యాక్టివా 125 vs యాక్సెస్ 125: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

By Ravi

ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్లకు గిరాకీ నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో 8 శాతం మాత్రమే ఉన్న స్కూటర్ల వాటా, ఇప్పుడు 25 శాతానికి పైగా పెరిగింది. ఈ సెగ్మెంట్లోని అవకాశాలను అందింపుచ్చుకునేందుకు, ద్విచక్ర వాహన తయారీదారులు కూడా కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇది కూడా చదవండి: టాప్ బెస్ట్ 125సీసీ బైక్స్

ఇటీవలి కాలంలో అనేక కొత్త స్కూటర్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ప్రస్తుతం స్కూటర్ సెగ్మెంట్లో ఎక్కువగా 100సీసీ, 110సీసీ మోడళ్లకు అధిక డిమాండ్ ఉంటోంది. అయితే, పెర్ఫార్మెన్స్ స్కూటర్లను కోరుకునే వారు మాత్రం 125సీసీ సెగ్మెంట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం రెండు మోడళ్లు ఎక్కువగా అమ్మడుపోతున్నాయి. అవి - హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125.

ఈ కథనంలో మనం దేశీయ విపణిలో లభిస్తున్న ఈ రెండు బెస్ట్ సెల్లింగ్ 125సీసీ స్కూటర్లలో (యాక్టివా 125, యాక్సెస్ 125) ఏది ఉత్తమమైన స్కూటర్ అనే అంశాన్ని తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలకు ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

యాక్టివా 125 vs యాక్సెస్ 125

తర్వాతి స్లైడ్‌లలో హోండా యాక్టివా 125 మరియు సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లలో ఏది ఉత్తమమైన స్కూటరో తెలుసుకోండి.

ఓవర్‌వ్యూ: హోండా యాక్టివా 125

ఓవర్‌వ్యూ: హోండా యాక్టివా 125

దాదాపు దశాబ్ధకాలంగా ఉన్న బోరింగ్ యాక్టివా డిజైన్‌ను అప్‌గ్రేడ్, క్రోమ్ టచ్‌తో కాస్తంత అప్‌మార్కెట్ ఫీల్ కలిగించేలా కొత్త యాక్టివా 125ను డిజైన్ చేశారు. తాజా లుక్, పెద్ద ఇంజన్, మరింత పవర్‌లతో వచ్చిన ఈ యాక్టివా 125 నేటి యువత ఎంపికలో ఫస్ట్ చాయిస్ ఉంటుంది. స్కూటర్ సెగ్మెంట్లో కొనుగోలుదారుల విశ్వసనీయతను సంపాధించుకోవడంలో యాక్టివా బ్రాండ్ ముందుంది.

ఓవర్‌వ్యూ: సుజుకి యాక్సెస్ 125

ఓవర్‌వ్యూ: సుజుకి యాక్సెస్ 125

హోండా యాక్టివా 125 మార్కెట్లోకి రాక ముందు వరకు, 125సీసీ ఇంజన్ కలిగిన స్కూటర్‌ను కోరుకునే వారి కస్టమర్ల ఫస్ట్ చాయిస్‌గా సుజుకి యాక్సెస్ 125నే ఉండేది. అయితే, ఈ పోటీని తట్టుకునేందుకు సుజుకి ఇటీవలే రిఫ్రెష్డ్ వెర్షన్ యాక్సెస్ 125ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు.

ఇందులో ప్రధానంగా కొత్త యాక్సెస్ బ్యాడ్జ్, సరికొత్త స్టీల్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సేఫ్టీ షట్టర్‌తో కూడిన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పిలియన్ రైడర్ కోసం అల్యూమినియం గ్రాబ్ రెయిల్, ట్యూబ్‌లెస్ టైర్స్ మరియు మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీలను కంపెనీ ఈ కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ యాక్సెస్ స్కూటర్‌లో ఆఫర్ చేస్తోంది. మెటాలిక్ సోనిక్ సిల్వర్, మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను సుజుకి ప్రవేశపెట్టింది.

స్టైలింగ్: యాక్టివా 125

స్టైలింగ్: యాక్టివా 125

ఇటీవలే విడుదలైన హోండా యాక్టివా 125 స్టైలింగ్ విషయంలో మిగిలిన రెండు మోడళ్ల కన్నా మెరుగ్గా అనిపిస్తుంది. ధృడమైన మెటల్ బాడీ నిర్మాణం, ముందు వైపు క్రోమ్ గార్నిష్, కొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్, కొత్త టర్న్ ఇండికేటర్స్ డిజైన్‌లతో ఇది మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

స్టైలింగ్: యాక్సెస్ 125

స్టైలింగ్: యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 ఓ సింపుల్ లుకింగ్ ఫ్యామిలీ స్కూటర్. దీని డిజైన్ చాలా సింపుల్‌గా ఉండటం వలన నేటి మోడ్రన్ యూత్ దీనికి అట్రాక్ట్ కాకపోవచ్చు. స్త్రీ, పురుషులు ఎవ్వరికైనా ఈ స్కూటర్ చక్కగా సూట్ అవుతుంది. కానీ, యాక్టివా 125 డిజైన్‌తో పోల్చుకుంటే, ఇది అంత ఆకర్షనీయంగా అనిపించకపోవచ్చు.

సీటింగ్, కంఫర్ట్: యాక్టివా 125

సీటింగ్, కంఫర్ట్: యాక్టివా 125

యాక్టివా 125లో అప్‌రైట్ రైడింగ్ పొజిషన్ కోసం వెడల్పుగా, ఫ్లాట్‌గా ఉండే సీటును జోడించారు. ఇది కేవలం రైడర్‌కే కాకుండా పిలియన్ రైడర్‌కు మంచి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. పెద్ద అల్లాయ్ గ్రాబ్ హ్యాండిల్, అల్లాయ్ ఫుట్ రెస్ట్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ వంటి పలు కంఫర్టబల్ ఫీచర్లు దీని సొంతం.

సీటింగ్, కంఫర్ట్: యాక్సెస్ 125

సీటింగ్, కంఫర్ట్: యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ సీటింగ్ పొజిషన్ కూడా యాక్టివా 125 మాదిరిగానే అనిపిస్తుంది. ఫ్లాట్‌గా, వెడల్పుగా ఉండే సీట్ రైడర్‍‌‌కు మరియు పిలయర్ రైడర్‌‍కు కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుంది. యాక్సెస్ స్కూటర్‌లోని ముందున్న ఫ్లోర్‌బోర్డ్ యాక్టివా అంత విశాలంగా ఉండదు.

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్టివా 125

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్టివా 125

హోండా యాక్టివా 125లో 124.9సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హార్స్‌పవర్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ వి-మ్యాటిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 59 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది (సగటు మైలేజ్ 45-50).

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్సెస్ 125

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్‌లో 124సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హార్స్‌పవర్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. సుజుకి యాక్సెస్ సగటును లీటరుకు 57 కి.మీ. మైలేజీని (సగటు మైలేజ్ 40-50 కి.మీ.) ఆఫర్ చేస్తుంది.

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్టివా 125

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్టివా 125

హోండా యాక్టివా 125లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ వలన యాక్టివా 125 ఎలాంటి రోడ్లపై అయినా కంఫర్టబల్ రైడ్‌ను అందిస్తుంది. ఇందులో ముందు వైపు అమర్చిన 12 ఇంచ్, 5-స్పోక్ వీల్స్ మరొక అదనపు ఆకర్షణ. ఈ వీల్‌కు అమర్చిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుంది. వెనుక వైపు 10 ఇంచ్ వీల్, 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌తో లభిస్తుంది. ఇది కూడా ఇతర హోండా స్కూటర్ల మాదిరిగానే కాంబీ బ్రేక్ సిస్టమ్‌తో లభిస్తుంది (బ్రేక్ వేసినప్పుడు రెండు బ్రేక్‌లు అప్లయ్ అవుతాయి)

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్సెస్ 125

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125లో ముందు వైపు స్వింగ్ ఆర్మ్ టైప్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు టైప్ సస్పెన్లను ఆఫర్ చేస్తున్నారు. యాక్టివా 125 మాదిరిగా కాకుండా, ఇందులో రెండు వైపులా 10-ఇంచ్ వీల్సే ఉంటాయి. ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉండదు. ఇరువైపులా 120 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో కాంబీ బ్రేక్ సిస్టమ్ వంటి టెక్నాలజీ లేదు.

ఇతర ఫీచర్లు: యాక్టివా 125

ఇతర ఫీచర్లు: యాక్టివా 125

డిజిటల్ అనాలాగ్ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన స్విచ్‌లు, 18-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, స్లైడింగ్ కవర్‌తో కూడిన కీ, క్లిక్ (కన్వీనెంట్ లిఫ్ట్ అప్ ఇండిపెండెంట్ కవర్) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: యాక్సెస్ 125

ఇతర ఫీచర్లు: యాక్సెస్ 125

పూర్తిగా అనలాగ్ క్లస్టర్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 20 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, వెనుక బ్రేక్ లివర్ కోసం బ్రేక్ లాక్ ఆప్షన్, స్లైడింగ్ కవర్‌తో కూడిన కీహోల్, అండర్ సీట్ స్టోరేజ్ కోసం ఇగ్నిషన్ కీ స్లాట్‌నే ఉపయోగించుకోవటం వంటి ప్రత్యేకతలు దీని సొంతం

వాల్యూ ఫర్ మనీ

వాల్యూ ఫర్ మనీ

హోండా యాక్టివా 125 స్టయిలిష్, మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండి ఈ సెగ్మెంట్లో నెంబర్ వన్‌గా ఉంది. తొలిచూపులోనే ఇది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇతర స్కూటర్ల అందంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని ఇంజన్ కూడా ఇతర మోడళ్ల కన్నా మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ) టెక్నాలజీతో యాక్టివా బెటర్ మైలేజీనిస్తుంది. యాక్సెస్ 125 మైలేజ్ యాక్టివా 125 మైలేజ్ కన్నా కాస్తంత తక్కువగానే ఉంటుందని చెప్పాలి.

చివరి మాట

చివరి మాట

హోండా యాక్టివా 125లోని ఫ్రంట్ ఆప్షనల్ డిస్క్ బ్రేక్ మరియు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌లు రోడ్డుపై మంచి బ్రేకింగ్ కాన్సిఫెడన్స్‌ను ఇస్తాయి. సుజుకి యాక్సెస్ 125 డ్రమ్ బ్రేక్స్ మాత్రమే లభిస్తంది. సస్పెన్షన్ విషయంలో కూడా హోండా యాక్టివా మెరుగ్గా ఉంటుంది. ధర పరంగా చూస్తే యాక్సెస్ 125 కన్నా యాక్టివా 125 ధర అధికంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇధి ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుంది.

కాబట్టి, ధరకు కాకుండా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి యాక్టివా 125 బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. బడ్జెట్‌లో 125సీసీ స్కూటర్ కోరుకునే వారికి సుజుకి యాక్సిస్ 125 చక్కటి ఆప్షన్ ఉంటుందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
The 125cc category among scooters has long been stagnant, with lack of any major activity. In this artilce we are comparing Honda Activa 125 and Suzuki Access 125. Take a look to find which one wins the race.
Story first published: Monday, September 8, 2014, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X