రిలయన్స్ ఆటోజోన్‌లో టామ్ టామ్ ఉత్పత్తులపై డిస్కౌంట్..!!

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 13:16 [IST]
నెథర్లాండ్స్‌కు చెందిన ఆటోమొబైల్ నావిగేషన్ సిస్టమ్‌ల తయారీ సంస్థ టామ్ టామ్ గడచిన సెప్టెంబర్ నెలలో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. టామ్ టామ్ ఇండియా సరసమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందింస్తోంది. టామ్ టామ్ అందిస్తున్న "వయా" బ్రాండ్ నావిగేషన్ సిస్టమ్స్, దేశీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

ప్రత్యేకించి భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని, వివిధ ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే విధంగా తమ నావిగేషన్ సిస్టమ్‌లను తయారు చేశామని టామా టామ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోక్లిన్ విగ్రుక్స్ తెలిపారు. ప్రస్తుతం టామ్ టామ్ ఇండియా నుండి వయా 100, వయా 120 మరియు వయా 125 అనే మూడు ఉత్పత్తులు లభిస్తున్నాయి. వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

టామ్ టామ్ నావిగేషన్ సిస్టమ్‌ల ధరలు:
* టామ్ టామ్ వయా 100 - రూ.14,999
* టామ్ టామ్ వయా 120 - రూ.16,999
* టామ్ టామ్ వయా 125 - రూ.18,999

ఈ ఉత్పత్తులు ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, పంజాబీ, మళయాలం, మరాఠీ, ఒరియా, తమిల్, తెలుగు భాషలను సపోర్ట్ చేస్తాయి. వీటిని డ్యాష్‌బోర్డ్‌లో లేదా రూఫ్ మౌంట్‌గా అమర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లిమిటెడ్ వారంటీతో లభిస్తాయి. ఇంకా ఇందులో వాయిస్ కమాండ్స్, మ్యాప్ కరెక్షన్, హెల్ప్ మి, వేర్ ఐ యామ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

టామ్ టామ్ ఇండియా గడచిన పదేళ్లుగా భారత్‌లో మ్యాప్‌లను అభివృద్ధి చేస్తోంది. ఈ ఉత్పత్తులు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల దుకాణాల్లో లభ్యమవుతాయి. అలాగే, రిలయన్స్ ఆటోజోన్‌లో కూడా టామ్ టామ్ నావిగేషన్ సిస్టమ్‌ల లభిస్తాయి, ఇప్పుడు రిలయన్స్ వీటిపై రూ.1500 నుండి రూ.2000 వరకూ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్లు పరిమిత కాలం వరకూ మాత్రమే.
English summary
The Netherlands-based car navigation system maker Tom Tom India is offering three new products in India namely Via 100, Via 120 and Via 125 in India. These products are available in all Reliance Autozone outlets with discount price.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .