హ్యుందాయ్ కొత్త ఎలాంట్రా సెడాన్ ఫీచర్లు, ప్రత్యేకతలు

ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం సెడాన్ "ఎలాంట్రాలో" కంపెనీ ఇటీవలే ఓ సరికొత్త వేరియంట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న ముగిసిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త ఎలాంట్రా సెడాన్‌ను విడుదల చేసింది. ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ ప్రిన్సిపల్స్ ఆధారంగా డిజైన్ చేసిన కొత్త ఎలాంట్రా సెడాన్ మరింత స్టయిలిష్‌గా ఉండి, మంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది. దీని హైలైట్స్ క్రింది విధంగా ఉన్నాయి.

Hyundai New Elantra

కొత్త ఎలాంట్రా సెడాన్‌ను 20-4020-30 ఏళ్ల వయో గ్రూపును దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ డిజైన్ చేసింది. ఇందులో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన 1.8 డ్యూయెల్ విటివిటి, 1.6 లీటర్ సిఆర్‌డిఐ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, సోలార్ గ్లాస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సార్స్, స్పోర్టీ పెడల్స్, పవర్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్నింగ్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా.. ఎమ్‌పి3, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సురక్షితమైన మరియు సులభమైన పార్కింగ్ కోసం ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్‌ (ఈసిఎమ్)తో కూడిన రియర్ వ్యూ కెమెరా ఆప్షన్‌తో ఇది లభ్యమవుతుంది. ఇది 4530 మి.మీ. పొడవును, 1775 మి.మీ. వెడల్పును, 1435 మి.మీ ఎత్తును కలిగి ఉండి 2,700 మి.మీ. వీల్‌బేస్‌తో లభిస్తుంది. దీని టైర్ సైజ్ 205/60/ఆర్16. త్వరలోనే ఇది వాణిజ్యపరంగా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

Most Read Articles

English summary
Hyundai new Elantra sedan is designed on the principles of Fluidic Sculpture, now its more stylish and more sporty. It is targeted at young achievers in the age group of 20 to 40 years.
Story first published: Monday, January 23, 2012, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X