రూ. 13.9 లక్షల ఖరీదైన మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన వి9 బాబర్ కు ఫస్ట్ డ్రైవ్ నిర్వహించింది డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందం. నేటి రివ్యూ కథనంలో దీని అనుకూలతలు మరియు ప్రతికూలతలు వివరంగా...

By Anil

పర్ఫామెన్స్ మోటార్ సైకిల్స్ మరియు సూపర్ బైకులు గురించి చర్చించుకుంటే ఇటాలియన్‌కు చెందిన బైకుల కంపెనీలే ముందుంటాయి. కొన్ని సంస్థలు లక్షలు ఖరీదైన శక్తివంతమైన బైకులను అత్యంత ఆర్షణీయంగా తీర్చిద్దాయి. అందుకు ఉదాహరణగా, ఎమ్‌వి అగస్టా మరియు డుకాటి బైకులను చెప్పుకోవచ్చు.

అయితే ఇటాలియన్‌కు చెందిన మరో టూ వీలర్ల కంపెనీ "మోటో గుజ్జి" ఇందుకు పూర్తిగా విభిన్నం. ఇటాలియన్ తరహా నాణ్యమైన విడి భాగాలతో ట్రెడిషనల్ సొబగులు అందించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రూయిజర్ స్టైల్ బైక్ ప్రేమికులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులను రూపొందిస్తోంది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అందులో రూ. 13 లక్షల ఖరీదైన తమ వి9 బాబర్ మోటార్ సైకిల్ ఒకటి. ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన వి9 బాబర్ కు డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందంఫస్ట్ డ్రైవ్ నిర్వహించింది. నేటి రివ్యూ కథనంలో దీని అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి వివరంగా...

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

మోటో గుజ్జి విషయానికి వస్తే, సూపర్ బైకులు మరియు ఆకర్షణీయమైన డిజైన్ లక్షణాలతో ఉన్న బైకులను మినహాయిస్తే, కేవలం క్రూయిజర్ బైకులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా నిర్విరామంగా బైకులను ఉత్పత్తి చేస్తూ, యూరప్ మొత్తం మీద అత్యంత పురాతణైన బైకుల తయారీ సంస్థగా నిలిచింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే దీని బ్రాండ్ విలువను పెంచుకుంటోంది. ప్రపంచంలో ప్రఖ్యాతంగా చెప్పుకునే మల్టిపుల్ వరల్డ్ జిపి ఛాంపియన్‌షిప్ మరియు ఇస్లి ఆఫ్ మ్యాన్ టిటి రేస్‌లో 11 సార్లు మోటో గుజ్జి బైకులు గెలుపొందాయి.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇటాలియన్ మోటార్ సైకిల్ సంస్థ తమ అనుభవాన్ని మేళవించి వి9 బాబర్ ను రూపొందించింది. వి7 మోడల్ నుండి సేకరించిన అనేక డిజైన్ అంశాలతో, టెక్నాలజీని జోడించి వి9 బాబర్‌ను పూర్తిగా క్రూయిజర్ శ్రేణి మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టింది. వి9 బాబర్ ప్రత్యేకతలు తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ టెస్ట్ డ్రైవ్ చేసింది, దీని గురించి ఓ లుక్కేసుకుందాం రండి...

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

డిజైన్ పరంగా ఎలాంటి అదనపు హంగులు లేకుండా, అవసరం లేని ఎక్ట్స్రా ఫిట్టింగ్స్ తొలగించి దాదాపు సింపుల్‌గా తీర్చిదిద్దింది. అయితే మోటో గుజ్జి లైనప్‌లో వి9 బాబర్ గుడ్ లుకింగ్ బైక్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాబర్ ట్రెడిషన్‌ను కొనసాగిస్తూనే లైట్ వెయిట్ మోటార్ సైకిల్‌గా పేరు తెచ్చుకుంది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఫ్రంట్ డిజైన్ పరంగా ఆకట్టుకోవడంలో వి9 బాబర్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ముందు వైపున్న టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మీద రెట్రో స్టైల్ రౌండ్ హెడ్ ల్యాంప్ అందించింది. దీనికి చెల్లించే ధర పరంగా చూస్తే హెడ్ ల్యాంప్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా అందించవచ్చు. అయితే ఈ వి9 బాబర్‌లో ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఇండికేటర్లు ఉన్నాయి.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

మ్యాట్ సిల్వర్ పెయింట్ జాబ్‌తో రెడ్ రేసింగ్ స్ట్రిప్స్ పెయింట్ చేయబడిన స్లిమ్ ఫ్యూయల్ ట్యాంక్ కలదు. వి9 బాబర్ మొత్తం స్టైలింగ్‌లో ఫ్యూయల్ ట్యాంక్‌దే పైచేయి. ఫ్యూయల్ ట్యాంక్ పెయింట్ తరహాలోనే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ కలదు, అయితే దీనికి లాక్ లేకపోవడం గమనార్హం.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ట్రెడిషన్ స్టైల్లో ఉన్న వి9 బాబర్‌లో ఆఫ్ సెట్ పార్ట్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ కలదు. రౌండ్ కన్సోల్‌కు మధ్యలో చిన్న స్క్రీన్ కలదు, ఇందులో ట్రిప్ మీటర్, ఓడో మీటర్, రిజర్వ్ ఫ్యూయల్ ఇండికేటర్, యావరేజ్ స్పీడ్, రియర్ టైమ్ ఫ్యూయల్ ఎఫీషియన్సీ, టెంపరేచర్, గేర్ ఇండికేటర్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్ మరియు గడియారం వంటి ఎన్నో ఫీచర్లున్నాయి.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

మోటో గుజ్జి వి9 బాబర్ లోని స్విచ్‌ల విభాగంలో నాణ్యత లోపించింది. ఇతర మరే ఇతర బైకుల్లో లేని యుఎస్‌బి పోర్ట్ ఇందులో అందివ్వడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్‌కు కుడివైపు క్రింది భాగంలో ఈ పోర్ట్ అందించారు. అంతే కాకుండా ఇందులో మోటో గుజ్జి మీడియా ఫ్లాట్‌ఫామ్ కలదు. దీనిని స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసుకుని బైక్ టెక్నికల్ వివరాలు పూర్తిగా స్మార్ట్ ఫోన్ నుండి తెలుసుకోవచ్చు.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

సాంకేతికంగా వి9 బాబర్‌లో 850సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే వి-ట్విన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 54.24బిహెచ్‌పి పవర్ మరియు 63ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇంజన్ సామర్థ్యం అధికంగానే ఉన్నప్పటికీ, దానికి తగినట్లు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అందివ్వడంలో విఫలమైంది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇంజన్ కూలింగ్ విషయానికి వస్తే, హై వే మీద రైడింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి హీటింగ్ సమస్య రాలేదు. అయితే, సిటి రోడ్ల మీద ఆపి ఆపి నడపడం వలన ఇంజన్ అధికంగా వేడెక్కింది. తక్కువ వేగం వద్ద ఇంజన్ వైపుకు వీలైనంత గాలి ప్రవాహం ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

వి9 బాబర్‌లో అందించిన ఇంజన్ యూరో-4 ఉద్గార నియమాలను పాటిస్తుంది. తక్కువ వేగం వద్ద కూడా మంచి పవర్ ఇవ్వగలిగింది. కేవలం 2900ఆర్‌పిఎమ్ ఇంజన్‌ వేగం వద్ద గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసింది. ఈ టార్క్ మరియు పవర్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా షాప్ట్ డ్రైవ్ సిస్టమ్(చైన్ కు బదులుగా షాప్ట్) ద్వారా వెనుక చక్రానికి అందుతుంది. వి9 బాబర్ గరిష్ట వేగం గంటకు 180కిమీలుగా ఉంది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అత్యుత్త టార్క్‌ ఉత్పత్తి చేయగల ఈ బైకులో మాకు బాగా నచ్చిన అంశం; తక్కువ వేగం ఎక్కువ గేర్‌లో ఉన్నపుడు, అదే విధంగా తక్కువ వేగం వద్ద ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించినపుడు ఇంజన్ మీద ఎలాంటి ఒత్తిడి పడదు. మరియు పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని బట్టి గేర్లను మార్చమని అస్సలు మొరాయించదు. మోటో గుజ్జి వి9 బాబర్ హై వే మీద లీటర్‌కు 23కిమీలు మరియు సిటిలో లీటర్‌కు 18కిమీల మైలేజ్ ఇచ్చింది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇంజన్‌ నుండి వచ్చే వైబ్రేషన్స్ కాస్త తగ్గించాల్సిన అవసరం ఉంది. ఐడిల్‌లో ఉంచినపుడు వైబ్రేషన్స్ అధికంగానే ఉన్నాయి. వి9 బాబర్‌లో రెండు మోడ్స్‌లో ఉన్న ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలదు, అవసరం లేనపుడు ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అందించారు.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఈ బైకులో శాడిల్ హైట్ 770ఎమ్ఎమ్‌గా ఉంది. షార్ట్ రైడర్ల కోసం ఇది బాగా సరిపోతుంది. మరే ఇతర క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు పోలిక లేకుండా చక్కటి రైడింగ్ పొజిషన్ మరియు సమాంతరంగా ఉండే హ్యాండిల్ బార్ ఇందులో అడ్వాంటేజ్. లాంగ్ రైడ్‌కు చక్కగానే ఉన్నప్పటికీ డబుల్ రైడింగ్ అసాధ్యం. సీటు పొడవు కాస్త తక్కువగా ఉండటం మరియు బ్యాక్ రెస్ట్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అధిక వేగం వద్ద ఎలాంటి మలుపులనైనా సునాయసంగా అధిగమించేస్తుంది. 200కిలోల బరువు ఉన్నప్పటికీ తేలికగా సాగిపోతుంది. ఇంత బరువు ఉన్నా కూడా ఇందులో అత్యుత్తమ వాలు కోణం కలదు. మలుపుల్లో షూ అంచు తారును తాకే వరకు బైకును వాల్చి మరీ రైడ్ చేయడం జరిగింది. బాబర్ స్టైలింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యాట్ బెలూన్ టైర్లను ఇందులో అందించారు. ముందు 130ఎమ్ఎమ్, వెనుక 150ఎమ్ఎమ్ కొలతల్లోని టైర్లను అందివ్వడంతో తక్కువ వేగం వద్ద దీనిని నడపడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

వి9 బాబర్ బైకులో వెనుక వైపున ప్రి-లోడెడ్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి బ్రెంబో కంపెనీ నుండి సేకరించిన డిస్క్ బ్రేకులు(ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుక వైపున 260ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ) అందించారు.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మోటో గుజ్జి వి9 బాబర్ ధర రూ. 13.9 లక్షలు ఎక్స్-షోరూమ్ (పూనే)గా ఉంది. ధర పరంగా వి9 బాబర్ ఖరీదైనదే, ఇదే ధరకు ఇండియన్ మార్కెట్లో 1000సీసీ మోటార్ సైకిల్‌ను ఎంచుకోవచ్చు. విభిన్నత్వం అనే అంశాన్ని మినహాయిస్తే, దీని ఎంపిక అంత మంచిది కాదని మా అభిప్రాయం!

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

తీర్పు:

అరుదైన మోటార్ సైకిల్ ఎంచుకునే వారు, ధర అనేది ఎంత మాత్రం సమస్య కాదనుకునే వారికి మోటో గుజ్జి వి9 బాబర్ ఉత్తమ ఎంపికే అని చెప్పవచ్చు. ట్రెడిషన్ డిజైన్ శైలిలో, క్రూయిజర్ సెగ్మెంట్లో ఇటాలియన్ మోటార్ సైకిల్ మాత్రమే ఎంచుకువాలనుకునే వారు మరో ఆలోచన లేకుండా దీనిని సొంతం చేసుకోవచ్చు.

మోటో గుజ్జి వి9 బాబర్ ఫస్ట్ రైడ్ రివ్యూ

మోటో గుజ్జి వి9 బాబర్ ఫ్యాక్ట్ షీట్...

  • ధర: రూ. 13.9 లక్షలు ఎక్స్-షోరూమ్ పూనే
  • ఇంజన్ సామర్థ్యం: 853సీసీ
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 15-లీటర్లు
  • మైలేజ్ అంచనాగా: హైవే మీద 23కిమీ/లీ; సిటిలో 18కిమీ/లీ
  • ఫ్యూయల్ ట్యాంక్ రేంజ్: 270కిమీలు(అంచనా)
  • పవర్ మరియు టార్క్: 55బిహెచ్‌పి/ 62ఎన్ఎమ్
  • గరిష్ట వేగం: 180కిమీలు

Most Read Articles

English summary
Read In Telugu: Moto Guzzi V9 Bobber First Ride Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X