బెనెల్లీ టిఎన్‌టి899 టెస్ట్ రైడ్ రివ్యూ; బీస్ట్ విత్ బ్యూటీ

By Ravi

ఇటాలియన్ మోటార్‌సైకిల్ టూవీలర్ బెనెల్లీ, ఈ ఏడాది భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. పూనేకి చెందిన డిఎస్‌కే గ్రూపు ద్వారా బెనెల్లీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. గ్లోబల్ మార్కెట్లలో బెనెల్లీ విక్రయిస్తున్న తమ 300సీసీ రేంజ్ బైక్‌లను మొదలుకొని 1190సీసీ రేంజ్ బైక్‌ల వరకూ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. బెనెల్లీ మొత్తం 12 మోటార్‌‌సైకిళ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

బెనెల్లీ ఇండియా ఇప్పటికే కొన్ని బైక్స్‌ను మీడియా డ్రైవ్ కోసం అందుబాటులో ఉంచింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మా డ్రైవ్‌‌స్పార్క్ బృందం ఇటీవలే బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ తాజాగా తమ 'బెనెల్లీ టిఎన్‌టి899' (Benelli TNT899) మోడల్‌ను మీడియా రైడ్ కోసం ఆఫర్ చేయటం జరిగింది. ఇదే బైక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ కూడా టెస్ట్ చసింది.

బెనెల్లీ ఇండియాలో విడుదల చేయాలనుకున్న 12 మోటార్‌సైకిళ్లలో టిఎన్‌టి899 మోడల్ కూడా ఒకటి. ఇటాలియన్ డిజైన్, ధృడత్వం, మన్నిక, లగ్జరీ స్టయిల్, పవర్‌ఫుల్ ఇంజన్, యూత్‌ఫుల్ లుక్ వంటి పలు అంశాలతో రూపుదిద్దుకున్న బెనెల్లీ టిఎన్‌టి899 మోటార్‌సైకిల్ విశేషాలను ఈ సమీక్షలో తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: బెనెల్లీ బిఎన్600ఐ టెస్ట్ రైడ్ రివ్యూ

బెనెల్లీ టిఎన్‌టి899 టెస్ట్ రైడ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో బెనెల్లీ టిఎన్‌టి899 టెస్ట్ రైడ్ రివ్యూని చదవండి.

ఓవర్‌వ్యూ

ఓవర్‌వ్యూ

* టెస్ట్ చేసిన మోడల్: బెనెల్లీ టిఎన్‌టి899

* ఇంజన్: ఇన్-లైన్ త్రీ, 899సీసీ

* గేర్‌బాక్స్: 6-స్పీడ్

* రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: పూనే

డిజైన్

డిజైన్

బెనెల్లీ టిఎన్‌టి899 మోటార్‌సైకిల్ ఫ్రంట్ డిజైన్ చాలా విశిష్టంగా ఉండి, తొలిచూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. దీని హెడ్‌లైట్స్ మరమనిషి తలను తలపించే విధంగా ఉంటుంది. ఇటాలియన్ మేడ్ కాబట్టి, దీని డిజైన్ విషయంలో ఎలాంటి సెకండ్ థాట్ అవసరం ఉండదు. ఇదొక నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్.

డిజైన్

డిజైన్

మేము రైడ్ చేసిన బెనెల్లీ టిఎన్‌టి899 వైట్ కలర్‌ది. దీని ఫ్రేమ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ తరహా ఫ్రేమ్‌ను స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అంటారు. కెటిఎమ్ డ్యూక్ బైక్‌ల మాదిరిగానే ఈ బెనెల్లీ టిఎన్‌టి899 ఫ్రేమ్ కూడా బయటకు కనిపించేలా ఉంటుంది. ఈ బైక్ స్టయిలింగ్ విషయంలో బెనెల్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకే ఇందులోని చిన్న చిన్న డిటేలింగ్స్ కూడా గొప్పగా కనిపిస్తాయి. హైస్పీడ్స్ వద్ద సైతం మంచి కంట్రోల్ ఉండేలా, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఈ బైక్‌ని డిజైన్ చేశారు.

డిజైన్

డిజైన్

బెనెల్లీ టిఎన్‌టి899 బైక్‌లోని పవర్‌ఫుల్ ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను రేడియేటర్‌ను ట్యాంక్‌కు అమరి ఉండే సైడ్ ప్యానెల్స్‌లో అమర్చారు. ఇందులో ఇదొక విశిష్టమైన ఫీచర్. అలాగే, ఇందులో త్రీ-ఇన్-వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇంజన్ నుంచి వచ్చే మూడు ఎగ్జాస్ట్ పైపుల్ ఓ పెద్ద ఎగ్జాస్ట్ పైపుతో కలుపడి ఉంటాయి. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ వెనుక సీటు క్రింది భాగంలో ఉంటుంది. టెయిల్ ల్యాంప్, ఇండికేటర్ ల్యాంప్స్ డిజైన్ కూడా చక్కగా ఉంటుంది.

ఇంజన్

ఇంజన్

బెనెల్లీ టిఎన్‌టి899 మోటార్‌సైకిల్‌లో ఇన్-లైన్ త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ 899సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 121 హార్స్‌పవర్‌ల శక్తిని, 88 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదొక ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది, ఇందులో వెట్ క్లచ్ ఉంటుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

బెనెల్లీ టిఎన్‌టి899 భారంగా ఉండే నేక్డ్ బైక్. ఇందులో పవర్‌ఫుల్ ఇంజన్ ఈ బైక్ భారాన్ని డామినేట్ చేయటంలో చక్కగా సహకరిస్తుంది. ఓపెన్ రోడ్లపై ఈ బైక్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ బైక్ హెవీగా ఉండి, నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై ఆగుతూ, ఆగుతూ వెళ్లటం కష్టంగా అనిపిస్తుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

దీని రైడింగ్ పొజిషన్ మంచి రైడింగ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ రోజూవారీ ఉపయోగానికన్నా కూడా వీకెండ్ లాంగ్ రైడ్స్‌కి చక్కగా సూట్ అవుతుంది. ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండి, ఇతరుల దృష్టిని మీ వైపుకి తిప్పుకునేలా చేస్తుంది. కానీ, దీని ఇంజన్ నాయిస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

రైడింగ్ ఇంప్రెషన్

రైడింగ్ ఇంప్రెషన్

ఈ బైక్‌ను నడుపుతున్నప్పుడు, ఇది మన కంట్రోల్‌లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. దీని రైడింగ్ పోశ్చర్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగా ఉంటుంది. కాకపోతే, దీని థ్రోటల్ రెస్పాన్స్ మరింత మెరుగుపరచి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. మాకు ఇది జర్కీగా, కాస్తంత అసౌకర్యంగా అనిపించింది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

బెనెల్లీ టిఎన్‌టి899లో డిజిటల్ ప్లస్ అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అనలాగ్ కన్సోల్‌పై కేవలం ఆర్‌పిఎమ్ ఇండికేటర్ మాత్రమే ఉంటుంది. డిజిటల్ మీటర్‌పై స్పీడ్ డిస్‌ప్లే అవుతుంది. ఇంకా ఇందులో ఇంజన్ టెంపరేచర్, క్లాక్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, ఓడోమీటర్‌సు కూడా డిస్‌ప్లే అవుతాయి. దీని సెటప్ కూడా సింపుల్‌గా, అర్థమయ్యేలా ఉంటుంది.

స్విచెస్

స్విచెస్

బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌లో మాదిరిగానే ఈ బైక్‌లో కూడా బేసిక్ స్విచెస్ ఉంటాయి. నాణ్యమైన మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. హైవేపై లేదా వర్షం/పొగమంచు వాతావరణంలో నడుపుతున్నప్పుడు మోటారిస్టులను అలెర్ట్ చేసేందుకు ఇందులో హాజర్డ్ లైట్స్ ఉంటాయి. హాజర్డ్ స్విచ్ ఆన్ చేయగానే నాలుగు ఇండికేటర్ లైట్లు వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి. ఇకపోతే హ్యాండిల్‌బార్ గ్రిప్స్ సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి.

మాకు నచ్చినవి - డిజైన్

మాకు నచ్చినవి - డిజైన్

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఇటాలియన్ డిజైన్ మోటార్‌సైకిళ్ల విషయంలో వంక చెప్పాల్సిన అసరం ఉంటుంది. బెనెల్లీ టిఎన్‌టి899 మోటార్‌సైకిల్ ప్రతి కోణం నుంచి కూడా కళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ మీ వైపే చూస్తుంటారు.

మాకు నచ్చినవి - బ్రేక్స్

మాకు నచ్చినవి - బ్రేక్స్

బెనెల్లీ టిఎన్‌టి899 బైక్‌లో బ్రెంబూ నుంచి గ్రహించిన డిస్క్ బ్రేక్స్ ఉపయోగించారు. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా ఉంటుంది. మొత్తమ్మీద ఈ బైక్ నడుపుతున్నప్పుడు మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ లభిస్తుంది.

మాకు నచ్చినవి - రేడియేటర్ గ్రిల్

మాకు నచ్చినవి - రేడియేటర్ గ్రిల్

సాధారణంగా రేడియర్ గ్రిల్ లేదా కూలెంట్ సిస్టమ్ ఇంజన్‌కు ముందు భాగంలో ఉంటుంది. కానీ ఈ బెనెల్లీ టిఎన్‌టి 899లో మాత్రం ఇది సైడ్ ప్యానెల్స్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది.

మాకు నచ్చనివి - రియర్ బ్రేక్

మాకు నచ్చనివి - రియర్ బ్రేక్

రియర్ బ్రేక్ కోసం కంపెనీ ఓ రోటర్ పెటల్‌ని ఆఫర్ చేసింది, ఇది చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే, ఈ బైక్‌లోని ఏబిఎస్ సిస్టమ్ కారణంగా, ఇది మెరుగైన పనితీరునే కనబరుస్తుంది.

మాకు నచ్చనివి - ఎగ్జాస్ట్

మాకు నచ్చనివి - ఎగ్జాస్ట్

బెనెల్లీ టిఎన్‌టి899 బైక్‌లో సీట్ క్రింద అమర్చిన ఎగ్జాస్ట్ సిస్టమ్ దూరం నుంచి చూడటానికి బాగానే ఉంటుంది కానీ, ఇది పిలియన్ రైడర్‌కు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ బైక్ ఎగ్జాస్ట్ అధిక వేడికి గురై, సీటు ద్వారా ఆ వేడి పిలియన్ రైడర్‌కు తాకే ఆస్కారం ఉంది. సీట్ క్రింద స్టోరేజ్ కూడా అంతంత మాత్రమే, కేవలం బండి పేపర్లు దాచుకోవటానికి తప్ప, మరెందుకూ పనికిరాదు.

మాకు నచ్చనివి - సైడ్ మిర్రర్

మాకు నచ్చనివి - సైడ్ మిర్రర్

బెనెల్లీ బిఎన్600ఐ మోటార్‌సైకిల్‌లో మాదిరిగానే ఈ బెనెల్లీ టిఎన్‌టి899 బైక్‌లో కూడా సైడ్ మిర్రర్స్ మైనస్‌గా నిలుస్తాయి. ఈ సైడ్ మిర్రర్స్ డిజైన్ డిజైన్ చిన్నదిగా ఉండి, వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్రొజెక్ట్ చేయటంలో అంత సమర్థవంతమైన పనితీరును చూపవు.

(చెడు) కాన్స్

(చెడు) కాన్స్

* ఇండియాలో గుర్తింపు లేని/పూర్తిగా కొత్త బ్రాండ్

* ఇంజన్ మెకానికల్ నాయిస్

* ఇరుకుగా ఉండే రైడింగ్ స్పేస్

* ధర (అధికంగా ఉండొచ్చని అంచనా)

(మంచి) ప్రోస్

(మంచి) ప్రోస్

* అందమైన ఇటాలియన్ డిజైన్ మోటార్‌సైకిల్

* ఇండియాలోనే అసెంబ్లింగ్

* బ్రెంబూ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్

* అడ్జస్టబల్ సస్పెన్షన్ సెటప్

కాంపిటీషన్

కాంపిటీషన్

భారత మార్కెట్లో టిఎన్‌టి899 మోడల్‌కి డైరెక్ట్ కాంపిటీషన్ ఏమీ లేదు. భారత మార్కెట్లో లభిస్తున్న అతికొద్ది ఇన్-లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి. భారత్‌లో త్రీ సిలిండర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ ట్రైయంప్ మాత్రమే (స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్).

బెనెల్లీ బిఎన్600ఐ

బెనెల్లీ బిఎన్600ఐ

ఇది కూడా చదవండి: బెనెల్లీ బిఎన్600ఐ టెస్ట్ రైడ్ రివ్యూ

Most Read Articles

English summary
Last time team DriveSpark tested Benelli BN600i, which will be sold in India under the nomenclature of TNT600. Now we test their most raw and meanest looking machine, the TNT899. It is a totally different motorcycle from what we tested out previously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X