వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ: స్కూటర్ ప్రియులకు ఇటాలియన్ ట్రీట్

By Ravi

ఒకప్పుడు స్కూటర్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే అతికొద్ది బ్రాండ్లలో 'వెస్పా' కూడా ఒకటి. ద్విచక్ర వాహన విభాగంలో సరికొత్త విప్లవాలకు తెరలేపిన ఈ ఇటాలియన్ బ్రాండ్ వెస్పా, ఇటీవలి కాలంలో వచ్చిన మోడ్రన్ స్కూటర్ల పోటీని తట్టుకోలేక్ వెస్పా మార్కెట్ నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. అయితే, కొంత కాలం తర్వాత వెస్పా కూడా తమ బ్రాండ్‌ను అప్‌గ్రేడ్ చేసి, ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్‌గా వెస్పా ఎల్ఎక్స్125తో 2012వ సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత వెస్పా విఎక్స్125 మోడల్‌ను తాజాగా 'వెస్పా ఎస్125' (Vespa S 125) మోడల్‌ను ప్రవేశపెట్టింది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ సరికొత్త స్పోర్టీ వెర్షన్ వెస్పా ఎస్125 స్కూటర్‌ను ముంబైలో టెస్ట్ రైడ్ చేసింది. వెస్పా సిరీస్‌లో వస్తున్న ఈ స్పోర్టీ వెర్షన్ 125సీసీ స్కూటర్ 'వెస్పా ఎస్'ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం స్కూటర్ 'వెస్పా విఎక్స్125'కు ఎగువన ప్రవేశపెట్టారు. వెస్పా ఎస్‌లో అంటే ఎస్ అంటే స్పోర్ట్ అని అర్థం. ఇదొక క్లాసిక్ డిజైన్ కలిగిన స్పోర్టీ వెస్పా స్కూటర్.

వెస్పా ఎస్ బేసిక్ చూడటానికి ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్‌ స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. అయితే, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు, ఫీచర్ల మార్పులను ఇందులో గమనించవచ్చు. ప్రస్తుతం భారత్‌లో వెస్పా అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించారు. ఈ స్కూటర్ టెస్ట్ రైడ్‌లో మేము పరిశీలించిన అంశాలను, ఇందులో మంచి చెడుల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

టెస్ట్ చేసిన మోడల్

టెస్ట్ చేసిన మోడల్

* 2014 పియాజ్జియో వెస్పా ఎస్125

* విడుదలైన తేది: మార్చ్ 5, 2014

* విడుదల సమయంలో ధర: రూ.76,495 (ఎక్స్-షోరూమ్, ముంబై)

* టెస్ట్ చేసిన ప్రాంతం, దూరం: బాంద్రా (ముంబై), 100 కి.మీ

* టెస్ట్ చేసిన వారు: అజింక్యా పారాలికర్

ఇంజన్

ఇంజన్

వెస్పా ఎల్ఎక్స్, విఎక్స్ స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించారు. ఇందులో అమర్చి 125సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ అండ్ కార్బురెట్టెడ్, త్రీ-వాల్వ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.06 పిఎస్‌ల శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.59 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

వెస్పా ఎస్ స్కూటర్‌ లీటరుకు 60 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, వాస్తవిక టెస్ట్ కండిషన్స్‌లో ఇది లీటరుకు 45-50 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

డిజైన్

డిజైన్

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ మరియు అదే షేపులో ఉండే క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్, హెడ్‌లైట్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్, క్రోమ్ బ్రేక్ లివర్స్, ముందు వైపు క్రోమ్ స్ట్రిప్, క్రోమ్ ఎగ్జాస్ట్ కవర్, క్రోమ్ ఫినిష్డ్ టెయిల్ ల్యాంప్ వంటి కాస్మోటిక్ ఫీచర్లతో ఇది మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

కొత్త వెస్పా ఎస్125 స్కూటర్ ఏ యాంగిల్ నుంచి చూసినా స్టన్నింగ్‌గా, స్టయిలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో బ్లాక్ కలర్ 3-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు హెడ్‌ల్యాంప్ వెస్పాకు పాత స్కూటర్ల లుక్‌ని తెచ్చిపెడుతాయి. బాడీ మొత్తంపై క్రోమ్ గార్నిష్ ఓ ప్రత్యేకమైన లుక్ ఫీల్‌ను అందిస్తుంది.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

ఈ స్కూటర్‌కు ముందువైపు ఒక వైపు మాత్రమే ఉండే షాక్ అబ్జార్వర్, ట్రేడ్ మార్క్ పొందిన వెస్పా మోనోకాక్ ఛాస్సిస్‌, ముందువైపు డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లతో ఇది ఇటాలియన్ స్కూటర్ల డిజైన్‌ను తలపిస్తుంది. ఇందులో చక్కగా డిజైన్ చేసిన సీట్ రైడర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, ఈ సీట్‌పై పిలియన్ రైడర్ (వెనుక కూర్చునే వారి)కి మాత్రం అంత సౌకర్యంగా ఉండదనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా ఫుట్ రెస్ట్స్.

రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్

రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్

ఈ స్కూటర్‌ను సాఫీగా ఉండే రోడ్లపైనే కాకుండా గతకులుగా ఉండే రోడ్లపై సైతం నడిపేందుకు అనువుగా ఉంటుంది. పొడవుగా ఉండే వ్యక్తులకు సైతం సౌకర్యంగా ఉండేలా దీని హ్యాండిల్ బార్స్‌ను చక్కగా పొజిషన్ చేశారు. అయితే, తక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు స్కూటర్ భారంగా (వైబ్రేషన్) అనిపిస్తుంది. మొత్తమ్మీద చూసుకుంటే రైడ్ కంఫర్ట్ బాగానే అనిపిస్తుంది.

హ్యాండ్లింగ్ అండ్ బ్రేకింగ్

హ్యాండ్లింగ్ అండ్ బ్రేకింగ్

హ్యాండ్లింగ్ విషయంలో వెస్పా ఎస్125 చాలా లైట్‌గా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇందులో ఉపయోగించిన ఎమ్ఆర్ఎఫ్ జాప్పర్ ట్యూబ్‌లెస్ టైర్లు మంచి రోడ్‌గ్రిప్‌ను అందిస్తాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు సింగిల్ కాలిపర్ డిస్క్ బ్రేక్‌ను మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను ఉపయోగించారు. సిటీ రోడ్లపై బ్రేకింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ, వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లో షార్ప్‌నెస్ తగ్గినట్లు అనిపిస్తుంది.

ఫీచర్లు

ఫీచర్లు

వెస్పా ఎస్125 స్కూటర్‌కు ఆల్-రౌండ్ వింటేజ్ రెట్రో టచ్‌‌నిచ్చేలా గుండ్రంగా ఉండే హెడ్‌లైట్ స్థానంలో ధీర్ఘచతురస్రాకారంలో ఉండే హెడ్‌లైట్ అమర్చారు. దీని హ్యాండిల్ బార్ మరియు ఫ్రంట్ బాడీ డిజైన్ కూడా పురాతన స్కూటర్‌ను తలపిస్తుంది. హెడ్‌లైట్, టెయిల్ లైట్, బ్రేక్ లివర్స్, మిర్రర్లకు క్రోమ్ టచ్ ఇచ్చారు.

మొత్తమ్మీద ఇదొక మోడ్రన్ క్లాసిక్ స్కూటర్‌లా అనిపిస్తుంది.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

స్కూటర్‌కు వెనుకవైపు టెయిల్ ల్యాంప్ పైభాగంలో ఉండే వెస్పా ఎస్ బ్యాడ్జింగ్ అలాగే స్కూటర్‌కు ఇరు వైపులా ఉండే వెస్పా మరియు ఎస్125 బ్యాడ్జింగ్‌లు దీని ప్రత్యేకతను తెలియజేస్తాయి. క్రోమ్ సరౌండింగ్స్‌తో కూడిన టెయిల్ ల్యాంప్, బాడీలోనే అమర్చబడి ఉండే టెయిల్ ల్యాంప్స్ స్కూటర్‌కు మంచి స్పోర్టీ లుక్‌నిస్తాయి.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

వెస్పా ఎస్125 స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పురాతన మోడళ్లనే తలపిస్తుంది. ఇందులో రౌండ్ షేపులో ఉండే అనలాగ్ మీటర్ కన్సోల్ మరియు డిజిటల్ క్లాక్‌తో పాటు టర్న్ ఇండికేటర్ మరియు హెడ్‌లైట్ ఇండికేటర్లు ఉంటాయి. కానీ అంత అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసే స్కూటర్‌లో ఇలాంటి బోరింగ్ మీటర్ కన్సోల్ మాత్రం కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

వెస్పా ఎస్ స్కూటర్‌లోని స్విచ్‌లు హ్యాండిల్ బార్‌కు లోపలే అమర్చబడి ఉన్నట్లు అనిపిస్తాయి. సడెన్‌గా వీటిని యాక్సిస్ చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ, వీటి డిజైన్ మాత్రం విశిష్టంగా, ఆకర్షనీయంగా అనిపిస్తుంది.

వెస్పా ఎస్125 టెస్ట్ రైడ్ రివ్యూ

ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో ఫీచర్, వెస్పా ఎస్ అండర్-సీట్ స్టోరేజ్. దీని సీటు క్రింది భాగంలో ఓ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను దాచుకోవచ్చు. దీని ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా సీటు క్రింది భాగంలోనే ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

వెస్పా ఎస్125 మ్యాట్ బ్లాక్, బ్రైట్ ఆరెంజ్, రెడ్ మరియు వైట్ కలర్లలో లభ్యం కానుంది.

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

ప్రోస్:

* పాజిటివ్ రైడ్ కంఫర్ట్

* టిప్-టాప్ ఫిట్ అండ్ బిల్డ్ క్వాలిటీ

* మంచి గ్రిప్ కోసం సుపీరియర్ ఎమ్ఆర్ఎఫ్ టైర్స్

* మంచి మిడ్-రేంజ్ యాక్సిలరేషన్

* ఆకర్షనీయమైన కలర్స్

కాన్స్:

* చిన్న పిలియన్ సీట్

* తక్కువ స్పీడ్స్ వద్ద్ వైబ్రేషన్

* సౌకర్యంగా లేని ఫుట్‌పెగ్స్(ఫుట్ రెస్ట్స్)ట

* గ్రాబ్ రెయిల్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయకపోవటం

* స్పీడ్స్ వద్ద సౌకర్యంగా లేని బ్రేకింగ్

* ఎత్తు పళ్లాల్లో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు బ్రేక్ లాక్ లేకపోవటం

ఎక్స్-ఫ్యాక్టర్:

* మోడ్రన్ డిజైన్ కలిగిన స్కూటర్‌పై క్లాసిక్ స్టైల్ రైడింగ్ అనుభూతి

వ్యాల్యూ ఫర్ మనీ: 3 / 5

వెస్పా 'మారని ఫ్యాషన్'

వెస్పా 'మారని ఫ్యాషన్'

వెస్పా తొలిసారిగా బజాజ్ ఆటో ద్వారా ఆ తర్వాత ఎల్ఎమ్ఎల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ రెండు కంపెనీలు కూడా వెస్పా విషయంలో వండర్లు చేయలేకపోయాయి. దీంతో ప్రస్తుతం వెస్పానే స్వయంగా భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

వెస్పా తమ బ్రాండ్‌కు మరింత బలం చేకూర్చేందుకు గాను ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

Most Read Articles

English summary
Vespa S Review verdict: The Vespa S 125cc test ride review details road test photos, features & price. Vespa S expert review highs & lows of 2014 model.
Story first published: Wednesday, March 19, 2014, 13:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X