యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం

By Anil

కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో 100 సీసీ బైకులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాయి. ఇందులో మహీంద్ర టూవీలర్స్ కూడా భాగమయ్యింది. అయితే మహీంద్రకు ఇది ఒక్కటే చాలదు, ఎందుకంటే మహీంద్ర టూ వీలర్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, ట్రక్కులు, ప్యాసింజర్ వాహనాలు మరియు ఎయిర్ క్రాఫ్ట్‌లు వంటి ఎన్నో వాహన శ్రేణుల్లోకి ప్రవేశించింది. కాని టువీలర్లలో యువత కోసం 300సీసీ రేంజ్ బైక్‌ను ఇన్నేళ్లకాలంలో ఏనాడు ప్రవేశ పెట్టలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా 300సీసీ టూవీవలర్‌ను విడుదల చేసింది.
Also Read: మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.

ఇప్పుడు ఈ మోజో టూవీలర్‌కు యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మహీంద్ర ప్రతి సారి ఒకింత నూతనత్వంతో బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వస్తోంది అందులో భాగంగానే ఈ సరి కొత్త మోజో. రెండు ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్స్, రెండు సైలెన్సర్లు, మరియు పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇలాంటి ఎన్నో కారణాలు వలన ఈ మోజో టూవీలర్ ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతోంది.

డిజైన్ :

డిజైన్ :

మోజోకు చేసిన రూపకల్పన తక్షణమే మీ మనస్సును దోచుకుంటుంది. ఎందుకంటే దీని ముందు వైపు గల ఒక జంట-పాడ్ హ్యాలోజన్ హెడ్ ల్యాంప్ కలిగిన భారతదేశపు ఏకైక 300 సీసీ బైక్ ఇదే. చాలా కాలం తరువాత వచ్చిన ఒక తాజా లుక్ ఇది మరియు బంగారు రంగుతో పూత పూయబడి ఉంటుంది. జెస్సీ -మ్యాక్ మ్యాన్ మరియు స్ట్రీక్ హాక్‌ల ప్రేరణతో గల ఒక ఆధునిక వెర్షన్ ఈ కొత్త మోజో గుర్తు చేస్తుంది.

బాడీ డిజైన్ :

బాడీ డిజైన్ :

ఇంజన్, ఫ్రేమ్ మరయు స్వింగ్ఆర్మ్ ఈ మూడు కో-ఆక్సియల్ గా అమర్చి డిజైన్ చేశారు. భారతదేశంలో 300సీసీ మోటర్ బైక్‌లలో వచ్చిన మొట్టమొదటి బైక్ ఇదే. ఈ మూడు భాగాలు బాడీలో ఒకే పాయింట్ వద్ద అమర్చుతారు దీని వలన ఈ మోటార్ సైకిల్‌కు విపరీతమైన స్థిరత్వం వచ్చిందని చెప్పవచ్చు. మహీంద్ర యొక్క నూతన డిజైన్‌లో ఇది ఒకటి.

 మోజో డిజైన్ అంశాలు :

మోజో డిజైన్ అంశాలు :

  • ఫ్రంట్ ఫోర్క్ పై భాగాన్ని బంగారు రంగుతో తయారు చేశారు.
  • పెట్రోల్ ట్యాంక్ క్రింది భాగాన రెండు బంగారు రంగు పైపులు ఉంటాయి.
  • పగటి పూట వెలిగే తెలుపు రంగు గల యల్.ఇ.డి లైట్లు.
  • పెటల్ ఆకారంలో ఉన్న ముందు వైపు డిస్క్ బ్రేక్
  • మఫ్లర్లు కలిగిన రెండు పొగ గొట్టాలు
  • మోజో ఇంజన్ మరియు గేర్ బాక్స్ :

    మోజో ఇంజన్ మరియు గేర్ బాక్స్ :

    మోజో ఇంజన్ దాదాపుగా 300 సీసీ కలదు, 4-వాల్వ్, సింగల్ సిలిండర్ మరియు లిక్విడ్‌తో కూలింగ్ చేయగలిగే ఇంజన్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో పనిచేయును. 6-స్పీడ్ గేర్ బాక్స్ గల మోజో 27 బి.హెచ్.పి మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో గల ఇగ్నిషన్ సిస్టమ్, ఇంజన్ కంట్రోల్ యూనిట్ (ఇ.సి.యు) మీద ఆధారంతో పని చేయును.

     మోజో ఇంజన్ యొక్క ఇంజన్ మరియు గేర్ బాక్స్ స్పెసిఫికేషన్స్ :

    మోజో ఇంజన్ యొక్క ఇంజన్ మరియు గేర్ బాక్స్ స్పెసిఫికేషన్స్ :

    • డిస్‌ప్లేస్‌మెంట్ : 295 సీసీ
    • కూలింగ్ : లిక్వడ్ కూల్డ్ ఇంజన్
    • బోర్, స్ట్రోక్ : 76,65 ఎమ్ఎమ్
    • కంప్రెషన్ రేషియో : 11:1
    • వాల్వ్ ట్రైన్ : డబుల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ (డి.ఒ.హెచ్.సి)
    • ఫ్యూయల్ డెలివరి : ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్
    • లుబ్రికేషన్ సిస్టమ్ : వెట్ సంప్, ఫోర్స్‌డ్ లుబ్రికేషన్
    • ట్రాన్స్‌మిషన్ : 6-స్పీడ్, కేబు వెట్ క్లచ్
    • ఫైనల్ డ్రైవ్ : చెయిన్
    • ఇంజన్ ఫర్ఫామెన్స్ :

      ఇంజన్ ఫర్ఫామెన్స్ :

      మహీంద్ర ఇంజనీర్లు మోజో నిర్మాణానికి ఎంతో కష్టపడ్డారు. మహీంద్ర తమ రీసెర్చ మరియు డెవలప్‌మెంట్ వారు 2010లో మోజో మీద ప్రయోగాలు మొదలు పెట్టారు అయితే ప్రస్తుతానికి దీనిని పూర్తి స్థాయిలో తయారు చేశారు. దీని ఇంజన్ శబ్ధం ఎంతో బాగుటుంది, ఇంజన్‌ను మధ్యరకంలో నడుపుతున్నప్పుడు మీరు ఈ శబ్దాన్ని గుర్తించవచ్చు. మరియు దీని ఆర్.పి.యమ్ 4500 నుండి 6500 వరకు ఉంటుంది. అప్పుడు 100 నుండి 120 కిలోమీటర్ల వేగం వరకు చేరుకోగలదు.

      మైలేజ్ :

      మైలేజ్ :

      మోజో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 21-లీటర్లు, మరియు రేడియేటర్ నుండి వెలువడే గాలిని ఫ్యూయల్ ట్యాంక్ ప్రక్కకు నెట్టేస్తుంది. అంటే దీని వలన గాలి యొక్క గమ్యం మరియు ట్యాంక్ యొక్క సైజు రెండు కూడా కీలకమైన అంశాలు. అయితే దీనికి పూర్తిగా పోటిగా ఉన్న కెటియమ్ మాత్రం 11-లీటర్ల ఫ్యూయల్ కెపాసిటిని కలిగి ఉంది. చాలా పరీక్షల అనంతరం నిండు ట్యాంకు మోజో మీకు ఇస్తుంది 400 కిలోమీటర్లు మైలేజ్‌.

      ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి మరియు టాప్ స్పీడ్ :

      ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి మరియు టాప్ స్పీడ్ :

      • మైలేజ్ : 20 కెఎమ్/యల్
      • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి : 21-లీటర్లు
      • రిజర్వ్ ట్యాంక్ కెపాసిటి : 3-లీటర్లు
      • టాప్ స్పీడ్ : 149 కెఎమ్/హెచ్
      • రైడ్ సౌలభ్యం :

        రైడ్ సౌలభ్యం :

        మోజో మీకు చక్కటి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. దీని గల బ్రేకులు, ఆకరషణీయమైన హ్యాండిల్ రైడింగ్‌లో మంచి ఫీల్ ‌ను ఇస్తాయి. మరియు చాలా దూరం రైడ్ చేసినపుడు దీని వలన మోకాలి నొప్పిని కూడా పొందే అవకాశం ఉంది ఎందుకంటే దీని సీట్ మరియు కాళ్లను పెట్టుకునే పెడల్స్ అలా చేయబడ్డాయి కాబట్టి.

        సదుపాయాలు :

        సదుపాయాలు :

        మోజోలో మీకు అతి మెత్తని సదుపాయాలు కనిపిస్తాయి. మోజో తోక భాగం ఎంతో ఇరుకుగా ఉంటుంది. ఇది వెనుక సీటు యొక్క సౌకర్యానికి దారితీస్తుంది. ఒక సారి ఆలోచించండి ఈ రోజుల్లో ఎన్ని కంపెనీలు మీకు వెనుక సీటును అతి సౌకర్యవంతంగా అందిస్తున్నాయి. అయితే మోజో లో ఉన్న సీటు సౌకర్యం కోసం మహీంద్ర అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పవచ్చు.

         సస్పెన్‌షన్ :

        సస్పెన్‌షన్ :

        మోజో యొక్క 169 బరువు, 21-లీటర్ల ఫ్యూయల్, 100 కిలోల బరువున్న రైడర్, అన్నింటిని దీనిలో ముందువైపు ఉన్న ఇన్వర్టెడ్ సస్పెన్‌షన్ మరియు వెనుకవైపున్న మోనో షాక్ సస్పెన్‌షన్ గ్రహించి మీకు కల్పిస్తాయి మంచి సస్పెన్‌షన్ ఫీల్‌ని. మరియు దీనిలో ఉన్న షాక్ అబ్జార్వర్స్ ఆయిల్ మరియు గ్యాస్‌తో నిండి ఉంటాయి అంతే కాకుండా దీనిని నేలకు 25 డిగ్రీలు యాంగిల్ ఉండేలా అమర్చారు. అయితే ఇలా 600సీసీ బైక్‌లలో మాత్రమే ఏర్పాటు చేసేవారు, కాని మోజో లో దీనిని తీసుకువచ్చారు.

        బ్రేక్స్ :

        బ్రేక్స్ :

        మోజోలో ముందువైపున 320 ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ మరియు వెనుకవైపున 240 ఎమ్ఎమ్ గల సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. అయితే ఇందులో యాంటి-లాకింగా బ్రేకింగ్ సిస్టమ్ లేదనే చెప్పవచ్చు. అయితే యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల బైక్‌లను వచ్చే ఏడాది నుండి అందుబాటులోకి తేనున్నారు.

        టైర్లు :

        టైర్లు :

        ఇందులో గల స్టీల్ రేడియల్ టైర్లు మలుపుల వద్ద మరియు తడి రోడ్ల మీద మంచి పని తీరును కనబరుస్తాయి. దీని యొక్క చివరి అంచుల వరకు గొప్ప పటిష్టమైన గ్రిప్‌ని కలగి ఉంటుంది.

        మహీంద్ర మోజో టైర్ స్పెసిఫికేషన్స్ :

        మహీంద్ర మోజో టైర్ స్పెసిఫికేషన్స్ :

        • ముందు టైరు 110/70-ఆర్ 17
        • వెనుక టైరు 150/60-ఆర్ 17
        • ఫీచర్స్ :

          ఫీచర్స్ :

          మోజో యొక్క హెడ్ ల్యాంప్‌లో రెండు లైట్లు కలవు, టెయిల్ ల్యాంప్‌లో ఎనిమిది యల్.ఇ.డి లైట్లు మరియు బ్రేక్ లైట్‌లో 12 యల్.ఇ.డి లైట్లను కలిగి ఉంది. ఇందులో ఉన్న స్పీడో మీటరు మీరు వెళ్ళిన అత్యధిక వేగాన్ని నమోదు చేస్తుంది. దీనిలో ఒక ముఖ్యమైన సేఫ్టి ఫీచర్ ఉంది, రైడర్ బైక్‌ని ఎడమ లేదా కుడి వైపునకు 45 డిగ్రీలకు మించి రైడ్ చేస్తే వెనుక ఉన్న చక్రాలు పట్టును కోల్పోయే అవకాశం ఉంది అలా జరిగే సమయంలో ఇందులో ఉన్న ఒక స్పెషల్ ఫంక్షన్ ఇంజన్‌ను ఆఫ్ చేస్తుంది తద్వారా ప్రమాదం జరగకుండా కాపాడుతుంది.

          ఇందులో మంచివి :

          ఇందులో మంచివి :

          • అత్యధిక వేగంలో కూడా మంచి స్థిరత్వాన్ని కలిగి ఉండటం
          • అల్లికలతో ఉన్న బ్రేక్ లైనర్స్
          • మంచి మిడ్ రేంజ్ పవర్
          • స్మూత్ మరియు సైలెంట్ ఇంజన్
          • ముందు మరియు వెనుకవైపున మంచి మోనో-షాక్ సస్పెన్‌షన్
          • రెండు ఎగ్జాస్ట్‌లు (పొగ గొట్టాలు)
          • అత్యంత వేగాన్ని నమోదు చేయడం వంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి
          • ఇందులో ఉన్న చెడ్డ అంశాలు :

            ఇందులో ఉన్న చెడ్డ అంశాలు :

            • సీటు ఎత్తు
            • తక్కువ వేగం ఉన్నప్పుడు ఒక రకమైన శబ్దం
            • డిస్టెన్స్ టు ఎంమ్టి ఆప్షన్ లేకపోవడం
            • యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం

              రివ్యూ :

               ధర :

              ధర :

              ధర ఇది ప్రతి ఒక్కరూ గమనించే అంశం, మోజో యొక్క ధర రూ. 1.80 లక్షలు (ఆన్-రోడ్) అంటే ఇది కెటిఎమ్ కన్నా 50,000 రుపాయలు తక్కువ మరి మోజో ఉత్తమమైదని అంటారా?

              తీర్పు :

              తీర్పు :

              300సీసీ రేంజ్‌లో వచ్చిన మోజో దీనికి కెటియమ్ 390 మోడల్ కు గట్టి పోటిని ఇస్తోంది. మా నిర్ణయం ఏమిటంటే ఇందులో ఉన్న ఫీచర్లతో పోలిస్తే మోజో ఎంతో బాగుంటుంది. మరియు పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేయబడిన బైక్ మోజో. దీని గురించి మొత్తం ఒక సారి గమనిస్తే యువత ఖచ్చితంగా ఇష్టపడుతుందని చెప్పవచ్చు . మరి మీరు......

              ఇప్పటి వరకు మోజోకు గురించి చూశారు కదా. ఇక్కడ ఉన్న వీడియోలో మోజో యొక్క సైలెన్సర్ సౌండ్‌ను మీరు వినవచ్చు.

Most Read Articles

English summary
Mahindra Mojo Review First Ride Impression
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X