డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ: 'ఓ మంచి చీప్ కార్'

'డాట్సన్ గో' హ్యాచ్‌బ్యాక్.. ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ సెగ్మెంట్లో సంచలనం సృష్టించేందుకు వచ్చిన లేటెస్ట్ జపనీస్ కార్ ఇది. డాట్సన్ పురాతన బ్రాండే అయినప్పటికీ, మోడ్రన్ కారుతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా కారును కొనుగోలు చేసే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని డాట్సన్ ఈ చిన్న కారును ప్రవేశపెట్టింది.

ఈ కారును రీసెంట్‌గా మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. మరి ఈ డాట్సన్ గో కారు విశిష్టతలు, లోపాలు, పెర్ఫార్మెన్, హ్యాండ్లింగ్, ఫీచర్లు, నాణ్యత, సేఫ్టీ వంటి అనేక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: హోండా సిటీ టెస్ట డ్రైవ్ రివ్యూ

డాట్సన్ గో రివ్యూ గురించి చదివే ముందుగా.. డాట్సన్ బ్రాండ్ చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ చెందిన బ్రాండే ఈ డాట్సన్. తొలి డాట్సన్ కారును 1931లో ప్రవేశపెట్టారని అదే సంవత్సరంలో భారతదేశపు రాజధానిగా న్యూఢిల్లీ ప్రకటించారని మీరు తెలుసా..?

వాస్తవానికి 1958 నుంచి 1986 వరకు జపాన్ నుంచి నిస్సాన్ ఎగుమతి చేసిన అన్ని వాహనాలను డాట్సన్ బ్రాండ్ క్రిందే విక్రయించేవారు. నిస్సాన్ 1986 మార్చ్ నెలలో తమ డాట్సన్ బ్రాండ్‌ను పూర్తిగా నిలిపివేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత జులై 2013లో నిస్సాన్ తిరిగి తమ డాట్సన్ బ్రాండ్‌కు ప్రాణం పోసి, ఇందులో తొలి మోడ్రన్ కారుగా డాట్సన్ గోను విడుదల చేసింది.

ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని డాట్సన్ తమ చిన్న కారు 'గో'ను తయారు చేసింది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ వంటి రెండు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఈ కారును అభివృద్ధి చేశారు. భారత్‌లో ఇంజనీరింగ్ చేయబడిన ఈ కారు మన భారతీయుల అంచనాలకు ధీటుగా ఉంటుందో లేదో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

* విడుదల సమయంలో ధర: రూ.3.12 లక్షల నుంచి రూ.3.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
* మైలేజ్: ప్రతి లీటరుకు 20.6 కిలోమీటర్లు (ఏఆర్ఏఐ ప్రకారం)

పరిచయం

పరిచయం

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మార్చ్ 19, 2014వ తేదీన మార్కెట్లో విడుదలయ్యింది. డాట్సన్ తొలికారుకు సంబంధించిన రివ్యూను ఈ ఫొటో స్లైడ్‌లలో పరిశీలించండి.

* టెస్ట్ చేసిన మోడల్: పెట్రోల్, టాప్-ఎండ్ వేరియంట్ (టి వేరియంట్)

* కారును టెస్ట్ చేసిన వారు: జోబో కురువిళ్ల (ఛీఫ్ ఎడిటర్)

* టెస్ట్ చేసిన దూరం: 150 కిలోమీటర్లు, హైదరాబాద్

డాట్సన్ గో ధరలు

డాట్సన్ గో ధరలు

డాట్సన్ గో మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* డాట్సన్ గో డి - రూ.3,12,270

* డాట్సన్ గో ఏ - రూ.3,46,482

* డాట్సన్ గో టి - రూ.3,69,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. మార్చ్ 2014 నాటికి)

ఎక్స్టీరియర్స్ (తర్వాతి 3 స్లైడ్‌ల వరకు)

ఎక్స్టీరియర్స్ (తర్వాతి 3 స్లైడ్‌ల వరకు)

ఏ కారు విషయంలోనైనా కొనుగోలుదారులను ప్రధానంగా ఆకర్షించే అంశం డిజైన్. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ డిజైన్ విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది. డిజైన్ విషయంలో ఇది మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి ఎంట్రీ లెవల్ కార్ల కన్నా మెరుగ్గా అనిపిస్తుంది.

'డి-కట్ గ్రిల్'ను కలిగి ఉండే ఫ్రంట్ బంపర్, గ్రిల్ చుట్టూ ఉండే క్రోమ్ ఫినిషింగ్ మరియు దాని మధ్యలో డాట్సన్ లోగో, బంపర్ క్రింది భాగంలో ఉండే ఎయిర్ ఇన్‌టేక్స్, చక్కగా డిజైన్ చేసిన హెడ్‌లైట్స్‌తో ఇది ముందు వైపు నుంచి అద్భుతమైన లుక్‌ని కలిగి ఉంటుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

అనేక మంది డిజైనర్లు ట్రెండీగా ఉండే బల్జింగ్ హెడ్‌లైట్లను ఉపయోగించేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ డాట్స్ గో విషయంలో ఇది ఇందుకు భిన్నంగా ఉంటుంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఒక విభిన్న కోణంలో షేప్ చేయబడిన హెడ్ లైట్లను గమనించవచ్చు.

దీని బాడీ లైన్స్ కూడా ముందు నుంచి వెనుక వరకు చాలా చక్కగా అనిపిస్తాయి. మా వరకు చెప్పాలంటే, డిజైన్ విషయంలో డాట్సన్ గో నీట్ అండ్ క్లీన్‌గా అనిపిస్తుంది. కాదంటారా..?

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మొత్తమ్మీద చూసుకుంటే, డాట్సన్ గో డైనమిక్ డిజైన్ ఈ సెగ్మెంట్లోని మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి కార్లతో పోల్చి చూసినప్పుడు, వాటి కన్నా ఇది ఎన్నో రెట్లుగా మెరుగ్గా అనిపిస్తుంది.

ఫ్యాక్ట్‌‌షీట్:

* డాట్సన్ గో గ్రౌండ్ క్లియరెన్స్ - 170 మి.మీ

* మారుతి ఆల్టో గ్రౌండ్ క్లియరెన్స్ - 160 మి.మీ

* హ్యుందాయ్ ఇయాన్ గ్రౌండ్ క్లియరెన్స్ - 170 మి.మీ

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతానికి నాలుగు రంగులలో మాత్రమే లభ్యం కానుంది. అవి -

1. స్కై బ్లూ

2. సిల్వర్

3. రూబీ రెడ్

4. వైట్

ఇంటీరియర్స్ (తర్వాతి 7 స్లైడ్‌ల వరకు)

ఇంటీరియర్స్ (తర్వాతి 7 స్లైడ్‌ల వరకు)

ఇప్పటి వరకు డాట్సన్ గో ఎక్స్టీరియర్లను పరిశీలించాం కదా.. ఇప్పుడు ఇంటీరియర్లను పరిశీలిద్దాం పండి.

డాట్సన్ గో ఇంటీరియర్ డిజైన్ మోడ్రన్‌గా, సింపుల్‌గా ఉండి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కావటంతో ఈ కారులో ఇంటీరియర్లు అంత హైఫైగా అనిపించవు. సింపుల్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, బీజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్‌ను ఇందులో చూడొచ్చు.

ఈ కారులో మొత్తం నాలుగు ఏసి వెంట్స్ (ఒకే రకమైన డిజైన్‌తో) ఉంటాయి. డ్యాష్‌బోర్డుకు మధ్యలో ఉండే ఈ రెండు ఏసి వెంట్స్ చూట్టూ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది. అవసరం లేదనుకుంటే, వీటిని క్లోజ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కారులో విశిష్టమైన ఫీచర్లు (ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న మరే ఎంట్రీ లెవల్ కారులో లేనివి) ఏంటంటే.. డ్యాష్‌బోర్డుకే అమర్చబడి ఉండే గేర్ లివర్ మరియు పార్కింగ్ బ్రేక్. ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి, ఇవి రెండు సెంటర్ కన్సోల్‌లోనే ఇమడ్చబడి ఉంటాయి.

మొదటిసారి ఇవి చూసిన వారికి కాస్తంత ఇబ్బంది గానే అనిపిస్తుంది, అయితే కారును నడుపుతున్న కొద్ది దీని అడ్వాంటేజ్ తెలుస్తుంది. కారు ఫ్లోర్‌పై ఈ రెండు కంట్రోల్స్‌ను తొలగించడం వలన ఇరుకుగా ఉండే పార్కింగ్ ప్రదేశాల్లో క్యాబిన్‌లో అటు ఇటూ కదిలేందుకు / ప్రవేశించేదుకు వీలుగా ఉంటుందని డాట్సన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇలా చేయటం వలన ఫ్రంట్ సీట్లలో స్పేస్ కూడా విశాలంగా ఉంటుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం, ఈ కంట్రోల్స్‌ను సెంటర్ కన్సోల్‌కు అమర్చడం వలన స్పేస్ లభిస్తుందో లేదో తెలియదు కానీ, పొడవాటి డ్రైవర్లకు మాత్రం ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ఫొటోలో చూడండి, పార్కింగ్ బ్రేక్/హ్యాండ్ బ్రేక్‌ను పూర్తిగా అప్లయ్ చేయటం జరిగింది. దీని వలన బ్రేక్ లివర్ చాలా వరకు ముందుకు వస్తుంది. ఫలితంగా ఇది పొడవుగా ఉండే డ్రైవర్లకు మోకాలి వద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కానీ, విమర్శకులు మాత్రం ఉత్పత్తి ఖర్చును తగ్గించుకునేందుకే డాట్సన్ గేర్ లివర్‌ను, పార్కింగ్/హ్యాండ్ బ్రేక్‌ను సెంటర్ కన్సోల్‌కే అమర్చిందని వాదిస్తున్నారు. అయితే, డాట్సన్ ఇంజనీర్ల వెర్షన్ మరోలా ఉంది. ఈ రెండు కంట్రోల్స్‌ను కారు ఫ్లోర్ నుంచి తొలగించడం వలన ముందు వరుసలో కనెక్టెడ్ సీట్లను ఏర్పాటు చేయవచ్చని, ఫలితంగా అదనపు స్పేస్ కూడా లభిస్తుందని చెబుతున్నారు.

కారులో అదనపు స్పేస్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని వారు చెబుతున్నారు. అయితే, ఈ కనెక్టెడ్ సీటులోని ఖాలీ ప్రదేశాన్ని మరో వ్యక్తి కూర్చుకునేందుకు కానీ లేదా ఇంకో సీటు మాదిరిగా కానీ ఉపయోగించుకోవటం ప్రమాదం. భద్రతా అంశాల దృష్ట్యా ఇది ఆమోదయోగ్యం కాదు.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ గో కారు వెనుక సీటులో కూర్చునే ప్యాసింజర్లకు కూడా సరిపడా లెగ్‌రూమ్ ఉంటుంది. వాస్తవానికి డాట్సన్ గో, ఈ సెగ్మెంట్లలో లభిస్తున్న కార్లలో కెల్లా మెరుగైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది.

ఫ్యాక్ట్‌షీట్: (పొడవు x వెడల్పు x ఎత్తు - మిల్లీ మీటర్లలో)

* డాట్సన్ గో

పొ x వె x ఎ - 3785 x 1635 x 1485

* మారుతి ఆల్టో కె10

పొ x వె x ఎ - 3620 x 1475 x 1460

* హ్యుందాయ్ ఇయాన్

పొ x వె x ఎ - 3495 x 1550 x 1500

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేసే వారు ఇంటీరియర్ స్పేస్‌కే కాకుండా బూట్ స్పేస్ (లేగేజ్ స్పేస్)కు కూడా ప్రాధాన్యత ఇస్తారు. డాట్సన్ గో బూట్ స్పేస్ విషయంలో కూడా సెగ్మెంట్ బెస్ట్ అనిపించుకుంటుంది.

ఫ్యాక్ట్‌షీట్: (బూట్ స్పేస్ లీటర్లలో)

* డాట్సన్ గో - 265 లీటర్లు

* మారుతి ఆల్టో కె10 - 160 లీటర్లు

* హ్యుందాయ్ ఇయాన్ - 215 లీటర్లు

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

స్పేర్ టైర్.. చరిత్రలోకి వెళితే.. వేల్స్‌లోని లానెల్లీకి చెందిన వాల్టర్, టామ్ డేవీస్‌లు 'స్పేర్ టైరు'ను తొలిసారిగా 1904లో పరిచయం చేశారు. అంతకు ముందుకు వరకు స్పేర్ వీల్స్ లేకుండా మోటార్ కార్లు తయారయ్యేవి. అప్పట్లో స్టెప్నీ ఐరన్ మోంగర్స్ కంపెనీ క్రింద టైర్లు తయారు చేసే సంస్థ ఈ విభాగంలో అగ్రగామిగా ఎదిగింది. ఈ కంపెనీ పేరు లోనుంచే స్పేర్ టైరుకు 'స్టెప్నీ' అనే పేరు వచ్చింది.

భారత్ వంటి రోడ్లకు స్పేర్ టైర్ తప్పనిసరి. మన రోడ్లపై టైరు ఎప్పుడు, ఎక్కడ పంక్చర్ అవుతుందో తెలియని పరిస్థితి. సరే అదంతా అటుంచితే, డాట్సన్ గో కారులో అమర్చిన స్పేర్ టైరును యాక్సెస్ చేసుకోవటం సులువుగా ఉంటుంది. కారు జాక్‌ను వెనుక భాగంలో కాకుండా, ఫ్రంట్ సీట్ క్రింద అమర్చారు.

ఫీచర్లు (తర్వాతి 4 స్లైడ్ల వరకు)

ఫీచర్లు (తర్వాతి 4 స్లైడ్ల వరకు)

ముందుగా డాట్సన్ గో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను గమనిస్తే, ఇది సింపుల‌్‌గా ఉన్నప్పటికీ అవతలి వారి దృష్టిని ఇట్టే ఆకట్టుకుంది.

ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఫీచర్లు:

* వైట్ అండ్ బ్లూ కలరింగ్

* డిజిటల్ టాకోమీటర్

* సగటు మైలేజ్ స్మార్ట్ మీటర్

* ఇన్‌స్టాంట్ ఫ్యూయెల్ ఎకానమీ

* లో ఫ్యూయెల్ వార్నింగ్

* ట్రిప్ మీటర్

* ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ గేజ్

* గేర్ షిఫ్ట్ గైడ్

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ గో కారులో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరో అధునాతన ఫీచర్ 'మొబైల్ డాకింగ్ స్టేషన్' (ఎమ్‌బిఎస్). మీ స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా మీ కారుతో కనెక్ట్ చేసుకునే ఫీచర్. వాస్తవానికి అనేక ఎంట్రీ లెవల్ కార్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేదు.

మీ స్మార్ట్ ఫోన్ (ఎలాంటి సైజు ఫోనైనా సరే)ను డ్యాష్‌బోర్డుకే అమరి ఉంచేందుకు గాను ఓ ప్రత్యేక స్లాట్ ఉంటుంది. ఆక్స్-ఇన్ కేబుల్ ద్వారా ఫోనులోని పాటల్ని కారులోని స్పీకర్లతో వినొచ్చు. ఒకవేళ మీ ఫోన్ చార్జింగ్ ఖాలీ అవుతున్నట్లు అనిపిస్తే, పక్కనే ఉన్న యూఎస్‌బి పోర్టుతో ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ సెటప్‌తో కేవలం పాటలు, రేడియో వినంట మాత్రమే కాదు.. మీ స్మార్ట్ ఫోన్‍‌లోని వీడియోలను కూడా ఇదిగో ఈ ఫొటోలో చూపించినట్లు ప్లే చేసుకోవచ్చు. అంతేకాదు, మీ స్మార్ట్ ఫోన్‌లో జిపిఎస్/గూగుల్ మ్యాప్స్ వంటి సౌలభ్యం ఉంటే, వాటి సాయంతో వాయిస్ ఇన్‌స్ట్రక్షన్లను కూడా పొందవచ్చు. భారత్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని డాట్సన్ ఈ సిస్టమ్‌ను తయారు చేసింది.

వాస్తవం:

భారత్‌లోని 70 శాతం హ్యాండ్‌సెట్లు స్మార్ట్‌ఫోన్లే.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మొత్తమ్మీద చూసుకుంటే, డాట్సన్ గో కారులోని కీలక ఫీచర్లు ఇలా ఉన్నాయి:

* పవర్ స్టీరింగ్

* పవర్ విండోస్

* కనెక్టెడ్ ఫ్రంట్ సీట్స్

* మొబైల్ డాకింగ్ స్టేషన్ (ఎమ్‌బిఎస్)

* సెంట్రల్ లాసింగ్ (మ్యాన్యువల్)

* యాక్ససరీ సాకెట్ (12 వోల్ట్స్)

* ఫ్రంట్ స్పీకర్స్ (ముందు వైపు డోర్లలో)

* 1.5 లీటర్ బాటిళ్లను అమర్చుకోగల డోర్ పాకెట్స్

* ఇంటెలిజెంట్ వైపింగ్ సిస్టమ్ (ఐడబ్ల్యూఎస్)

లేని ఫీచర్లు - ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్. ఈ కారు సేఫ్టీ పెద్ద సమస్య. ఈ కారులో కనీసం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌నైనా డాట్సన్ స్టాండర్డ్‌గా ఆఫర్ చేసి ఉండాల్సింది.
ఇంజన్

ఇంజన్

డాట్సన్ గో కారులో 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 3-సిలిండర్ ఇంజన్ వలన బరువు, మైలేజ్, ఖర్చు వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఇంజనీర్లు చెబుతుంటే, మాకు మాత్రం కారును నడుపుతున్నప్పుడు ఐడిల్ స్పీడ్స్ వద్ద స్వల్పంగా వైబ్రేషన్ అనిపించింది.

కానీ, ఈ వైబ్రేషన్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు డాట్సన్ ఇంజనీర్లు కౌంటర్‌బ్యాలెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యాక్సిలేషన్ ప్రెస్ చేయగానే వైబ్రేషన్ అనిపించదు. ఇంజన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు మాత్రమే స్వల్పంగా వైబ్రేషన్ అనిపిస్తుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ ఇంజన్ కొంచెం ఎక్కువ శబ్ధాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఫర్వాలేదనిపిస్తుంది. ఇందులోని ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 165 కిలోమీటర్లు. ఇది 13.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది.

ఫ్యాక్ట్‌షీట్: (బిహెచ్‌పి, టార్క్)

* డాట్సన్ గో (1200సీసీ)

పవర్ - 67 బిహెచ్‌పి

టార్క్ - 104 ఎన్ఎమ్

* మారుతి ఆల్టో కె10 (1000సీసీ)

పవర్ - 67 బిహెచ్‌పి

టార్క్ - 90 ఎన్ఎమ్

మైలేజ్

మైలేజ్

ఈ ప్రైస్ రేంజ్‌లో తయారీదారులు/కొనుగోలుదారులు పెర్ఫార్మెన్స్ మీద కాకుండా మైలేజ్‌పైనే ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. డాట్సన్ గో లీటరు పెట్రోల్‌కు 20.6 కి.మీ. మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. అయితే, వాస్తవానికి మేము నడిపినప్పుడు ఇది లీటరుకు 17 కి.మీ. మైలేజీనిచ్చింది (సిటీ, హైవే కలిపి).

ఫ్యాక్ట్‌షీట్: (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్)

* డాట్సన్ గో (1200సీసీ) - 20.6 కెఎమ్‌పిఎల్

* ఆల్టో కె10 (1000సీసీ) - 20.2 కెఎమ్‌పిఎల్

* ఇయాన్ (800సీసీ) - 21.1 కెఎమ్‌పిఎల్

డ్రైవ్‌ట్రైన్, ట్రాన్సిమిషన్, పెడల్స్

డ్రైవ్‌ట్రైన్, ట్రాన్సిమిషన్, పెడల్స్

డాట్సన్ గో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్) కలిగిన ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు.

తక్కువ ఇంజన్ స్పీడ్స్ వద్ద అప్‌షిఫ్ట్ చేసినప్పుడు ఈ 104 ఎన్ఎమ్ టార్క్ కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇది సిటీ డ్రైవ్‌కు సరిపోతుంది. అలాగే హైవేలపై నడిపేటప్పుడు, అధిక ఆర్‌పిఎమ్‌ల వద్ద డౌన్‌షిఫ్ట్ చేసినప్పుడు సరైన షిఫ్ట్ పొందటానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

మరో వైపు హ్యాంగింగ్ పెడల్స్ (క్లచ్/బ్రేక్/యాక్సిలరేటర్)ను సిటీ లేదా హైవే డ్రైవ్‌లో ఆపరేట్ చేసేందుకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదు.

రోడ్డు పై..

రోడ్డు పై..

హ్యాండ్లింగ్ విషయానికి వస్తే.. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ 769 కేజీల బరువును కలిగి ఉండి ఈ సెగ్మెంట్లో కెల్లా తేలికైన కారుగా ఉంటుంది. దీని లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కారణంగా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ (సిజి) పెరిగి మంచి హైస్పీడ్స్ వద్ద కూడా మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ఓ మంచి ఫ్యామిలీ కార్ మాత్రమే, పెర్ఫామెన్స్ (రేస్ కార్ లాంటి) కారును కోరుకునే వారికి ఇది సూట్ కాదు.

స్టీరింగ్

స్టీరింగ్

తక్కువ స్పీడ్స్ వద్ద హై-స్పీడ్ కార్నరింగ్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ (ఈపిఎస్)పై కాస్తంత ఎక్కువ ప్రయత్నం చేయాలనిపిస్తుంది. లో స్పీడ్స్‌లో స్టీరింగ్ చాలా లైట్‌గా అనిపిస్తుంది. వేగం పెరిగే కొద్ది స్టీరింగ్‌పై ఎక్కువ బలం ప్రయోగించాల్సి ఉంటుంది.

ఫ్యాక్ట్‌షీట్: (టర్నింగ్ రేడియస్ - మీటర్లలో)

* డాట్సన్ గో - 4.6 మీటర్లు

* మారుతి ఆల్టో కె10 - 4.6 మీటర్లు

* హ్యుందాయ్ ఇయాన్ - 5 మీటర్లు

సస్పెన్షన్, బ్రేకింగ్ అండ్ టైర్స్

సస్పెన్షన్, బ్రేకింగ్ అండ్ టైర్స్

పెద్ద సైజు కుటుంబాలను, భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకొని దీని సస్పెన్షన్‌ను మరియు గ్రౌండ్ క్లియరెన్సును అభివృద్ధి చేశారు. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది, ఫలితంగా సగటు గ్రౌండ్ క్లియరెన్స్ కన్నా ఎక్కువ మరియు రీడిఫైన్డ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తుంది.

బ్రేక్స్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లను వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఒవరాల్‌గా బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదనిపిస్తుంది.

ఫ్యాక్ట్‌షీట్: (టైర్ల సైజులు)

* డాట్సన్ గో - 155/70/R13

* మారుతి ఆల్టో కె10 - 155/65/R13

* హ్యుందాయ్ ఇయాన్ - 145/80/R12

నాసిరకం.. (నాణ్యత లోపం) (తర్వాతి 5 స్లైడ్‌ల వరకు)

నాసిరకం.. (నాణ్యత లోపం) (తర్వాతి 5 స్లైడ్‌ల వరకు)

డాట్సన్ గో బ్యాచ్‌బ్యాక్ బడ్జెట్ కారు కావటంతో కంపెనీ తయారీ విషయంలో నాణ్యతాప్రమాణల అంశంలో రాజీపడినట్లు అనిపిస్తుంది. ఇందులో ఉపయోగించిన ప్లాస్టిక్ నాణ్యతను మరింత మెరుగుపరచి ఉంటే, బాగుండనిపిస్తుంది.

ఈ ఫొటోలో గమనించినట్లయితే, దీని లోపలి డోర్ ప్యానెల్స్ చాలా సులువుగా తొలగిపోతున్నాయి. కానీ, గట్టిగా గుద్దితే తిరిగి యధాస్థానంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ విషయంలో నాణ్యత లోపం కనిపిస్తుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కేవలం ప్లాస్టికే కాదు, మేము డ్రైవ్ చేసిన టాప్ ఎండ్ వేరియంట్లో డే/నైట్ డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా లేకపోవటం మరో భద్రతా లోపంగా చెప్పుకోవచ్చు. రాత్రివేళ్లలో డ్రైవ్ చేసేటప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎక్స్టీరియర్‌లో గమనిస్తే.. విండ్‌షీల్డ్ చుట్టూ ఉపయోగించిన ప్లాస్టిక్‌లో కూడా నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైపర్ బ్లేడ్లకు దిగువన ఉండే ప్లాస్టిక్ చాలా వదులుగా అనిపిస్తుంది. దీనిని ఫిక్స్ చేయడానికి మరికొన్ని స్క్రూలు బిగించి ఉంటే బాగుండేది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఐడిల్ స్పీడ్స్ వద్ద వైబ్రేషన్ ఉందని ఇదివరకు చెప్పుకున్నాం కదా.. మీరు ఈ ఫొటోను సరిగ్గా గమనిస్తే, డాట్సన్ గో వెనుక వైపు, కారు క్రింది భాగంలో ఎగ్జాస్ట్ పైప్ (సైలెన్సర్)ను పట్టి ఉంచేందుకు ఓ నాసిరకం క్లాంప్ను ఉపయోగించారు. గ్రామీణ రోడ్లపై ఇది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో డాట్సన్ మరింత నాణ్యతను పాటించి ఉంటే బాగుండేది.

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

చివరిగా.. డాట్సన్ గో కారులో బూట్ లాక్ (వెనుక డోరు లాక్) లేకపోవటం ఇందులో మరో లోపంగా గుర్తించవచ్చు. ఈ సౌలభ్యం లేని కారణంగా ఈ కారు బూట్ డోరును వెనుక నుంచి ఓపెన్ చేయటం సాధ్యం కాదు. అంటే బూట్ డోరు ఓపెన్ చేయాల్సి వచ్చినపుడల్లా డ్రైవర్ సైడ్ డోరును ఓపెన్ చేసి, బూట్ డోరును రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది.

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి:

* ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్

* విశాలమైన ఫ్రంట్ సీట్స్

* రీఫైన్డ్ రైడ్ కంఫర్ట్

* అధిక గ్రౌండ్ క్లియరెన్స్

* మొబైల్ డాకింగ్ స్టేషన్

* బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్ స్పేస్

* బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్

* బెస్ట్ ఇన్ క్లాస్ పవర్, టార్క్

* మంచి మైలేజ్ (సిటీ, హైవేలపై)

* కిలోమీటర్లతో సంబంధం లేకుండా 2 ఏళ్ల అపరిమిత వారంటీ

చెడు:

* బూట్ లాక్ లేకపోవటం

* సేఫ్టీ ఫీచర్లు (ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్) లేకపోవటం

* నాసిరకం ప్లాస్టిక్ మెటీరియల్

* నాయిర్, వైబ్రేషన్ అండ్ హార్ష్‌నెస్ (ఎన్‌విహెచ్)

* నాన్ అడ్జస్టబల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్

* డ్రైవర్ సైడ్ మాస్టర్ పవర్ విండో కంట్రోల్స్ లేకపోవటం

ఎక్స్-ఫ్యాక్టర్:

తొలిసారిగా కారును కొనాలనుకునే వారికి బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ కార్

రేటింగ్:

3.5 / 5

డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మరి ఈ డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్ మీకు నచ్చిందా..? మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Fasten your seat belts as we take you on a virtual first drive of the Datsun GO, a distinctive five-door, five-seat hatchback specifically crafted for the first-time new car buyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X