యమహా ఎఫ్‌జడ్ 25 Vs బెనెల్లీ టిఎన్‌టి 25

తాజాగ యమహా ఇండియా ఎఫ్‌డ్25 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. అయితే ఇది వరకే అందుబాటులో ఉన్న బెనెల్లీ టిఎన్‌టి25 మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనిస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమం అని తెలిపే కంపారిజన్....

Written By:

250సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లకు దేశీయంగా డిమాండ్ నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ మధ్యనే యమహా తమ ఎఫ్‌జడ్25 బైకును విడుదల చేసింది. 250 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైకు బెనెల్లీ టిఎన్‌టి 25 తో పోటీపడుతోంది. పాఠకుల కోసం ఎఫ్‌జడ్25 మరియు బెనెల్లీ టిఎన్‌టి25 బైకుల పోలిక నేటి కథనంలో...

ఇవాళ్టి కథనం ద్వారా యమహా ఎఫ్‌జడ్ 25 మరియు బెనెల్లీ టిఎన్‌టి25 బైకుల యొక్క డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ధరలను పోల్చి ఇందులో అత్యుత్తమ ఎంపిక ఏదో అని తెలిసుకుందా రండి.

యమహా ఎఫ్‌జడ్ 25 డిజైన్

యమహా ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్ డిజైన్ దాదాపు 150సీసీ సామర్థ్యం ఉన్న ఎఫ్‌జడ్‌ను పోలి ఉంటుంది. అయితే ప్రత్యేకించి అగ్రెసివ్‌గా ఉన్న హెడ్ ల్యాంప్, కండలు తిరిగిన ఇంధన ట్యాంక్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి ఇతరత్రా శరీర భాగాల పరంగా విశ్లేషిస్తే దీని అద్బుతమైన డిజైన్ బయటపడుతుంది.

బెనెల్లీ టిఎన్‌టి 25 డిజైన్

బెనెల్లీ టిఎన్‌టి 25 విషయానికి వస్తే, మృదువైన ఇంధన ట్యాంకు మీద పదునైన డిజైన్ గీతలు, ఇంజన్ క్రింది భాగంలో తెల్లటి ఆకారంలో ఉన్న డీకాల్, మరియు చిన్న ఆకారంలో ఉన్న షార్ప్ ఎగ్జాస్ట్ కలదు, ఈ రెండు కూడా బెనెల్లీ టిఎన్‌టి 300 మోటార్ సైకిల్ నుండి గ్రహించడం జరిగింది.

ఎఫ్‌జడ్ 25 ఇంజన్ వివరాలు

యమహా తమ ఎఫ్‌జడ్ 25 లో 249సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 20బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యమహా ఎఫ్‌జడ్ 25 లోని ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్‌కు5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌‌మిషన్ అనుసంధానం కలదు. ఇది లీటర్‌కు 43 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, మరియు దీని బరువు 148 కిలోలుగా ఉంది.

టిఎన్‌టి 25 ఇంజన్ వివరాలు

బెనెల్లీ తమ టిఎన్‌టి 25 మోటార్ సైకిల్‌లో 249సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది. ఇది గరిష్టంగా 28బిహెచ్‌పి పవర్ మరియు 21.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బెనెల్లీ ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. 159కిలోలు బరువున్న ఈ బెనెల్లీ టిఎన్‌టి 25 మోటార్ సైకిల్ లీటర్‌కు 25కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఎఫ్‌జడ్‌25 ఫీచర్లు

జపాన్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం యమహా తమ ఎఫ్‌జడ్‌25 లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ముందు మరియు వెనుక వైపున 17-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ చక్రాలు కలవు.

ఇంధన సామర్థ్యాన్ని తెలిపే ఇండికేట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్ల్పిట్ సీట్లు, ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు 14-లీటర్ల ఇంధన ట్యాంకు కలదు.

టిఎన్‌టి 25 ఫీచర్లు

ఇటలీకి చెందిన మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజ తమ టిఎన్‌టి 25 లో అందించిన ఫీచర్లు, ముందు వైపున ఇన్వర్టెడ్, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, అల్లాయ్ చక్రాలు, సెమీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్ల్పిట్ సీట్లు కలవు.

అంతే కాకుండా ఇందులో ఇంధన వివరాలను తెలిపే ఇండికేటింగ్ లైట్లు, ఓడో మీటర్, డ్యూయల్ ట్రిప్ మీటర్లు, టెయిల్ ల్యాంప్స్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ లతో పాటు 17 లీటర్ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. అయితే రెండు బైకుల్లో కూడా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు.

ధర వివరాలు

 

  • యమహా ఎఫ్‌జడ్ 25 ధర రూ. 1.34 లక్షలు
  • బెనెల్లీ టిఎన్‌టి 25 ధర రూ. 2.10 లక్షలు

రెండు ధరలు కూడా ఆన్ రోడ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

 

తీర్పు

యమహా ఎఫ్‌జడ్ 25 విషయానికి వస్తే జపాన్ సంస్థ అయిన యమహాకు దేశీయ విపణిలోని 250సీసీ సెగ్మెంట్లో అతి ముఖ్యమైన మోడల్ ఇది. అందు కోసం ఉండాల్సిన ప్రముఖ ఫీచర్లను మరియు ఇంజన్‌ను పరిచయం చేస్తూనే విలువలకు తగ్గ ధరను నిర్ణయించింది. డిజైన్ పరంగా అద్బుతమనే చెప్పాలి.

బెనెల్లీ అత్యుత్తమ ఫీచర్ల జోడింపుతో పాటు శక్తివంతమైన ఇంజన్‌ను తమ టిఎన్‌టి 25లో అందించింది. రెండు మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే బడ్జెట్ గురించి ఆలోచించే వారికి యమహా ఎఫ్‌జడ్ 25 మరియు పనితీరుతో పాటు బెనెల్లీ అనే బ్రాండ్ కావాలనుకునే వారికి టిఎన్‌టి 25 ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన ఎంపిక మరియు ఎందుకు అనే విషయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోగలరు.....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, January 31, 2017, 16:17 [IST]
English summary
Yamaha FZ 25 vs Benelli TNT 25: Battle Of The Quarter-Litre Nakeds
Please Wait while comments are loading...

Latest Photos