మహీంద్రా గస్టో స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు కైనటిక్ టూవీలర్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత ద్విచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసినదే. ఆరంభంలో కంపెనీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, సెంచురో మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన తర్వాత టూవీలర్ సెగ్మెంట్లో మహీంద్రా గట్టి పట్టును సాధించుకోగలిగింది. సెంచురో ద్వారా మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పట్టు సాధించినట్లుగానే స్కూటర్ సెగ్మెంట్లో కూడా కస్టమర్ల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశ్యంతో మహీంద్రా టూవీలర్స్ ఓ సరికొత్త స్కూటర్‌ను అభివృద్ధి చేసింది.

ఆ సరికొత్త స్కూటర్ పేరే 'మహీంద్రా గస్టో' (Mahindra Gusto). ఈ స్కూటర్‌ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 9, 2014) వాణిజ్య పరంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, గస్టో స్కూటర్‌ను విడుదల చేయటాని కంటే ముందుగానే కంపెనీ మీడియా మిత్రుల కోసం గస్టో టెస్ట్ రైడ్ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో నిర్వహించింది. ఈ కార్యక్రమలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా భాగం పంచుకుంది.

మహీంద్రా గస్టో స్కూటర్‌పై మా అభిప్రయాన్ని, మొదటి సవారీ అనుభూతిని ఈ కథనంలో తెలుసుకోండి..!

మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో మహీంద్రా గస్టో స్కూటర్ టెస్ట్ రైడ్ విశేషాలను తెలుసుకోండి.

మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ

మహీంద్రా గస్టో స్కూటర్ ఓ గ్లోబల్ మోడల్. ఈ స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు కైనటిక్ స్కూటర్లను అప్‌గ్రేడ్ చేసి విక్రయిస్తున్న మహీంద్రా టూవీలర్స్ తొలిసారిగా తమ స్వంత టెక్నాలజీతో తయారు చేసిన స్కూటర్ ఈ గస్టో.

ఫ్రంట్ వ్యూ

ఫ్రంట్ వ్యూ

మహీంద్రా గస్టో ముందు వైపు విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇతర స్కూటర్ల డిజైన్‌తో పోల్చుకుంటే గస్టో ఫ్రంట్ డిజైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిచూపులో ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సిల్వర్ గ్రిల్ దాని పక్కనే ఉండే టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ బార్ దానిపై ఉండే మహీంద్రా లోగో, వి-షేప్ హెడ్‌ల్యాంప్ (సెంచురో నుంచి స్ఫూర్తిపొంది తయారు చేసినది) వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

సైడ్ వ్యూ

సైడ్ వ్యూ

సైడ్ నుంచి మహీంద్రా గస్టో స్కూటర్ పొడవుగా, విశాలంగా కనిపిస్తుంది. అప్‌రైట్ సీట్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. స్కూటర్ సైడ్స్‌పై మహీంద్రా బ్యాడ్జింగ్, గస్టో లోగోలను క్రోమ్ ఫినిషింగ్‌తో తయారు చేశారు. సైడ్ నుంచి ఇది మంచి ఫ్యామిలీ స్కూటర్ లుక్‌నిస్తుంది.

రియర్ వ్యూ

రియర్ వ్యూ

మహీంద్రా గస్టో స్కూటర్ రియర్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా విశిష్టంగా ఉంటుంది. విశిష్టమైన ఒవెల్ షేపులో ఉండే టెయిల్ ల్యాంప్, దానికి దిగువన సిల్వర్ ఫినిషింగ్, రిఫ్లెక్టర్, నెంబర్ ప్లేట్‌లను అమర్చారు. మొత్మమ్మీద రియర్ డిజైన్ సింపుల్‌గా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

గస్టో ఇంజన్ విషయంలో మహీంద్రా ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ రీఫైన్డ్ ఇంజన్ తక్కువ శబ్ధాన్ని విడుదల చేస్తుంది. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను ఉపయగించడం వలన ఇది సుపీరియర్ హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 12-ఇంచ్‌ల ట్యూబ్‌లెస్ ఎమ్ఆర్ఎఫ్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు కూడా రోడ్డుపై మంచి గ్రిప్‌ను, కంట్రోల్‌ను ఆఫర్ చేస్తాయి.

కంఫర్ట్, రైడింగ్ పొజిషన్

కంఫర్ట్, రైడింగ్ పొజిషన్

సాధారణంగా కస్టమర్లు మోటార్‌సైకిళ్ల కన్నా స్కూటర్లనే కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవటానికి ప్రధాన కారణం, స్కూటర్లపై కూర్చోవటం సౌకర్యంగా ఉండటమే కాకుండా, రైడింగ్ పొజిషన్ కూడా చక్కగా ఉండటమే. ఈ విషయంలో మహీంద్రా ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గస్టోను డిజైన్ చేశారు. ఫలితంగా ఇది మంచి రైడింగ్ పొజిషన్‌ను, చక్కటి కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది.

సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్

సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్

మహీంద్రా గస్టో స్కూటర్‌లో రైడర్ సౌకర్యాన్ని బట్టి సీటు ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. బహుశా, స్కూటర్ సెగ్మెంట్లో హైట్ అడ్జస్ట్‌మెంట్ సీటును ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ మహీంద్రానే కావచ్చు. రెండు పాయింట్ల మేర ఈ సీటును సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిని ఆపరేట్ చేయటం కూడా చాలా సులువుగా ఉంటుంది. పొట్టిగా ఉండే రైడర్లు సీటును ఎత్తును తగ్గించుకోవచ్చు, పొడవుగా ఉండే రైడర్లను సీటు ఎత్తును పెంచుకోవచ్చు.

అండర్ సీట్ స్టోరేజ్

అండర్ సీట్ స్టోరేజ్

గస్టో స్కూటర్ సీట్ క్రింది భాగంలో స్టోరేజ్ స్పేస్ కాస్తంత తక్కువే అని చెప్పాలి. ఇందులో ఒక హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను మాత్రమే ఉంచేంత స్థలం ఉంటుంది. అయితే, అదనపు స్థలం కోసం మహీంద్రా టూవీలర్స్ తమ గస్టోలో గ్లవ్ బాక్స్‌ను ఆఫర్ చేస్తోంది.

ఫ్రంట్ కిక్ స్టార్ట్

ఫ్రంట్ కిక్ స్టార్ట్

మహీంద్రా గస్టో స్కూటర్ ఫ్రంట్ కిక్ స్టార్ట్‌ను కలిగి ఉంటుంది, ఈ ఫీచర్ కలిగి ఉన్న అతికొద్ది స్కూటర్లలో గస్టో కూడా ఒకటి. దీనివలన మెయిన్ స్టాండ్ ఆన్‌లో లేకపోయినప్పటికీ, కిక్ స్టార్ట్ చేయటం సులువుగా ఉంటుంది. ప్రత్యేకించి మహిళలకు ఈ ఫ్రంట్ కిక్ స్టార్ట్‌ను ఆపరేట్ చేయటం సులువుగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది.

ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్టోరేజ్ స్పేస్

ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్టోరేజ్ స్పేస్

మహీంద్రా గస్టోలో మొత్తం అనలాగ్ మీటర్లే ఉంటాయి. డిజిటల్ మీటర్ అందుబాటులో లేదు. బహుశా దీని ధరను తక్కువగా ఉంచేందుకు ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయటం లేదేమో. ఇకపోతే ఈ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌కు దిగువన చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో వాలెట్, మొబైల్ వంటి వాటిని దాచుకోవచ్చు.

బటన్స్, ప్లాస్టిక్ క్వాలిటీ

బటన్స్, ప్లాస్టిక్ క్వాలిటీ

మహీంద్రా గస్టో స్కూటర్‌లోని బటన్స్ మరియు వాటి ప్లాస్టిక్ క్వాలిటీ అంత నాణ్యంగా అనిపించదు. ప్లాస్టిక్ హార్డ్‌గా ఉండి, వాటిని టచ్ చేసినప్పుడు మంచి ఫీల్ కలగదు. వీటిని నాణ్యత ఇంకొంచెం మెరుగుపరచి ఉంటే బాగుండేది. అయితే, వీటి ప్లేస్‌మెంట్ మాత్రం కంఫర్టబల్‌గా అనిపిస్తుంది.

ఇంజన్

ఇంజన్

మహీంద్రా గస్టో స్కూటర్‌లో 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

సివిటి ట్రాన్సిమిషన్ వలన మహీంద్రా గస్టో లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలాంటి వైబ్రేష్ లేకుండానే ఈ స్కూటర్ సులువుగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.

బెటర్ పవర్, బెటర్ మైలేజ్

బెటర్ పవర్, బెటర్ మైలేజ్

గస్టో స్కూటర్‌ పూర్తి అల్యూమినియం ఎమ్-టెక్‌ ఇంజన్‌తో పాటుగా దృఢమైన క్రాంక్‌షాఫ్ట్ మరియు బేరింగ్స్, అధిక జడత్వం కలిగిన మాగ్నెటో, అత్యధిక శక్తి కలిగిన హెచ్‌టి కాయిల్‌ మరియు సిరీస్‌ రెగ్యులేటర్‌‌ల వలన గస్టో స్కూటర్ బెటర్ పవర్‌ను, మైలేజీని మరియు విశ్వసనీయతను ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

మహీంద్రా గస్టో మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది. అవి -

1. ఐస్‌బర్గ్ వైట్

2. గలాక్టిక్ బ్లాక్

3. మాగ్నటిక్ మాగ్నెటా

4. వొల్కానో రెడ్

5. ఆర్కిటిక్ వైట్

6. రావెన్ బ్లాక్

వేరియంట్లు ధరలు

వేరియంట్లు ధరలు

భారత మార్కెట్లో 'మహీంద్రా గస్టో' స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* మహీంద్రా గస్ట్ డిఎక్స్ - రూ.43,000

* మహీంద్రా గస్ట్ విఎక్స్ - రూ.47,000

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

(ఇవి ప్రారంభోత్సవ ధరలు మాత్రమే, దీపావళి వరకే ఈ ధరలు అందుబాటులో ఉంటాయి)

లభ్యత

లభ్యత

మహీంద్రా గస్టో స్కూటర్ ప్రస్తుతానికి పశ్చిమ, ఉత్తర భారతదేశంలో మాత్రమే లభ్యం కానుంది. మరికొద్ది నెలల్లోనే ఈ స్కూటర్‌ను సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

కాగా.. దక్షిణ భారతదేశంలో ఇది జవరి నుంచి అందుబాటులో ఉంటుందని మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది.

చివరిమాట

చివరిమాట

మహీంద్రా గస్టో స్కూటర్ తక్కువ ధరలో లభిస్తూ, మంచి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఇది నేరుగా హోండా యాక్టివాకు గట్టి పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Mahindra Two Wheelers has just launched its latest Global scooter the ‘Gusto'. The Indian automobile giant has spent a lot of time in developing their new product. They are relatively new in the two wheeler segment.
Story first published: Monday, September 29, 2014, 18:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X