2013 టోక్యో మోటార్ షో: యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

By Ravi

ఆటోమొబైల్ ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలలో వచ్చిన విప్లవం కేవలం ఫోర్ వీలర్స్ మాత్రమే పరిమితం కాలేదు. ద్విచక్ర వాహనాల తయారీదారులు కూడా ఈ టెక్నాలజీలను ఆసరగా చేసుకొని, అధునాతన టూవీలర్లను తయారు చేస్తున్నారు. తాజాగా.. జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనల తయారీ కంపెనీ యమహా ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం జపాన్‌లో జరగుతున్న 2013 టోక్యో మోటార్ షోలో 'పెస్1' (PES1 - ప్యాషన్ ఎలక్ట్రిక్ స్ట్రీట్‌‌స్పోర్ట్‌) పేరిట యమహా ఓ మోడ్రన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ బైక్. ఇది రెగ్యులర్ ఎలక్ట్రిక్ బైక్‌ల మాదిరి అండర్ పెర్ఫామెన్స్‌ను కాకుండా హై పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో ఈ బైక్ పెర్ఫామెన్స్ వీడియోను చూడటం మర్చిపోకండి..!

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

ఇతర ఎలక్ట్రిక్ బైక్‌ల మాదిరిగానే యమహా పెస్1 ఎలక్ట్రిక్ బైక్ కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. అయితే, యమహా స్మార్ట్ పవర్ మాడ్యూల్‌గా పిలిచే ఈ బ్యాటరీ ప్యాక్‌ను సులువగా తొలగించకోవచ్చు, అమర్చుకోవచ్చు.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

ఈ బ్యాటరీ ప్యాక్‌లో విద్యుత్ బ్రష్‌లెస్ డిసి మోటార్‌కు పంపిణీ అవుతుంది. ఈ మోటార్ ఓ బెల్ట్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు తిరిగేలా చేస్తుంది. ఈ మోటార్ పవర్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

యమహా పెస్1 గురించి మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇది దీనిని తేలిక బరువు కలిగిన మోనోకాక్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఫలితంగా ఇది 100 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

దీని తేలిక పాటి నిర్మాణ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, దీని ఛాస్సిస్ ఇటు ఫ్రేమ్ మాదిరిగాను అటు బాడీ మాదిరిగాను పనిచేస్తుంది. దీని పొడవు 1919 మి.మీ., వెడల్పు 640 మి.మీ., ఎత్తు 1000 మి.మీ.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) ఉండదు. కానీ పెస్1లో ట్రాన్సిమిషన్ ఉంటుంది. రైడర్ ఎంపికను బట్టి దీనిని మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడ్స్‌కు మార్చుకోవచ్చు.

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను స్మార్ట్ ఫోన్ సాయంతో అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉండే ఆన్ బోర్డ్ కంప్యూటర్ సాయంతో స్మార్ట్ ఫోన్‌ను అనుసంధానం చేసి అన్ని రకాల సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.

యమహా పెస్1 మోటార్‌సైకిల్ పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి. ఇది చూసిన తర్వాత మీకు కూడా ఇలాంటి ఓ ఎలక్ట్రిక్ బైక్ కావాలనిపించడం ఖాయం..!

Most Read Articles

English summary
Yamaha PES1 is powered by a lithium-ion battery pack like most electric bikes. However, the battery pack, called Yamaha Smart Power Module, can be easily removed and replaced.
Story first published: Friday, November 22, 2013, 12:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X