కెటిఎమ్ డ్యూక్ 250 వర్సెస్ యమహా ఎఫ్‌జడ్25

Written By:

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో 250సీసీ సెగ్మెంట్ మరో ట్రెండ్‌ను సృష్టించబోతోందా ? అంటే నిజమనే చెబుతున్నాయి ఈ మధ్య విడుదలైన కొత్త 250సీసీ బైకులు. యమహా ఎఫ్‌‌జడ్ 25 విడుదలైన కేవలం నెల రోజులకే కెటిఎమ్ ఇండియా 250సీసీ ఇంజన్‌తో ఓ కొత్త బైకును విడుదల చేసింది.

కెటిఎమ్ డ్యూక్ 250 మరియు యమహా ఎఫ్‌జడ్25 బైకుల ఇంజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ మరియు ధర వంటి అనేక అంశాల పరంగా పోల్చి, ఈ రెండింటిలో ది బెస్ట్ అని తేల్చే ఇవాళ్టి "కెటిఎమ్ డ్యూక్ 250 మరియు యమహా ఎఫ్‌‌జడ్ 25" కథనం మీద ఓ లుక్కేసుకోండి....

డిజైన్

యమహా ఎఫ్‌జడ్25 కండలు తిరిగిన శరీరాన్ని కలిగి ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 250తో పోల్చితే పరిమాణం పరంగా పెద్దగా ఉంటుంది. డ్యూక్ విషయానికి వస్తే ఆరేంజ్ కలర్‌ మినహాయిస్తే ఎంచుకోవడానికి మరే కలర్ ఆప్షన్లు లేవు. అయితే 250సీసీ సెగ్మెంట్లో అత్యంత పదునైన చూపులతో, అగ్రెసివ్ డిజైన్ లక్షణాలతో తక్కువ బరువును కలిగి ఉంటుంది.

యమహా ఎఫ్‌జడ్25 మరియు డ్యూక్ 250 ఇంజన్ వివరాలు

ఎఫ్‌జడ్25 మరియు డ్యూక్ 250లలో ఒకే సీసీ(క్యూబిక్ కెపాసిటి) గల ఇంజన్‌లు ఉన్నాయి. రెండు కూడా 248సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కెటిఎమ్ డ్యూక్ 250 లోని ఇంజన్ 31బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తే ఎఫ్‌జడ్25 లోని ఇంజన్ గరిష్టంగా 20బిహెచ్‌పి పవర్ మాత్రమే ఉత్పత్తి చేయును.

అద్బుతమైన పనితీరు కనబరిచే డ్యూక్ 250 ఎఫ్‌జడ్25 కన్నా పది కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. టార్క్ విషయానికి వస్తే ఎఫ్‌జడ్25 గరిష్టంగా 20ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తే కెటిఎమ్ డ్యూక్ 250 గరిష్టంగా 24ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. రేసింగ్ స్టైల్ పరంగా కూడా కెటిఎమ్ డ్యూక్ 250 అత్యంత అనువుగా ఉంటుంది.
ఇంజన్ పనితీరు పరంగా ర్యాంకింగ్...

  • యమహా ఎఫ్‌జడ్25 - 7.5/10
  • కెటిఎమ్ డ్యూక్ - 250 8.5/10

ఫీచర్లు

యమగా ఎఫ్‌జడ్25 లో పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ కలదు. డ్యూక్ 250లో అయితే హ్యాలోజియన్ ల్యాంప్‌కు చుట్టూ ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. రెండు బైకుల్లో కూడా భద్రతలో అత్యంత కీలకమైన ఫీచర్ యాంటిలాక్ బ్రేక్ సిస్టమ్ రాలేదు. రెండింటిలో ఇరు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించారు.

కెటిఎమ్ డ్యూక్ 250లో స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కలదు, దీనిని యమహా ఎఫ్‌జడ్25లో రాలేదని గుర్తించవచ్చు. ఫీచర్ల పరంగా డ్యూక్ 250 ఓ మెట్టు పై స్థానంలోనే నిలిచింది.
ఫీచర్ల పరంగా రేటింగ్...

  • యమహా ఎఫ్‌జడ్25 - 7.5/10
  • కెటిఎమ్ డ్యూక్ - 8/10

మైలేజ్

ఎక్కువ సీసీ సామర్థ్యం ఉన్న బైకుల్లో మైలేజ్ దాదాపుగా ఆశించిలేము. అదే కమ్యూటర్ సెగ్మెంట్ రీతిలో అంతో ఇంతో మైలేజ్ ఉంటే వినియోగదారులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో మైలేజ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి కంపెనీలు. యమహా ఎఫ్‌జడ్25 మైలేజ్ లీటర్‌కు 35-40కిమీల మధ్య ఉంటే, కెటిఎమ్ డ్యూక్ మైలేజ్ లీటర్‌కు 30-35కిమీల మధ్య ఉంది.

  • యమహా ఎఫ్‌జడ్25 - 8/10
  • కెటిఎమ్ డ్యూక్ - 7.5/10

ధర

యమహా ఎఫ్‌జడ్25 ధర రూ. 1.19 లక్షలు మరియు కెటిఎమ్ డ్యూక్ 250 ధర రూ. 1.73 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. ఒకే సెగ్మెంట్లో విడుదలైనప్పటికీ రెండింటి మధ్య రూ. 54,000 లు వ్యత్యాసం ఉంది. ధర పరంగా ఈ రెండింటిని పరిశీలిస్తే యమహా ఎఫ్‌జడ్250 అత్యంత సరసమైన మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు.
ధర పరంగా రేటింగ్

  • యమహా ఎఫ్‌జడ్25 - 8/10
  • కెటిఎమ్ డ్యూక్ 250 - 7.5/10

తీర్పు

యమహా ఇండియా అత్యంత తెలివిగా ఎఫ్‌జడ్25 ధరను నిర్ణయించింది. యమహా ఇండియాకు ఇది అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా నిలిచింది. ష్టైల్ మరియు ఇందులో ఉన్న ఇంజన్ పరంగా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

ఎఫ్‌జడ్25తో పోల్చుకుంటే డ్యూక్ 250 స్పోర్టివ్ ప్రొడక్ట్. ఆధునిక మరియు పదునైన డిజైన్ శైలిలో కలదు. స్లిప్పర్ క్లచ్ ఫీచర్ జోడించడం ద్వారా భారీ స్థాయిలో రేసర్లను ఆకట్టుకోగలదు. అయితే ధర పరంగా కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ బ్రాండ్ పేరుకు విలువను జోడించటం దీని ప్రత్యేకం.

రెండు బైకుల్లో ఏది ఎంచుకోవాలి అనే విశయానికి వస్తే, యమహా ఎఫ్‌జడ్ 25 ఉత్తమం అని చెప్పవచ్చు. దాదాపు డ్యూక్250తో దాదాపు సమానమైన విలువను కలిగి ఉంటూ బడ్జెట్‌కు లోబడిన ధరతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మా ఎంపిక యమహా ఎఫ్‌జడ్25. మరి మీ ఎంపిక ఏది....? ఎందుకు....? క్రింది కామెంట్ బాక్స్ తెలియజేయండి....

మీకు నచ్చిన కెటిఎమ్ బైకుల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... మరియు యమహా ఎఫ్‌జడ్25 ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

English summary
KTM Duke 250 Vs Yamaha FZ25: New Kids On The Block Go To War?
Please Wait while comments are loading...

Latest Photos