టోక్యో మోటార్ షో: యమహా మోటివ్.ఈ సిటీ కార్ ఆవిష్కరణ

By Ravi

యువతను ఆకట్టుకునే బైక్‌లను తయారు చేయటంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యమహా తొలిసారిగా కారును తయారు చేస్తే ఎలా ఉంటుంది..? ఇదిగో ఈ ఫొటోల్లో కనిపించినట్లుగా ఉంటుంది. మెక్‌లారెన్ ఎఫ్1తో పాటుగా అనే ఫార్ములా వన్ కార్లను డిజైన్ చేసిన ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ గోర్డాన్ ముర్రే, యమహా కంపెనీల ఆధ్వర్యంలో రూపుద్దిద్దుకున్నదే ఈ 'మోటివ్.ఈ' (MOTIV.e) సిటీ కారు.

పరిమాణంలో చిన్నదిగా, ప్రకృతి సాన్నిహిత్యంగా ఉండి మరియు తయారు చేయటానికి సులువు, ఖర్చుత తక్కువతో కూడికున్నది ఉండే సిటీ కారును తయారు చేయాలనే గోర్డాన్ ముర్రే సంకల్పానికి యమహా చేయూతను అందించింది. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ మోటార్ షోలో యమహా ఈ అధునాతన మోటివ్.ఈ కారును ప్రదర్శనకు ఉంచింది.

గోర్డాన్ ముర్రే డిజైన్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు, గతంలో ఆయన తయారు చేసిన టి.27 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారుకు కొనసాగింపు వెర్షనే. ఇది దాదాపు ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న కాన్సెప్ట్. మరి ఈ బుజ్జి సిటీ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందామా?

యమహా మోటివ్.ఈ

మోటివ్.ఈ ఒక టూ-సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో అమర్చి 8.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఎలక్ట్రిక్ మోటార్ నడుస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 25 కిలోవాట్ల పవర్‌ను. 896 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే, ఇది ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, యమహా బైక్‌ల మాదిరిగానే మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

యమహా మోటివ్.ఈ

యమహా మోటివ్.ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ సింగిల్ స్పీడ్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించింది. ఈ గేర్ బాక్స్ టార్క్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, దానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది. మోటివ్.ఈ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్లకు తగ్గకుండా పరుగులు తీస్తుంది.

యమహా మోటివ్.ఈ

మోటివ్.ఈ ఎలక్ట్రిక్ కారును తేలికగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ కారు మొత్తం బరువు 726 కేజీలు మాత్రమే. పూర్తి బ్యాటరీ చార్జ్‌పై ఇది 160 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి పట్టే సమయం కూడా కేవలం మూడు గంటలు మాత్రమే.

యమహా మోటివ్.ఈ

ఈ కారు నిర్మాణంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, దీనిని ఐస్ట్రీమ్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నిక్‌పై నిర్మించారు. గోర్డాన్ ముర్రే ఇదే టెక్నిక్‌ను ఫార్ములా వన్ కార్ల తయారీలో ఉపయోగిస్తాడు. ఇది తేలికైన మరియు సురక్షితమైన నిర్మాణానికి సహకరిస్తుంది.

Most Read Articles

English summary
Gordon Murray, the man who designed the legendary McLaren F1 and even Formula 1 race cars is now on a mission to develop eco friendly, compact, easy and inexpensive to manufacture city cars and helping him realise his dreams is none other than Yamaha. At last week's Tokyo Motor Show Yamaha displayed the MOTIV.e City Car, an electric car designed by Gordon Murray Design. 
Story first published: Tuesday, November 26, 2013, 11:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X