ఇండియన్ ఛీఫ్ వింటేజ్ టెస్ట్ రైడ్ రివ్యూ—కింగ్ ఆఫ్ క్రూజర్స్

By Ravi

అమెరికాకు చెందిన పురాతన మోటార్‌‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌‌సైకిల్స్' (Indian Motorcycles) గడచిన జనవరి 2014లో తమ మూడు మోటార్‌సైకిళ్లను (ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్) భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం, ఇండియన్ మోటార్‌సైకిల్స్ దేశీయ విపణిలో స్కౌట్, ఛీఫ్ క్లాసిక్, ఛీఫ్ వింటేజ్, ఛీఫ్టైన్ మరియు రోడ్‌మాస్టర్ మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.12 లక్షల నుంచి రూ.37 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం సరికొత్త 'ఇండియన్ ఛీఫ్ వింటేజ్' మోటార్‌సైకిల్‌ని ముంబైలో టెస్ట్ రైడ్ చేసింది. విలాసవంతమైన క్రూజర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, ఇండియన్ ఛీఫ్ వింటేజ్ వాటిన్నింటి కన్నా ముందు వరుసలో ఉంటుంది. మరి మా ఈ టెస్ట్ రైడ్‌లో ఈ అమెరికన్ క్లాసిక్ క్రూజర్ ఎన్ని మార్కులు దక్కించుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదవాల్సిందే.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇండియన్ ఛీఫ్ వింటేజ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో ఇండియన్ ఛీఫ్ వింటేజ్ మోటార్‌సైకిల్ టెస్ట్ రైడ్ రివ్యూని పరిశీలించండి.

పరిచయం

పరిచయం

* టెస్ట్ చేసిన మోడల్: 2015 ఇండియా ఛీఫ్ వింటేజ్

* ఇంజన్: 1811సీసీ, వి-ట్విన్

* గేర్‌బాక్స్: 6-స్పీడ్

* రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: థానే, మహారాష్ట్ర

* ధర: రూ.28.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డిజైన్

డిజైన్

ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ అందిస్తున్న ఈ ఛీఫ్ వింటేజ్ క్రూజర్ బైక్ ఇటు క్లాసిక్ లుక్‌ని, అటు మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది అమెరికన్ బ్రాండ్ కావటంతో డిజైన్, క్వాలిటీ విషయంలో ఎక్కడా వంక చెప్పాల్సిన అసరం లేదు. రెట్రో క్లాసిక్ లుక్ కోసం ఈ బైక్‌లో ఎక్కువ మొత్తం క్రోమ్ మెటీరియల్స్ ఉపయోగించారు. అందుకే ఇది తళుక్కుమని మెరుస్తూ, తొలి చూపులోనే మది దోచుకుంటుంది. ఈ బైక్‌ని ఫ్రంట్ వీల్ ఫెండర్ పాతకాలపు డిజైన్‌ను కలిగి ఉండి, దాదాపు సగభాగం చక్రాన్ని కవర్ చేస్తూ కనిపిస్తుంది.

డిజైన్

డిజైన్

పేరుకు తగినట్లుగానే రెట్రో స్టైల్, మోడ్రన్ గ్యాడ్జెట్లతో రూపుదిద్దుకున్న ఇండియన్ ఛీఫ్ వింటేజ్ సురక్షితమైన, సులువుగా రైడ్ చేయటానికి వీలుగా ఉంటుంది. అలాగే, ఈ బైక్‌లోని డ్యూయెల్ ఎగ్జాస్ట్ (డబుల్ సైలెన్సర్) కూడా క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇకపోతే, ఇందులో క్లాసిక్ అప్పీల్‌నిచ్చే మరో ఫీచర్ లెథర్. నాణ్యమైన ఒరిజినల్ లెథర్‌తో తయారు చేయబడిన సీట్స్, శాడల్ బ్యాగ్స్ ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఫ్రంట్ ఫెండర్ మాదిరిగానే రియర్ ఫెండర్ కూడా దాదాపు సగభాగం వెనుక చక్రాన్ని కవర్ చేస్తూ కనిపిస్తుంది.

ఇంజన్

ఇంజన్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్ మోటార్‌సైకిల్‌లో 1811సీసీ, వి-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ అని కూడా పిలుస్తారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 138.9 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. క్లోజ్డ్ లూప్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంధనం సరఫరా అవుతుంది.

ఎక్విప్‌మెంట్

ఎక్విప్‌మెంట్

ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ స్టార్ట్, క్విక్ రిలీస్ లెక్సన్ విండ్‌షీల్డ్, క్విక్ రిలీజ్ వింటేజ్ లెథర్ శాడల్ బ్యాగ్స్, హైవే అండ్ లైట్ బార్ వంటి ఫీచర్లను ఈ ఇండియన్ ఛీఫ్ వింటేజ్ మోటార్‌సైకిల్‌లో స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇవేకాకుండా.. కస్టమర్లు తమ నచ్చిన యాక్ససరీలను, యాడ్-ఆన్ ప్యాకేజ్‌లను ఇండియన్ మోటార్‌సైకిల్ డీలర్‌షిప్స్ నుంచి ఎంచుకోవచ్చు.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్ ఓ భారీ మోటార్‌సైకిల్. దీని మొత్తం బరువు 364 కిలోలు. ఈ బైక్‌ను తొలిసారిగా రైడ్ చేసేవారు, దీనిని చాలా హెవీగా ఫీల్ అవుతారు. కానీ, నిజానికి ఈ బైక్‌ను రైడ్ చేసేటప్పుడు దాని భారం తెలియదు. బైక్‌ను స్టార్ట్ చేసేటప్పుడు, ట్రాఫిక్‌లో నిలుచున్నప్పుడు మాత్రమే బైక్ భారం తెలుస్తుంది. ఓపెన్ రోడ్స్‌పై రైడ్ చేస్తున్నప్పుడు చాలా తేలికగా అనిపిస్తుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

ఈ మోటార్‌సైకిల్‌పై వెళ్తుంటే, ఎవరైనా సరే ఓ సెలబ్రిటీగా మారిపోవటం ఖాయం. రోడ్డుపై వెళ్లే వారి దృష్టంతా మీ ఇండియన్ ఛీఫ్ వింటేజ్ బైక్ పైనే ఉంటుంది. అంతేకాదు.. ఈ బైక్ గురించి మిమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, వారందరికీ ఇది 'ఇండియన్ మోటార్‌సైకిల్' అని చెబితే, అర్థం కాకపోవచ్చేమో. ఎందుకంటే, ఇది ఇండియాలో అంత పాపులర్ అయిన మోటార్‌సైకిల్ కాదు. ఈ బైక్‌పై మేము ఎక్కడికి వెళ్లినా సరే, రోడ్డుపై ఉన్నవారంతా ఒకటి రెండు సార్లు ఈ బైక్ వైపు చూడటం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

వాస్తవానికి ఇండియన్ ఛీఫ్ క్లాసిక్ సిటీ రోడ్లకు సరిపడా బైక్ కాదు. ఓపెన్ రోడ్స్ కోసం అలాగే లాంగ్ ట్రిప్స్ కోసం ఉపయోగపడే ఓ చక్కటి క్రూజర్ బైక్ ఇది. ఆగుతూ, వెళ్తూ ఉండే సిటీ ట్రాఫిక్‌లో దీనిని హ్యాండిల్ చేయటం కష్టంగా అనిపిస్తుంది. ఇంతటి భారీ బైక్‌లో ఇంజన్ త్వరగా వేడెక్కే సమస్య ఉంటుందని మేము మొదట్లో భావించాం, కానీ దీనిపై ఎంత దూరం వెళ్లిన మాకు అలాంటి సమస్య ఏమీ తలత్తెలేదు. నిజానికి ఈ క్రూజర్‌ను నడపాలంటే, సదరు వ్యక్తికి మంచి ఫిజిక్ ఉండాలి.

మాకు నచ్చినవి - రెడ్ ఇండియన్ ఆర్నమెంట్

మాకు నచ్చినవి - రెడ్ ఇండియన్ ఆర్నమెంట్

ఇండియన్ ఛీఫ్ క్రూజర్ మోటార్‌సైకిల్‌లో ఫ్రంట్ ఫెండర్ (మడ్‌గార్డ్)పై ఉండే 'రెడ్ ఇండియన్' ఆర్నమెంట్ ఆకట్టుకుంటుంది. గ్లాస్‌తో తయారు చేయబడిన ఈ ఆర్నమెంట్, క్రోమ్ కవర్‌లో అమర్చబడి ఉంటుంది. ఇండియన్ మోటార్‌సైకిల్ దీనిని 'వార్ బానెట్' అని పిలుస్తుంది, 1947 కాలం నుంచే ఈ ఆర్నమెంట్‌ను ఉపయోగిస్తున్నారు.

మాకు నచ్చినవి - విండ్‌షీల్డ్

మాకు నచ్చినవి - విండ్‌షీల్డ్

ఇండియన్ ఛీఫ్ క్రూజర్ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు హెడ్‌లైట్‌కు పైభాగంలో అమర్చిన విండ్‌షీల్డ్ కూడా ఓపెన్ రోడ్స్‌కి చక్కగా ఉపయోగపడుతుంది. వేగంగా బైక్ నడుపుతున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలి రైడర్‌పై ఎక్కువ భారాన్ని పడకుండా ఉంచడంలో ఇది సహకరిస్తుంది.

మాకు నచ్చినవి - లెథర్ శాడల్ బ్యాగ్స్

మాకు నచ్చినవి - లెథర్ శాడల్ బ్యాగ్స్

బైక్‌కు ఇరువైపులా ఉండే లెథర్ శాడల్ బ్యాగ్స్ స్టోరేజ్ స్పేస్ కోసం మాత్రమే కాకుండా, ఇండియన్ ఛీఫ్ వింటేజ్‌కు ప్రీమియం లుక్‌ని ఆఫర్ చేస్తాయి. అంతేకాకుండా, ఇది బైక్‌కు రెట్రో క్లాసిక్ లుక్‌ని కూడా ఇస్తుంది. ఈ బ్యాగ్స్‌ని ఒరిజినల్ లెథర్‌తో తయారు చేశారు.

మాకు నచ్చినవి - ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

మాకు నచ్చినవి - ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్ మోటార్‌సైకిల్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఉంటుంది. ఇందులో ఓ డిజిటల్ అండ్ అనలాగ్ మీటర్ కన్సోల్ ఉంటుంది. క్రోమ్ ప్యానెల్‌లో అమర్చబడి ఉన్న ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా క్లాసిక్, మోడ్రన్ ఫీచర్లతో డిజైన్ చేయబడి ఉంటుంది.

మాకు నచ్చనివి - స్విచెస్

మాకు నచ్చనివి - స్విచెస్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్‌లో అనేక స్విచెస్ ఉంటాయి, కొత్త వారికి ఇవి గందరగోళంగా అనిపించవచ్చు. అంతేకాకుండా పొట్టిగా ఉండే రైడర్లు ఈ స్విచ్‌లు యాక్సిస్ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇంజన్ కిల్, హాజర్డ్, హారన్, క్రూయిజ్ కంట్రోల్, ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్స్ తదితర స్విచ్‌లు ఇందులో ఉంటాయి. గ్రిప్స్ కూడా చాలా పెద్దవిగా అనిపిస్తాయి.

మాకు నచ్చనివి - బ్యాక్ రెస్ట్ లేకపోవటం

మాకు నచ్చనివి - బ్యాక్ రెస్ట్ లేకపోవటం

ఈ బైక్‌లో రైడర్ కోసం బ్యాక్‌రెస్ట్ ఉంటుంది, కానీ పిలియన్ రైడర్ కోసం బ్యాక్‌‍రెస్ట్ ఉండదు. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు లేదా సడెన్‌గా యాక్సిలరేట్ చేసేటప్పుడు వచ్చే జర్క్‌ను తట్టుకునేందుకు పిలియన్ రైడర్‍‌కు కూడా బ్యాక్‌రెస్ట్ ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ, కస్టమర్లు కోరుకుంటే ఈ బ్యాక్‌రెస్ట్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా ఫిట్ చేయించుకునే వెసలుబాటు ఉంటుంది.

కాంపిటీషన్

కాంపిటీషన్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్ ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్, ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి, హోండా గోల్డ్‌‌వింగ్, సుజుకి ఎమ్1800ఆర్ వంటి క్రూజర్ మోడళ్లతో పోటీ పడనుంది. అయితే, ఈ సెగ్మెంట్లో ఇతర మోడళ్లతో పోల్చుకుంటే ఇండియన్ ఛీఫ్ వింటేజ్ వాటిన్నింటి కన్నా విశిష్టమైన లుక్ అండ్ ఫీల్‌ని కలిగి ఉంటుంది.

చరిత్ర

చరిత్ర

ఇండియన్ మోటార్‌సైకిల్ అమెరికాకు చెందిన క్రూజర్ మోటార్‌సైకిల్ బ్రాండ్. ఈ బ్రాండ్‌ను 1901లో జార్జ్ ఎమ్ హెన్డీ, ఆస్కార్ హెడ్‌స్టోర్మ్‌లు స్థాపించారు. యూఎస్ఏలోని మస్సాచుస్సెట్‌లో ఉన్న స్ప్రింగ్‌ఫీల్డ్ వద్ద ఈ బ్రాండ్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి అత్యంత పాపులర్ అయిన మోటార్‌సైకిల్ స్కౌట్.

ఈ బ్రాండ్‌ను స్థాపించిన తర్వాత ఇది అనేక యజమానుల చేతుల మారింది, అంతేకాకుండా కొంత కాలం పాటు ఈ బ్రాండ్‌ను నిలిపివేయటం కూడా జరిగింది. కాగా.. 2011లో అమెరికాకు చెందిన ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆల్-టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పోలారిస్ యాజమాన్యంలో ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తిరిగి తన పూర్వవైభవాన్ని దక్కించుకుంది.

Most Read Articles

English summary
We give our first ride impression of 2015 Indian Motorcycle Chief Vintage cruiser. 2015 Indian Chief Vintage cruiser price, feature & analysis.
Story first published: Wednesday, January 14, 2015, 19:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X