బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి రివ్యూ: పనితీరు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు

జర్మనీ దిగ్గజ బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 3-సిరీస్‌లో జిటి సెడాన్‌ను విడుదల చేసింది. అయితే దీనికి టెస్ట్ డ్రైవ్ నిర్వహించేందుకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు అవకాశం కల్పించింది.

By Anil

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ సెడాన్ కారు టెస్ట్ డ్రైవ్ నిర్వహించి, పనితీరు, సాంకేతిక వివరాలు, ఫీచర్లు, ధర, ధరకు తగ్గ విలువలను కలిగి ఉందా.. లేదా... మరియు లగ్జరీ సెడాన్ సెగ్మెంట్లో దీని ఎంపిక ఉత్తమమేనా అనే వివరాలు నేటి రివ్యూ కథనంలో మీ కోసం...

మరీ ఎక్కువ కాకుండా కాస్తంత ఖరీదైన మరియు ఉత్తమ లగ్జరీ సెడాన్ ఎంచుకోవాలనుకునే వారికి దేశీయంగా లభించే బెస్ట్ లగ్జరీ సెడాన్ ఏదో తెలుసా...? వెనుక సీటులో సౌకర్యవంతంగా కూర్చుని మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, హోదాను ఒలకబోస్తూ, మంచి స్టేటస్ ఫీల్ లక్షణాలు ఉన్న బెస్ట్ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ గ్రాన్ టురిస్మో పర్ఫెక్ట్ మ్యాచ్‌ అని చెప్పవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

జిటి అనగా బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ సెడాన్ యొక్క గ్రాన్ టురిస్మో వర్షన్. డిజైన్ పరంగా ఇది సెడాన్ కారే అయినప్పటికీ చాలా మంది వెంటనే గుర్తించలేరు. ముందు వైపు పొడవాటి బ్యానెట్ మరియు వెనుక వైపున ఉబ్బెత్తుగా ఉండటం.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఇలా కనిపించడానికి బిఎమ్‌డబ్ల్యూ ఈ గ్రాన్ టురిస్మో లగ్జరీ సెడాన్ యొక్క మూడు కొలతల్లో మార్పులు జరపడం - అవి, పొడవు, వెడల్పు మరియు ఎత్తు. అయితే, ముందు వైపు ఉన్న రీ డిజైన్ చేయబడిన బంపర్ ద్వారా కండలు తిరిగిన ఆకృతిలో మరింత డిజైన్ లక్షణాలను కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

నాలుగు డోర్లకు ఫ్రేమ్ రహిత విండోలు, కారు ఇరువైపులా క్యారెక్టర్ లైన్, విండో చుట్టువైపులా క్రోమ్ సొబగులున్న పట్టీలు, వెనుకు వైపున ఎత్తైన బుట్ (డిల్లీ), బూట్ స్పాయిలర్(డిక్కీ డోర్ మీద ఉన్న భాగం) వంటి అనేక అంశాలు ఈ గ్రాన్ టురిస్మో బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లైనప్‌లో జిటి అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ సెడాన్ ఫ్రంట్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన సరికొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్ కలదు. ఇందులో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, మరియు ఫాగ్ ల్యాంప్స్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ట్విన్ హెడ్ ల్యాంప్ అమరికను మరియు కిడ్నీ గ్రిల్‌ను వేరు చేస్తూ ఎల్ఇడి ఇండికేటర్ లైట్లను జోడించడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ సెడాన్‌లో ప్రక్క వైపుల లగ్జరీ లైన్ పేరుతో ఉన్న క్రోమ్ బ్యాడ్జింగ్ గుర్తించవచ్చు. మరియు ఫ్రంట్ డోర్ మీద నుండి రియర్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వరకు పొడవాటి గీతలను గమనించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

డిజైన్ పరంగా చోటు చేసుకున్న మార్పులు విషయానికి వస్తే, ఈ లగ్జరీ లైన్ సెడాన్‌లో ఫ్రంట్ ఎయిర్ ఇంటేకర్ పరిమాణం పెంచడం జరిగింది. బంపర్ విభాగంలో ఇరువైపులా కొత్త డిజైన్‌‌లో ఉన్న ఫాగ్ ల్యాంప్ తొడుగులను స్పష్టంగా చూడవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

రియర్ డిజైన్ పరంగా జరిగిన మార్పులు విషయానికి వస్తే, దీని తోబుట్టువును పోలిన డిజైన్ లక్షణాలనే కలిగి ఉంది. ఎక్కువ వేగంలో ఉన్న కారుకు వెనుక వైపున డౌన్ ఫోర్స్‌ను పెంచడానితి కావాల్సిన రీతిలో మలచబడిన రియర్ స్పాయిలర్ మరియు పూర్తి స్థాయిలో గాలి ద్వారా కలిగే ఘర్షణను అధిగమించే డిజైన్ ఫిలాసఫీకి ప్రాధాన్యతనిచ్చారు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి టెయిల్ పైప్ అమరికలో ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ గొట్టాలు ఉన్నాయి. మరియు రియర్ డిజైన్‌లో కారుకు ఎడమవైపు పై భాగంలో జిటి పేరుతో ఉన్న క్రోమ్ బ్యాడ్జింగ్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌బ్ల్యూ 320డి గ్రాన్ టురిస్మో లగ్జరీ లైన్ సెడాన్‌లో ఎక్ట్సీరియర్ మీద మాత్రమే కాదు ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శాడిల్ బ్రౌన్ కలర్‌లో ఉన్న సీట్లు, మరియు డకోటా బ్లాక్ కలర్‌లో అప్‌హోల్‌స్ట్రే కలదు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

సరికొత్త గ్రాన్ టురిస్మో లగ్జరీ లైన్ సెడాన్‌లో ఇంటీరియర్‌లో జరిగిన మార్పులు గుర్తించడం అంత సులువు కాదు. అయితే కొత్తగా ఉన్న గేర్ సెలక్టర్, ఐడ్రైవ్ కంట్రోలర్ మినహాయిస్తే, ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

డ్రైవర్ మరియు ప్రయాణికులు సౌకర్యవంతంగా ఇందులో కూర్చోవచ్చు. ముందు వైపు సీట్లకు మెమోరీ ఫంక్షన్ ఉన్న ఎలక్ట్రికల్ సీట్ అడ్జెస్ట్‌మెంట్ వ్యవస్థకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. మేము టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నపుడు వివిధ రకాల ఎత్తు ఉన్న డ్రైవర్లకు అనుగుణంగా సీట్ ఎత్తును మార్చుకోవచ్చు. మనం చేసే అన్ని మార్పులను మెమోరీ మొత్తం గుర్తుంచుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి అత్యుత్తమ హెడ్ మరియు లెగ్ స్పేస్ కలిగి ఉంది. కాబట్టి అసౌకర్యానికి గురికాకుండా ఇందులో ప్రయాణించవచ్చు. దీని వీల్ బేస్ 2,920ఎమ్ఎమ్‌(రెగ్యులర్ 320డిజో పోల్చుకుంటే 70ఎమ్ఎమ్ వరకు ఎక్కువగా ఉంది)గా ఉంది. సాధారణ 320డి కన్నా మరింత సౌకర్యవంతమైన రూమ్ స్పేస్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే ప్యానరోమిక్ సన్ రూఫ్ ఇందులో ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఇంటీరియర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ల విషయానికి వస్తే, బాటిల్ హోల్డర్లు, కీలెస్ ఇంజన్ స్టార్ట్, ఆరు ఎయిర్ బ్యాగులు, కప్ హోల్డర్లు, అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ప్యాసింజర్ మరియు డ్రైవర్ ఆర్మ్ రెస్ట్, డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం డోల్ హ్యాండిల్స్, స్టోరేజి బాక్స్, యుఎస్‌బి మరియు ఏయుఎక్స్ ఇన్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ లైన్ సెడాన్‌లో అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్ కలదు. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్, బిఎమ్‌డబ్ల్యూ అప్లికేషన్లు, రేడియో బిఎమ్‌డబ్ల్యూ ప్రొఫెషనల్స్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ మరియు న్యావిగేషన్ సిస్టమ్ ప్రొఫెషనల్స్ వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కలదు. ఎలాంటి ఇరుకైన ప్రదేశాలలోనైనా సులభంగా పార్క్ చేయవచ్చు. కారుకు సంభందించిన మొత్తం సమాచారం 8.8-అంగుళాల పరిమాణం ఉన్న హై రిజల్యూషన్ డిస్ల్పే‌లో కనిపిస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఇందులో స్టోరేజీ సామర్థ్యానికి బిఎమ్‌డబ్ల్యూ అధిక ప్రాధాన్యతనిచ్చింది. నలుగురు కూర్చునే సీటింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు 520-లీటర్ల డిక్కీ స్పేస్ కలదు. వెనుక వరుస సీటును పూర్తిగా మడిపివేస్తే 1,600-లీటర్లకు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ లైన్ సెడాన్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ స్క్రోల్ టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

పనితీరు మరియు హ్యాండ్లింగ్

పనితీరు మరియు హ్యాండ్లింగ్

బిఎమ్‌డబ్ల్యూ జిటి కేవలం 7.5-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఇది గరిష్టంగా గంటకు 235కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మేము డ్రైవ్ చేసినపుడు చేరుకున్న గరిష్ట వేగం వద్ద ఈ కారులో అందించిన 225/50 ఆర్18 టైర్లు యొక్క అత్యుత్తమ రోడ్ గ్రిప్ మరియు పటిష్టతను గుర్తించడం జరిగింది. మరియు గేర్ల మార్పిడి చాలా వేగంగా జరిగిపోతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

ఏ గేర్‌లోనైనా, ఏ సందర్భంలోనైనా 320డి జిటి స్మూత్ డ్రైవింగ్ ఇస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఈ జిటి వెర్షన్‌ కారులో పెడల్ షిఫ్టర్స్‌ను అందివ్వడం జరిగింది తద్వారా గేర్లను మ్యాన్యువల్‌‌లో చాలా సులభంగా మార్చవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ లైన్ సెడాన్ కారులో నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్. మొదటి రెండు మోడ్‌లలో డ్రైవ్ చేస్తున్నపుడు కారు అత్యత్తమ మైలేజ్ ఇస్తుంది(సిటిలో 14కిమీ/లీ మరియు హైవేలో 22కిమీ/లీ). ఈ జిటి కారులో ఆటో ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ అదే విధంగా బ్రేక్ పవర్ రీజనరేషన్ అనే కొన్ని మైల్డ్ హైబ్రిడ్ సెట్టింగ్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లోకి వెళ్లాక ఇంజన్ పవర్‌లో తేడా గమనించవచ్చు. స్టీరింగ్ చేసేటపుడు స్పోర్టివ్ రైడింగ్ ఫీల్ ఖచ్చితంగా పొందుతారు. ప్రత్యేకించి ఈ గ్రాన్ టురిస్మో లగ్జరీ సెడాన్ స్పోర్ట్స్ ఫీల్ చాలా విభిన్నంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్

స్పోర్ట్ ప్లస్ డ్రైవింగ్ మోడ్ ఎంచుకునేసరికి డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ మరింత స్పోర్టివ్ రైడింగ్ ఫీల్ పొందుతాడు. ఇందుకు కారణం ఈ మోడ్‌లో ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ కూడా సమిష్టిగా పనిచేస్తుంది. అతి వేగం వద్ద నియంత్రణ కోల్పోయే సంధర్బంలో ట్రాక్షన్‌ కంట్రోల్ వ్యవస్థ టైర్లకు చేరే టార్క్‌ను అదుపులోకి తీసుకొస్తుంది. తద్వారా స్పోర్టివ్ ప్లస్ మోడ్‌లో సురక్షితమైన స్పోర్టివ్ రైడ్ సాధ్యం అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ 320డి గ్రాన్ టురిస్మో(జిటి) లగ్జరీ లైన్ ఇండియన్ మార్కెట్లో రూ. 46,50,000 ల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ 320డి సెడాన్ కన్నా ఈ ప్రీమియమ్ సెడాన్ ధర 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటుంది. 3-సిరీస్ సెడాన్ విభాగంలో అతి అత్యంత విశాలమైన మరియు సౌకర్యవంతమైన లగ్జరీ ఎస్‌యూవీ.

తీర్పు

తీర్పు

విశాలమైన, ప్రాక్టికల్‌ మరియు ఫ్యామిలీ కారుతో ఫన్ డ్రైవింగ్ పొందడానికి చక్కగా సరిపోయే లగ్జరీ కారు 320డి జిటి. ఇండియన్ ఫ్యామిలీ రేంజ్ లగ్జరీ సెడాన్ కార్లలో స్పోర్టివ్ డ్రైవింగ్ ఫీల్ కోరుకునే వారు, మరియు ధర శ్రేణి రూ. 45 నుండి రూ. 50 లక్షల మధ్య వెచ్చించే వారికి బిఎమ్‌డబ్ల్యూ 320డి జిటి లగ్జరీ లైన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu To Know More About BMW 320d GT Luxury Line: First Drive Review
Story first published: Wednesday, June 7, 2017, 22:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X