ఈ ఏడాది మధ్య భాగంలో విడుదల కానున్న రీనాల్ట్ డస్టర్

ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రీనాల్ట్ ఇటీవల ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో విడుదల చేసిన మిడ్-సైజ్ క్రాసోవర్ 'డస్టర్'ను ఈ ఏడాది మధ్య భాగం నాటికి దేశీయ విపణిలో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇటు సెడాన్‌లోని సౌకర్యాన్ని అటు ఎస్‌యూవీలోని పెర్ఫామెన్స్‌ను కలగలిపి రూపొందించిన డస్టర్ ఎస్‌యూవీ భారత వినియోగదారులను ఆకట్టుకోగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Renault Duster

డస్టర్ ఎస్‌యూవీని దాదాపు అత్యధికంగా ఇక్కడి మార్కెట్లో లభించే విడిభాగాలను ఉపయోగించి భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇలా చేయడం వలన డస్టర్ క్రాసోవర్‌ను తక్కువ ధరకే అందించేందుకు రీనాల్ట్‌కు సాధ్యమవుతుంది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలోనూ రీనాల్ట్ డస్టర్ లభ్యం కానుంది. ప్రీమియం ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్, శక్తివంతమైన పెర్ఫామెన్స్, అధిక మైలేజ్‌ వంటి విశిష్టమైన ఫీచర్లతో రీనాల్ట్ డస్టర్ లభిస్తుంది.

ప్రస్తుతం రీనాల్ట్ ఇండియా దేశీయ మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్, కొలియోస్ ఎస్‌యూవీ, పల్స్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను అందిస్తున్న త్వరలో విడుదల చేయనున్న డస్టర్ క్రాసోవర్‌తో భారత్‌లో రీనాల్ట్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో నాలుగు మోడళ్లకు చేరుకోనుంది.ఇక దీని ధర విషయానికి వస్తే ఇది సుమారు రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Renault India Private Ltd expects to launch its mid-size crossover Duster in the second half of the current year and with its launch, Renault India, would have a portfolio of four new products spread across a broad spectrum to ensure that it has a wide reach and caters to a wide range of customers.
Story first published: Monday, January 16, 2012, 13:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X