బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 వర్సెస్ కెటిఎమ్ ఆర్‌సి200

By Ravi

బజాజ్ ఆటో 200సీసీ బైక్ సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన పల్సర్ ఆర్ఎస్200 స్పోర్ట్స్ బైక్‌తో ఈ సెగ్మెంట్లో పోటీ జోరందుకుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో బజాజ్ భాగస్వామ్య కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త ఆర్‌సి200 స్పోర్ట్స్ బైక్‌ను విక్రయిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రెండు మోడళ్లలో దేనిని కొనుగోలు చేయాలని కస్టమర్లు తికమక పడిపోతున్నారు.

బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ నేక్డ్ బైక్‌కి ఫెయిర్డ్ వెర్షనే ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్200. అలాగే కెటిఎమ్ అందిస్తున్న డ్యూక్ 200 నేక్డ్ బైక్‌కి ఫెయిర్డ్ వెర్షనే ఈ ఆర్‌సి200. ఈ రెండు మోడళ్లు కూడా బజాజ్ ప్రో బైక్ షోరూమ్‌ల ద్వారా అందుబాటులోకి ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పల్సర్ ఆర్ఎస్200 డిజైన్

పల్సర్ ఆర్ఎస్200 డిజైన్

బజాజ్ ఇప్పటి వరకూ ఏ పల్సర్ బైక్‌ను ఈ విధంగా డిజైన్ చేయలేదు. పూర్తిగా సూపర్‌బైక్‌ను తలపించేలా మంచి ఫెయిరింగ్‌తో ఈ కొత్త ఆర్ఎస్200ను డిజైన్ చేశారు. ఇందులో ఆర్ఎస్ అంటే రేసింగ్ స్పోర్ట్ అని అర్థం. ఫుల్ బాడీ ఫెయిరింగ్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్‌తో ఇది స్టన్నింగ్ లుక్‌ని కలిగి ఉంటుంది.

కెటిఎమ్ ఆర్‌సి200 డిజైన్

కెటిఎమ్ ఆర్‌సి200 డిజైన్

డిజైన్ విషయంలో కెటిఎమ్ మోటార్‌సైకిళ్లకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా ఇప్పటికే మంచి పాపులారిటీ ఉన్న ఈ బ్రాండ్, ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే సక్సెస్‌ను దక్కించుకుంటోంది. డ్యూక్ 200కు ఫెయిరింగ్‌ని జోడించి ఆర్‌సి200ను తయారు చేశార. దీని ఫ్రంట్ లుక్ చాలా విశిష్టంగా, స్టయిలిష్‌గా ఉంటుంది.

కెటిఎమ్ ఆర్‌సి200 డిజైన్ కన్నా పల్సర్ ఆర్ఎస్200 డిజైన్ కాస్త దేశీయంగా అనిపిస్తుంది. కాబట్టి డిజైన్ విషయంలో మా ఓటు పల్సర్ ఆర్ఎస్200కే.

పల్సర్ ఆర్ఎస్200 కీలక ఫీచర్లు

పల్సర్ ఆర్ఎస్200 కీలక ఫీచర్లు

- ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్

- ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్

- క్రిస్టల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

- సెమీ డిజిటల్ మీటర్ కన్సోల్

- ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేక్స్

- ఆప్షనల్ ఏబిఎస్

కెటిఎమ్ ఆర్‌సి200 కీలక ఫీచర్లు

కెటిఎమ్ ఆర్‌సి200 కీలక ఫీచర్లు

- ఇన్‌వర్టెడ్ ఫోర్క్స్

- డ్యూయెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్

- ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్

- ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

- డిజిటల్ మీటర్ కన్సోల్

- ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేక్స్

కీలక ఫీచర్ల పరంగా చూసుకుంటే కెటిఎమ్ ఆర్‌సి 200లోని అన్ని ఫీచర్లు పల్సర్ ఆర్ఎస్200లో లభిస్తున్నాయి. అంతేకాకుకండా ఇందులో ఏబిఎస్ ఫీచర్ ఆప్షనల్‌గా అందుబాటులో ఉంది. కెటిఎమ్ ఆర్‌సి200లో ఏబిఎస్ లేదు.

పల్సర్ ఆర్ఎస్200 ఇంజన్

పల్సర్ ఆర్ఎస్200 ఇంజన్

పల్సర్ అర్ఎస్200లోని 199.5సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 24 హెచ్‌పిల శక్తిని, 18.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో మూడు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి. దీని బరువు 165 కేజీలు, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు.

కెటిఎమ్ ఆర్‌సి200 ఇంజన్

కెటిఎమ్ ఆర్‌సి200 ఇంజన్

కెటిఎమ్ ఆర్‌సి200లోని 199.5సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 25 హెచ్‌పిల శక్తిని, 19 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని బరువు 137.5 కేజీలు, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు.

ఇంజన్ పెర్ఫామెన్స్ విషయంలో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 కన్నా కెటిఎమ్ ఆర్‌సి200 బెస్ట్‌గా ఉంటుంది.

పల్సర్ ఆర్ఎస్200 సేఫ్టీ

పల్సర్ ఆర్ఎస్200 సేఫ్టీ

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 స్టాండర్డ్ వేరియంట్‌లో 300 మి.మీ ఫ్రంట్ అండ్ 230 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్స్ లభిస్తాయి. అదే టాప్-వేరియంట్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) లభిస్తుంది.

కెటిఎమ్ ఆర్‌సి200 సేఫ్టీ

కెటిఎమ్ ఆర్‌సి200 సేఫ్టీ

కెటిఎమ్ ఆర్‌సి200 బైక్‌లో 300 మి.మీ ఫ్రంట్ అండ్ 230 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్స్ మాత్రమే లభిస్తాయి. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆప్షనల్‌గా కూడా అందుబాటులో లేదు.

కాబట్టి, సేఫ్టీ విషయంలో మా ఓటు నేరుగా పల్సర్ ఆర్ఎస్200కే వెళ్తుంది.

ధర

ధర

పల్సర్ ఆర్ఎస్200: రూ.1.18 లక్షలు (స్టాండర్డ్)

పల్సర్ ఆర్ఎస్200: రూ.1.30 లక్షలు (ఏబిఎస్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ధర

ధర

కెటిఎమ్ ఆర్‌సి200: రూ.1.67 లక్షలు

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ధర పరంగా చూసుకుంటే, మా ఓటు డెఫెనెట్‌గా పల్సర్ ఆర్ఎస్200కే చెందుతుంది.

చివరిమాట

చివరిమాట

పల్సర్ ఆర్ఎస్200, కెటిఎమ్ ఆర్‌సి200 మధ్య చాలా దగ్గర కాంపిటీషన్ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే తక్కువ ధరలో బెస్ట్ స్పోర్ట్స్ బైక్ కావాలనుకునే వారు పల్సర్ ఆర్ఎస్200ను ఎంచుకోవచ్చు.

అలాకాకుండా.. ధర కాస్తంత ఎక్కువైనా పర్లేదు విదేశీ బ్రాండ్ (ఆస్ట్రియన్) మరియు ప్యూర్లీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ బైక్ కావాలనుకునే వారు కెటిఎమ్ ఆర్‌సి200ను ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
The 200 cc sport bike segment is again dominated by KTM with the RC 200. Being manufactured along with the KTM RC 200 though is the newly launched Bajaj Pulsar RS 200.
Story first published: Saturday, March 28, 2015, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X