ఆడి క్యూ3 35 టిడిఐ క్వాట్రో డైనమిక్ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్

By Ravi

క్లాస్ మరియు స్టయిల్‌‍తో కూడిన కార్లను తయారు చేయటంలో జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇలా ఆడి అమ్ములపొది నుంచి దూసుకొచ్చిన శరమే ఈ కొత్త ఆడి క్యూ3 డైనమిక్. భారత విపణిలో ఆడి విక్రయిస్తున్న తమ పాపులర్ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్యూ3 సిరీస్‌లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌గా వచ్చిన 'ఆడి క్యూ3 డైనమిక్' (Audi Q3 Dynamic), ఆడి డ్రైవ్ సెలక్ట్ ఫీచర్ (వివిధ డ్రైవింగ్ మోడ్స్‌ను సెలక్ట్ చేసుకునే ఫీచర్)తో లభ్యమవుతోంది.

ఈ సెగ్మెంట్లో మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన జిఎల్ఏ-క్లాస్‌కు గట్టి పోటీనిచ్చేలా ఆడి తయారు చేసుకున్న తాజా ఆయుధమే ఈ ఆడి క్యూ3 డైనమిక్. ఇది అత్యంత పాపులర్ అయిన ఆడి క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ (4x4)తో లభిస్తుంది.

ఈ స్టయిలిష్, పవర్‌ఫుల్ అండ్ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం విభిన్న రోడ్ కండిషన్స్‌లో టెస్ట్ చేసింది. మరి మా పరీక్షలో ఆడి క్యూ3 డైనమిక్ ఎన్ని మార్కులు సాధించిందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

ఆడి క్యూ3 డైనమిక్ డిజైన్, పెర్ఫార్మెన్స్, ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

పరిచయం

పరిచయం

టెస్ట్ చేసిన మోడల్: ఆడి క్యూ3 35 టిడిఐ క్వాట్రో డైనమిక్

ఇంధన రకం: డీజిల్

డ్రైవ్‌ట్రైన్: పెర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్

రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: కరి మోటార్ స్పీడ్‌వే [కోయంబత్తూర్]

ధర: రూ.38 లక్షలు [ఎక్స్-షోరూమ్, అక్టోబర్ 2014 నాటికి]

ఓవర్‌వ్యూ

ఓవర్‌వ్యూ

ప్రస్తుతం భారత మార్కెట్లో ఆడి క్యూ3 కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ మోడల్‌ను తొలిసారిగా 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కారు ఆడి ఇండియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

ఆడి క్యూ3 డీజిల్ ఫ్యాక్ట్‌షీట్

ఇంజన్, ట్రాన్సిమిషన్ అండ్ డ్రైవ్‌ట్రైన్:

  • 2.0-లీటర్, 138 బిహెచ్‌పి, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ [ఫ్రంట్ వీల్ డ్రైవ్]
  • 2.0-లీటర్, 175 బిహెచ్‌పి, 7-స్పీడ్ ట్రానిక్ ట్రాన్సిమిషన్ [పర్మినెంట్ ఆల్ వీల్ డ్రైవ్]
  • ఇంజన్, ట్రాన్సిమిషన్ అండ్ డ్రైవ్‌ట్రైన్:

    • 2.0-లీటర్, 211 బిహెచ్‌పి, 7-స్పీడ్ ట్రానిక్ ట్రాన్సిమిషన్ [పర్మినెంట్ ఆల్ వీల్ డ్రైవ్]
    • స్టయిలింగ్ - ఫ్రంట్

      స్టయిలింగ్ - ఫ్రంట్

      ఆడి క్యూ3 మంచి విజువల్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. ఆడి క్యూ3 డైనమిక్ ఫ్రంట్ పూర్తిగా క్లియర్ కట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. హుడ్ (బానెట్) షట్ లైన్స్ ఏ-పిల్లర్ ఇన్‌సైడ్ ఎడ్జ్ నుంచి ఫ్లో అవుతున్నట్లు ఉంటాయి. దీని ఫ్రంట్ గ్రిల్‌లలో ఎక్కువ భాగం క్రోమ్ కనిపిస్తుంది.

      ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, వాటి చుట్టూ ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, క్రోమ్ సరౌండింగ్స్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ అన్నింటినీ కూడా నీట్‌గా క్రాఫ్ట్ చేశారు. ఇవి కారుకు ఓ ప్రత్యేకమైన లుక్‌ని తెచ్చిపెడుతాయి.

      ఈ కారును ఇతర యాంగిల్స్ నుంచి చూసినట్లయితే, ఇది ఎందుకు అత్యంత స్టయిలిష్ కాంపాక్ట్ ప్రీమియం ఎస్‌యూవీనో మీకే అర్థమైపోతుంది.

      స్టయిలింగ్ - సైడ్

      స్టయిలింగ్ - సైడ్

      సైడ్ నుంచి చూసినప్పుడు ఆడి క్యూ2 స్టయిలింగ్ చాలా పవర్‌ఫుల్‌గా, స్ట్రైకింగ్‌గా అనిపిస్తుంది.

      కారు అద్దాల చుట్టూ ఉండే క్రోమ్ స్ట్రైప్, బ్లాక్ కలర్ బి అండ్ సి పిల్లర్స్, స్ట్రైట్ బాడీ లైన్స్, ఫ్రంట్ బంపర్ నుంచి వీల్ ఆర్చెస్ మీదుగా వెనుక బంపర్‌కు కలుపబడి ఉండే సన్నటి బ్లాక్ క్లాడింగ్‌లు కారుకు మంచి ప్రీమియం, స్పోర్టీ అండ్ స్టయిలిష్ అప్పీల్‌ను తెచ్చిపెడుతాయి.

      ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినది స్టయిలిష్ రూఫ్ రెయిల్. కారు పైభాగంలో అమర్చిన రూఫ్ రెయిల్ ఈ ఎస్‌యూవీకి స్పోర్టీ కూపే లాంటి క్యారెక్టర్‌ను కల్పిస్తుంది.

      స్టయిలింగ్ - రియర్

      స్టయిలింగ్ - రియర్

      ఇక కొత్త ఆడి క్యూ3 డైనమిక్ రియర్ డిజైన్‌ను గమనిస్తే.. స్మోక్డ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌లో అమర్చిన క్లియర్ లెన్స్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బంపర్ మరియు క్రింది భాగంలో అమర్చిన సిల్వర్ కలర్ అండర్‌బాడీ క్లాడింగ్, క్రోమ్ ఫినిష్ట్ స్ప్లిట్ సైలెన్సర్, రియర్ రూఫ్ స్పాయిలర్‌లు ఈ ఎస్‌యూవీకి ప్రీమియం, స్టయిలిష్ లుక్‌తో పాటుగా రగ్గడ్ ఆఫ్-రోడర్ ఫీల్‌ని కూడా కలిగిస్తాయి.

      మొత్తమ్మీద ఆడి క్యూ3 డైనమిక్ డిజైన్ తొలిచూపులోనే కొనుగోలుదారుల మదిని దోచుకుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు.

      ఇంటీరియర్స్

      ఇంటీరియర్స్

      ఆడి క్యూ3 డైనమిక్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. రెగ్యులర్ ఆడి క్యూ3 ప్రీమియం ప్లస్ (టాప్-ఎండ్ వేరియంట్) మోడల్‌లో కనిపించినట్లుగానే ఉంటాయి.

      అత్యుత్తమ నాణ్యతతో తయారు చేసిన మెటీరియల్స్‌ను ఉపయోగించి తయారు చేసిన ఇంటీరియర్స్ మంచి ప్రీమియం ఫీల్‌నిస్తాయి. సోబర్ టోన్ ఇంటీరియర్స్, అక్కడక్కడా క్రోమ్ గార్నిషింగ్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, రియర్ ఏసి వెంట్స్, పానరోమిక్ సన్‌రూఫ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

      క్యూ3 డైనమిక్ ఇంటీరియర్స్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులలో మరొకటి సెంటర్ కన్సోల్‌పై ఉండే డ్రైవ్ సెలక్ట్ కంట్రోల్ నాబ్. ఇది మీకు నచ్చిన డ్రైవింగ్ మోడ్స్‌ని ఎంచుకునేందుకు సహకరిస్తుంది [* డ్రైవ్ సెలక్ట్ గురించి స్లైడ్స్ 8, 9లలో వివరించడం జరిగింది]

      డ్రైవబిలిటీ అండ్ మైలేజ్

      డ్రైవబిలిటీ అండ్ మైలేజ్

      క్యూ3 డైనమిక్‌లోని 2.0 డీజిల్ ఇంజన్ కావల్సినంత టార్క్‌ను ఆఫర్ చేస్తుంది. క్వాట్రో డ్రైవ్ టెక్నాలజీ [పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్]తో కూడిన క్యూ3 డైనమిక్ ఆఫ్-రోడ్స్, కొండ ప్రాంతాలు, డైలీ సిటీ ప్రయాణం ఇలా ఎలాంటి పరిస్థితులైనా సరే, దానికి అనుగుణంగా టార్క్‌ను ఆఫర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎలాంటి డ్రైవింగ్ కండిషన్స్ అయినా సరే, క్యూ3 డైనమిక్‌ను డ్రైవ్ చేయటం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నమ్మసక్యం కావటం లేదా.. అయితే ఈ ఫొటో చూడండి..

      ఫ్యాక్ట్‌షీట్

      • ఇంజన్: 2.0-లీటర్ టిడిఐ
      • గరిష్ట పవర్: 175 బిహెచ్‌పి
      • ఫ్యూయెల్ టైప్: డీజిల్
      • మైలేజ్: 15.73 కెఎమ్‌పిఎల్ [ఏఆర్ఏఐ]
      • ట్రాన్సిమిషన్: 7-స్పీడ్ ట్రానిక్ ట్రాన్సిమిషన్ విత్ డ్రైవ్ సెలక్ట్ మోడ్స్ [కంఫర్ట్, ఆటో మరియు డైనమిక్]
      • * ఈ ఎస్‌యూవీని మేము ఎక్కువ భాగం కరి మోటార్ స్పీడ్‌వే రేస్ ట్రాక్‌పై అలాగే దీని పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ క్వాట్రో సిస్టమ్‌ను టెస్ట్ చేసేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆఫ్-రోడ్ సెక్షన్‌పై చేయటం జరిగింది.

        విశిష్టమైన ఫీచర్స్

        విశిష్టమైన ఫీచర్స్

        మనం నడిపే రోడ్డు, నడిపే స్టయిల్‌ని బట్టి డ్రైవింగ్ మోడ్‌ను మార్చుకునేందకు వీలుగా ఇందులో ఆడి డ్రైవ్ సెలక్ట్ (ఏడిఎస్) అనే ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది మూడు డ్రైవింగ్ మోడ్స్ [కంఫర్ట్, ఆటో మరియు డైనమిక్]ను కలిగి ఉంటుంది. డిఫాల్ట్‌గా ఇది ఆటో మోడ్‌లో ఉంటుంది.

        కంఫర్ట్ మోడ్: ఈ మోడ్‌లో తక్కువ లేదా ఎక్కువ స్పీడ్స్ వద్ద స్టీరింగ్ పనితీరు చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే థ్రోటల్ (యాక్సిలేటర్) రెస్పాన్స్ మరియు సస్పెన్షన్ డ్యాంపింగ్ చాలా స్మూత్‌గా మారిపోతాయి. తరచూ రద్దీగా ఉండే సిటీలో ఆగుతూ, వెళ్తూ ఉండే ప్రయాణానికి ఈ కంఫర్ట్ డ్రైవింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

        ఆటో మోడ్: ఇది పూర్తిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్. ఇది మీ డ్రైవింగ్ స్టయిల్‌ని పర్యవేక్షించి, దానికి అనుగుణంగా ఎస్‌యూవీ పెర్ఫార్మెన్స్‌ను మార్చుకుంటూ ఉంటుంది.

        డైనమిక్ మోడ్: మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఈ మోడ్‌ను ఎంచుకోగానే, హ్యాండ్లింగ్‌లో గరిష్ట పెర్ఫార్మెన్స్, పవర్‌ను అందించేందుకు వీలుగా ఎస్‌యూవీలోని కాంపోనెంట్స్ అడ్జస్ట్ అవుతాయి.

        ఆడి క్యూ3 డైనమిక్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

        ప్రతి డ్రైవింగ్ మోడ్ కూడా ఈ నాలుగు (స్టీరింగ్, సస్పెన్షన్, ట్రాన్సిమిషన్, యక్సిలేటర్) డ్రైవింగ్ క్యారెక్టరిస్టిక్స్‌ను విశిష్టంగా కాన్ఫిగర్ చేస్తుంది.

        డైనమిక్ స్టీరింగ్: తక్కువ మరియు ఎక్కువ స్పీడ్స్ వద్ద స్టీరింగ్ రేషియోని సర్దుబాటు చేసుకుని, తగిన రెస్పాన్స్‌ను ఇస్తుంది.

        సస్పెన్షన్ డ్యాంపింగ్: ఏ మోడ్ సెట్టింగ్‌లో అయినా సరే, బాడీ కంట్రోల్‌ను మాగ్జిమైజ్ చేసేందుకు ప్రతి వీల్ వద్ద సస్పెన్షన్ డ్యాంపర్ సెట్సింగ్స్ ప్రతి సెకనుకు అనేకసార్లు అడ్జస్ట్ అవుతుంది.

        ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్): ఎంచుకునే డ్రైవింగ్ మోడ్‌ను బట్టి గేర్ షిఫ్ట్స్ ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ మోడ్‌లో షిఫ్ట్స్ స్మూత్‌గా ఉంటాయి. అదే డైనమిక్ మోడ్‌‌లో అయితే ఇంజన్ రెవ్స్ ఎక్కువగాను గేర్ షిఫ్ట్స్ వేగంగా ఉండి, ఇంజన్ పవర్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు సహకరిస్తాయి.

        థ్రోటల్ (యాక్సిలేటర్): యాక్సిలరేటర్ ఇన్‌పుట్స్ కూడా డ్రైవింగ్ మోడ్స్‌పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ మోడ్‌లో ఇది స్టార్ట్ అండ్ గో సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ రెస్పాన్స్‌ను కలిగి ఉంటుంది. డైనమిక్ మోడ్‌లో యాక్సిలరేటర్ మరింత రెస్పాన్సివ్‌గా ఉండి, పెడల్ ఇన్‌పుట్స్ ఆధారంగా ఇంజన్ యాక్సిలరేట్ అవుతుంది.

        ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

        ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

        > షేపులో ఉండే క్యూ3 డైనమిక్ క్లియర్ లెన్స్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు ఓ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి.

        క్యూ3 టెయిల్ ల్యాంప్ షార్ప్ ఇల్యుమినేషన్‌ను కలిగి ఉండి రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట సైతం ఒక్క చూపులోనే గుర్తించేలా ఉంటాయి.

        లైటింగ్ విషయంలో ప్రతి ఆడి కారు కూడా విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ క్యూ3 డైనమిక్‌లో టెయిల్ ల్యాంప్ అతి ముఖ్యమైన స్టయిలింగ్ ఎలిమెంట్‌గా చెప్పుకోవచ్చు.

        అల్లాయ్ వీల్స్

        అల్లాయ్ వీల్స్

        సాధారణంగా అల్లాయ్ వీల్స్ కారు యొక్క ఓవరాల్ లుక్‌ని మెరుగపరచడంలో సహకరిస్తాయి.

        ఆడి క్యూ3 డైనమిక్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 17 ఇంచ్ 5-స్పోక్ అల్లాయ్ వీల్ రొయ్య పంజా ఆకారంలో చాలా విశిష్టంగా ఉండి, కారు లుక్‌ని మరింత పెంచుతుంది.

        ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్

        ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్

        ఆడి కార్లలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్లకు ఎల్లప్పూడూ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ప్రత్యేకించి క్యూ3 డైనమిక్‌లో ఉపయోగించిన ఆటోమేటిక్-డైనమిక్ హెడ్‌లైట్ రేంజ్ ఫీచర్, ఎదురుగా వచ్చే వాహన చాలకులను గుర్తించి, వారి కళ్లకు జిగేల్ మనిపించేలా కాకుండా తక్కువ ఆటోమేటిక్‌గా కాంతిని అడ్జస్ట్ చేసుకుంటుంది.

        అంటే, ఆడి క్యూ3 డైనమిక్ లైట్స్ కేవలం ఆకర్షనీయమైన లుక్‌కే పరిమితం కాకుండా మంచి సేఫ్టీకి కూడా పనికొస్తాయన్నమాట.

        పానోరమిక్ సన్‌రూఫ్

        పానోరమిక్ సన్‌రూఫ్

        రాను రాను కార్లలో సన్‌రూఫ్స్ పెద్దవిగాను, ఉత్తమంగాను మారుతున్నాయి.

        ప్రత్యేకించి ఆడి క్యూ3 డైనమిక్‌లోని సన్‌రూఫ్, కారు రూఫ్ (పైభాగం)లో దాదాపు 70 శాతం ఉంటుంది. అంటే మిగిలిన 30 శాతం మాత్రమే హార్డ్ టాప్ రూఫ్ ఉంటుందన్నమాట. విండోస్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా ఈ సన్‌రూఫ్ సాయంతో తాజా గాలిని మనం ఆస్వాదించవచ్చు. చెప్పాలంటే, ఇది ఓపెన్ టాప్ ఎస్‌యూవీని నడుపుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

        రీడర్ల నోట్ కోసం: పానోరమిక్ సన్‌రూఫ్స్‌కి రెగ్యులర్ సన్‌రూఫ్స్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. పానోరమిక్ సన్‌రూఫ్ అనేది టింట్ చేయబడిన లేదా క్లియర్ లెన్స్‌తో కూడిన పెద్ద సన్‌రూఫ్, ఇది కారు పైభాగం మొత్తం లేదా మెజారిటీ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. అనేక టాప్-ఎండ్ వేరియంట్లలో పానోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. సాంప్రదాయ సన్‌రూఫ్ కన్నా పానోరమిక్ సన్‌రూఫ్ పెద్దదిగా ఉంటుంది.

        ప్రధాన పోటీ

        ప్రధాన పోటీ

        ఆడి క్యూ3 డైనమిక్ ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏతో పోటీ పడుతుంది. చాలా మంది మెర్సిడెస్‌కు అభిమానులు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి ఈ సెగ్మెంట్ విషయంలో మాత్రం క్యూ3 డైనమిక్, జిఎల్ఏ కన్నా బెటర్ అనే చెప్పాలి. పైపెచ్చు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కావటం కూడా ఇందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

        ధరల యుద్ధం:

        ఆడి క్యూ3 డైనమిక్ 35 టిడిఐ క్వాట్రో

        ఆన్-రోడ్ ధర (ఢిల్లీ) - రూ.44,94,731

        మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 200 సిడిఐ

        ఆన్-రోడ్ ధర (ఢిల్లీ) - రూ.42,57,284

        చివరిమాట

        చివరిమాట

        క్యూ3 డైనమిక్ ప్లస్‌లు

        • ప్రీమియం ఫీల్ ఇంటీరియర్
        • సిటీలో డ్రైవ్ చేయటం సులువు
        • ఆఫ్-రోడింగ్ పరిస్థితులను సులువుగా హ్యాండిల్ చేస్తుంది (క్వాట్రో టెక్నాలజీ)
        • స్మూత్ అండ్ క్విక్ షిఫ్టింగ్ డ్యూయెల్ క్లచ్ 7-స్పీడ్ గేర్‌బాక్స్
        • అనేక ఫీచర్లు, సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లు
        • క్యూ3 డైనమిక్ మైనస్‌లు

          • పరిమిత రియర్ స్పేస్
          • అసమతౌల్య రోడ్లపై ఫర్మ్ రైడ్
          • స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ (ఫీల్ లేదు)
          • సస్పెన్షన్ డ్యాంపింగ్ విషయానికి వస్తే ఆడి డ్రైవ్ సెలక్ట్ (ఏడిఎస్) దాని పరిమితులను కలిగి ఉంటుంది
          • ఎక్స్-ఫ్యాక్టర్

            • ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతున్న ఏకైక ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ
            • ధరకు తగిన విలువ

              • 5 స్టార్లకు గాను 4 స్టార్లు
              • మీకు తెలుసా?

                మీకు తెలుసా?

                ఆడి బ్రాండ్ లోగోలోని నాలుగు రింగ్స్‌లో ఒక్కొక్క రింగ్ ఒక్కక్క కంపెనీ సూచిస్తుంది. ఈ నాలుగు కంపెనీలు కలిసి ఆటో యూనియన్‌గా ఏర్పడి కార్లను తయారు చేయాలని ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

                ఈ నాలుగు కంపెనీలు 1932లో విలీనం అయిన అనంతరం, జర్మనీలో మెర్సిడెస్ బెంజ్ తర్వాత అతిపెద్ద కార్ కంపెనీగా ఆటో యూనియన్ అవతరించింది. ఈ నాలుగు కంపెనీలలో ప్రతి కంపెనీ ఒక్కో సెగ్మెంట్‌పై దృష్టి పెట్టేది. ఇందులో హార్చ్ హై-ఎండ్ లగ్జరీ కార్లను తయారు చేస్తే, ఆడి డీలక్స్ మిడ్-సైజ్ కార్లపై, వాండెరర్ స్టాండర్డ్ మిడ్-సైజ్ కార్లపై, డికెడబ్ల్యూ చిన్న కార్లు మోటార్‌సైకిళ్లపై దృష్టి సారించేది.

                అధికారి పేరు ఆడి ఏజి అనేది 1985లో ఏర్పడి, ఆటో యూనియన్‌కు శుభం కార్డు పడింది. ప్రస్తుతం ఆడి, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులో ఓ భాగంగా ఉంది.

Most Read Articles

English summary
DriveSpark reviews the all-new Audi Q3 35 TDI Quattro Dynamic. So how does this premium compact SUV fair in real world conditions? Read more here.
Story first published: Saturday, October 25, 2014, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X