భారతీయులు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్-10 టూవీలర్లు

By Anil

కాల గర్బంలో మరో నెల గడిచిపోయింది. ప్రతి నెలలాగే గడిచిన నెలలో కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య వివిద రకాల కంపెనీలకు చెందిన టూవీలర్లు అమ్ముడు పోయాయి. కాలం మారే కొద్ది కొన్ని కొత్త రకాల మోడల్లు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. కొన్ని విశేష ఆదరణను పొందుతాయి. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికే ఉన్న మోడల్లకు కొన్ని కొత్త మెరుపులు అద్ది మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి.
Also Read: హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?

ప్రతి మాసంలోలాగే గత అక్టోబర్ మాసంలో స్ల్పెండర్ మరియు ఆక్టివా మోడల్లకు తీవ్ర యుద్దమే జరిగింది. అయితే ఈ రెండు మోడల్లు మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. తెలుగు పాఠకుల కోసం డ్రైవ్‌స్పార్క్ అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడుబోయిన టూవీలర్ల గురించిన సమాచారం అందిస్తోంది. మరియు ఎక్కువ మంది ఎంచుకున్న మోడల్ల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు ఏ బైకును ఎంచుకోవాలో అనే సందేహం తీరిపోతుంది. మరెందుకు ఆలస్యం క్రింద గల కథనాల మీద దృష్టి పెట్టండి.

10. హీరో గ్లామర్

10. హీరో గ్లామర్

హీరో మోటో కార్ప్‌కు చెందిన గ్లామర్ 2015 అక్టోబర్ నెలలో 62,482 యూనిట్లు అమ్మడుపోయి 17.8 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గత సంవత్సరం ఇదే నెలలో ఇది మొదటి పది స్థానాలలో చోటు సంపాదించుకోలేక పోయింది.

09.టివియస్ యక్స్‌యల్‌‌ సూపర్

09.టివియస్ యక్స్‌యల్‌‌ సూపర్

అదే మన ఊరి బండి టివియస్ యక్స్‌యల్ సూపర్. ఈ గడిచిన నెలలో 65,241 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. కాని 5.5 శాతం వృద్దిని కొల్పోయింది. ఇదే నెల గత సంవత్సరంలో 69,066 యూనిట్లు అమ్ముడుపోయి ఎనిమిదవ స్థానంలో నిలవగా ఈ సారి 9 స్థానానికి వచ్చింది.

08. హీరో మాయెస్ట్రో

08. హీరో మాయెస్ట్రో

అక్టోబర్ నెలలో జరిగిన అమ్మకాలలో ఎక్కువ వృద్దిని నమోదు చేసుకున్న వాటిలో హీరో మాయెస్ట్రో ఒకటి. ఇది ఏకంగా 52.2 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. ఇక అమ్మకాల పరంగా చూస్తే దాదాపుగా 65,786 మాయెస్ట్రో స్కూటర్లు అమ్ముడుపోయి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

07. బజాజ్ సిటి

07. బజాజ్ సిటి

బజాజ్‌కు చెందిన అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల టూవీలర్ బజాజ్ సిటి. ఈ మోడల్ గడిచిన నెలలో 66,517 యూనిట్ల అమ్మకాలు జరిపి ఏడవ స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే ఇదే నెల 2014 లో బజాజ్ సిటి మొదటి పది స్థానాలలో చోటు సాదించలేదు. దీనిని బట్టి చూస్తే వీటి అమ్మకాలు వృద్ది పెరిగిందని తెలుస్తోంది.

06.బజాజ్ పల్సర్

06.బజాజ్ పల్సర్

బజాజ్ దశ మారడానికి కారణం పల్సర్ మోడల్. ఈ పల్సర్ టూవీలర్లు గత నెలలో 701,618 అమ్మకాలు జరిపి ఆరవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది అక్బోబర్ నెలలో కూడా ఇది ఆరవ స్థానంలోనే ఉంది. అనగా వీటి అమ్మకాలలో ఏ మాత్రం వృద్ది సాధించలేదని తెలుస్తోంది.

05. హోండాసిబి షైన్

05. హోండాసిబి షైన్

సిబి షైన్ గత ఏడాది అక్టోబర్ నెలతో పోల్చుకుంటే భారీగా అమ్మకాలను జరిపింది. గత ఏడాది ఇదే నెలలో ఈ షైన్ 64,1154 అమ్మకాలు జరిపి 9 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా 90,168 యూనిట్ల అమ్మకాలు జరిపి 40.6 శాతం వృద్దితో ఐదవ స్థానంలో నిలిచింది.

04. హీరో ప్యాసన్

04. హీరో ప్యాసన్

హీరో మోటోకార్ప్ వారి టూవీలర్లలో అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్లలో ప్యాసన్‌కు చెందిన టూవీలర్లు. 2015 అక్టోబర్‌లో ఇవి 95,883 యూనిట్ల అమ్మకాలు జరిపి నాలుగవ స్థానంలో నిలిచింది. ఇదే నెల గత ఏడాదిన 102,866 యూనిట్లు అమ్ముడుపోయి మూడవ స్థానంలో నిలిచింది.

03. హెచ్‌‌యఫ్ డీలక్స్

03. హెచ్‌‌యఫ్ డీలక్స్

హీరోకు చెందిన ఈ హెచ్‌‌యఫ్ డీలక్స్ గత ఏడాది అక్టోబ‌‌ర్‌లో జరిగిన అమ్మకాలలో నాలుగవ స్థానంలో ఉండగా. ప్రస్తుత ఈ ఏడాది అక్టోబర్‌లో 107,294 యూనిట్ల అమ్మకాలు జరిపి 5.3 శాతం వృద్దితో మూడవ స్థానంలో నిలిచింది.

02. హీరో స్ల్పెండర్

02. హీరో స్ల్పెండర్

హీరో మోటోకార్ప్ వారి శ్రేణికి చెందిన స్ల్పెండర్ మోడల్ 236,564 యూనిట్ల అమ్ముడుపోయి రెండవ స్థానంలో నిలిచాయి. అయితే గత ఏడాది ఇదే నెలలో మొదటి స్థానంలో నిలిచింది.

 01. హోండా ఆక్టివా

01. హోండా ఆక్టివా

హోండాకు చెందిన ఆక్టివా మోడల్‌‌కు మరియు హీరో స్ల్పెండర్‌కు మద్య తీవ్ర పోటి నెలకొంది. అయితే 237,563 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే అక్టివా గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే దాదాపుగా 34.9 శాతం వృద్ది సాధించింది.

 తీర్పు

తీర్పు

మన భారతీయులకు భాగా తెలుసు ఏ టూవీలర్ ఎలాంటిదో అని. అందుకే ఎక్కుమంది హోండా వారి ఆక్టివా మరియు హీరో మోటోకార్ప్ వారి స్ల్పెండర్‌కు పట్టం కట్టారు.కాబట్టి సందేహించడం మాని ఇందులో మీకు నచ్చిన టూ వీలర్‌ను ఎంచుకోండి...

 టాప్-10
  1. అక్టోబర్‌లో ఎక్కువగా అమ్మడుపోయిన టాప్ 10 బెస్ట్ కార్లు...
  2. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మరి ఇందులో మీ బైక్ ఉందా?

Most Read Articles

English summary
Top 10 Best Selling Two Wheelers In October
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X