విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగొ

By Anil

ఫోర్డ్ ఫిగొ ప్రతి ఒక్కరికి సరిపోయే ఒక పొందికైన హ్యాచ్‌బ్యాక్, ఇది దేశీయంగా అభివృద్ధి చెందిన మోడల్ దీని డిజైన్ కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినది. ప్రస్తుతం 2010 నుండి దీనిని తయారు చేస్తున్నారు. ఒక వేళ హ్యాచ్‌బ్యాక్ కనున మీకు నచ్చనట్లైతే, ఫోర్డ్ మీకు మరొక అవకాశాన్ని అందిస్తోంది అదే దీని సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన ఆస్పైర్‌.
Also Read: అక్టోబర్ 26 న విడుదల కానున్న మారుతి సుజుకి బాలెనొ

మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మారుతి సుజుకి స్విఫ్ట్ ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్య దోరణితో కొనసాగుతోంది అయితే దీనికి ఈ మధ్యనే ఒక పెద్ద చిక్కువచ్చి పడింది అది ఏంటంటే ఫోర్డ్ ఫిగొ కస్టమర్లను ఆశ్చర్యపరిచే అత్భుతమైన ఫీచర్లను అందివ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. 2015 మోడల్ కు చెందిన ఫిగొను తమ మొదటి జనరేషన్‌తో పోల్చుకుంటే ఇందులో అత్యధికమైన ఫీచర్‌లను కలిగి ఉంది.

డిజైన్:

డిజైన్:

క్రోమ్ మెటల్‌తో తయారైన ఫ్రంట్ గ్రిల్ మీ కన్నులకు ఇది ఇంపుగా కనిపిస్తుంది. ఈ గ్రిల్ ట్రెపిజాయిడల్ ఆకారంలో ఉంటుంది.విండ్ షీల్డ్స్ మీకు ఇస్తాయి గాలిని సమర్తవంతంగా ఆప్టిమైజ్ చేయగలవు, ఇందులో గల స్వెప్ట్ బ్లాక్ హెడ్ లైట్స్ మీకు చక్కని లైటింగ్ ఎఫిషియన్సిని ఇవ్వగలవు.మొత్తానికి కారు యొక్క ఆకారం, శక్తివంతమైన పంక్తులతో కూడిన అందమైన గీతలు మరియు బోల్డ్ తత్వం దీనికి డైనమిక్ లుక్‌ను తీసుకువచ్చాయి. నిజానికి, మారుతి స్విఫ్ట్, హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 తో పోలిస్తే ఫిగో యొక్క రూపకల్పన ఎంతో అత్భుతం దీని వలన మీరు చెల్లించిన దానికంటే ఎక్కువ శైలిని పొందుతారు.

ఇంటీరియర్:

ఇంటీరియర్:

సరి కొత్త ఫోర్డ్ ఫిగో యొక్క నూతన ఇంటీరియర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజితో డిజైన్ చేయబడింది ఇది మీరు ఈ ఫోర్డ్‌ని డ్రైవ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి ఫిగో యొక్క లెగ్ రూమ్ ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారు. దీని పరంగా ఫిగో మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఇందులో మీరు ఊహించిన విధంగానే ఉత్తమమాన లెగ్ రూమ్ ఇందులో ఉంది. ఇందులో వాటరి బాటిల్స్‌ను పెట్టుకోవడానికి డోర్స్ వద్ద పాకెట్‌లను ఇచ్చారు మరియు న్యూస్ పేపర్స్,మ్యాగజైన్స్ ని పెట్టుకోవడానికి సీ‌ట్‌లకు వెనుకవైపున పాకెట్‌లను ఇచ్చారు.

వీల్ బేస్:

వీల్ బేస్:

  • ఫోర్డ్ ఫిగో 2491 ఎమ్.ఎమ్
  • మారుతి స్విఫ్ట్ 2430 ఎమ్.ఎమ్
  • హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 2425 ఎమ్.ఎమ్
  • ఫిగో యొక్క ఉత్తమమైన శ్రేణిలో వీల్ బేస్ అత్యధికంగా 2,491 ఎమ్.ఎమ్ ఉంది, ఇందులో లెగ్ రూమ్, షోల్డర్ రూమ్ అన్ని అత్యధికంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

    ఇంజిన్ మరియు గేర్ బాక్స్ :

    ఇంజిన్ మరియు గేర్ బాక్స్ :

    ఫిగో మూడు రకాల ఇంజిన్‌లతో ఆఫర్ చేస్తోంది

    • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌
    • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌
    • 1.5-లీటర్(ఆటోమేటిక్) పెట్రోల్ ఇంజిన్‌
    • 1.5-లీటర్(ఆటోమేటిక్) పెట్రోల్ ఇంజిన్ నందు 6-స్పీడ్ గేర్ బాక్స్ మరియు డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలదు.
    • మైలేజ్:

      మైలేజ్:

      • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్:
      • - కారును 100-140 కిలోమీటర్ల వేగంతో నడిపినపుడు 22 కెపియల్ మైలేజ్‌ని ఇస్తుంది.

        - కారును 150 కిలోమీటర్లను మించి వేగంతో నడిపినపుడు 15 కెపియల్ మైలేజ్‌ని ఇస్తుంది.

        అయితే ఏ.ఆర్.ఏ.ఐ సర్టిఫికెట్ ప్రకారం దీని మైలేజ్ 25.83 కెపియల్ గా ఉంది.

        • ఆటోమేటిక్ పెట్రోల్ మోడల్:
        • - ఏ.ఆర్.ఏ.ఐ సర్టిఫికెట్ ప్రకారం దీని మైలేజ్ 17 కెపియల్ గా ఉంది.

          - ఒక వేళ దానిని 100-140 కిలోమీటర్ల వేగంతో నడిపినపుడు 12.5 కెపియల్ మైలేజ్‌ని ఇస్తుంది.

          భధ్రత:

          భధ్రత:

          ఫిగో లోని భధ్రత పరంగా చూస్తే మీగతా అన్ని కంపెనీలు చేతులు దించేశాయని చెప్పవచ్చు. ఫిగోలో లభించు భధ్రత ఎంతో కీలకమైనది దీని మొత్తం పరిధిలో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఎంతో కీలకమైనది. ఈ కొత్త ఫోర్డ్ ఫిగోలో రెండవ వైవిధ్యమైన ఫీచర్ మొత్తం లైనప్ అంతటా ప్రామానికమైన డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను అందివ్వడం జరిగినది. అంతే కాకుండా టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చారు.

          ఫిగో ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తో జతచేయబడి ఉంది దీని వలన ఏవయినా అత్యవసర కాల్స్ మరియు ప్రస్తుతం మీరున్న స్థానం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది, ఇంది ఫోర్డ్ యొక్క ప్రసిద్ద అత్యవసర అసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

          విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగో

          రివ్యూ:

          విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగో

          కార్ స్పెసిఫికేషన్:

          ధర:

          ధర:

          ఎంట్రీ లెవల్‌లో గల అన్ని ఫోర్డ్ ఫిగో మోడల్స్ యొక్క ధర రూ.4.29 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లి).

          స్పెసిఫికేషన్స్:

          స్పెసిఫికేషన్స్:

          • ఏంపిల్ స్టోరేజ్ స్పేస్
          • అడ్వాన్స్‌డ్ కనెక్టివిటి సొల్యుషన్స్
          • డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ యొక్క వారంటి 10-సంవత్సరాలు లేదా 100,000కిలోమీటర్లు
          • అత్యంత సమర్థవంతమైన ఎయిర్ కండీషనర్
          • శక్తివంతమైన మరియు అత్బుత ఇందన సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్
          • స్పెసిఫికేషన్స్:

            స్పెసిఫికేషన్స్:

            • స్టైలిష్ మరియు స్పోర్టి డిజైన్
            • ఎంపిక చేసుకోదగిన ఏడు రంగులు
            • ప్రామాణికమైన ఎయిర్ బ్యాగ్‌లు
            • టాప్ ఎండ్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు
            • రెండవ వేరియంట్‌లో ముందు వైపు అత్యంత ప్రామాణికమైన ఎయిర్ బ్యాగ్‌ను కలిగి ఉండటం
            • సువిశాలమైన ఇంటీరియర్
            • కాన్స్:

              కాన్స్:

              • స్లగ్గిష్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్
              • ముందు భాగాన గల ప్యాసింజర్ సీట్ చాలా ఎత్తులో ఉంటుంది
                • అతి తక్కువ వేగంలో ఉన్నపుడు స్టీరింగ్ ఎఫర్ట్‌ని తగ్గించుకోవడానికి ఇందులో ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ ఉంది
                • తీర్పు:

                  తీర్పు:

                  మేము సరి కొత్త ఫిగోని మారుతి సుజుకి, హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 కంటే మెరుగైనదిగా ఎంపిక చేశాము మరి మీరు ? ఒక సారి మేము మీకు అందించిన సమాచారాన్ని చదివి నిర్ణయం తీసుకోండి అయితే చిన్న సెడాన్‌లో 2015 సంవత్సరానికిగాను ఫొర్డ్ ఫిగోని ఉత్తమమైన కారుగా ఎంపిక చేయవచ్చు. ఫోర్డ్ భారతదేశంలో విజయం పథంలో దూసుకుపోనున్నది.

Most Read Articles

English summary
The Ford Figo is a subcompact hatchback, which was designed and developed in India. It is currently under production since 2010. If hatchbacks are not your type, Ford also offers the subcompact sedan—the Aspire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X