రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ: కెఫే రేసర్ 535సీసీ

By మాటలు: జోబో కురువిళ్ల; అనువాదం: రవి శంకర్

పాత సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో, పాత సంవత్సరానికి తీపి గుర్తుగా రాయల్ ఎన్‌పీల్డ్ తమ సరికొత్త 535సీసీ కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్ 'కాంటినెంటల్ జిటి'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్‌ను క్లాసికల్ బైక్‌కు మోడ్రన్ లుక్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. క్రూయిజర్ బైక్‌ల తయారీలో ఇప్పటి ప్రపంచ స్థాయి బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇలాంటి బైక్ రావటం నిజంగా బైక్ ప్రియులు చేసుకున్న అదృష్టం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే దాదాపు 200 కాంటినెంటల్ జిటి బైక్‌లో దేశవిదేశాలకు చెందిన ఆటోమొబైల్ జర్నలిస్టులను గోవాకు ఆహ్వానించి టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని, అనంతరం బైక్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ టెస్ట్ డ్రైవ్‌కు నేను కూడా హాజరయ్యాను. 1960వ దశకానికి చెందిన పురాతన బ్రిటీష్ జిటి బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది ఈ బైక్‌ను డిజైన్ చేశారు. దీని క్లాసిక్ డిజైన్ ఎవరినైనా తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది.

కంపెనీ 60 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బైక్‌ను ఇదివరకెన్నడూ తయారు చేయలేదు. ఈ సరికొత్త కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న అత్యంత శక్తివంతమైనది అలాగే తేలికైనది. పెర్ఫామెన్స్, పవర్, హ్యాండ్లింగ్, రోడ్ గ్రిప్, కంఫర్టబల్ రైడ్ పొజిషన్ ఇలా అనేక అంశాల గురించి ఈ బైక్‌లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 535సీసీ కెఫే రేసర్ బైక్‌తో నేను పొందిన అనుభూతిని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

రాయర్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ 535సీసీ గడచిన నవంబర్ 26, 2013న భారత మార్కెట్లో విడుదలయ్యింది. ఈ బైక్ రివ్యూ కోసం తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

మేడ్ లైక్ ఏ గన్

మేడ్ లైక్ ఏ గన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ క్యాప్షన్ 'మేడ్ లైక్ ఏ గన్'కు తగినట్లుగానే ఈ కొత్త కాంటినెంటల్ జిటిని తయారు చేశారు. అత్యంత తేలికైన, వేగవంతమైన, శక్తివంతమైన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రూ.2.05 లక్షల ధరతో (ఆన్-రోడ్, ఢిల్లీ) ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

కెఫే రేసర్ సంస్కృతి

కెఫే రేసర్ సంస్కృతి

కెఫే రేసర్ అనేది బ్రిటీష్‌లో అంతరించి పోయిన ఓ సంస్కృతి. 1960 ప్రాంతంలో బైకర్లు/స్నేహితులు ఈ తరహా బైక్‌లపై అలా సరదా కెఫేలకు వెళ్లి మాంటా మంతీ జరుపుకునే వారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ సరికొత్త 2014 కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ 535సీసీతో అంతరించిపోయిన సంస్కృతికి తిరిగి జీవం పోసే ప్రయత్నం చేసింది.

డిజైన్

డిజైన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి ఇంత అందంగా డిజైన్ కావటం వెనుక ఉన్నది జెనోఫియా డిజైన్ సంస్థ. యూకేకి చెందిన ఈ డిజైన్ స్టూడియో కాంటినెంటల్ జిటి డిజైన్‌లో కీలక పాత్ర పోషించింది. ఈ డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. మేము ఈ బైక్‌పై వెళ్తున్నప్పుడు అనేక మంది మమ్మల్ని ఆపి, ఈ బైక్ గురించి వివరాలు అడిగే వారు. డిజైన్ విషయంలో మేము దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాం.

ఇంజన్

ఇంజన్

ఈ ఇంజన్ అనేక ప్రశంసలను అలాగే విమర్శలను అందుకుంది. ఈ ఇంజన్ నుంచి మీరు కెటిఎమ్ 390 లేదా యమహా ఆర్‌డి350 బైక్‌ల మాదిరిగా క్విక్ పవర్ రష్‌ను అంచనా వస్తే, మీరు నిరుత్సాహ పడక తప్పదు. అయినప్పటికీ, ఈ పవర్‌ఫుల్ ఇంజన్ మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 500సీసీ బైక్‌లలో ఉపయోగిస్తున్న ఇంజన్ లాంటిదే. అయితే, దీని సామర్థ్యాన్ని పెంచేందుకు గాను బోర్ సైజ్‌ను కూడా పెంచారు. ఇది కొత్త ఈసియూ ఫ్యూయెల్ మ్యాపింగ్‌తో లభిస్తుంది.

ఈ 535ససీ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 29.1 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్

రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ల విషయంలో హ్యాండ్లింగ్, బ్రేకింగ్‌లు సరిగ్గా అనేక ఏళ్లుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయితే, కెఫే రేసర్ విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఛాస్సిస్, సస్పెన్షన్, బ్రేక్స్, టైర్స్ విషయంలో ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోల్చుకుంటే కెఫే రేసర్ ప్రత్యేకంగా అనిపిస్తుంది.

ఇందులో కొత్త ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను (ఇంజన్‌ను అమర్చే ఫ్రేమ్) ఉపయోగించారు. ఈ ఫ్రేమ్‌తో ఏకైక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కాంటినెంటల్ జిటి కావటం మరొక విశేషం. ఈ ఫ్రేమ్‌ను ప్రత్యేకించి కాంటినెంటల్ జిటి కోసం యూకెకు చెందిన హ్యారిస్ పెర్ఫామెన్స్ సహకారంతో కలిసి కంపెనీ తయారు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

ఇందులోని 41 మి.మీ. ఫ్రంట్ ఫోర్క్ 110 మి.మీ. ట్రావెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 80 మి.మీ. ట్రావెల్‌తో కూడిన రెండు గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్స్‌ను అమర్చారు. పైయోలీ నుంచి గ్రహించిన ఈ షాక్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌ను కలిగి ఉంటాయి.

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్రేక్స్‌ను బ్రెమ్బూ నుంచి గ్రహించారు. ముందు వైపు రెండు 300 మి.మీ. డిస్క్ మరియు 2 పిస్టన్ కాలిపర్ అలాగే వెనుక వైపు 240 మి.మీ. డిస్క్ మరియు సింగిల్ కాలిపర్‌ను అమర్చారు. కాంటినెంటల్ జిటిలో ఉపయోగించిన టైర్లను పీరెల్లీ స్పోర్ట్ డెమాన్ నుంచి గ్రహించారు.

ఇంధన దాహం ఎక్కువ

ఇంధన దాహం ఎక్కువ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్‌కు ఇంధన దాహం కొంచెం ఎక్కువకే.. కేవలం మైలేజ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకునే కస్టమర్లు ఇది అ మాత్రం బెస్ట్ ఆప్షన్ కాదనే చెప్పాలి. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లు. మేము రైడ్ చేసినప్పుడు ఈ బైక్ లీటురుకు సగటున 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేసింది. అయితే, జాగ్రత్తగా నడిపితే సగటున లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీ రావచ్చు.

వెర్షన్స్

వెర్షన్స్

గోవాలో మొదటి రోజున (టెస్ట్ డ్రైవ్ సమయంలో) రెడ్ కలర్ కెఫే రేసర్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత రోజున ఈ బైక్ ధరను వెల్లడించేటప్పుడు లైవరీ యల్లో కలర్ కెఫే రేసర్‌ను విడుదల చేశారు. ఇది మొత్తం రెండు వెర్షన్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి సింగిల్ సీటర్, మరొకటి డబుల్ సీటర్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది డ్యూయెల్ సీట్ కాంటినెంటల్ జిటి. పిలియన్ రైడర్ కోసం ఏర్పాటు చేసిన ఫుట్ రెస్ట్‌లను ఇందులో గమనించవచ్చు. అయితే, సీట్ మాత్రం ఫైబర్ కౌల్ కవరింగ్‌తో ఉంటుంది. అంటే, ఇది పిలియన్ రైడర్‌కు కంఫర్టబల్ కాదని తెలుస్తోంది. నేను టెస్ట్ డ్రైవ్ చేసింది సింగిల్ సీటర్ కెఫే రేసర్. ఈ సీటింగ్ ఆప్షన్‌ను వినియోగదారులు తమ ఎంపికను బట్టి ఎంచుకోవచ్చు.

టెస్ట్ చేసిన మోడల్

టెస్ట్ చేసిన మోడల్

* 2013 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 535సీసీ

* విడుదల సమయంలో ధర: రూ.2.05 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ)

* విడుదల తేది: నవంబర్ 26, 2013

* నడిపిన కి.మీ. (గోవాలో): 350

* డెలివరీలు: జనవరి 2014 నుంచి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

మంచి:

* ఆకర్షనీయమైన కలర్, మంచి ఫిట్ అండ్ ఫినిషింగ్

* ధృడమైనది (ప్రత్యేకించి పాట్‌హోల్స్, రోడ్-హంప్స్‌పై)

* మంచి హ్యాండ్లింగ్, బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్

చెడు:

* లాంగ్ రైడ్‌కు అనువైనది కాదు

* గరిష్ట పవర్ 29.1 బిహెచ్‌పిలు మాత్రమే (35 బిహెచ్‌పిలకు పెంచి ఉంటే బాగుండేది)

* క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ నుంచి వచ్చే వైబ్రేషన్

* సైలెన్సర్‌ను కవర్ చేయబడి ఉండే హీట్ షీల్డ్ అంత సమర్థవంతంగా లేదు

ఎక్స్-ఫ్యాక్టర్:

* 1960ని గుర్తుకు తెచ్చే క్లాసిక్ డిజైన్

జిటి అప్పీరల్

జిటి అప్పీరల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ రైడర్ల కోసం ఆకర్షయమైన యాక్ససరీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో లెథర్ రైడింగ్ జాకెట్స్, హాఫ్/ఫుల్ ఫేస్ హెల్మెట్స్, రైడింగ్ బూట్స్, గ్లౌవ్స్, బఫ్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు సేఫ్టీని అందించడమే కాకుండా, రైడర్లకు మంచి లుక్‌ని కూడా ఇస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

ఐషర్ మోటార్స్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా తమ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌‌ను భారత్‌కు పరిచయం చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కొలతలు క్రింది విధంగా ఉన్నాయి:

వీల్‌బేస్: 1360 మి.మీ

గ్రౌండ్ క్లియరెన్స్: 140 మి.మీ

పొడవు: 2060 మి.మీ.

వెడల్పు: 760 మి.మీ.

ఎత్తు: 1070 మి.మీ.

సీట్ ఎత్తు: 800 మి.మీ.

బరువు: 184 కేజీలు. (ఫుల్ ట్యాంక్‌తో)

Most Read Articles

English summary
Royal Enfield Continental GT review; price, bhp, mileage of Royal Enfield 535cc bike. Royal Enfield Cafe Racer review test ride details for RE fans. Appease your mind with gripping visuals of the beauty while we take you on Tour of the Royal Enfield Cafe Racer Review - 535 Continental GT. - Click through the gallery below.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X