ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - క్రాఫ్టెడ్ విత్ క్లాస్

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ3'ని ఆగస్ట్ 7, 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ప్రీమియం కాంపాక్ట్ సెడాన్ కోసం మీడియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది. మరి ఆడి ఏ3 సెడాన్‌లో ఆ అల్టిమేట్ ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ముందుగా ఆడి ఏ3లోని కొన్ని ముఖ్యాంశాలను ఈ పట్టికలో పరిశీలించండి.

ఆడి ఏ3 ఒక 4-డోర్, ప్రీమియం కాంపాక్ట్ సెడాన్. ఇటీవలే ఇది '2014 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకుంది. ఈ అల్టిమేట్ కారును మేము ఇటీవలే తూర్పు భారతదేశానికి వెనిస్ నగరంగా పేరుగాంచిన ఉదయ్‌పూర్ ప్రాంతంలో సుమారు 200 కిలోమీటర్లకు పైగా టెస్ట్ చేశాము. ఉదయ్‌పూర్ రాజవంశం ఇప్పటికీ సజీవంగా ఉన్న ప్రపంచంలో కెల్లా అతిపురాతన రాజవంశంలో ఒకటి, ఇది సుమారు 1567లో ఏర్పడినట్లుగా చరిత్ర చెబుతోంది. సరే చరిత్రను అలా ఉంచి, ఆడి ఏ3 విషయానికి వస్తే..

భారత లగ్జరీ కార్ మార్కెట్లోని దిగ్గజాలైన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ఆడి రూపొందించిన ఈ ఏ3 సెడాన్ స్టయిల్, లుక్, కంఫర్ట్, మైలేజ్, ఫీచర్స్, టెక్నాలజీ ఇలా అనేక విషయాల్లో కస్టమర్లు వెచ్చించే ప్రతి రూపాయికి తగిన విలువను ఆఫర్ చేస్తుంది. ఆడి ఏ3 కారును టెస్ట్ డ్రైవ్ చేసిన మేము, ఈ కారు గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. అవేంటో మీరు తెలుసుకోవాలంటే, ఈ కథనాన్ని చదవండి.

విడుదల తేది: ఆగస్ట్ 7, 2014
అంచనా ధర: రూ.30 లక్షలు (ఆన్-రోడ్)

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి..!

ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

2015 ఆడి ఏ3 35టిడిఐ - రివ్యూ చేసినది జోబో కురువిళ్ల. పూర్తి రివ్యూని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మోడల్: ఆడి ఏ3 35టిడిఐ ఎస్ ట్రానిక్

ఫ్యూయెల్ టైప్: డీజిల్

బాడీ స్టైల్: సెడాన్

సీటింగ్: 5-సీటర్

ఇంజన్: టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

మైలేజ్: 20.38 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్)

గేర్‌బాక్స్: 6-స్పీడ్ ఎస్ ట్రానికి డ్యూయెల్ క్లచ్

డ్రైవ్ టైప్: ఫ్రంట్ వీల్ డ్రైవ్

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - ఫ్రంట్

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - ఫ్రంట్

బ్యూటిఫుల్ ఆడి ఏ3 డిజైన్ వెనుకున్న డిజైనర్ ఫ్రెంచ్-కెనడియన్ డానీ గరాండ్. తొలిచూపులోనే చూపరుల మదిని దోచుకునేలా ఈ కారును డిజైన్ చేయటంలో డానీ కీలక పాత్ర పోషించాడు. సింగిల్ ఫ్రేమ్ రేడియేటర్ గ్రిల్, వెడ్జ్ షేప్డ్ హెడ్‌లైట్‌తో ఇది ముందు వైపు నుంచి స్టన్నింగ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ప్రీమియం అప్పీల్‌నిచ్చేందుకు గ్రిల్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ ఉంటుంది.

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - సైడ్

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - సైడ్

సైడ్ నుంచి చూసినప్పుడు దీనిపై షార్ప్ అండ్ క్రిస్ప్ క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. ఆడి వీటిని ది టోర్నడో లైన్ అని పిలుస్తుంది. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ టాప్ ఎడ్జ్ నుంచచి టెయిల్ ల్యాంప్ టాప్ ఎడ్జ్ వరకు ఈ లైన్ ఉంటుంది. సైడ్ మిర్రర్స్ చుట్టూ ఉండే క్రోమ్ లైన్ కూడా కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది. దీని బి పిల్లర్ బ్లాక్ కలర్‌లో ఉండి, అద్దాలలో కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఆడి ఏ3 ఓ నిజమైన త్రీ-బాక్స్ డిజైన్ (బానెట్, క్యాబిన్, బూట్) కారు. సాధారణంగా ఓ త్రీ-బాక్స్ డిజైన్ కారు చాలా క్లాసిక్‌గా, రిజర్వ్డ్‌గా ఉంటుంది. అయితే, ఆడి తమ ఏ3లో ఈ క్లాసిక్ లుక్‌తో పాటుగా మజిక్యులర్ అండ్ స్పోర్టీ ఫీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. కొద్దిగా ముందుకు వచ్చినట్టు ఉండే వీల్ ఆర్చెస్ మరియు వివిధ క్యారెర్టర్ లైన్స్‌తో కారుపై లైట్ అండ్ షాడో ఎఫెక్ట్ కనిపిస్తుంది.

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - రియర్

ఎక్స్టీరియర్ అండ్ స్టయిలింగ్ - రియర్

స్పోర్టీనెస్‌ను కేవలం ఫ్రంట్ అండ్ సైడ్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, వెనుక వైపు కూడా స్పోర్టీ అప్పీల్‌నిచ్చేందుకు డిజైనర్లు కృషి చేశారు. సగం బూట్ డోరుపై, సగం వెనుక బాడీపై ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బంపర్ క్రింది భాగంలో కార్నర్స్ వద్ద ఉండే రిఫ్లెక్టర్స్, బంపర్ క్రింది భాగంలో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ప్యానెల్, డ్యూయెల్ సైలెన్సర్ పైప్, రూఫ్ స్పాయిలర్ మాదిరిగా అనిపించే బూట్ డోర్ లైన్ ఇవన్నీ కలిసి కారుకు సరికొత్త లుక్‌ని తెస్తాయి.

ఇంటీరియర్ - ఫ్రంట్

ఇంటీరియర్ - ఫ్రంట్

ఇంటీరియర్ - ఫ్రంట్సుమారు 90 కేజీల బరువు, 5 అడుగులు 10 అంగుళాల ఎత్తున్న డ్రైవర్ సైతం ఈ కారు డ్రైవర్ సీట్‌లో సౌకర్యంగా కూర్చోగలడంటే, ఇందులోని కంఫర్ట్ లెవల్స్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఇందులోని సీటింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది, డ్రైవర్‌కు అనుగుణంగా దీనిని సర్దుబాటు చేసుకునే వెసలుబాటు ఉంటుంది. మల్టీ మీడియా ఇంటర్‌ఫేస్ (ఎమ్ఎమ్ఐ)తో కూడిన స్ట్రైట్‌ఫార్వాడ్ క్యాబిన్ ఇందులో ఉంటుంది, ఇది డ్యాష్‌బోర్డు పైభాగంలో ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్ సింపుల్ అండ్ క్లీన్‌గా ఉంటుంది.

ఇందులోని ఎమ్ఎమ్ఐ మెనూ సిస్టమ్ కూడా సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. కూలింగ్/హీటింగ్ కంట్రోల్స్ కూడా చాలా సులువుగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయి. ఇంకా ఇందులో కప్స్, బాటిల్స్, వాలెట్, ఐఫోన్ వంటి వాటిని స్టోర్ చేసుకునేందుకు తగినంత స్పేస్ ఉంటుంది.

మొత్తమ్మీద ఆడి ఏ3 క్యాబిన్ ప్రీమియం టచ్‌ని ఆఫర్ చేస్తూ, మీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత కంఫర్టబల్ చేస్తుంది.

ఇంటీరియర్ - రియర్

ఇంటీరియర్ - రియర్

ఆడి ఏ3 కారు ఓ 5-సీటర్ అయితే, వెనుక వరుస సీటులో ఇద్దరు ప్రయాణీకులకు సీటింగ్ పొజిషన్ సౌకర్యంగా ఉంటుంది. మధ్యలో కూర్చునే మూడవ వ్యక్తి కాళ్లు పెట్టుకునేటప్పుడు కాస్తంత ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. రియర్ ఏసి వెంట్స్ అండ్ కంట్రోల్స్ కారణంగా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. అయితే, మూడవ ప్యాసింజర్ కోసం అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్ కూడా ఉంటుంది. ఈ కారు కూపే లాంటి రూఫ్‌లైన్‌ను కలిగి ఉండటం వలన వెనుక సీట్లో ఎత్తుగా ఉండే వాళ్లు కూర్చున్నప్పుడు హెడ్‌రూమ్ సమస్యను ఎదుర్కునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే, వెనుక సీట్లో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ సమస్య ఉంటుందని చెప్పాలి.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

ఆడి ఏ3 కారులో 425 లీటర్ల స్టాండర్డ్ బూట్ స్పేస్ ఉంటుంది, మరింత ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకునే వారు వెనుక వరుస సీటును పూర్తిగా మడుచుకుంటే 880 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ సైడ్స్ వలన ఇందులో చతురస్రాకారపు లోడింగ్ ఏరియా లభిస్తుంది. ఫలితంగా మరింత ఎక్కువ లగేజ్‌ను స్టోర్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

ఆడి ఏ3 కారులో 1968సీసీ, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌లో వేరియబల్ టర్బైన్ జియోమెట్రీ (విజిటి) టర్బోచార్జర్‌ను అమర్చడం వలన ఇది 3500-4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 143 హార్స్ పవర్‌ల శక్తిని, 1750-3000 ఆర్‌పిఎమ్ వద్ద 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫ్యాక్ట్‌షీట్:

ఆడి ఏ3 సెడాన్ (40టిఎఫ్ఎస్ఐ ఎస్ ట్రానిక్ పెట్రోల్)లో ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ 1789సీసీ స్పార్క్-ఇగ్నిషన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5100-6200 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 180 హార్స్ పవర్‌ల శక్తిని, 1250-5000 ఆర్‌పిఎమ్ వద్ద 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ఆడి ఏ3 కారులోని ఇంజన్లు 6-స్పీడ్ ఎస్ ట్రానికి డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ (డిసిటి) రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్ నుంచి హై-స్పీడ్ హైవే వరకు ఎక్కడా రాజీ పడకుండా స్మూత్ యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో గేర్ షిఫ్టర్ సాయంతో గేర్లను మ్యాన్యువల్‌గా మార్చుకోవటం ఇందులో మరో ప్రత్యేకత.

డిసిటి ఓ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాదిరిగా కూడా పనిచేస్తుంది, ఇక్కడ క్లచ్ పెడల్ ఉండదు, మిగతాదంతా సేమ్ టూ సేమ్.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆడి ఏ3 ఓవరాల్‌గా సంతృప్తికరంగానే ఉంటుంది. మంచి రోడ్ గ్రిప్, షార్ప్ బ్రేకింగ్ దీని స్పెషాలిటీ.

మేము డ్రైవ్ చేసినప్పుడు ఇది 9 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. చేరుకుంది (ఆడి పేర్కొన్న సమయం 8.6 సెకండ్లు). దీని గరిష్ట వేగం గంటకు 224 కిలోమీటర్లు (యాంత్రికంగా వేగాన్ని పరిమితం చేశారు).

ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

హై-స్పీడ్ కార్నర్స్ వద్ద స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇందులో ఎలక్ట్రికల్లీ అసిస్టెట్ పవర్ స్టీరింగ్ పనితీరు మెరుగ్గానే ఉంటుంది.

ఫ్యాక్ట్ షీట్:

- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 50 లీటర్లు

- మైలేజ్ : 20.38 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్)

- మైలేజ్ : 16 కెఎమ్‌పిఎల్ (రియల్ వరల్డ్ మైలేజ్)

5 అల్టిమేట్ ఫీచర్స్ - 1. ఎమ్ఎమ్ఐ

5 అల్టిమేట్ ఫీచర్స్ - 1. ఎమ్ఎమ్ఐ

ఆడి ఏ3లోని ఎమ్ఎమ్ఐ (మల్టీ మీడియా ఇంటర్‌ఫేస్) ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఓ బెస్ట్ ఫీచర్‌గా ఉంటుంది. కారును ఆన్ చేయగానే డ్యాష్ బోర్డ్ పైభాగంలో ఇది పైకి లేస్తుంది.

ఏ3లో ఎమ్ఎమ్ఐ టెక్నాలజీ ఓ స్టాండర్డ్ ఫీచర్. ఇందులోని వాయిస్ కంట్రోల్, మీడియా నావిగేషన్, టెలిఫోన్ ఫంక్షన్స్‌ను యాక్సిస్ చేసుకోవటం చాలా సులువు, లగ్జరీ బ్రాండ్ మల్టీ మీడియా సిస్టమ్‌లోని బెస్ట్ వాటిళ్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు.

గేర్ స్టిక్‌కు వెనుకగా ఉండ్ ఓ గుండ్రటి నాబ్ సాయంతో ఎమ్ఎమ్ఐని కంట్రోల్ చేసుకోవచ్చు. మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ కార్లలో కూడా ఇలాంటి కంట్రోల్స్ కనిపిస్తాయి. చాలా మంది వినియోగదారులు టచ్ స్క్రీన్ కంట్రోల్స్ కన్నా ఇలాంటి కంట్రోల్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

ఫ్యాక్ట్‌షీట్:

ఏ3లోని కంటింగ్ ఎడ్జ్ ఎమ్ఎమ్ఐ ఎన్‌విడియా టెగ్రా 2 ప్రాసెసర్‌తో నడుస్తుంది, దీనిని మాడ్యులర్ హార్డ్‌వేర్ డిజైన్‌పై మోడ్రన్ చిప్‌సెట్‌తో తయారు చేశారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న మల్టీమీడియా టెక్నాలజీతో అప్ టూ డేట్ ఉండేందుకు ఇది సహకరిస్తుంది.

2. హెచ్‌విఏసి వెంట్

2. హెచ్‌విఏసి వెంట్

లగ్జరీ కార్లలో చిన్న చిన్న విషయాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. టర్బైన్ మాదిరిగా గుండ్రంగా కనిపించే ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. త్రీ డైమన్షనల్ సిల్వర్ డెకరేటివ్‌తో కూడిన హెచ్‌విఏసి (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) కారు ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం లుక్‌ని జోడిస్తుంది. ఎయిర్ ఫ్లోను కంట్రోల్ చేసేందుకు బయటి సిల్వర్ రింగ్‌ను తిప్పాల్సి ఉంటుంది.

3. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

3. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

డ్యాష్‌బోర్డ్ మినిమం ఫీచర్లతో సింపుల్‌గా ఉంటుంది. అదే డిజైన్ ఫిలాసఫీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా కనిపిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై రెండు గుండ్రటి అనలాగ్ మీటర్లలోనే ఇంజన్ ఆర్‌పిఎమ్, ఇంజన్ టెంపరేచర్, స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేజ్ ఉంటాయి. ఈ రెండు డయల్స్‌కు మధ్యలో ఓ డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ కంప్యూటర్ ఉంటాయి.

4. సన్‌రూఫ్

4. సన్‌రూఫ్

ఆడి ఏ3 సెడాన్‌లో సన్‌రూఫ్ మరో అట్రాక్టివ్ ఫీచర్. టాప్-ఎండ్ వేరియంట్లో పానోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ ఉంటుంది. సాయంసంధ్య వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ, మీ ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా, ఉల్లాసభరితంగా మార్చుకునేందుకు ఇది సహకరిస్తుంది.

5. అల్లాయ్ వీల్స్

5. అల్లాయ్ వీల్స్

ఆడి ఏ3 కారులోని 16 ఇంచ్, ఐసీ సిల్వర్ మెటాలిక్ అల్లాయ్ వీల్స్ కారు ఎక్స్టీరియర్‌కు మరింత ప్రీమియం, స్పోర్టీ లుక్‌‌ని ఆఫర్ చేస్తాయి. వి అండ్ వై షేపులోని మల్టీ-స్పోక్ డిజైన్ ఆకట్టుకుంటుంది.

సమ్మరై

సమ్మరై

పాజిటివ్

- స్ట్రైకింగ్ డిజైన్

- ఎఫీషియెంట్ ఇంజన్

- డైలీ డ్రైవ్ కార్

నెగిటివ్

- మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదు

- వెనుక వరుస సీటులో స్పేస్ కొరత

- స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్

ఎక్స్-ఫ్యాక్టర్

- లుక్స్, ఫీల్, డ్రైవ్ విషయంలో నాణ్యత

వ్యాల్యూ ఫర్ మనీ

- 4 స్టార్స్

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ఆడి సంస్థను ఆగస్ట్ హార్చ్ అనే వ్యక్తి జులై 16, 1909లో వికావు వద్ద స్థాపించారు. కాంపిటీటివ్ కారణాల వలన ఈ సంస్థకు ఫౌండర్ పేరును పెట్టలేకపోయారు. అయితే, ఆ సంస్థకు ఆడి అనే పేరును దాని వ్యవస్థాపకుడి ఇంటి పేరు (హార్చ్) నుంచి గ్రహించారు. జర్మనీలో హార్చ్ అంటే లిజన్ (వినటం) అని అర్థం. ఈ పదాన్ని లాటిన్‌లోకి తర్జుమా చేస్తా ఆడి అనే శబ్ధం వస్తుంది. అలా ఈ సంస్థకు ఆడి అనే పేరు వచ్చింది.

శుభం.

ఈ కథనం మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో/మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
We review the elegant and dynamic 2015 Audi A3 - a four-door, premium, compact-sedan. Here are the verdicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X