బజాజ్ అవెంజర్ 220 టెస్ట్ రైడ్ రివ్యూ

By Ravi

కంఫర్టబల్ రైడ్‌ని ఆఫర్ చేసే క్రూజర్ స్టైల్ మోటార్‌సైకిల్ అంటే ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే, వాటి అధిక ధర వలన చాలా మంది కస్టమర్లు క్రూజర్ మోటార్‌సైకిళ్లకు దూరంగా ఉంటున్నారు. సరసమైన ధరకే ఈ తరహా బైక్ లభిస్తే, బైకర్లకు అంతకు మించిన సంతోషం మరోటి ఉండదు. ప్రస్తుతం మనదేశంలో లభిస్తున్న చీప్ అండ్ బెస్ట్ క్రూజర్ బైక్ బజాజ్ అవెంజర్ 220.

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న అవెంజర్ 220సీసీ బైక్ లక్ష రూపాయలకు దిగువన లభిస్తోంది. ఈ బైక్ ఇటు సిటీ రైడ్‌కి అటు హైవే టూరింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. నేటి ఆధునిక యువతరం స్పోర్టీగా కనిపించే నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌లకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. క్రూజర్ మోటార్‌సైకిల్‌లో ఉండే కంఫర్ట్‌నెస్‌ని రుచి చూస్తే, వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో.

మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే కొత్త బజాజ్ అవెంజర్ 220 మోడల్ బైక్‌ని టెస్ట్ రైడ్ చేసింది. ఈ బైక్‌పై ఏకంగా 1500 కిలోమీటర్లు (3 రోజుల పాటు) కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రయాణించి, ఈ బైక్ సామర్థ్యాన్ని పరీక్షించడం జరిగింది. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులలో సైతం సులువుగా దూసుకుపోగలిగిన అవెంజర్ 220 గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బజాజ్ అవెంజర్ 220 టెస్ట్ రైడ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో బజాజ్ అవెంజర్ 220 టెస్ట్ రైడ్ రివ్యూని చదవండి.

మోడల్

మోడల్

గతంలో కవాసకి ఎలిమేటర్ బైక్ గుర్తున్న వారికి బజాజ్ అవెంజర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కవాసకి ఎలిమేటర్ డిజైన్‌పై రూపుదిద్దుకున్నదే ఈ బజాజ్ అవెంజర్. తొలుత ఇందులో 180సీసీ, 200సీసీ వేరియంట్లు లభించేవి. కానీ, బజాజ్ ఆటో ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లను నిలిపి వేసింది. ఇప్పుడు ఇది కేవలం 220సీసీ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది.

డిజైన్

డిజైన్

బజాజ్ అవెంజర్ పూర్తి మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండదు. ఇదొక క్లాసిక్ క్రూజర్ మోటార్‌సైకిల్. ఫోక్స్ వీల్స్, రౌండ్ హెడ్ ల్యాంప్ అండ్ ఇండికేటర్ ల్యాంప్, వెడల్పాటి ఫ్యూయెల్ ట్యాంక్, విశాలమైన సీట్, రౌండ్ అనలాగ్ స్పీడో మీటర్‌లతో ఇది పూర్తి క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.

క్రోమ్ గార్నిష్, ప్రీమియం లుక్

క్రోమ్ గార్నిష్, ప్రీమియం లుక్

బజాజ్ అవెంజర్ 220 బైక్‌లో ఎక్కువగా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్, ఇండికేటర్ ల్యాంప్స్, క్రాష్ గార్డ్, స్పీడోమీటర్, సైడ్ మిర్రర్స్, ఫ్యూయెల్ ట్యాంక్ మౌంటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైలెన్సర్, వెనుక సస్పెన్షన్, బ్యాక్ రెస్ట్ ఇవన్నీ కూడా క్రోమ్ ఫినిషింగ్‌తో డిజైన్ చేయబడి ఉంటాయి. మొత్తమ్మీద ఈ క్రోమ్ గార్నిష్ చూడటానికి కంటికి ఇంపుగా అనిపిస్తూ, బైక్‌కి మంచి ప్రీమియం లుక్‌నిస్తుంది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

బజాజ్ అవెంజర్ 220లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఉంటుంది. దీనిపై ఇండికేటర్, బ్యాటరీ, న్యూట్రల్, హై-బీమ్ వార్నింగ్ లైట్స్ ఉంటాయి. అలాగే, అనలాగ్ ఫ్యూయెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది.

ఆర్‌పిఎమ్ మీటర్ లేదు

ఆర్‌పిఎమ్ మీటర్ లేదు

బజాజ్ అవెంజర్ 220 బైక్‌లో ఆర్‌పిఎమ్ మీటర్ ఉండదు. కాబట్టి, ఎంత ఆర్‌పిఎమ్‌లో గేరు మారుస్తున్నామో అనే విషయాన్ని తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది. ఇందులో కేవలం స్పీడో మీటర్ మాత్రమే ఉంటుంది. అయితే, స్పీడో మీటర్‌లో మ్యాన్యువల్ ట్రిప్ మీటర్ కూడా ఉంటుంది. అయితే, 999 కిలోమీటర్ల తర్వాత తిరిగి 0 కి వచ్చేస్తుంది.

ఇంజన్

ఇంజన్

ఈ క్రూజర్ మోటార్‌సైకిల్‌లో 219.89సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ, ఎయిర్ కూల్డ్ విత్ ఆయిల్ కూలర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8400 ఆర్‌పిఎమ్ వద్ద 19.03 బిహెచ్‌పిల శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 17.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ (1 క్రిందకు, 4 పైకి)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

బజాజ్ అవెంజర్ 19.03 బిహెచ్‌పిల శక్తితో సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ బైక్ ఇన్షియల్ పికప్ చాలా చక్కగా ఉంటుంది. మిడ్-రేంజ్ పికప్ కాస్తంత తక్కువ అనిపించినప్పటికీ, హై-రేంజ్ పికప్ మాత్రం మెరుగ్గానే అనిపిస్తుంది. ప్రత్యేకించే హైవేలు, ఓపెన్ రోడ్లపై ఈ బైక్ పెర్ఫార్మెన్స్ చక్కగా ఉంటుంది.

హ్యాండ్లింగ్

హ్యాండ్లింగ్

లో-స్లంగ్ క్రూజర్ సీటింగ్ పొజిషన్‌తో కూడిన అవెంజర్ హ్యాండ్లింగ్ సులువుగా ఉంటుంది. దీని వీల్ బేస్ 1475 మి.మీ. అధిక వీల్ బేస్ కారణంగా, స్పోర్ట్స్ బైక్ మాదిరిగా అవెంజర్‌తో షార్ప్ కటింగ్స్, టర్నింగ్స్ చేయటం సాధ్యం కాదు.

మైలేజ్

మైలేజ్

రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం బజాజ్ అవెంజర్ 220 లీటరుకు 30-35 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. దీని ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు, రిజర్వ్ సామర్థ్యం 3.4 లీటర్లు. ఫుల్ ట్యాంక్‌పై సగటున 500 కిలోమీటర్లు పైగా దూరం ప్రయాణించవచ్చు.

టైర్లు

టైర్లు

ఈ బైక్‌లో ముందు వైపు 90 / 90 x 17" సైజ్ టైరుని, వెనుక వైపు 130 / 90 x 15" టైరుని ఆఫర్ చేస్తున్నారు. వెనుక టైరు వెడల్పుగా మంచి రోడ్ గ్రిప్‌ను ఇస్తుంది. బైక్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసేందుకు ఈ టైరు ఎంతగానో సహకరిస్తుంది. ఇవి ట్యూబ్ టైర్లు. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లను ఆఫర్ చేసి ఉంటే, బాగుండనేది మా అభిప్రాయం.

బ్రేక్స్

బ్రేక్స్

ఈ బైక్‌లో ముందు వైపు 260 మి.మీ. డయా డిస్క్ బ్రేక్ (బ్రెంబో బ్రాండ్)ను వెనుక వైపు 130 మి.మీ డయా డ్రమ్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు. నిజానికి దీని బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ మమ్మల్ని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. లూజ్ గ్రావెల్, తడిసిన రోడ్లపై ఫ్రంట్ బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు బైక్ జారిపోయే ప్రమాదాన్ని మేము మా టెస్ట్ రైడ్‌‌లో గుర్తించాము.

సస్పెన్షన్

సస్పెన్షన్

బజాజ్ అవెంజర్ 220లో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లను ఆఫర్ చేస్తున్నారు. సోలో రైడ్ చేస్తున్నప్పుడు దీని సస్పెన్షన్ సిస్టమ్ బాగానే అనిపిస్తుంది కానీ, పిలియన్ రైడ్‌లో మాత్రం కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది.

సీటింగ్ పొజిషన్

సీటింగ్ పొజిషన్

ఈ బైక్‌లోని వెడల్పాటి లో-స్లంగ్ క్రూజర్ సీటింగ్ రైడర్‌కు మంచి కంఫర్ట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, దీని రైడింగ్ పొజిషన్‌ను చక్కగా డిజైన్ చేశారు. కాళ్లు ముందుకు చాచినట్లుగా ఉండే రైడింగ్ పొజిషన్ లాంగ్ రైడ్‌కి అనుకూలంగా ఉంటుంది. పిలియన్ రైడర్ కోసం జోడించిన బ్యాక్‌రెస్ట్ కూడా మంచి కంఫర్ట్‌ను అందిస్తుంది. పొట్టిగా ఉండే రైడర్లకు సైతం ఈ బైక్‌ని హ్యాండిల్ చేయటం సులువుగా ఉంటుంది. అంతేకాకుండా, లాంగ్ రైడ్‌లో నడుము నొప్పి కూడా అనిపించదు.

బజాజ్ అవెంజర్ 220 టెస్ట్ రైడ్ రివ్యూ

బజాజ్ అవెంజర్ 220లో కొన్ని మంచి విషయాలు ఉన్నట్లే, కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి. ఆ చెడు విషయాలేంటో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

కిక్ స్టార్ట్ లేదు

కిక్ స్టార్ట్ లేదు

బజాజ్ అవెంజర్ కేవలం ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో కిక్ స్టార్ట్ ఆప్షన్ లేదు. బ్యాటరీలో ఏదైనా లోపం ఉంటే, ఇంజన్‌ను స్టార్ట్ చేయటం కష్టమవుతుంది. అయితే, ఈ సమస్యను నివారించేందుకు బజాజ్ ఆటో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీని ఆఫర్ చేస్తోంది. అలాగే, బ్యాటరీ పనితీరును ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై వార్నింగ్ లైట్ రూపంలో చూపిస్తుంది.

బరువు

బరువు

బజాజ్ అవెంజర్ 220 ఖాలీ ట్యాంక్‌తో 154.5 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో ఈ బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు రోడ్డుపై పంక్చర్ అయితే (ప్రత్యేకించి వెనుక టైరు) ఈ బైక్‌ను ముందు నెట్టుకు వెళ్లటం భారంగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, దీని సీటింగ్ పొజిషన్ వలన ఈ బైక్ అధిక బరువు కలిగి ఉన్న కూడా దీనిని హ్యాండిల్ చేయటం సులువుగానే అనిపిస్తుంది.

స్విచ్‌ల క్వాలిటీ

స్విచ్‌ల క్వాలిటీ

ఈ బైక్‌లో ఉపయోగించిన స్విచ్‌ల క్వాలిటీ చాలా పూర్‌గా అనిపిస్తుంది. పల్సర్ బైక్‌లలో మాదిరిగా నాణ్యమైన బ్యాక్‌లిట్ (ప్రకాశించే) స్విచ్‌లను అవెంజర్ 220లో కూడా ఆఫర్ చేసి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

కీ (తాళం)

కీ (తాళం)

చివరిగా.. ఇంత విలువైన బైక్‌కి బజాజ్ ఆఫర్ చేస్తున్న తాళం చూస్తే, ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. అవెంజర్ 220 తాళం చెవి విషయంలో బజాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

వ్యాల్యూ ఫర్ మనీ

వ్యాల్యూ ఫర్ మనీ

బజాజ్ అవెంజర్ 220లో కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నప్పటికీ ఇది ధరకు తగిన విలువను మాత్రం ఆఫర్ చేస్తుందనే చెప్పాలి. బడ్జెట్ విషయంలో ఈ క్రూజర్ మోటార్‌సైకిల్ లక్ష రూపాయల కన్నా తక్కువకే లభిస్తుంది (ఆన్-రోడ్ ధర సుమారు రూ.94,000).

బజాజ్ నుంచి మరో కొత్త క్రూజర్

బజాజ్ నుంచి మరో కొత్త క్రూజర్

ఇదిలా ఉంటే, బజాజ్ ఆటో వచ్చే ఏడాదిలో ఓ కొత్త క్రూజర్ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవెంజర్‌కు ఎగువన ఈ కొత్త క్రూజర్‌ను ప్రవేశపెడుతారా లేక అవెంజర్‌ను తొలగించి, దాని స్థానంలో ఈ కొత్త క్రూజర్‌ను చేరుస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఈ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Team DriveSpark recently tested the new Bajaj Avenger 220. It is classic cruiser motorcycle. The looks, low slung styling, classic fuel tank with fuel gauge build it give the Avenger a distinct identity ad road presence. Take a look at our test ride report.
Story first published: Wednesday, December 3, 2014, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X