ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ: టూ వీలర్లకు ఇవి ఉత్తమమేనా..?

కార్లు మరియు బైకులను స్వయంగా నడిపి, రివ్యూ ద్వారా వాటిని కొనుగోలు చేయడం ఉత్తమమేనా వంటి అనేక సందేహాలు తీర్చిన డ్రైవ్‌స్పార్క్ ఇప్పుడు ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టూ వీలర్లను పరీక్షించి, సమీక్షించింది.

By Anil

ఎమ్ఆర్ఎఫ్ మస్సెటర్ అనే పేరుతో టూ వీలర్ల టైర్లను గత ఏడాది విపణిలోకి విడుదల చేసింది. ఆ సందర్భంలో మస్సెటర్ టైర్లను కలిగి ఉన్న టూ వీలర్లను ట్రాక్ మీద నడిపి ఆటోమొబైల్ జర్నలిస్టుల తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.ట్రాక్ మీద సరే. మరి, రోడ్డు మీదకు వస్తే దీని పరిస్థితి ఏమిటి?

ఇదే ఎమ్ఆర్ఎఫ్ మస్సెటర్ టైరును రోజూ మా బైకులో వినియోగించడం ద్వారా, ఇందులో ఉన్న ప్రతికూలతలు మరియు అప్రయోజనాలు గ్రహించడం జరిగింది. మస్సెట్ టైర్ యొక్క స్వీయ అనుభవం నేటి కథనంలో...

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

భారత దేశపు అతి పెద్ద టైర్ల తయారీ సంస్థ "ఎమ్ఆర్ఎఫ్" దేశీయ రబ్బరు పరిశ్రమలో గత 70 సంవత్సరాలుగా ఉంది. రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికి సంభందించిన అన్ని రకాల టైర్లను ఉత్పత్తి చేస్తోంది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

తక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్లకు కాకుండా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఖరీదైన మరియు స్పోర్టివ్ బైకులకు కావాల్సిన టైర్లను ఉత్పత్తి చేయడం మీద ఎమ్ఆర్ఎఫ్ ఎక్కువ దృష్టిసారిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుండి పర్ఫామెన్స్ బైకుల మీద ఇండియన్స్ ఎక్కువ మక్కువ చూపుతుండటం ఇందుకు ప్రధానం కారణం.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

అన్ని రకాల శక్తివంమైన పర్ఫామెన్స్ బైకుల కోసం, హై-పర్ఫామెన్స్ టైర్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థలు(ఉదా: మెట్జలర్ మరియు పిరెల్లీ). అంతే కాకుండా దేశీయ విపణిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ ఇంటర్నేషనల్ ఉత్పత్తులకు ఎమ్ఆర్ఎఫ్ వద్ద ఉన్న సమాధానం మస్సెటర్ టైర్.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

ఎమ్ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ల కోసం గాను ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ సైట్ ప్రారంభించింది. ప్రతి మలుపును శాసించండి అంటూ ఎమ్ఆర్ఎఫ్ ప్రారంభించిన www.ruleeverycurve.com వెబ్‌సైట్ సందర్శించి మస్సెటర్ శ్రేణి ఉత్పత్తులను వీక్షించగలరు.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

ఈ వెబ్‌సైట్లో మస్సెటర్ టైర్ల ఉత్పత్తులకు సంభందించిన సమాచారంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ రైడింగ్ రూట్లకు సంభందించిన వివరాలను పొందుపరిచింది. అందే కాకుండా దేశవ్యాప్తంగా మలుపులతో కూడిన రోడ్ల వివరాలను గుర్తించే కర్వ్ మ్యాప్ కూడా తమ సైట్లో అందించింది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

గతంలో, ఎమ్ఆర్ఎఫ్ పర్ఫామెన్స్ బైకుల కోసం ప్రత్యేకంగా రెవ్జ్(Revz) అనే టైర్లను ప్రవేశపెట్టింది. అయితే వేగవంతమైన మలుపుల్లో సురక్షితమైన రైడింగ్ కోసం ప్రవేశపెట్టిన మస్సెటర్ టైర్ల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించింది. మరి ఈ మస్టెటర్ టైర్లు మంచివేనా....? క్రింది స్లైడర్ల ద్వారా మస్సెటర్ టైర్ల రివ్యూ.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

టైర్ సెలక్ట్ చేసుకునే ముందు టైర్ డిజైన్ ఆకృతిని గమనించడం సాధారణం, టైరు మీద వివిధ రకాల డిజైన్‌లో ఉన్న గీతలు, రోడ్డు మీద పటిష్టాన్ని పెంచడంలో కీలంకా ఉంటాయి. అందుకోసం టైరు మీద ఆగ్ని కీళల తరహాలో చెక్కిన రూపాన్ని గమనించవచ్చు.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

జపనీస్ టైర్ల డిజైన్ తరహాలో ఉన్న ఈ మస్సెటర్ టైర్ల గ్రిప్ డిజైన్ కోసం ఎమ్ఆర్ఎఫ్ ప్రత్యేకంగా ఏదైనా సాఫ్ట్ వేర్ వినియోగించిందా అంటే? లేదనే చెప్పాలి.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

సాఫ్ట్ కాంపౌడ్ కంస్ట్రక్షన్ ఆధారంతో ఎమ్ఆర్ఎఫ్ ఈ మస్సెటర్ టైర్లను తయారు చేస్తుంది. ట్రాక్ మీద నడిపినపుడు వచ్చే రైడింగ్ అనుభూతి సాధారణ రోడ్ల మీద నడిపునపుడు కలిగే అనుభూతికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం గురించి అటుంచితే, రోడ్డు మీద ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని ఎదుర్కోవాలి. మా ఈ రివ్యూలో మేము గుర్తించిన అంశం ఇది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

మస్సెటర్ టైర్‌కు ఎమ్ఆర్ఎఫ్ ఇచ్చిన ట్యాగ్ లైన్, ప్రతి మలుపును శాసించు (Rule Every Curve) అనే అంశాన్ని తీసుకుని బెంగళూరు రహదారుల్లో కాస్త మట్టితో కూడిన మలుపులు, ట్రాఫిక్‌లోని మలుపుల్లో, ఇరుకైన మరియు విశాలమైన, వర్షంలో మరియు మండుటెండల్లో ఉన్న వివిధ రకాల మలుపుల్లో మస్సెటర్ టైర్‌‌ను పరీక్షించడం జరిగింది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

ఎమ్ఆర్ఎఫ్ తెలిపినట్లు మస్సెటర్ టైర్ చాలా అద్బుతం. ప్రతి ప్రతికూలమైన మలుపుల్ని సునాయసంగా అధిగమించింది. జారుడు స్వభావం ఉన్న మలుపుల్లో టైర్ జారుతున్న ఫీలింగ్ ఏ మాత్రం పొందలేదు. మృదువైన పదార్థంతో తయారు చేయడం ద్వారా పంక్చర్ అయ్యే అవకాశం సాధారణంగానే ఉంటుంది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

సుమారుగా వెయ్యి కిలోమీటర్లు మేరు నడిపిన తరువాత టైర్ పంక్చర్‌కు గురైంది. అయితే పంక్చర్ అయినప్పటి నుండి అలాగే రెండు రోజుల పాటు నడపడం జరిగింది. అయితే అన్ని రోడ్లు మరియు మలుపుల్లో అద్బుతమైన పనితీరు కనబరిచింది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

మలుపుల్లో చక్కటి రైడింగ్ కోసం ఎక్కువ మంది ఎంచుకునే బైకు యమహా ఎఫ్‌జడ్-16 మోటార్ సైకిల్‌లో మస్సెటర్ టైర్లను పరీక్షించడం జరిగింది. నిజానికి మేము వినియోగించిన బైకు చాలా పాతది మరియు మంచి కండీషన్‌లో కూడా లేదు. అయితే మస్సెటర్ టైర్లు ఉన్న ధీమాతో మలుపుల్లో ధైర్యంగా రైడ్ చేయడం సాధ్యం అయ్యింది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

ముందు టైరును పట్టించి ఉంచి, వెనుక టైరు మీద ఎక్కువ పవర్ ప్రయోగించడం ద్వారా అధిక మలుపును స్కిడ్ అవ్వకుండా అధిగమించింది. అనేక సంవత్సరాల పాటు ఎమ్ఆర్ఎఫ్ టైర్ల తయారీలో ఎంతటి నైపుణ్యాన్ని సంపాదించుకుందే మస్సెటర్ ద్వారా తెలుస్తోంది.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

కాలం చెల్లిన రోడ్లు మరియు మరియు మట్టి రోడ్ల మీద కూడా మస్సెటర్ టైర్ ఉత్తమ రైడింగ్‌ను కల్పించింది. మస్సెటర్ టైర్ల శ్రేణి - 80/90-17 ముందు చక్రానికి మరియు 100/90-17 వెనుక చక్రానికి మరియు 140/70-17 వంటి కొలతల్లో లభిస్తున్నాయి.

ఎమ్‌ఆర్ఎఫ్ మస్సెటర్ టైర్ రివ్యూ

వివిధ రకాల మోటార్ సైకిల్ మరియు వాటి ధరల ఆధారంగా, ఎమ్ఆర్ఎఫ్ మస్సెటర్ ధరల శ్రేణి రూ. 3,500 లు నుండి రూ. 5,000 మధ్య ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu MRF Masseter Tyres Review
Story first published: Friday, June 9, 2017, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X