నూతన ఆశలతో సరికొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే: హోండా నవీ రివ్యూ

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ సరికొత్త తమ నవీ స్కూటర్‌ ద్వారా సరికొత్త ప్రయోగం చేసిందని చెప్పవచ్చు. నూతనత్వానికి స్వాగతం పలికి ఇండియన్ మార్కెట్లోకి అందించిన క్రాసోవర్ స్కూటర్ నవీ అత్భుతమైన విజయం సాధించింది. స్కూటర్ కాదు, బైకు కాదు రెండింటి కలయికలో అందించిన నవీ వినియోగదారులకు ఒక కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని మిగిల్చింది.

హోండా నవీ క్రాసోవర్ స్కూటర్ గురించి డ్రైవింగ్‌స్పార్క్ బృందం అందించిన రివ్యూ వివరాలు క్రింది కథనంలో.....

రాజ్‌దూత్ జిటిఎస్ 175 పోలికలో హోండా నవీ

రాజ్‌దూత్ జిటిఎస్ 175 పోలికలో హోండా నవీ

కొత్త డిజైన్ అని కోడై కూస్తున్న హోండా, ఒక విధంగా చెప్పాలంటే 1970 కాలం నాటి రాజ్‌దూత్ జిటిఎస్ 175 ను పోలి ఉండేది. అయితే హోండా రిస్క్ తీసుకుని మరీ ఈ నవీ క్రాసోవర్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది.

డిజైన్

డిజైన్

స్కూటర్ కమ్ మోటర్ సైకిల్ లక్షణాలున్న దీనిని క్రాసోవర్ స్కూటర్‌గా సంభోదించవచ్చు. ఈ మిని బైకులో కాస్త లగేజ్‌ను స్టోర్ చేసుకునే అవకాశం ఉండేలా డిజైన్ చేసింది హోండా.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

నవీ హెడ్ ల్యాంప్ ఇందులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది, ఈ టూ వీలర్‌లోని అన్ని భాగాలతో పోల్చితే హెడ్‌ ల్యాంప్ అన్నింటికన్నా పెద్దిదిగా ఉంటుంది. మలిచిన తీరుగా ఉండే ఫ్యూయల్ ట్యాంక్, విశాలమైన సీటు మరియు చిన్నగా చక్కగా ఉన్న టెయిల్ వంటివి ఇందులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

కొత్త ప్రయోగం

కొత్త ప్రయోగం

ఇంత వరకు భారతీయులకు ఈ తరహా బైకులను ఏ సంస్థ కూడా అందివ్వలేదు. నూతన డిజైన్‌ తీరులో కొత్త ప్రయోగం చేసి ఇండియన్స్‌కు అందించిందని చెప్పవచ్చు. అయితే మీరు దీనిని దగ్గర నుండి గమనించినట్లయితే ఇందులోని అన్ని భాగాలను కూడా ఇతర బైకుల నుండి సేకరించి కస్టమైజ్ చేయించి తయారుచేసినట్లుగా ఖచ్చితంగా గుర్తిస్తారు.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

నవీ బైకులోని ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను గమనించినట్లయితే బైకులలో ఉండే విధంగా దర్శనమిస్తుంది. దీని ఎగ్జాస్ట్ మరియు ఇందులో వినియోగించిన కార్బన్ ఫైబర్ వంటి పరికరాలు దీని స్థాయిని పెంచి మార్కెట్లో ఉన్నత విలువలతో కనిపించేలా తీర్చిదిద్దారు.

ఇంజన్

ఇంజన్

హోండా నవీ క్రాసోవర్ స్కూటర్ కమ్ బైకులో డిజైన్‌కు తగ్గట్టే 109 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఇందులోని ఇంజన్ 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 8.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ (సివిటి) గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

మైలేజ్

మైలేజ్

చూడటానికి బైకు మరియు స్కూటర్‌ రెండింటిని పోలిన లక్షణాలతో ఉన్న ఈ బైకు సిటి రైడింగ్‌లకు ఎంతో అనువుగా ఉంటుంది. దీనిని గంటకు 75 కిలోమీటర్ల లోపు వేగంతో రైడ్ చేస్తే లీటర్‌కు 45 కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుంది.

ఆక్టివా మరియు నవీ మద్య ఉన్న తేడా

ఆక్టివా మరియు నవీ మద్య ఉన్న తేడా

హోండా సంస్థ ఆక్టివాలో అందించిన ఇంజన్‌ను నవీలో కూడా అందించింది. బైకును పోలిన రూపంలో ఉన్న నవీలోని ఇంజన్ అత్భుతమైన పనితీరును కనబరిచింది. ఇందులో ఎటువంటి అదుర్లు కూడా రావు. రైడింగ్ ఎంతో సాఫీగా సాగుతుంది. ఇక సీటింగ్ విషయానికొస్తే ఇద్దరు కూర్చునప్పటికీ ఏ అలుపు సొలుపు లేకుండా పరుగులు పెడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే సరైన డిజైన్‌కు సరైన ఇంజన్‌ను అందించారు అనొచ్చు.

రైడింగ్

రైడింగ్

నవీ స్కూటర్‌ను మేము టెస్ట్ రైడ్ చేస్తున్న సమయంలో మధ్య మధ్యలో క్లచ్ మరియు గేర్లను మార్చడానికి ప్రయత్నించాము. అనగా ఇది బైక్‌ తరహా రైడింగ్‌ను అందిస్తుంది. కాని ఇందులోని రెండు బ్రేకులను కూడా సాధారణ స్కూటర్‌‌లా హ్యాండిల్ మీద కల్పించారు.

సస్ఫెన్షన్

సస్ఫెన్షన్

నవీ ఎంతో ఉత్తమమైన టూ వీలర్, ఎందుకంటే దీని పనితీరుకు సరియైన విధంగా సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. ముందు వైపు ఉన్న టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున అందించిన ఒక వైపు మాత్రమే ఉన్న షాక్ అబ్జార్వర్ రెండు కూడా ప్రయాణంలో ఎదురయ్యే ఎత్తుపల్లాను సమాంతరంగా గ్రహిస్తాయి.

ఇంస్ట్రుమెంటేషన్ మరియు స్టోరేజ్

ఇంస్ట్రుమెంటేషన్ మరియు స్టోరేజ్

అన్ని రకాల హెచ్చరికలను సూచించే విధంగా పెద్ద స్పీడో మీటర్‌ కలదు. అయితే ఇందులో ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్, సైడ్ స్టాండ్ హెచ్చరికలను మరయు ఇంధనం తక్కువగా ఉంది అని తెలిపే సూచికలు ఇందులో లేవు. కాని ఇంధనాన్ని నింపడానికి ఇంధన ట్యాంకు మీద సాధారణ క్యాప్ కలదు, ఇందులో ఉన్న ఇంధన ట్యాంకు సామర్థ్యం 3.8 లీటర్లుగా ఉంది.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

ఇందులో కొంత వరకు ఖాళీ ప్రదేశాన్ని అందించారు. స్కూటర్లను నడిపే వారికి కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటే బాగుటుంది అనుకుంటారు. ఇంధన ట్యాంకు క్రింది భాగంలో కాస్త స్థలాన్ని మరియు సీటు క్రింది భాగంలో కూడా కొంతం స్పేస్‌ను అందించారు.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

బ్రేక్ లీవర్లను ఎంతో చక్కగా డిజైన్ చేసారు, వీటి ద్వారా రైడింగ్ సమయంలో ఎక్కువ పటిష్టతను పొందుతారు. రెండు వైపులా అందించిన రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఖచ్చితమైన వ్యూవ్ ఉండే విధంగా డిజైన్ చేయబడ్డాయి.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ ఈ నవీ స్కూటర్‌లో ముందు మరియు వెనుక రెండు వైపుల కూడా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందించారు. అయితే ఆప్షనల్‌గా కూడా ఇందులో కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందివ్వలేకపోయారు.

స్పిచ్చ్‌లు

స్పిచ్చ్‌లు

ఇందులో కుడి మరియు ఎడమ వైపున హ్యాండిల్స్ మీద ఉన్న స్విచ్‌ల వ్యవస్థ ఎంతో సాంప్రదాయంగా ఉంది. ఎటువంటి నూతనత్వం చోటు చేసుకోలేదు. ఎడమ వైపున ఉన్న స్విచ్‌ బోర్డులో హారన్, హెడ్ లైట్ ఆఫ్/ఆన్, తక్కువ మరియు ఎక్కువ కాంతిని అందించే డిమ్ అండ్ డిప్ లైటింగ్ స్విచ్‌లు కలవు. కుడి వైపున ఉన్న హ్యాండిల్ మీద కేవలం ఎలక్ట్రిక్ స్టార్ట్‌కు సంభందించిన స్విచ్ మాత్రమే కలదు.

నిర్మాణ నాణ్యత

నిర్మాణ నాణ్యత

హోండా నవీకు మేము నిర్వహించిన పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకున్న అంశం నిర్మాణ నాణ్యత. ఇందులో వినయోగించిన ప్లాస్టిక్ చాలా వరకు నాణ్యతారాహిత్యంగా ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ మీద వినియోగించిన క్యాప్‌ ఎక్కువ శాతం ప్లాస్టిక్‌కు కలిగి ఉంది మరియు దీనికి ఉన్న లాక్ కూడా ప్లాస్టిక్‌తో తయారైనదే.

ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

వినియోగించిన ప్లాస్టిక్ పరంగా ఇది వెనకడుగు వేసినప్పటికీ ఇందులోని ఇంజన్, పనితీరు మరియు రైడింగ్ వంటి అంశాలు దీన్ని నెట్టుకొచ్చాయి.

ఎలక్ట్రికల్స్

ఎలక్ట్రికల్స్

ఇందులో వినియోగించిన హారన్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటి విభాగాల్లో ఎటువంటి అవాంతరాలు లేవు. నవీలోని మొత్తం విద్యుధీకరణ వ్యవస్థ ఎప్పుడు కూడా రైడర్లను ఇబ్బది పెట్టదు. దీనికి ముందు వైపు బైకులను పోలి ఉండేవిధంగా పెద్ద పరిమాణంలో ఉండే హెడ్ లైటును అందించారు. ఇది ఎక్కువ కాంతిని అందిస్తుంది.

ధర వివరాలు

ధర వివరాలు

హోండా నవీ ధర రూ. 42,616 లు ఆన్-రోడ్ (ఢిల్లీ)గా ఉంది, అంటే ఇన్సూరెన్స్ మరియు రోడ్ ట్యాక్స్ అన్ని చెల్లించిన తరువాత వచ్చే మొత్తం ధర అన్నమాట. అనంగా వచ్చే అద్దాలు, సైడ్ స్టాండ్, నెంబర్ ప్లేట్ వంటి వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

లభించు రంగులు

లభించు రంగులు

హోండా నవీ క్రాసోవర్ స్కూటర్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు విభిన్నరంగుల్లో లభించును. అవి,

  • పాట్రియోట్ రెడ్,
  • షాస్తా వైట్ (మేము పరీక్షించిన స్కూటర్)
  • బ్లాక్,
  • హాపర్ గ్రీన్,
  • స్పార్కి ఆరేంజ్.
  • పోటీదారులు

    పోటీదారులు

    హోండా వారి నవీ కు దేశ వ్యాప్తంగా ఎలాంటి పోటీనిచ్చే వాహనాలు లేవు. ఇండియన్ మార్కెట్‌ కోసం మాత్రమే కాకుండా హోండా సంస్థ ఈ నవీ స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసింది. అచ్చం దీనిని పోలి ఉంటే గ్రోమ్ అనే టూవీలర్‌ కలదు అయితే అది కూడా హోండా సంస్థకు చెందిన ఉత్పత్తే.

    హోండా నవీ ఇతర సాంకేతిక వివరాలు

    హోండా నవీ ఇతర సాంకేతిక వివరాలు

    • ఇంజన్: 109.19 సీసీ
    • పవర్: 7000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 7.8 బిహెచ్‌పి
    • టార్క్: 5,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 8.9 ఎన్ఎమ్
    • మైలేజ్: 45 కిమీ/లీ
    • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 3.8 లీటర్లు
    • సీటు ఎత్తు: 765 ఎమ్ఎమ్
    • బరువు: 101 కిలోలు
    • బ్రేకులు: ముందు 130 ఎమ్ఎమ్ డ్రమ్, వెనుక వైపున 130 ఎమ్ఎమ్ డ్రమ్
    • హోండా నవీ ఇతర వివరాలు

      హోండా నవీ ఇతర వివరాలు

      • టైర్లు: ముందు 90/90 12-అంగుళాలు, వెనుక 90/100 10-అంగుళాలు
      • వీల్ బేస్: 1286 ఎమ్ఎమ్
      • ఎత్తు: 1039 ఎమ్ఎమ్
      • పొడవు: 1805 ఎమ్ఎమ్
      • వెడల్పు: 748 ఎమ్ఎమ్
      • గ్రౌండ్ క్లియరెన్స్: 156 ఎమ్ఎమ్
      • హోండా నవీలోని అనుకూల అంశాలు

        హోండా నవీలోని అనుకూల అంశాలు

        • డిజైన్
        • సౌకర్యవంతం
        • స్మూత్ ఇంజన్
        • ఉత్తమ బ్రేకింగ్ వ్యవస్థ
        • మైలేజ్
        • కాంతివంతమైన హెడ్ లైట్
        • డబ్బుకు తగ్గ ఉత్పత్తి
        • హోండా నవీలోని ప్రతికూల అంశాలు

          హోండా నవీలోని ప్రతికూల అంశాలు

          • ప్లాస్టిక్ నాణ్యత
          • స్టోరేజ్ స్పేస్
          • నడిపే వ్యక్తి మరియు కూర్చున్న వ్యక్తులు కాళ్లు పెట్టుకునే ఫూట్ స్టాండ్ చాలా దగ్గరగా ఉండటం
          • ఇంగ్నిషన్ మరియు నెక్ లాక్ వేరుగా ఉండటం
          • తీర్పు

            తీర్పు

            ఇప్పుడు అందరికీ వచ్చే అనుమానం, దీనిని కొనవచ్చా ? ఇది మంచి ఉత్పత్తేనా ? దీనిని నడిపే సమయంలో మంచి ఫన్‌ ఉంటుందా ? ఇది ధరకు తగ్గ ఉత్పత్తేనా అని ఎన్నో డౌట్లు వచ్చేసుంటాయి.

            ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

            ప్రతి రోజు అవసరాలకు వినియోగించే మన బైకులతో పోల్చితే దీని మీద రైడింగ్ ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడటానికి చిన్నగా అనిపించినా ఇందులో ఇద్దరు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. దీని కొనుగోలు చేసేటప్పుడు ధర ఎక్కువ అనే ఆలోచన అస్సలు రాదు, ఎందుకంటే ఇందులో ఉన్న అన్ని ఫీచర్లు ధరకు తగ్గట్లే ఉంటాయి. అన్నింటి కన్నా అటు బైకును కాకుండా ఇటు స్కూటర్‌ను కాకుండా హోండా నవీ ఒక కొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

            ( ఈ రివ్యూ మీరు దీనిని ఎంచుకోవాలా వద్దా అని నిర్ణయిస్తుందని మా అభిప్రాయ) దీని మీద మీ వ్యాఖ్యలను మాతో పంచుకోగలరు.

            ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

            హోండా నవీ తోక భాగము (టెయిల్)

            ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే

            హోండా నవీ సైడ్ స్టాండ్ వ్యూవ్ ఇమేజ్

Most Read Articles

English summary
Honda Navi Review First Ride Impression
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X