లెజెండ్‌గా వచ్చిన హోండా లివో : రివ్యూ

By Vinay Kumar

కమ్యుటేటర్ సెగ్మెంట్ ద్విచక్రవాహన సంస్థల అమ్మకాలకు అనువైనది. ఈ సెగ్మెంట్‌లోనికి హోండా తన సరికొత్త లివోను లెజెండ్‌‌లా విడుదల చేసింది.

కొత్త లుక్, డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దబడింది. ఇది డ్రీమ్ సిరీస్ కంటే పై స్థానాన్ని ఆక్రమించనుంది.

Also Read: మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు

క్రింది రివ్యూ ద్వారా ధర, డిజైన్, ఫీచర్స్, మరిన్ని విషయాలు తెలుసుకుందాం......

డిజైన్ :

డిజైన్ :

డిజైన్ పరంగా హోండా లివో సొగసుగా ఉంటుంది. సైడ్ మరియు ముందు నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. హెడ్‌లైట్ ఫెయిరింగ్ మోటార్ సైకిల్‌ను పెద్దగా కన్పించేలా చేస్తుంది. ఇది ప్రయాణికులకు సరిపడే విధంగా ఉంది.

లెజెండ్‌గా వచ్చిన హోండా లివో : రివ్యూ

ఫ్యూయల్ ట్యాంక్ వైపు నుంచి మరియు వెనుక వైపు నుంచి లుక్ చాలా బాగుంది. నగరాలలో తప్పని సరిగా వాడాల్సిన టెయిల్ ల్యాంప్ పెద్దదిగా ఉంది.

హోండా లివో స్పెసిఫికేషన్స్ :

హోండా లివో స్పెసిఫికేషన్స్ :

ఇంజన్ : 110సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్.

హార్స్‌పవర్ : 9.

టార్క్ : 8.5 ఎన్ఎమ్.

గేర్‌బాక్స్ : 4-స్పీడ్.

హోండా లివో మైలేజ్, ఫ్యూయల్ కెపాసిటీ :

హోండా లివో మైలేజ్, ఫ్యూయల్ కెపాసిటీ :

ఇది 74 కి.మీ/లీటర్ మైలేజ్‌ను ఇచ్చే విధంగా తయారు చేయబడింది. 8.5 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

కొలతలు :

కొలతలు :

బరువు : 111 కే.జీలు.

ఎత్తు : 1099 మి.మీ.

వీల్ బేస్ : 1285 మి.మీ.

చక్రం మరియు సస్పెన్షన్ :

చక్రం మరియు సస్పెన్షన్ :

ఇది టూబ్‌లెస్ చక్రాలను కలిగి ఉంది. ముందు భాగం టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగం స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.

బ్రేక్స్ :

బ్రేక్స్ :

హోండా లివో ముందు చక్రం 240 మి.మీ డిస్క్ లేదా 130 మి.మీ డ్రమ్ బ్రేక్ ఆప్షన్లను కలిగి ఉంది. వెనుక చక్రం 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది.

ఇన్స్ట్రుమెంటేషన్ :

ఇన్స్ట్రుమెంటేషన్ :

హోండా లివో యాంగులర్ మీటర్ కన్సోల్‌ను కలిగి ఉంది. చదవడానికి సులువుగా ట్విన్ మీటర్‌ను కలిగి ఉంది. కుడి వైపు ఫ్యూయల్ లెవల్, ఎడమ వైపు స్పీడ్‌ను చూపిస్తాయి.

స్పిచ్ గేర్ :

స్పిచ్ గేర్ :

స్పిచ్ గేర్ ఉపయోగించడానికి సులభంగా చాలా బాగా ఉంది. ఎడమవైపు హెడ్‌లైట్, ఇండికేటర్ మరియు పాస్ స్విచ్‌తో పాటు హార్న్ కంట్రోల్ ఉన్నాయి. కుడి వైపు ఎలక్ట్రిక్ స్టాట్ బటన్ ఉంది.

హోండా లివో ధర :

హోండా లివో ధర :

డ్రమ్ - రూ.52,989 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

డిస్క్ - రూ.55,489 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

తీర్పు :

తీర్పు :

హోండా లివో ఈ సెగ్మెంట్లో లుక్‌లో అన్నిటికంటే చాలా బాగా ఉంది. మంచి ఫ్యూయల్ ఎకానమి ఇచ్చే ఇంజన్‌తో ఇది తీర్చిదిద్దబడింది.

Most Read Articles

English summary
The commuter segment is a very important market for two-wheeler makers. They need to offer comfort, decent styling and most importantly, good fuel efficiency and low cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X