గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్10 టూ వీలర్లు: మొదటి స్థానంలో ఏ బైకుందో తెలుసా ?

By Anil

వ్యక్తిగత రవాణా కోసం భారతీయులు ఎక్కువగా ఎంచుకుంటున్న వాహనాలు టూ వీలర్లు, ఇందులో బైకులు మరియు స్కూటర్లు రెండూ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా వ్యక్తిగత రవాణాకోసం టూ వీలర్లను ఎంచుకుంటున్నారు. అయితే మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం గత ఆర్థిక ఏడాదిలో ఎక్కువ మంది ఎంచుకున్న టూ వీలర్లను ఈ కథనం ద్వారా అందిస్తున్నాము. ఇందులో స్కూటర్లు మరియు బైకులు రెండూ స్థానం సంపాదించుకున్నాయి. మరి ఇందులో మీకు ఇష్టమైన టూ వీలర్ ఉందేమో చూడండి.

10. టీవీఎస్ జూపిటర్

10. టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ సంస్థకు చెందిన జూపిటర్ స్కూటర్ గడిచిన ఏప్రిల్ 2015 మరియు మార్చి 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 5,37,431 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

జూపిటర్‌ స్కూటర్‌లో 109.7సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిడర్ ఇంజన్‌ కలదు. ఇది 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు లీటర్‌కు 62 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ. 48,809 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

09. బజాజ్ సిటి 100

09. బజాజ్ సిటి 100

బజాజ్ సంస్థకు చెందిన ఉత్తమ మైలేజ్ మరియు బడ్జెట్ బైకు సిటి10 ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దీనిని సుమారుగా 5,90,067 మంది భారతీయులు ఎంపిక చేసుకున్నారు.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

బజాజ్ ఆటో సంస్థ ఇందులో 99.27 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించారు. ఇది 9.1 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు లీటర్‌కు 89 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వనున్నట్లు ఏర్‌ఏఐ తెలిపింది.

బజాజ్ సిటి100 ధర రూ. 35,034 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

08. బజాజ్ పల్సర్

08. బజాజ్ పల్సర్

పల్సర్ శ్రేణిలో బజాజ్ ఆటో సంస్థ పల్సర్ 135 ఎల్‌ఎస్ నుండి రేసి ఆర్‌ఎస్200 వరకు సుమారుగా ఆరు మోడళ్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆరు పల్సర్ మోడళ్ల నుండి గత ఆర్థిక ఏడాదిలో బజాజ్ సుమారుగా 6,18,371 యూనిట్ల బైకుల అమ్మకాలు జరిపింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

బజాజ్ పల్సర్ లోని టాప్ మోడల్ అయిన ఆర్‌ఎస్ 200 లో 199.5సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ కలదు ఇది 24.1 బిహెచ్‌పి పవర్, 18.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు 35 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

పల్సర్‌లోని ప్రారంభ వేరియంట్ 135 ఎల్ఎస్ ధర రూ. 63,269 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.

07. హీరో గ్లామర్

07. హీరో గ్లామర్

దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన గ్లామర్ గడిచిన ఏప్రిల్ 2015-మార్చి 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 6,18,371 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో ఇందులో 124.8 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించింది. ఇది 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 10.53 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 55 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

గ్లామర్‌లో కార్బొరేటర్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. కార్బోరేటెడ్ గ్లామర్ వేరియంట్ ధర రూ. 55,925 లు మరియు ఫ్యూయల్ ఇంజెక్టెజ్ గ్లామర్ వేరియంట్ ధర రూ. 65,600 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

06. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

06. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

దీనిని చూడంగానే ఆశచర్యపోయారు కదా . మీరే కాదు ఆశ్చర్యపోవడం మా వంతు కూడా అయ్యింది. ఇండియన్ మార్కెట్లో అమ్మకాలలో ఉన్న ఏకైక మోపెడ్ వాహనం ఇది. ముగిసిన ఆర్థిక ఏడాది అమ్మకాలలో బైకులు మరియు స్కూటర్లుగా ధీటుగా 7,23,767 యూనిట్లు అమ్మకాలు సాధించింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

టీవీఎస్ సంస్థ ఈ ఎక్స్‌ఎల్ మోపెడ్‌లను కేవలం 2-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 69.9 సీసీ గల ఇంజన్‌ మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఇంజన్ సుమారుగా 3.5 బిహెచ్‌పి పవర్ మరియు 5 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 26,857 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది

05. హోండా సిబి షైన్

05. హోండా సిబి షైన్

జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్స్ వారి షైన్ 7,98,699 యూనిట్ల అమ్మకాలు సాధించి. ఐదవ స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హోండా ఈ షైన్ బైకులో 124.7సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది 10.57 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌తో పాటు లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవవగలదు.

హోండా సిబి షైన్ ధర రూ.55,559 ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

04. హీరో ప్యాసన్

04. హీరో ప్యాసన్

హీరో మోటోకార్పోలో హీరో లాంటి మొదటి బైకు ఈ ప్యాసన్. గత ఆర్థిక ఏడాదిలో ఈ ప్యాసన్ బైకులను సుమారుగా 11,39,576 మంది భారతీయులు ఎంచుకున్నారు.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో మోటోకార్ప్ ఇందులో 99.7 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 8.24 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌తో పాటు లీటర్‌కు 84 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

హీరో ప్యాసన్ రేంజ్ బైకుల ప్రారంభ ధర సుమారుగా రూ. 48,900 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరోలోని హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకు ప్యాసన్ కన్నా 8,678 యూనిట్లు అమ్మకాలు జరిపి మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో 11,48,254 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇందులో ప్యాసన్‌లో వినియోగించిన ఇంజన్‌ను ఉపయోగించారు. తద్వారా పవర్,టార్క్ మరియు మైలేజ్ అన్ని కూడా ప్యాసన్‌ను పోలి ఉంటాయి. అయితే డిజైన్‌లో మార్పులు మనం గమనించవచ్చు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ. 43,100 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది

02. హోండా ఆక్టివా

02. హోండా ఆక్టివా

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు సాధిస్తున్న స్కూటర్ల విభాగంలో హోండా ఆక్టివా మొదటి స్థానంలో ఉంది. గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో హోండా వారి ఆక్టివా స్కూటర్‌ను సుమారుగా 24,66,350 మంది భారతీయులు కొనుగోలు చేశారు.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హోండా ఆక్టివా లోని బేస్ మోడల్‌ను ఆక్టివా ఐ అని అంటారు. ఇందులో 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల 109.19 సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ కలదు.

హోండా ఆక్టివా ప్రారంభ వేరియంట్ ధర రూ 46,213 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

హీరో స్ల్పెండర్

హీరో స్ల్పెండర్

గత ఆర్థిక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు సాధించిన టూ వీలర్లలో మొదటి స్థానాన్ని హీరో స్ల్పెండర్ కైవసం చేసుకుంది. దీనిని సుమారుగా 24,86,065 మంది భారతీయులు ఎంచుకున్నారు. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే వీటి అమ్మకాలు 31,124 యూనిట్లు తక్కువగా ఉన్నప్పటికీ మొదటి స్థానంలో ఇదే నిలిచింది.

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

ఇంజన్, మైలేజ్ మరియు ధర వివరాలు

హీరో సంస్థ ఇందులో 99.7 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 8.24 బిహెచ్‌పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు 81 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

హీరో స్ల్పెండర్ ప్రారంభ ధర రూ. 46,500 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మరిన్ని కథనాల కోసం....

హైదరాబాద్ నుండి ఢిల్లీకి కేవలం రూ. 91 లతో ప్రయాణించవచ్చు

125సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్‌‌నిచ్చే 8 బైకులు

Most Read Articles

English summary
Report: Top 10 Most Wanted Two-Wheelers In India
Story first published: Friday, April 29, 2016, 13:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X