భారత్‌లో లభిస్తున్న టాప్ బెస్ట్ 125సీసీ స్కూటర్స్ - వివరాలు

By Ravi

ప్రస్తుతం టూవీలర్ మార్కెట్లో స్కూటర్ ట్రెండ్ నడుస్తోంది. ఎక్కువగా సిటీల్లో ప్రయాణించే వారు నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై తరచూ గేర్లు మార్చుకుంటూ వెళ్లే మోటార్‌సైకిళ్ల కన్నా సౌకర్యవంతమైన స్కూటర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్కూటర్లకు మంచి గిరాకీ పెరిగింది. స్త్రీ పురుష భేదం లేకుండా స్కూటర్లను నడిపేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు.

స్కూటర్లకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని తయారీదారులు కూడా కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. స్కూటర్లను కొనుగోలుచేసే వారిలో కొందరు బడ్జెట్, మైలేజ్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటే, కొందరు మాత్రమే పవర్, పెర్ఫార్మెన్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి కేటగిరీకి చెందిన కస్టమర్ల కోసం అనేక 100-110సీసీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

అయితే, ఈ రెండవ కేటగిరీకి చెందిన కస్టమర్ల కోసం చాలా పరిమిత సంఖ్యలో 125సీసీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈనాటి మన కథనంలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యుత్తుమ 125సీసీ స్కూటర్లు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాప్ బెస్ట్ 125సీసీ స్కూటర్స్

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్ బెస్ట్ 125సీసీ స్కూటర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా 125

ఈ సెగ్మెంట్లో ఇటీవలే ప్రవేశించిన కొత్త మోడల్ హోండా యాక్టివా 125. విశ్వసనీయమైన యాక్టివా బ్రాండ్, నాణ్యమైన మరియు ధృడమైన నిర్మాణం, శక్తివంతమైన ఇంజన్ వంటి విశిష్టతలతో ఇది లభిస్తుంది.

బెస్ట్ ఏంటి: ఆకర్షనీయమైన డిజైన్, స్టయిలిష్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పూర్తి మెటల్ బాడీ, పవర్‌ఫుల్ రీఫైన్డ్ ఇంజన్, ఆప్షనల్ డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్ల వలన ఇది బెస్ట్ 125సీసీ స్కూటర్‌లో అగ్ర స్థానంలో నిలుస్తుంది.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా 125

మైలేజ్: హోండా యాక్టివా 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 59 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 50 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 5.3 లీటర్లు

ఇంజన్: 124.9సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 8.6 హెచ్‌పి @ 6500 ఆర్‌పిఎమ్, టార్క్ 10.12 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 18 లీటర్లు

ధర రూ.57,531 (డ్రమ్ బ్రేక్), రూ.63,645 (డిస్క్ బ్రేక్)

(ధర ఆన్-రోడ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

సుజుకి యాక్సిస్ 125

సుజుకి యాక్సిస్ 125

హోండా యాక్టివా 125 స్కూటర్ రాక ముందు వరకు సుజుకి యాక్సిస్ 125 స్కూటరే అత్యధికంగా అమ్ముడుపోతున్న 125సీసీ స్కూటర్‌గా ఉండేది. సుజుకి యాక్సిస్ ఓ మంచి ఫ్యామిలీ స్కూటర్. ఇది సింపుల్ డిజైన్‌‌ను కలిగి ఉంటుంది.

బెస్ట్ ఏంటి: రీఫైన్డ్ అండ్ పవర్‌ఫుల్ ఇంజన్, సరసమైన ధర.

సుజుకి యాక్సిస్ 125

సుజుకి యాక్సిస్ 125

మైలేజ్: సుజుకి యాక్సిస్ 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 57 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 45-50 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 6.0 లీటర్లు

ఇంజన్: 124సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 8.58 హెచ్‌పి @ 7000 ఆర్‌పిఎమ్, టార్క్ 9.8 ఎన్ఎమ్ @ 5000 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 20 లీటర్లు

బరువు: 112 కేజీలు

ధర రూ.51,611 (రెగ్యులర్ ఎడిషన్), రూ.53350 (స్పెషల్ ఎడిషన్)

(ధర ఆన్-రోడ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

సుజుకి స్విష్ 125

సుజుకి స్విష్ 125

సుజుకి అందిస్తున్న మరో 125సీసీ స్కూటర్ స్విష్. సుజుకి యాక్సిస్ డిజైన్ బోరింగ్ అనిపించే వారు ఈ స్టయిలిష్ సుజుకి స్విష్ 125సీసీ స్కూటర్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్ ఒక్కటే, డిజైన్ మాత్రమే వేరు.

బెస్ట్ ఏంటి: స్లీక్ అండ్ స్టయిలిష్ డిజైన్, సరసమైన ధర.

సుజుకి స్విష్ 125

సుజుకి స్విష్ 125

మైలేజ్: సుజుకి స్విష్ 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 57 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 45-50 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 6.0 లీటర్లు

ఇంజన్: 124సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 8.58 హెచ్‌పి @ 7000 ఆర్‌పిఎమ్, టార్క్ 9.8 ఎన్ఎమ్ @ 5000 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 20 లీటర్లు

బరువు: 110 కేజీలు

ధర రూ.52,671

(ధర ఆన్-రోడ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

మహీంద్రా డ్యూరో డిజెడ్ 125

మహీంద్రా డ్యూరో డిజెడ్ 125

మహీంద్రా టూవీలర్స్ తమ డ్యూరో స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసి, డ్యూరో డిజెడ్ పేరి మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ స్కూటర్ కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో విఫలమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం తక్కువ పవర్, మైలేజ్‌‌తో కూడిన ఇంజనే.

బెస్ట్ ఏంటి: కేవలం ధర మాత్రమే. రెగ్యులర్ 110సీసీ ధరకు లభించే 125సీసీ బైక్ ఇది.
మహీంద్రా డ్యూరో డిజెడ్ 125

మహీంద్రా డ్యూరో డిజెడ్ 125

మైలేజ్: మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 56.25 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 45-50 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 6.5 లీటర్లు

ఇంజన్: 124.6సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 8 హెచ్‌పి @ 7000 ఆర్‌పిఎమ్, టార్క్ 9 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 20 లీటర్లు, ముందువైపు గ్లౌవ్ బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

బరువు: 114 కేజీలు

ధర రూ.43,788

(ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

వెస్పా ఎల్ఎక్స్ 125

వెస్పా ఎల్ఎక్స్ 125

వెస్పా ఎల్ఎక్స్ 125 ఈ సెగ్మెంట్లో కెల్లా ప్రీమియం స్కూటర్. ప్రీమియం స్టైల్, క్లాసిక్ లుక్ దీని ప్రత్యేకత.

బెస్ట్ ఏంటి: పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్, క్లాసిక్ రెట్రో లుక్స్, స్ట్రాంగ్ మెటాలిక్ మోనోకాక్ బాడీ, కంఫర్టబల్ సీట్స్.

వెస్పా ఎల్ఎక్స్ 125

వెస్పా ఎల్ఎక్స్ 125

మైలేజ్: వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 60 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 50-55 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 8.5 లీటర్లు

ఇంజన్: 125సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 10.06 హెచ్‌పి @ 7500 ఆర్‌పిఎమ్, టార్క్ 10.60 ఎన్ఎమ్ @ 7500 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 16.5 లీటర్లు

బరువు: 114 కేజీలు

ధర రూ.59,996

(ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

వెస్పా ఎస్ 125

వెస్పా ఎస్ 125

125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఈ వెస్పా ఎస్ 125. రోడ్డుపై మీరు వెళ్తున్నప్పుడు ఇతరుల దృష్టిని మీ వైపుకు మరల్చుకోవాలంటే ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయండి.

బెస్ట్ ఏంటి: పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్, క్లాసిక్ రెట్రో లుక్స్, స్ట్రాంగ్ మెటాలిక్ మోనోకాక్ బాడీ, కంఫర్టబల్ సీట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

వెస్పా ఎస్ 125

వెస్పా ఎస్ 125

మైలేజ్: వెస్పా ఎస్ 125 స్కూటర్ యొక్క సర్టిఫైడ్ మైలేజ్ 60 కెఎమ్‌పిఎల్. సిటీ రోడ్లపై ఇది లీటరుకు 50-55 కి.మీ. మైలేజీనిస్తుందని అంచనా.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 8.5 లీటర్లు

ఇంజన్: 125సీసీ, సింగిల్ సిలిండర్. పవర్ 10.06 హెచ్‌పి @ 7500 ఆర్‌పిఎమ్, టార్క్ 10.60 ఎన్ఎమ్ @ 7500 ఆర్‌పిఎమ్

అండర్ సీట్ స్టోరేజ్: 16.5 లీటర్లు

బరువు: 114 కేజీలు

ధర రూ.75,424

(ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, మే 2014 నాటికి)

టాప్ బెస్ట్ 125సీసీ స్కూటర్స్

మరి ఈ టాప్ బెస్ట్ 125సీసీ స్కూటర్లలో మీ ఫేవరేట్ 125సీసీ స్కూటర్ ఏది?

Most Read Articles

English summary
The Indian scooter scene is bustling with activity. We have compiled mileage figures, engine specifications and important feature details of some of the top 125cc scooters available in the Market for a quick comparison.
Story first published: Friday, May 9, 2014, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X