బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు.....డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్

By Anil

రెనో-నిస్సాన్ 1999 లో రెండు పెద్ద కార్ల తయారీ సంస్థలు ఫ్రాంకో-జపనీస్ టెక్నాలజీల సంయుక్తంతో భాగస్వామ్యం అయ్యాయి. ఆ తరువాత నిస్సాన్‌ వారి ఆధ్వర్యంలో కార్యకాలపాలు సాగిస్తూ బడ్జెట్ కార్ల తయారీ సంస్థగా 2013 నుండి డాట్సన్ నిస్సాన్ వారి సహకారంతో దేశీయంగా కార్యకలాపాలు విసృతం చేసింది. అప్పటి నుండి డాట్సన్ దేశీయంగానే కాకుండా సౌత్ అఫ్రికా మరియు రష్యా వంటి దేశాలలో ఎంట్రీ లెవల్ బడ్జెట్ కార్లను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అందులో భాగంగానే డాట్సన్ తమ రెడి గో బడ్జెట్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్

డాట్సన్ రెడి గో :
డాట్సన్ సంస్థ ఈ రెడి గో చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును ఎంట్రీ లెవల్ కార్లను తయారు చేసే సిఎమ్ఎఫ్-ఎ వేదిక ఆధారంతో తయారు చేశారు. సిఎమ్‌ఎఫ్ అనగా కామన్ మోడ్యూల్ ఫ్యామిలీ అంటారు మరియు సిఎమ్‌ఎఫ్-ఎ అనగా చిన్న మరియు సరసమైన విభాగానికి చెందిన ఎంట్రీ లెవల్ కార్లను అభివృద్ది చేసే విభాగం అని అర్థం. రెనో వారి క్విడ్ కారు కూడా ఇదే వేదిక మీద రూపు దిద్దుకుంది. డాట్సన్ సంస్థ వైవిధ్యమైన మరియు స్పోర్టివ్ చూపులతో ఉండే విధంగా రెడి గో కారును రూపొందించారు.

డిజైన్ :
డాట్సన్ దీనిని షార్ప్‌ లుక్స్ మరియు మస్కలర్ బాడీ అదే విధంగా శక్తివంతమైన స్పోర్టివ్ లుక్ డిజైన్‌తో యువతను టార్గెట్ చేసి డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆల్టో 800 మరియు రెనో క్విడ్ వంటి వాటితో పోల్చితే ఇది విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది.

డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్


ఇంటీరియర్ :
డాట్సన్ రెడి గో హ్యాచ్‌బ్యాక్ కారును ఎక్ట్సీరియర్‌ డిజైన్‌‌తో పోల్చితే ఇంటీరియర్ డిజైన్ మీద పెద్దగా చొరవ తీసుకోలేదు. ఇంటీరియర్ మొత్తం దాదాపుగా మొత్తం ప్లాస్టిక్‌తో డిజైన్ చేశారు. క్యాబిన్ స్పేస్ పరంగా సంతృప్తిపరిచినప్పటికీ స్టోరేజ్ కోసం ఏవిధమైన ప్రత్యేకమైన స్పేస్ ఇందులో కల్పించలేకపోయారు. ఎటువంటి మెటల్ పరికరాలు కూడా ఇందులో కనిపించవు. ఫీచర్లు గురించి డాట్సన్ పూర్తిగా మరిచిపోయిందని చెప్పవచ్చు. ఈ అంశాలన్నింటిని చూస్తే ఈ రెడి గో కారును అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రూపొందించినట్లు తెలుస్తోంది.
డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్


ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు :

  • ఇంజన్ - 799 సీసీ మూడు సిలిండర్ల పెట్రోల్
  • పవర్ మరియు టార్క్ - 53 బిహెచ్‌పి/ 72 ఎన్ఎమ్
  • గేర్ బాక్స్ - 5-స్పీడ్ మ్యాన్యువల్
  • డ్రైవ్ సిస్టమ్ - ఫ్రంట్ వీల్ డ్రైవ్
  • మైలేజ్ - 25.17 కిమీ/లీ (ఏఆర్ఏఐ ప్రకారం)
  • ఇంధన ట్యాంకు సామర్థ్యం - 28 లీటర్లు
  • గరిష్ట వేగం - 140 కిలోమీటర్లు
  • 0-నుండి 100 కిమీల వేగం - 15.9 సెకండ్ల కాలంలో
  • భద్రత - టాప్ ఎండ్ వేరియంట్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్

టెస్ట్ డ్రైవ్ నిర్వహించిన సమయంలో ఇది లీటర్‌కు 19 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇచ్చింది.

పర్ఫామెన్స్, రైడింగ్ మరియు నిర్వహణ :
ఇందులో హైలట్ ఏమిటంటే-799 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, ఇది క్విడ్ కన్నా ఎక్కువ శక్తివంతమైనది. క్విడ్‌లో ఉన్న విధంగానే ఇందులో 799సీసీ కెపాసిటి గల ఇంజన్, 53 బిహెచ్‌పి మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్‌లో ఉన్నాయి.

క్విడ్ పనితీరుతో పోల్చుకుంటే రెడి గో కొంచెం బెటర్‌గా ఉంటుంది. అంతే కాకుండా క్విడ్ కారు కన్నా 25 కేజీలు తకువ బరువుంటుంది(ఖాలీ కారు బరువులను పోల్చితే) తద్వారా బరువు-పవర్ మరియు బరువు-టార్క్‌ నిష్పత్తుల పరంగా చూసుకుంటే క్విడ్ కన్నా రెడి గో బెటర్‌గా ఉంటుంది.

డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్


రెడి గో హ్యాచ్‌బ్యాక్ కారు పల్లపు ప్రదేశాల నుండి ఎత్తైన రహదారుల మీదకు చేరడానికి ప్రయత్నించే సమయంలో ఇది గరిష్టం 72 వరకు ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెడి గో లోని ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నపుడు ఎంతో భారంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆర్‌పిఎమ్ వద్ద ఇంజన్ చేసే శబ్దం క్విడ్ లోని 800సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ యొక్క శబ్దాన్ని గుర్తుచేస్తుంది.

నిర్వహణ పరంగా రెడి గో నుండి వినియోగదారుల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఇందులోని నాలుగు చక్రాలు కూడా 13-అంగుళా జెకె టైర్లు (155/80 ఆర్13 కొలతలు ) ఉంటాయి. ఇవి ఎంతో పటిష్టతతో మంచి గ్రిప్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని డ్రైవ్‌ చేస్తున్న సమయంలో మంచి అనుభూతిని పొందుతారు.

ఇందులో వైబ్రేషన్లు (అదుర్లు) చాలా వరకు తక్కువ మరియు కారులోని చిన్న చిన్న పరికరాలు ఏ మాత్రం కూడా తక్కువగా వచ్చే అదుర్లకు గురికావు. మరియు స్పోర్టివ్, ఎస్‌యువి తరహాలో ఉండే దీనిని ఓవరాల్ బాడీ డిజైన్‌కు అనుగుణంగా 185 ఎమ్‌ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కల్పించారు.

డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్


సిటిలో చక్కటి డ్రైవబిలిటీ కల్పించిన మృదువైన మరియు సులువైన స్టీరింగ్ ధన్యవాదాలు చెప్పచ్చు. అయితే గరిష్ట వేగం వద్ద దీని డ్రైవింగ్ కొంచెం అసహనానికి గురి చేస్తుంది. ఇక ముందు వైపున ఎత్తైన డ్రైవింగ్ సీటు డ్రైవింగ్ చేసే సమయంలో మరింత సౌకర్యంగా ఉండేట్లు చేస్తుంది. చాలా వరకు ఎంట్రీ లెవల్ కార్లు సిటి రోడ్లను మరియు సిటి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడతాయి. ఇక బ్రేకింగ్ మరియు ఇతర పెడల్స్ విషయానికి వస్తే ఆరడుగులు పొడవున్న వ్యక్తులు కూడా దీనిని సౌకర్యవంతంగా డ్రైవ్ చేయగలరు.

మొత్తంగా రెడి గో 800 సీసీ సామర్థ్యం ఉన్న శక్తివంతమైన కారు, దీనిని 200 నుండి 4000 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం మధ్య సిటి డ్రైవింగ్‌కు ఎంతో చక్కగా ఉంటుంది.

అనుకూల అంశాలు :

English summary
Datsun Redigo Review Test Drive Report In Telugu
Story first published: Tuesday, May 17, 2016, 17:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X