వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్

By Ravi

అసలే కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు.. అలాంటి కారుపై వజ్రాలు పొదిగితే ఎలా ఉంటుంది.. దాని ధర మన అంచనాలకు అందుతుందా..? బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ గడచిన సెప్టెంబర్ నెలలో జరిగిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఓ సెలెస్టియల్ ఫాంటమ్ కారును ఆవిష్కరించింది గుర్తుందా..?

బిఎమ్‌డబ్ల్యూ అధీనంలో విజయవంతంగా ఒక దశాబ్ధం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రోల్స్ రాయిస్ ఈ ప్రత్యేకమైన ఫాంటమ్ కారును తయారు చేసింది. ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్‌షోలో ఆవిష్కరించి సెలెస్టియల్ ఫాంటమ్ కారులో ప్రత్యేకత ఏటంటే, ఇందులో స్టార్‌లైట్ హెడ్‌లైనర్ ఉంటుంది. అంటేకారు లోపల పై భాగంలో వేలాది సంఖ్యలో చిన్నపాటి ఫైబర్ ఆప్టిక్ లైట్లను అమర్చారు. కారు లోపల కూర్చుంటే, మనపైన ఆకాశం ఉన్నట్లు, అందులో నక్షత్రాలు మిళమిలా మెరుస్తున్నట్లు అనిపిస్తుంది.

అయితే, రోల్స్ రాయిస్ ఈసారి మరింత ఖరీదైన సెలెస్టియల్ ఫాంటమ్‌ను తయారు చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్

ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న 2013 దుబాయ్ మోటార్ షోలో రోల్స్ రాయిస్ ఓ విశిష్టమైన ఫాంటమ్ కారును ఆవిష్కరించింది. ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించిన సెలెస్టియల్ ఫాంటమ్‌లో ఫైబర్ ఆప్టిక్ లైట్లను ఉపయోగిస్తే, ఈ రోల్స్ రాయస్ సెలెస్టియల్ ఫాంటమ్ కారులో వజ్రాలను ఉపయోగించారు.

వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్

ఈ రోల్స్ రాయిస్ సెలస్టియల్ ఫాంటమ్ కారులోని డోర్ క్యాపింగ్స్, సెంటర్ కన్సోల్ లిడ్ మరియు రియర్ ప్రైవసీ డివైడర్‌లో మొత్తం 446 వజ్రాలను పొదిగారు. ప్రతి వజ్రాన్ని కూడా చేతితోనే అమర్చారు.

వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్

మామూలుగానే రోల్స్ రాయిస్ అంటే ఓ స్పెషల్ కారు, అలాంటి ఓ స్పెషల్ కారుకు మళ్లీ స్పెషల్ అప్పీల్‌ను ఇవ్వటం ఎందుకని రోల్స్ రాయిస్ ప్రతినిధులను అడిగితే.. ప్రపంచలోని విశిష్టమైన ఉత్పత్తుల మధ్య ప్రాశ్చ్యం అతిపెద్ద మార్కెట్ అని, దుబాయ్ అంతర్జాతీయ మోటార్ షో కోసం మరింత విశిష్టమైన ఉత్పత్తిని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని తయారు చేశామని చెప్పారు.

వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్

వజ్రాలు పొదిగిన సెలెస్టియల్ ఫాంటమ్ రోల్స్ రాయిస్‌తో పేరుగా ఫాంటమ్ కూపే చికానే కారును కూడా ప్రదర్శనకు ఉంచారు.

Most Read Articles

English summary
At the ongoing 2013 Dubai Motor Show the British automaker Rolls Royce has displayed the Celestial Phantom yet again, but its even more precious this time - literally.
Story first published: Friday, November 8, 2013, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X