హ్యుందాయ్ వెలాస్టర్ క్రాసోవర్.. ఇండియాకు వచ్చేనా..?

భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే ముగిసిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త క్రాసోవర్ కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచింది. కూపేలోని స్టయిల్‌ను హ్యాచ్‌బ్యాక్‌లోని పనితీరును కలగలపి అభివృద్ధి చేసిన వెలాస్టర్ క్రాసోవర్ యుటిలిటీ వాహనం ఆకర్షనీయమైన ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ కారును స్టయిల్ మైండెడ్ కలిగిన 20-30 ఏళ్ల వయో గ్రూపును దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ డిజైన్ చేసింది. ఇందులో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్లు కలిగిన 1.6 లీటర్ గామ్మా జిడిఐ ఇంజన్‌ను అమర్చారు. ఇంకా ఇందులో 7 ఇంచ్ మల్టీ మీడియా టచ్ స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, నావ్‌ట్రాఫిక్‌తో కూడిన ఎక్స్ఎమ్ శాటిలైట్ రేడియో, పవర్ సీట్స్, రివర్స్ కెమెరా, 450 వాట్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

అంతేకాకుండా, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన ప్రాక్సిమిటీ కీ ఎంట్రీ, మరింత సౌకర్యం కోసం ఫ్రంట్, రియర్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, వాయిస్ రికగ్నైజేషన్‌తో కూడిన బ్లూటూత్, పానడోరా ఇంటర్నెట్ రేడియో, బ్లూ లింక్-వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి.

పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి)తో కూడిన వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే. దీని ప్రొడక్షన్ వెర్షన్, ధర గురించి మాత్రం హ్యుందా నోరు విప్పడం లేదు.

Most Read Articles

English summary
Imagine the perfect mix: the functionality of a hatchback and the sleek looks of a coupe. The Veloster is reality of that concept. A crossover utility vehicle with a unique, innovative presence, it's where dynamics meets practicality.
Story first published: Wednesday, April 11, 2012, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X