2014 హోండా సిటీ రివ్యూ: టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

By Ravi

సరికొత్త 2014 హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్‌తో మేము మీ ముందుకు వచ్చేశాం. జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా, భారత ఆటోమొబైల్ మార్కెట్లో చక్రం తిప్పేందుకు మరో కొత్త డీజిల్ మోడల్‌ను పరిచయం చేసింది. అదే 2014 హోండా సిటీ డీజిల్. ఒకప్పుడు కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడే, ఈ మోడల్ అత్యధికంగా అమ్ముడుపోతూ, ఈ సెగ్మెంట్లోని డీజిల్ వెర్షన్ సెడాన్లకు సైతం సవాల్ విసిరిన బెస్ట్ సెల్లింగ్ మిడ్-సెడాన్ 'హోండా సిటీ'.

హోండా సిటీ సెడాన్ పాపులర్ కావటానికి ప్రధాన కారణం, దీని ప్రీమియం డిజైన్ మరియు సరసమైన ధరలే. హోండా అమేజ్ డీజిల్ కారు విడదలతో, భారత మార్కెట్లో డీజిల్ కార్ల పవరేంటో హోండాకు తెలిసి వచ్చంది. అందుకే, చకచకా తమ పాపులర్ సిటీ కారులో కూడా హోండా డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు, భవిష్యత్తులో మరిన్ని డీజిల్ వెర్షన్ కార్లను (హోండా మొబిలో ఎమ్‌పివి, 2014 జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్) కూడా విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది.

సరే వాటి సంగతి అటుంచితే, హోండా కార్స్ ఇండియా ఇటీవలే తమ కొత్త 2014 సిటీ సెడాన్ కోసం టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది. డీజిల్, పెట్రోల్, ఆటోమేటిక్ (పెట్రోల్) వెర్షన్ సిటీ కార్లను కంపెనీ ఈ టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంచింది. మరి ఈ కొత్త 2014 హోండా సిటీ కారులో బెస్ట్ ఏంటి, వరస్ట్ ఏంటనేది తెలుసుకుందాం రండి..!!

హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కొత్త 2014 హోండా సిటీ డీజిల్ మరియు పెట్రోల్ మోడళ్లకు సంబంధించిన పూర్తి రివ్యూని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

బేసిక్ డిజైన్

బేసిక్ డిజైన్

హోండా తాజాగా ఆవిష్కరించిన సిటీ సెడాన్ నాల్గవ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది. అయితే, దీని బేసిక్ డిజైన్‌లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు, కానీ కాస్మోటిక్ మార్పులను మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇవి చిన్నిపాటి డిజైన్ మార్పులే అయినప్పటికీ, కొత్త సిటీ సెడాన్‌కు సరికొత్త లుక్‌నిస్తాయి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త సిటీ కారులోని 'ఎగ్జైటింగ్ హెచ్-డిజైన్' ఫ్రంట్ ప్రొఫైల్ కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌ను తలపిస్తుంది. రెండు హెడ్‌లైట్లను కలుపుతున్నట్లు ఉండే వెడల్పాటి పెద్ద సింగిల్ లైన్ క్రోమ్ బ్రార్, దానికి మధ్యలో హోండా లోగో సరికొత్తగా అనిపిస్తాయి. మొత్తమ్మీద చూస్తే, ఫ్రంట్ డిజైన్ షార్ప్‌గా, స్పోర్టీగా అనిపిస్తుంది.

సైడ్ డిజైన్

సైడ్ డిజైన్

కొత్త హోండా సిటీ సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఫ్రంట్ డోర్ నుంచి చివరి టెయిల్ ల్యాంప్ వరకు ఉండే షార్ప్ బాడీ లైన్స్, అలాగే డోర్స్‌కు క్రింది భాగంలో రెండు టైర్లకు మధ్యగా ఉండే మరో బాడీ లైన్ ఇందులో కొత్తగా చేసిన డిజైన్ మార్పులు. ఈ డిజైన్ ఫీచర్ వలన కొత్త హోండా సిటీ మునుపటి వెర్షన్ మరింత ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

కొలతలు

కొలతలు

కొత్త 2014 హోండా సిటీలో మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, మొత్తం పొడవు, వెడల్పు, గ్రౌండ్ క్లియరెన్స్ కొలతల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కానీ ఎత్తు, వీల్‌బేస్‌లలో మాత్రం మార్పులు ఉన్నాయి. ఎత్తును 10 మి.మీ., వీల్‌బేస్‌ను 50 మి.మీ. మేర పెంచారు. దీని ఫలితంగా షోల్డర్ రూమ్ 40 మి.మీ. మెరుగుపడింది.

ఇంటీరియర్ స్పేస్

ఇంటీరియర్ స్పేస్

మాములుగానే సిటీ సెడాన్ అంటేనే, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌కు పెట్టింది పేరు. అలాగే, కొత్త హోండా సిటీ కూడా మెరుగైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ప్రత్యేకించి వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మంచి సౌకర్యంగా ఉంటుంది. ఇందులోని లెగ్‌రూమ్‌ను డి-సెగ్మెంట్ కార్లతో పోల్చవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే, దీని క్నీ రూమ్, లెగ్‌రూమ్‌లు మునుపటి వెర్షన్ కన్నా వరుసగా 70 మి.మీ., 60 మి.మీ. మేర పెంచారు. బూట్‌స్పేస్‌ను కూడా 510 లీటర్లకు పెంచారు.

ఇంటీరియర్

ఇంటీరియర్

కొత్త 2014 హోండా సిటీ సెడాన్ ఇంటీరియర్లను మునుపటి వెర్షన్ కన్నా మోడ్రన్‌గా, ప్రీమియంగా కనిపించేలా మెరుగుపరచారు. బీజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ కాంబినేషన్, ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, నాణ్యమైన మెటీరియల్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫిట్ అండ్ ఫినిష్ ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్లో ప్లష్ లెథర్ ఇంటీరియర్‌ను ఆఫర్ చేస్తున్నారు.

స్టీరింగ్ వీల్

స్టీరింగ్ వీల్

ఇంటీరియర్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో మరొకటి త్రీ స్పోక్డ్ స్టీరింగ్ వీల్ (సిఆర్-విలో మాదిరిగా ఉంటుంది). సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన ఈ స్టయిలిష్ స్టీరింగ్ వీల్ అనేక క్విక్ యాక్సిస్ బటన్లతో లభిస్తుంది. దీనిపై వాల్యూమ్ కంట్రోల్స్, కాల్ రిసీవ్ బటన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సాంకేతికతలు అమర్చబడి ఉంటాయి.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

కొత్త 2014 హోండా సిటీలో డ్యాష్‌బోర్డుకు అమర్చబడి ఉండే 5 ఇంచ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరో ప్రత్యేకత. ఇది ఆడియో/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్‌గా పనిచేస్తూనే రివర్స్ పార్కింగ్ స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. సిటీ వెనుక బంపర్‌లో అమర్చబడి ఉండే కెమరా నార్మల్, టాప్ డైన్, వైడ్ యాంగిల్ అనే మూడు విజువల్ సెట్టింగ్‌తో లభిస్తుంది. దీని సాయంతో కారును సురక్షితంగా రివర్స్ చేయవచ్చు.

ఫెథర్ టచ్ ఆటోమేటిక్ క్లైమేంట్ కంట్రోల్

ఫెథర్ టచ్ ఆటోమేటిక్ క్లైమేంట్ కంట్రోల్

సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా కొత్త సిటీలో ఫెథర్ టచ్ ఆటోమేటిక్ క్లైమేంట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ కార్లలో మాదిరిగా ఏసి/హీటర్‌లను కంట్రోల్ చేసేందుకు స్విచ్‌లను నొక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ వేలితో అలా టచ్ చేస్తే, ఇది యాక్టివేట్ అవుతుంది. టచ్‌స్క్రీన్ సిస్టమ్‌కు దిగువన ఈ సిస్టమ్‌ను అమర్చారు.

ఫీచర్లు

ఫీచర్లు

కొత్త 2014 హోండా సిటీ పలు వేరియంట్లలో లభ్యం కానుంది (వేరియంట్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు). వేరియంట్‌ను బట్టి, అందులో ఆఫర్ చేసే ఫీచర్ల వివరాలు మారుతూ ఉంటాయి. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రం అనేక ఫీచర్లు లభ్యమవుతాయి. ఇందులో 5 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 8-స్పీకర్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, 4 పవర్ సాకెట్స్, సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ ఏసి వెంట్స్ మొదైలన ఫీచర్లు లభిస్తాయి. కారును నడిపే వేగాన్ని బట్టి ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కలర్ మారుతూ ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

అన్ని సిటీ వేరియంట్లలో డ్రైవర్, ప్యాసింజర్ల కోసం ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఫోర్స్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

ఇంజన్

ఇంజన్

కొత్త 2014 హోండా సిటీలో ఇంజన్లను రీఫైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్ 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

(పైన పేర్కొన్న మైలేజ్‌ గణాంకాలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసినవి, నడిపే తీరు, రోడ్డును బట్టి వాస్తవిక మైలేజ్ మారే అవకాశం ఉంటుంది)

పెట్రోల్ ఇంజన్ పనితీరు

పెట్రోల్ ఇంజన్ పనితీరు

సాధారణంగా ఏ పెట్రోల్ కారు పనితీరైనా స్మూత్‌గా ఉంటుంది. ప్రత్యేకించి కొత్త సిటీలో ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలు తక్కువగా, క్యాబిన్ లోపల ఓ లగ్జరీ కారును అనుభూతిని పొందవచ్చు. ఇక ఈ ఇంజన్ పెర్ఫామెన్స్ కూడా ఇటు సిటీ రోడ్లపై నడిపేందుకు అటు హైవే రోడ్లపై పరుగులు పెట్టించేందుకు చక్కగా ఉంటుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ స్మూత్‌గా ఉంటుంది. గేర్లను సులువుగా మార్చేలా గేర్ రేషియోలను డిజైన్ చేశారు.

ఆటోమేటిక్ వేరియంట్

ఆటోమేటిక్ వేరియంట్

ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన హోండా సిటీ విషయానికి వస్తే.. ఇందులో సివిటి గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఇప్పటికే ఈ తరహా గేర్‌బాక్స్‌ని నిస్సాన్ కార్లలో ఉపయోగిస్తున్నాయి. ఇది నిస్సాన్ మాదిరిగా కాకుండా మరింత స్మూత్‌గా ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్లో గేర్లను స్టీరింగ్‌పై ఉండే ప్యాడల్ షిఫ్టర్ల సాయంతో మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సివిటి గేర్‌బాక్స్ వలన కలిగే మరో ప్రయోజనం ఏంటంటే, ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్ల కన్నా ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

డీజిల్ ఇంజన్ పనితీరు

డీజిల్ ఇంజన్ పనితీరు

హోండా అమేజ్‌లో ఉపయోగించిన డీజిల్ ఇంజన్‌నే కొత్త హోండా సిటీలోను ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్‌ను సిటీ కారుకు అనుగుణంగా రీఫైన్ చేశారు. డీజిల్ ఇంజన్లంటేనే నాయిస్, కానీ సిటీ విషయంలో డీజిల్ ఇంజన్ నాయిస్ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. అమేజ్, సిటీ డీజిల్ ఇంజన్లలో మరో పెద్ద తేడా ఏంటంటే, దీని గరిష్ట వేగం. అమేజ్ టాప్ స్పీడ్ గంటకు 145 కి.మీ. అయితే, కొత్త సిటీ టాప్ స్పీడ్ గంటకు 190 కి.మీ.

బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్

బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్

సాధారణంగా ఈ సెగ్మెంట్లోని డీజిల్ కార్ల 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. కానీ కొత్త సిటీలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఇది అత్యధికంగా లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది హోండా అమేజ్ కన్నా హెవీగా ఉన్నప్పటికీ, ఇంత ఎక్కువ మైలేజీనివ్వటానికి కారణం ఈ 6-స్పీడ్ గేర్‌బాక్సే (అమేజ్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు).

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

కొత్త సిటీ రైడ్ క్వాలిటీని మునుపటి వెర్షన్ కన్నా మెరుగుపరచారు. ప్రత్యేకించి సస్పెన్షన్లను కొద్దిగా ధృఢంగా, భారతీయ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఫలితంగా ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు సైతం కారుపై మంచి కంట్రోల్ ఉంటుంది.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, ఇందులోని ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ తక్కువ వేగం వద్ద లైట్‌గా అనిపిస్తుంది, కానీ వేగం పెరిగే కొద్ది స్టీరింగ్ హెవీగా మారుతుంటుంది. ఏదేమైనప్పటికీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయంలో ఇది మునుపటి సిటీ సెడాన్ కన్నా మెరుగ్గా అనిపిస్తుంది.

ముగింపు..

ముగింపు..

డిజైన్: చిన్నపాటి కాస్మోటిక్ మార్పుల మినహా బేసక్ డిజైన్‌ను చూడగానే కొత్త సిటీ ఇదివరకటి సిటీ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ డిజైన్ విషయంలో, ఈ సెగ్మెంట్లోని ఫ్లూయిడిక్ వెర్షన్ కొత్తగా సిటీ కన్నా బాగుంటుదనిపిస్తుంది.

డైమన్షన్స్: కొత్త సిటీ కొలతల్లో చేసిన కొద్దిపాటి మార్పుల చేర్పుల వలన ఇది మరింత విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా బెస్ట్ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో ప్రతికూలంగా చెప్పాల్సిందేమీ లేదు.

ఇంటీరియర్స్, ఫీచర్స్: ఫీచర్ల విషయంలో కూడా ఇది బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇందులోని కొన్ని రకాల ఫీచర్లను (ప్రత్యేకించి ఫెథర్ టచ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్) సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా ఆఫర్ చేస్తున్నారు.

ఇంజన్, పెర్ఫామెన్స్:

ఇంజన్, పెర్ఫామెన్స్:

హోండా అంటేనే సాటిలేని ఇంజన్లకు పెట్టింది పేరు. రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ అండ్ పెర్ఫామెన్స్‌లు మరీ అద్భుతం కాకపోయినప్పటికీ, యావరేజ్‌కు పైనే ఉంటాయి. సివిటి ట్రాన్సిమిషన్, ప్యాడల్ షిఫ్టర్స్ కలిగిన వేరియంట్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది.

మైలేజ్: మైలేజ్ విషయంలో కొత్త హోండా సిటీని మరే కారు బీట్ చేయలేదు. లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీతో ఇది భారతదేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కారుగా నిలిచింది. పెట్రోల్ వెర్షన్లు కూడా (ప్రత్యేకించి ఆటోమేటిక్ వేరియంట్) మెరుగైన మైలేజీనిస్తాయి.

ఫుల్ స్పెసిఫికేషన్స్

ఫుల్ స్పెసిఫికేషన్స్

కొత్త 2014 హోండా సిటీ పూర్తి స్పెసిఫికేషన్లను (పెట్రోల్ అండ్ డీజిల్ వెర్షన్స్) ఈ షీట్‌లో చూడొచ్చు.

చివరి మాట

చివరి మాట

కొత్త 2014 హోండా సిటీ ఆల్-రౌండర్ కారు అని చెప్పొచ్చు. మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, మంచి మైలేజ్, సివిటి గేర్ బాక్స్ (పెట్రోల్), బెటర్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటే, హోండా అమేజ్ మాదిరిగానే ఇది కూడా మార్కెట్లో వండర్లు చేయటం ఖాయం. వచ్చే జనవరి నుంచి ఇది వాణిజ్య పరంగా లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Honda City is a sedan which many Indians have aspired to own. A sedan that was once considered the best in its segment. But then, the absence of a diesel engine, coming of new rivals and the non-arrival of an updated model meant shift of loyalists to other brands. The City, once Honda's best selling nameplate in India, gave way for the Amaze.
Story first published: Wednesday, December 18, 2013, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X