మెర్సిడెస్ బెంజ్ SLS AMG ఫైనల్ ఎడిషన్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న 2013 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో 'మెర్సిడెస్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్'ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో ఇదే చివరి వెర్షన్. ఇకపై ఇందులో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు కానీ, అప్‌గ్రేడెడ్ మోడళ్లు కానీ రావు. ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కేవలం నాలుగేళ్లకే దీని ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు.

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసమే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మోడల్‌ను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించడానికి ముందుగా, కొనుగోలుదారులకు ఓ చివరి అవకాశాన్ని కల్పించేందుకు కంపెనీ ఇందులో ఈ ఫైనల్ (ఆఖరి)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ ఉత్పత్తిని కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు.

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి మోడల్‌ ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, ఇందులో ఇంతకన్నా కన్నా మరింత శక్తివంతమైన, పొడవైన, గల్‌వింగ్ డోర్లు కలిగిన ఓ జిటి కారును మెర్సిడెస్ బెంజ్ 2015లో విడుదల చేయనుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్ ఉత్పత్తిని కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఇందులో కూపే వెర్షన్ మరియు రోడ్‌స్టర్ వెర్షన్లు (సాఫ్ట్ టాప్) రెండూ కలిసి ఉండనున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

ఈ ఫైనల్ ఎడిషన్‌లో కార్బన్ ఫైబర్ హుడ్, రియర్ వింగ్, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ స్ప్లిట్టర్స్, ఓఆర్‌విఎమ్‌లు, కొత్త బ్రేక్స్, విభిన్నమైన ఫ్రంట్ బంపర్స్, బ్లాక్డ్ అవుట్ హెడ్‌ల్యాంప్ సరౌండింగ్స్ వంటి మార్పులను చూడొచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ తమ ఫైనల్ ఎడిషన్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కోసం ఎక్స్‌క్లూజివ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. కొనుగోలుదారులు వీటిని హై షీన్ స్పోక్స్ అండ్ రిమ్ ఫ్లాంగ్‌తో కూడిన మ్యాట్ బ్లాక్ ఫినిష్‍లో కానీ లేదా పూర్తిగా మ్యాట్ బ్లాక్‌లో కానీ పొందవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

ఈ చక్రాలు ఎక్స్‌క్లూజివ్ డన్‌లాప్ స్పోర్ట్ మ్యాక్స్ రేస్ కప్ టైర్స్ 265/35 R19 (ముందు), 295/30 R20 (వెనుక)తో కవర్ చేయబడి ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

కార్బన్ ఫైబర్ ఎక్స్టీరియర్ మిర్రర్, ఇంజన్ కవర్స్, కార్బన్ సెరామిక్ బ్రేక్స్, బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ బియోసౌండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఫీచర్లను ఆప్షనల్‌గా ఆఫర్ చేస్తున్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

రియర్ వింగ్, ఫ్రంట్ స్ప్లిట్టర్ మరియు బానెట్‌పై ఉండే ఎయిర్ అవుట్‌లెట్లు ముందు వెనుక యాక్సిల్స్‌కు తగినంత డౌన్‌ఫోర్స్‌ను ఆఫర్ చేస్తాయి. ఇది అధిగ వేగం వద్ద వాహనాన్ని కంట్రోల్‌లో ఉంచేందుకు సహకరిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

ఇందులోని స్పోర్టీయర్ సీట్ కవర్లు డైమండ్ ప్యాటర్న్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటిని డిసిగ్నో ఎక్స్‌క్లూజివ్ లెథర్‌పై, సిల్వర్ స్టిచింగ్, సిల్వర్ సీట్ బెల్ట్స్‌తో డిజైన్ చేశారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

ప్రతి స్పెషల్ ఎడిషన్ కారులోని కార్బన్ ఫైబర్ సెంటర్ కన్సోల్‌పై 'ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్ - 1 ఆఫ్ 350' అనే బ్యాడ్జ్ ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

పెర్ఫామెన్స్ విషయంలో మార్పు లేదు. ఇదివరకటి ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జిలో ఉపయోగించిన 6.2 లీటర్ వి8 ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 583 హెచ్‌పిల శక్తిని, 650 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్ కేవలం 3.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, అలాగే 11.2 సెకండ్ల వ్యవధిలో 0-200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 320 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి ఫైనల్ ఎడిషన్ మార్చ్ 2014 నుంచి యూరప్ మార్కెట్లలో లభ్యం కానుంది. కూపే ప్రారంభ ధర 2,25,505 డాలర్లు గాను, రోడ్‌స్టర్ ప్రారంభ ధర 2,33,835 డాలర్లు గాను ఉంది.

Most Read Articles

English summary
The very last Mercedes-Benz SLS AMG has been unveiled both at the Tokyo Motor Show and the Los Angeles Auto Show. As the name says it, Merc will no longer make this iconic, long nosed, gullwing door sports car. This is the car's last hurrah.
Story first published: Thursday, November 21, 2013, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X