బెనెల్లీ బిఎన్600ఐ టెస్ట్ రైడ్ రివ్యూ; మరో ఇటాలియన్ బీస్ట్

By Ravi

ఇటలీకి చెందిన టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ, వచ్చే ఏడాది భారత మార్కెట్లో మొత్తం 12 మోటార్‌‌సైకిళ్లను విడుదల చేయనుంది. ఇప్పటికే బెనెల్లీ బైక్స్‌ను మీడియా డ్రైవ్ కోసం కంపెనీ అందుబాటులో ఉంచింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మా డ్రైవ్ స్పార్క్ బృందం పాపులర్ బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేసింది.

బెనెల్లీ నుంచి ఇండియాలో విడుదల కానున్న 12 మోటార్‌సైకిళ్లలో బిఎన్600ఐ మోడల్ కూడా ఒకటి. స్టయిల్, పవర్, డ్యూరబిలిటీ, పెర్ఫార్మెన్స్, డిజైన్ వంటి అంశాలతో రూపుదిద్దుకున్న బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్ విశేషాలను ఈ సమీక్షలో తెలుసుకుందాం రండి.

పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్ ద్వారా బెనెల్లీ ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. డిఎస్‌కే ఇప్పటికే కొరియాకి చెందిన హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో విక్రయిస్తోంది. బెనెల్లీ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయటం ద్వారా వీటిని సరసమైన ధరకే అందించాలని కంపెనీ భావిస్తోంది. మరి మా టెస్టింగ్‌లో ఈ కొత్త బెనెల్లీ బైక్ ఎన్ని మార్కులు దక్కించుకుందో తెలియాలంటే ఈ కథనాన్ని చదవండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బెనెల్లీ బిఎన్600ఐ టెస్ట్ రైడ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో బెనెల్లీ బిఎన్600ఐ టెస్ట్ రైడ్ రివ్యూని చదవండి.

ఓవర్‌వ్యూ

ఓవర్‌వ్యూ

* టెస్ట్ చేసిన మోడల్: బెనెల్లీ బిఎన్600ఐ (టిఎన్‌టి600)

* ఇంజన్: ఇన్-లైన్ ఫోర్, 600సీసీ

* గేర్‌బాక్స్: 6-స్పీడ్

* రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: పూనే

డిజైన్

డిజైన్

బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్ మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉండి, తొలిచూపులోనే యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటాలియన్ మేడ్ కాబట్టి, దీని డిజైన్ విషయంలో ఎలాంటి సెకండ్ థాట్ అవసరం ఉండదు. ఇదొక సెమీ-ఫెయిర్డ్ మోటార్‌సైకిల్.

డిజైన్

డిజైన్

బిఎన్600ఐ స్టయిలింగ్ విషయంలో బెనెల్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది, ఈ సెగ్మెంట్లో ఏ ఇతర బైక్‌లో లేని డిజైన్ ఎలిమెంట్లను కంపెనీ ఇందులో పొందుపరచింది. ఈ మోటార్‌సైకిల్‌లోని చిన్న చిన్న డిటేలింగ్స్ విషయంలో కూడా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. హైస్పీడ్స్ వద్ద సైతం మంచి కంట్రోల్ ఉండేలా, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఈ బైక్‌ని డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌లో ఇన్-లైన్ ఫోర్, లిక్విడ్ కూల్డ్ 600సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 82 హార్స్‌పవర్‌ల శక్తిని, 52 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డెల్ఫీ సప్లయ్ చేసిన ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్టర్‌ను ఈ ఇంజన్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది, ఇందులో వెట్ క్లచ్ ఉంటుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

రైడ్ చేయటానికి సులువుగా ఉండే 600సీసీ మోటార్‌సైకిళ్లలో బెనెల్లీ బిఎన్600ఐ కూడా ఒకటి ఇది టాల్ గేరింగ్ రేషియోలను కలిగి ఉండి, మెరుగైన పవర్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ బైక్‌పై రైడ్ కొంచెం స్టిఫ్‌గా అనిపించినప్పటికీ, రైడర్‌కు నచ్చిన విధంగా ఫ్రంట్ అండ్ రియర్ షాక్ అబ్జార్వర్లను సర్దుబాటు చేసుకునే వెసలుబాటును కల్పించారు. ఏదేమైనప్పటికీ, ఈ బైక్ హెవీగా ఉండి, నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై ఆగుతూ, ఆగుతూ వెళ్లటం కష్టంగా అనిపిస్తుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

ఇది ఫార్వార్డ్ లీన్ డ్రైవింగ్ పొజిషన్‌ను కలిగి ఉండి, మంచి రైడింగ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్ కేవలం రోజూవారీ ఉపయోగానికే కాకుండా, వీకెండ్ లాంగ్ రైడ్స్‌కి చక్కగా సూట్ అవుతుంది. ఇందులోని రీఫైన్డ్ ఇంజన్ దాదాపుగా ఎలాంటి వైబ్రేషన్‌ను కలిగి ఉండదనే చెప్పాలి.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఈ మోటార్‌సైకిల్‌లో డిజిటల్ ప్లస్ అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అనలాగ్ కన్సోల్‌పై కేవలం ఆర్‌పిఎమ్ ఇండికేటర్ మాత్రమే ఉంటుంది. డిజిటల్ మీటర్‌పై స్పీడ్ డిస్‌ప్లే అవుతుంది. ఇంకా ఇందులో ఇంజన్ టెంపరేచర్, క్లాక్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, ఓడోమీటర్‌సు కూడా డిస్‌ప్లే అవుతాయి. దీని సెటప్ కూడా సింపుల్‌గా, అర్థమయ్యేలా ఉంటుంది.

స్విచెస్

స్విచెస్

ఇందులో బేసిక్ స్విచెస్ ఉంటాయి, వీటి నాణ్యత కూడా మెరుగ్గానే ఉంటుంది. హైవేపై లేదా వర్షం/పొగమంచు వాతావరణంలో నడుపుతున్నప్పుడు మోటారిస్టులను అలెర్ట్ చేసేందుకు ఇందులో హాజర్డ్ లైట్స్ ఉంటాయి. హాజర్డ్ స్విచ్ ఆన్ చేయగానే నాలుగు ఇండికేటర్ లైట్లు వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి. ఇకపోతే హ్యాండిల్‌బార్ గ్రిప్స్ సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి.

మాకు నచ్చినవి - డిజైన్

మాకు నచ్చినవి - డిజైన్

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఇటాలియన్ డిజైన్ మోటార్‌సైకిళ్ల విషయంలో వంక చెప్పాల్సిన అసరం ఉంటుంది. బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్ ప్రతి కోణం నుంచి కూడా కళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది.

మాకు నచ్చినవి - ట్విన్ ఎగ్జాస్ట్

మాకు నచ్చినవి - ట్విన్ ఎగ్జాస్ట్

బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌లో ఉండే డ్యూయెల్ ఎగ్జాస్ట్ ఈ బైక్‌కు మరింత ప్రత్యేకమైన అప్పీరెన్స్‌ను తెచ్చిపెడుతుంది. ఈ ఎగ్జాస్ట్ పైప్స్ గ్రాబ్ రెయిల్స్ క్రింది భాగంలో త్రికోణాకారంలో ఉంటాయి. సైలెన్సర్ బీటింగ్ (ఎగ్జాస్ట్ సౌండ్) కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

మాకు నచ్చినవి - కీ (తాళంచెవి)

మాకు నచ్చినవి - కీ (తాళంచెవి)

ఈ బైక్‌లో కీ మెకానిజం చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. కత్తిలాంటి షేపులో ఉండే బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్ కీ వాస్తవానికి ఓ ఫోల్డింగ్ కీ. ఈ ఫోల్డింగ్ కీ వలన జేబులు చిరిగిపోయే ప్రమాదం ఉండదు. ఈ కీ డిజైన్ తప్పకుండా చూపరులను ఆకట్టుకుంటుంది.

మాకు నచ్చినవి - రైడింగ్ పొజిషన్స్

మాకు నచ్చినవి - రైడింగ్ పొజిషన్స్

బెనెల్లీ బిఎన్600ఐ రైడర్ సీటింగ్ పొజిషన్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు. పొట్టిగా ఉండే రైడర్లు సైతం సౌకర్యవంతంగా ఈ బైక్‌ని నడిపేలా దీనిని డిజైన్ చేశారు. పిలియన్ రైడర్ సీట్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ, యువతకు మాత్రం ఇది చక్కగా సరిపోతుంది. ఇదొక మంచి ఫన్-టూ-రైడ్ మోటార్‌సైకిల్.

మాకు నచ్చనవి - సైడ్ స్టాండ్, ఫుట్ పెగ్స్

మాకు నచ్చనవి - సైడ్ స్టాండ్, ఫుట్ పెగ్స్

సైడ్ స్టాండ్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ కాదు. ఇదొక మంచి సేఫ్టీ ఫీచరే అయినప్పటికీ, ఈ స్టాండ్‌ను ఆపరేట్ చేయటం కాస్తంత కష్టంగా అనిపిస్తుంది. దీని రైడర్, పిలియన్ రైడర్ ఫుట్ పెగ్స్ కూడా చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. సైడ్ స్టాండ్‌ను ఎంగేజ్ చేయటానికి ఫుట్ పెగ్స్‌ని పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

మాకు నచ్చనవి - సైడ్ మిర్రర్

మాకు నచ్చనవి - సైడ్ మిర్రర్

లీఫ్ షేపులో ఉండే ఈ సైడ్ మిర్రర్స్ డిజైన్ కొత్తగా ఉన్నప్పటికీ, వీటి ఫంక్షనాలిటీ మాత్రం అంత సమర్థవంతంగా ఉండదు. వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్రొజెక్ట్ చేయటంలో ఇవి అంత మెరుగ్గా అనిపించవు.

మాకు నచ్చనవి - స్టోరేజ్ స్పేస్

మాకు నచ్చనవి - స్టోరేజ్ స్పేస్

బెనెల్లీ బిఎన్600ఐ బైక్‌లో స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ. పిలియన్ రైడర్ సీట్ క్రింది భాగంలో డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునేంత స్థలం మాత్రమే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బైక్‌లో టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కూడా ఉండవు.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇండియన్ మార్కెట్ కోసం డిఎస్‌కె బెనెల్లీ ఆఫర్ చేయనున్న మోటార్‌సైకిళ్లను టిఎన్‌టి బ్యాడ్జ్‌తో విక్రయించనున్నారు. మేము టెస్ట్ చేసిన బిఎన్600ఐ బైక్‌ను, ఇండియాలో విడుదల చేసిన తర్వాత టిఎన్‌టి600ఐ పేరుతో విక్రయించనున్నారు. టిఎన్‌టి అంటే టోర్నడో ట్రి నేక్డ్ అని అర్థం.

మంచి (ప్రోస్)

మంచి (ప్రోస్)

* అందమైన ఇటాలియన్ డిజైన్ మోటార్‌సైకిల్

* ఇండియాలోనే అసెంబ్లింగ్

* సూపర్‌స్పోర్ట్ ఎక్స్‌పీరియెన్స్

* ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్)

(చెడు) కాన్స్

(చెడు) కాన్స్

* ఇండియాలో గుర్తింపు లేని/పూర్తిగా కొత్త బ్రాండ్

* ధర (అధికంగా ఉండొచ్చని అంచనా)

చివరిమాట

చివరిమాట

భారత మార్కెట్లో బెనెల్లీ మోటార్‌సైకిళ్లు మంచి విజయం సాధించాలంటే, వీటి ధర విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్లోని కాంపిటీటర్లను దృష్టిలో ఉంచుకొని, వారి కన్నా తక్కువ ధరకే బెనెల్లీ తమ ఉత్పత్తులను ఆఫర్ చేయగలిగినట్లయితే, తప్పకుండా విజయం సాధించవచ్చనేది మా అభిప్రాయం. ఇక బెనెల్లీ బిఎన్600ఐ లేదా టిఎన్‌టి600ఐ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఇదొ ప్యూర్ ఫన్ టూ రైడ్ బైక్. యువత దీని డిజైన్, పెర్ఫార్మెన్స్‌ను ఖచ్చితంగా ఇష్టపడుతుంది.

Most Read Articles

English summary
DSK Motors had recently announced that they would be joining forces with Italian manufacturer Benelli. They have been scouting for partners for quite some time to enter the Indian market. After a lot of consideration and negotiations, the Italian company has decided to partner with DSK.
Story first published: Tuesday, December 16, 2014, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X