హీరో ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ రైడ్ రివ్యూ: 1200 కి.మీ., అయినా ఆగని పరుగు..

By Ravi

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా), తమ జపాన్ భాగస్వామి హోండా మోటార్‌సైకిల్ నుంచి విడిపోయిన తర్వాత, వీరిద్దరి జాయింట్ వెంచర్ నుంచి అందుబాటులో ఉన్న అన్ని ద్విచక్ర వాహనాలను హీరో అప్‌గ్రేడ్ చేయటం ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ ఉత్పత్తులపై చెరగని ముద్ర వేసుకున్న హోండా బ్రాండింగ్‌ను తొలగిస్తూ, కంపెనీ తనదైన శైలిలో మరింత మోడ్రన్ (టెక్నాలజీ పరంగా మరియు డిజైన్ పరంగా) ఉత్పత్తులను ప్రవేశపెడుతూ వస్తోంది.

అలా.. హీరో మోటోకార్ప్ ప్రవేశపెట్టిన లేటెస్ట్ ప్రోడక్టే ఈ 'హీరో ఎక్స్‌ట్రీమ్' (Hero Extreme). గతంలో ఈ బైక్ పేరు హీరో హోండా సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉండేది. కాగా.. హీరో మోటోకార్ప్ ఈ కొత్త బైక్‌ను పేరులోనే కాకుండా డిజైన్, టెక్నాలజీలో కూడా అనేక మార్పులు చేసి 2014 హీరో ఎక్స్‌ట్రీమ్‌గా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌ను టెస్ట్ రైడ్ చేసే అవకాశం లభించింది.

ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాను, మేము ఈ బైక్‌ను ఏకధాటిగా మూడు రోజుల పాటు 1200 కిలోమీటర్ల దూరం టెస్ట్ రైడ్ చేయటం జరిగింది. 150సీసీ బైక్ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లకు గట్టి సవాల్ విసిరేలా మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్టయిలిష్ ఫీచర్స్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌తో 2014 హీరో ఎక్స్‌ట్రీమ్‌ను డిజైన్ చేశారు. మరి మా టెస్టింగ్‌లో ఈ కొత్త బైక్ విజయం సాధించిందో లేక పరాజయం పొందిందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హీరో ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ రైడ్ రివ్యూ

హీరో మోటోకార్ప్ కంపెనీ మాకు ఓ సరికొత్త రెడ్ కలర్ ఎక్స్‌ట్రీమ్ బైక్‌ను టెస్ట్ రైడ్ కోసం ఆఫర్ చేసింది. మీడియా టెస్ట్ రైడ్ కోసం ఈ బైక్‌లో ఎలాంటి మార్పులను కంపెనీ చేయలేదు. వాస్తవానికి కస్టమర్లకు విక్రయించే బైక్‌లలో ఒకదానినే టెస్ట్ రైడ్ కోసం ఆఫర్ చేయటం జరిగింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ రైడ్ రివ్యూ

హీరో ఎక్స్‌ట్రీమ్ శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు మేము ఈ బైక్‌ని విభిన్న రకాల వాతావరణంలో, విభిన్న రకాల రోడ్లపై టెస్ట్ చేయటం జరిగింది. ఈ బైక్‌తో బెంగుళూరులో ప్రారంభమైన మా ప్రయాణం కూర్గ్ కాఫీ ఎస్టేట్స్ గుండా, కేరళ బీచ్‌ల గుండా, తమిళనాడు ఘాట్ రోడ్‌ల గుండా మరియు కర్ణాటకలోని గ్రామీణ గ్రావెల్ రోడ్ల సాగి చివరకు 1200 కిలోమీటర్ల అలుపెరగని రైడ్ తర్వాత బెంగుళూరు చేరుకుంది.

2014 హీరో ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ రైడ్ రూట్:

2014 హీరో ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ రైడ్ రూట్:

మొదటి రోజు: Bangalore - Mysore - Hunsur - Ponnampet - Tholpetty - Mananthavady - Kuttiady - Kappad - Calicut.

రెండవ రోజు: Calicut - Vythiri - Kalpetta - Chundale - Gudalur - Masinagudi - Ooty - Kundha.

మూడవ రోజు: Kundha - Emerald Lake - Ooty - Kotagiri - Mettupalayam - Sathyamangalam - Kollegal - Malavalli - Bangalore.

డిజైన్

డిజైన్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌ను చాలా చక్కగా, స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. షార్ప్ ఎడ్జ్‌లతో ఈ బైక్‌ను స్లీక్‌గా డిజైన్ చేయటంలో హీరో మోటోకార్ప్ ఇంజనీర్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మునుపటి సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్ డిజైన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్ డిజైన్ ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. హెడ్‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకూ దీని డిజైన్ విశిష్టంగా ఉంటుంది. ఓవరాల్ లుక్ చక్కగా ఉంటుంది.

ఇంజన్ స్పెసిఫికేషన్స్

ఇంజన్ స్పెసిఫికేషన్స్

హీరో ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిల్‌లో 149.2సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.4 పిఎస్‌ల శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ (1 డౌన్, 4 అప్)తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంధనం కార్బురేటర్ ద్వారా ఇంజన్‌కు సరఫరా అవుతుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఇందులోని 150సీసీ ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్‌గా సంతృప్తినిస్తుంది. ఈ ఇంజన్ ప్రత్యేకించి మంచి మిడ్-రేంజ్, టాప్-ఎండ్ రేంజ్ పవర్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు పవర్‌బ్యాండ్స్ ఉంటాయి, అందులో ఒకటి 3000-6000 ఆర్‌పిఎమ్ వద్ద, మరొకటి 7000-9000 ఆర్‌పిఎమ్ వద్ద ఉంటాయి. మేము టెస్ట్ రైడ్ చేసిన కండిషన్స్ ప్రకారం, ఈ బైక్ లీటరుకు 45 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఆఫర్ చేసింది. దీని ఇంజన్ చాలా స్మూత్‌గా ఉంది.

రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్

రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ హ్యాండ్లింగ్ చాలా చక్కగా ఉంది. మలుపులతో కూడిన రోడ్లయినా లేదా ఎత్తయినా ఘాట్ రోడ్లయినా సరే దీని హ్యాండ్లింగ్‌ మాత్రం చక్కగా ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై దీని హ్యాండ్లింగ్ స్మూత్‌గానే అనిపిస్తుంది.

కానీ దీని రైడింగ్ పొజిషన్ మాత్రం అంత సౌకర్యంగా అనిపించదు. ఇది ఇటు ఫుల్ ఫార్వార్డ్ లీన్ పొజిషన్‌గా కానీ లేదా అటు రిలాక్స్డ్ అప్‌రైట్ పొజిషన్‌లా కానీ ఉండదు. ఫలితంగా లాంగ్ రైడ్స్‌లో రైడర్ నెక్, బ్యాక్‌పై ఎక్కువ ప్రెజర్ పడినట్లు అనిపిస్తుంది.

సీట్

సీట్

హీరో ఎక్స్‌క్రీమ్ రైడింగ్ పొజిషన్ సౌకర్యంగా లేకపోయినప్పటికీ, దీని సీట్ మాత్రం చాలా కంఫర్టబల్‌గా ఉంటుంది. అయితే, పిలియన్ రైడర్ సీట్ మాత్రం కాస్తంత చిన్నదిగా, అసౌకర్యంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో చక్కటి సస్పెన్షన్ సిస్టమ్ వలన ఎకధాటిగా 500 కిలోమీటర్ల దూరం నడిపినా, సౌకర్యంగానే అనిపించింది. పొట్టివారికి మాత్రం ఇది ప్రిఫరబల్ బైక్ కాదు, 5 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న నాకే ఈ బైక్‌పై నుంచి కాళ్లు పూర్తిగా నేలను తాకలేకపోయాయి. దీనిపై సిటీలో తిరగాలనుకునే షార్ట్ రైడర్స్ కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.

ముందు బ్రేక్

ముందు బ్రేక్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ బ్రేకింగ్ ఎక్స్‌పీరియెన్స్ నిజంగా గొప్పగా అనిపిస్తుంది. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్ లేకపోయినప్పటికీ, ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను ఇస్తాయి. ఇందులో ముందు వైపు 240 మి.మీ. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ ఉపయోగించారు. అయితే, ఈ బ్రేక్‌ను కాస్తంత టెక్నిక్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది, లేకపోతే ఫ్రంట్ వీల్ లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

వెనుక బ్రేక్

వెనుక బ్రేక్

హీరో ఎక్స్‌ట్రీమ్ వెనుక వైపు 220 మి.మీ. డిస్క్ బ్రేక్‌ను ఉపయోగించారు. ఈ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ అంత సులువుగా వీల్ లాక్ కాదు. రెండు బ్రేక్‌లను హార్డ్‌గా లేదా ర్యాష్‌గా అప్లయ్ చేస్తే వీల్స్ లాక్ అయ్యి బైక్ జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మోడల్‌లో ఆప్షనల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

హెడ్‌లైట్స్

హెడ్‌లైట్స్

హీరో ఎక్స్‌ట్రీమ్‌లో హెడ్‌లైట్స్‌ను చాలా విశిష్టంగా డిజైన్ చేశారు. ఇందులో ఆడి కార్ స్టయిల్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ (హెడ్‌లైట్‌కు పైభాగంలో, వి షేపులో ఉండే లైట్స్) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంజన్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ లైట్లను ఆపరేట్ చేసుకోవచ్చు. చీకటి వేళల్లో ఈ లైట్ ఎంతగానో (గైడ్ మి ల్యాంప్ మాదిరిగా) సహకరిస్తుంది. మొత్తమ్మీద ఈ పవర్‌ఫుల్ హెడ్‌లై రాత్రి సమయంలో స్పష్టమైన కాంతినిస్తూ, రోడ్డుపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోయేందుకు ఉపయోగపడుతుంది.

స్టయిలిష్ గ్రాబ్ రెయిల్స్

స్టయిలిష్ గ్రాబ్ రెయిల్స్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌లోని స్టయిలిష్ స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్ ఎంతో స్టయిలిష్‌గా ఉంటాయి. వీటిని చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇవి బైక్ లుక్‌ను పెంచడంలో సహకరిస్తాయి.

మొబైల్ చార్జింగ్ పోర్ట్

మొబైల్ చార్జింగ్ పోర్ట్

ఈ సెగ్మెంట్లో మొట్టమొదటి సారిగా, హీరో ఎక్స్‌ట్రీమ్ సీట్ క్రింది భాగంలో మొబైల్‌ను చార్జ్ చేసుకునేందుకు 12 వోల్ట్ ప్లగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఫోన్‌ను దాచేందుకు ఓ ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది. అయితే, ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల సైజ్ ఐదు అంగుళాలకు మించి ఉంటున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మొబైల్ చార్జింగ్ కోసం సీట్ క్రింద ఇవ్వబడిన కంపార్ట్‌మెంట్‌లో కేవలం 4.7 ఇంచ్‌ల వరకు సైజు కలిగిన ఫోన్లు మాత్రమే పడుతాయి.

శారీ గార్డ్

శారీ గార్డ్

మహిళా పిలియన్ రైడర్ల రక్షణను దృష్టిలో ఉంచుకొని చక్కగా డిజైన్ చేసిన ఈ శారీ గార్డ్, ఎక్స్‌ట్రీమ్ స్పోర్టీనెస్‌ను ఏమాత్రం దెబ్బతీయదు. సాధారణంగా యువకులు తమ బైక్‌లలో ఈ శారీ గార్డ్‌ను తొలగిస్తేనే, బైక్ అందంగా కనిపిస్తుందని భావిస్తారు. అందుకే, హీరో మోటోకార్ప్ ఇంజనీర్లు ఎక్స్‌ట్రీమ్ డిజైన్‌ను దృష్టిలో ఉంచుకొని దీనిని డిజైన్ చేశారు.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. బ్లూ కలర్ ఇల్యుమినేషన్‌తో కూడిన ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడ్, యావరేజ్, ఫ్యూయెల్ లెవల్, టైమ్, ట్రిప్ మీటర్ మొదలైన అంశాలను తెలియజేస్తుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మధ్యలో (డిజిటల్ మీటర్ పైభాగంలో) అనలాగ్ ఆర్‌పిఎమ్ మీటర్ కూడా ఉంటుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై టర్న్ ఇండికేటర్స్, మెయింటినెన్స్ ఇండికేటర్, హైబీమ్ ఇండికేటర్‌తో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంటుంది.

సైడ్ స్టాండ్ ఇండికేటర్

సైడ్ స్టాండ్ ఇండికేటర్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులోని సైడ్ స్టాండ్ ఇండికేటర్. సైడ్ స్టాండ్ ఆన్ చేసి ఉండటాన్ని ఈ ఇండికేటర్ తెలియజేస్తుంది. ఒకవేళ రైడర్ ఈ ఇండికేటర్‌ను పట్టించుకోకుండా ఇంజన్ ఆన్ చేసినప్పటికీ, గేర్ వేయగానే ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. సైడ్ స్టాండ్‌ను తొలగించి గేర్ వేస్తేనే బైక్ ముందుకు సాగుతుంది. తరచూ సైడ్ స్టాండ్ గురించి మర్చిపోతూ ఉండే వారికి ఇదొక గొప్ప సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు.

డ్యూయెల్ కలర్

డ్యూయెల్ కలర్

ఈ బైక్ డ్యూయెల్ టోన్ కలర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో ఇది మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా సగం బాడీ కలర్‌లోను, సగం బ్లాక్ కలర్‌లోను ఉంటాయి. క్లియర్ లెన్స్ ఇండికేటర్లు కూడా స్టయిలిష్‌గా ఉంటాయి.

టెయిల్ ల్యాంప్

టెయిల్ ల్యాంప్

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ టెయిల్ ల్యాంప్ (వెనుక బ్రేక్ లైట్)ను కూడా స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. ప్రత్యేకించి దీనిని ఎల్ఈడి లైట్లతో తీర్చిదిద్దారు. రాత్రివేళల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ప్రకాశవంతంగా కనిపిస్తూ, అప్రమత్తం చేస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

హీరో ఎక్స్‌ట్రీమ్ ఐదు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి -

1. మెర్క్యూరిక్ సిల్వర్

2. జాజ్ బ్లూ

3. ఫైరీ రెడ్

4. పాంథర్ బ్లాక్

5. మాగ్నా ఆరెంజ్

ధర

ధర

హీరో ఎక్స్‌ట్రీమ్ సింగిల్ (ఫ్రంట్) డిస్క్, డ్యూయెల్ డిస్క్ (ఫ్రంట్ అండ్ రియర్) వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.67,829 లుగా ఉంటే డ్యూయెల్ డిస్క్ వేరియంట్ ధర రూ.70,829 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

స్విచెస్ (ఇంజన్ ఆఫ్ స్విచ్ లేదు)

స్విచెస్ (ఇంజన్ ఆఫ్ స్విచ్ లేదు)

ఈ బైక్‌లో స్విచ్ కంట్రోల్స్‌ను హీరో మోటోకార్ప్ నాణ్యమైన ప్లాస్టిక్‌తో తయారు చేసింది. అంతేకాకుండా వీటి పొజిషనింగ్ కూడా చక్కగా ఉంటుంది. చేతివేళ్లకు అందుబాటులో ఉండేలా ఈ స్విచ్‌లను అమర్చారు. అయితే, ఇందులో ఇంజన్ స్టాప్ బటన్ అందుబాటులో లేదు, ఇదొక్కటే ఇందులో మెయిన్ డ్రాబ్యాక్. ఇంజన్ ఆఫ్ స్విచ్ కూడా ఏర్పాటు చేసి ఉంటే ఇంకా బాగుండేదని మా అభిప్రాయం.

ఫుట్ కంట్రోల్ (చాలా చిన్నవి)

ఫుట్ కంట్రోల్ (చాలా చిన్నవి)

ఇందులోని ఫుట్ కంట్రోల్స్ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. బైక్ లుక్‌ని డామినేట్ చేస్తాయనే ఉద్దేశ్యంతోనే ఏమో కానీ గేర్ పెడల్ మరియు బ్రేక్ పెడల్‌ను చాలా చిన్నగా డిజైన్ చేశారు. కొందరికి కొన్ని సందర్భాల్లో వీటిని ఆపరేట్ చేయటం కాస్తంత ఇబ్బందిగా అనిపించవచ్చు.

చివరి మాట

చివరి మాట

మొత్తమ్మీద ఈ కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 150సీసీ మోటార్‌సైకిళ్ల కన్నా బెస్ట్‌గా అనిపిస్తుంది. దీని స్మూత్ ఇంజన్, హ్యాండ్లింగ్, రైడింగ్ మరియు ఫీచర్ల వలన ఇది ఇతర 150సీసీ బైక్‌ల కన్నా విశిష్టంగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
We got a chance to test ride the new 2014 Hero Xtreme and decided to ride it through some demanding roads in the south. It was a three day road test, in which the motorcycle was put through its paces, from the bustling traffic of the city, through the coffee estates of Coorg then to the beaches in Kerala, then through the the dense and windy roads of the tiger reserve and tea estates of Tamil Nadu and finally finishing off through the back roads of rural Karnataka. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X