కొత్త కార్ల విడుదలతో కలకలలాడిన ఆటో ఎక్స్‌పో 2012

బుధవారంతో ముగిసిన 2012 ఆటో ఎక్స్‌పోకు సుమారు 7,00,000 మందికి సందర్శకులు విచ్చేశారని, వీరిలో ఎగ్జిబిటర్లు, సిబ్బంది అందరూ కలిసి ఉన్నారని 2012 ఆటో ఎక్స్‌పో స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ రాజీవ్‌ కౌల్‌ తెలిపారు. ఈ ఎక్స్‌పోలో 24 దేశాలకు చెందిన 1,500 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ 50 గ్లోబల్‌ బ్రాండ్‌లను ప్రదర్శించగా, కొత్తగా 58 వాహనాలను విడుదల చేశారు.

Delhi Auto Expo 2012

మారుతి సుజుకి తొలి ఎమ్‌పివి ఎర్టిగా, బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ కార్లు, ఆడి కొత్త కార్లు, రీనాల్ట్ పల్స్, నిస్సాన్ లీఫ్, వంటి ప్రముఖ కార్లతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్, ట్రైయంప్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్, కాన్సెప్ట్ కార్స్, కమర్షియల్ వెహికల్స్‌తో 11వ ఆటో ఎక్స్‌పో మెరిసిపోయింది. కాగా.. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శకులు విచ్చేసే ఆటో షో అయిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని, వచ్చే ఎక్స్‌పోను 2014 ఫిబ్రవరి 5-12 మధ్య ఏర్పాటు చేయాలని నిర్వాహక సంస్థలు సియామ్, సిఐఐ, ఆక్మాలు నిర్ణయించాయి.

Most Read Articles

English summary
The 11th Indian Auto Expo has come to a close and the next versions will never be the same. The premier auto event that saw more than 7 lakh visitors and 1,500 exhibitors. The organizers of the event are planning to move the location of the Auto Expo in 2014 to a different place after several complaints about infrastructure were reported.
Story first published: Thursday, January 12, 2012, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X