ఫియట్ అవెంచురా రివ్యూ: కొత్త దుస్తులు ధరించిన ఫియట్ పుంటో!

By Ravi

ఒకప్పుడు కారు కంటే ఓ రెండు మూడు బాడీ షేపులలో మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడు రోజుకో కొత్త సెగ్మెంట్ పుట్టుకొస్తోంది. అలా పుట్టుకొచ్చిన కొత్త సెగ్మెంటే 'క్రాసోవర్' రెండు విభిన్న రకాల బాడీ టైప్‌లను కలిగిన కార్లను తీసుకొని, ఒక కారుగా డిజైన్ చేయటమే క్రాసోవర్ అని చెప్పొచ్చు. అలాంటి క్రాసోవరే ఈ కొత్త 'ఫియట్ అవెంచురా' (Fiat Avventura).

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా తమ అవెంచురా మోడల్‌ని 'కాంటెంపరరీ అర్బన్ వెహికల్' (సియూవి) అని పిలుస్తుంది. వాస్తవానికి ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను కంపెనీ అందిస్తున్న పుంటో హ్యాచ్‍బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది పరమాణంలో దాదాపు ఫియట్ పుంటోతో సమానంగా ఉంటుంది. కానీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ లుక్ అండ్ ఫీల్ మాత్రం వేరుగా ఉంటుంది.

ఫియట్ అందిస్తున్న అవెంచురా క్రాసోవర్‌ను ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ యూనిట్ ముంబైలో టెస్ట్ డ్రైవ్ చేసింది. మరి టెస్టింగ్‌లో ఈ మోడల్‌ను పాస్ అయ్యిుందా లేక ఫెయిల్ అయ్యిందా తెలుసుకునే ప్రయత్నాం చేద్దాం రండి..!

ఫియట్ అవెంచురా టెస్ట్ డ్రైవ్ రిపోర్టును ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫియట్ అవెంచురా రివ్యూ

టెస్ట్ చేసిన మోడల్: ఫియట్ అవెంచురా 1.4 డైనమిక్

ఫ్యూయెల్ టైప్: పెట్రోల్

రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: ముంబై, పూనే

తర్వాతి స్లైడ్‌లలో రివ్యూని చదవండి.
డిజైన్ - ఫ్రంట్

డిజైన్ - ఫ్రంట్

ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను మరీ భారీగా మాడిఫై చేయకుండా, బంపర్స్, సైడ్ బాడీ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటి చిన్నపాటి మార్పులతో అవెంచురాని డిజైన్ చేశారు. అందుకే, ఈ మోడల్‌కు పుంటోకు మధ్య అనేక సిమిలారిటీలు కనిపిస్తాయి. బహుశా అవెంచురా ఉత్పత్తి ఖర్చును తక్కువగా ఉంచేందుకే ఫియట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఫియట్ అవెంచురాకు ప్రీమియం లుక్ కల్పించేందుకు గాను ఫ్రంట్ గ్రిల్ చుట్టూ క్రోమ్ గార్నిష్ చేశారు. అలాగే, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ కూడా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్ ప్లాస్టిక్ అండ్ గ్రే కలర్‌లో ఉంటుంది.

డిజైన్ - సైడ్

డిజైన్ - సైడ్

సైడ్ నుంచి చూసినట్లయితే.. తొలిచూపులో ఇది పుంటో మాదిరిగానే అనిపించినప్పటికీ ప్లాస్టిక్ క్లాడింగ్స్, రూఫ్ రెయిల్స్ వలన వ్యత్యాసం తెలుస్తుంది. అంతేకాకుండా.. ఇది పుంటో కన్నా 42 మి.మీ. ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది (పెద్ద వీల్స్ కారణంగా, పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా). వెనుక అమర్చిన స్పేర్ వీల్ కూడా సైడ్ లుక్‌ని మారుస్తుంది.

డిజైన్ - రియర్

డిజైన్ - రియర్

అవెంచురా రియర్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. వెనుక వైపు స్పేర్ వీల్‌ను బూట్ డోర్‌కి (ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా) కాకుండా వెనుక బంపర్‌లో అమరి ఉండేలా, షాషీకి బోల్ట్ చేయబడిన ప్రత్యేక మెకానిజంతో పనిచేస్తుంది. వెనుక వైపు కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ బంపర్, బంపర్‌కు ఇరువైపులా అమర్చబడిన రిఫ్లెక్టర్స్, బంపర్‌లోనే అమరి ఉండే ఎగ్జాస్ట్ పైప్, స్పేర్ వీల్ క్యాప్‌తో ఇది స్పోర్టీగా కనిపిస్తుంది.

ఇంజన్

ఇంజన్

మేము టెస్ట్ డ్రైవ్ చేసినది పెట్రోల్ వెర్షన్ ఫియట్ అవెంచురా. ఇందులో 1368సీసీ ఫైర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, క్రాసోవర్ లాంటి వాహనానికి ఈ ఇంజన్ పవర్ సరిపోదు. మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు పవర్ ల్యాగ్‌ని ఫీల్ అవ్వటం జరిగింది. ఇందులో కంపెనీ తమ లీనియా సెడాన్‌లో ఆఫర్ చేస్తున్న 112 బిహెచ్‌పి టి-జెట్ ఇంజన్‌ను అమర్చి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఫియట్ అవెంచురా పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది లాంగ్ త్రోని కలిగి ఉండి, కాస్తంత రబ్బర్ టచ్ ఫీల్ కలిగి ఉంటుంది. మేము టెస్ట్ చేసిన వేరియంట్‌లో లెథర్‌తో కవర్ చేయబడిన గేర్ నాబ్ లేదు, ఫలితంగా ఇది వేళ్లకు కాస్తతం హార్డ్ ఫీల్‌ని కలిగిస్తుంది. అయితే, గతంలో పుంటో ఇవోని డ్రైవ్ చేసినప్పుడు మేము ఫీల్ అయిన గేర్‌షిఫ్ట్ అస్థిరత అవెంచురాలో కలగలేదు.

సస్పెన్షన్

సస్పెన్షన్

రగ్గడ్ లుక్ అండ్ ఫీల్ కలిగిన ఫియట్ అవెంచురా సస్పెన్షన్‌ను ఇండియన్ రోడ్స్‌కి అనుగుణంగా ట్యూన్ చేశారు. ఈ కారులో పెద్ద 16 ఇంచ్ వీల్స్‌ని ఆఫర్ చేస్తున్నారు. పాట్‌హోల్స్ ఇంపాక్ట్‌ను అబ్జార్బ్ చేసేలా సస్పెన్షన్‌ను ధృడంగా మార్చారు. మొత్తానికి అవెంచురా సస్పెన్షన్ పుంటో ఇవో సస్పెన్షన్ కన్నా మెరుగ్గా అనిపిస్తుంది.

క్యాబిన్

క్యాబిన్

ఫియట్ అవెంచురా క్యాబిన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఆరెంజ కలర్ ఇల్యుమినేటింగ్‌తో కూడిన మీటర్ కన్సోల్స్, సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా ఆఫర్ చేస్తున్న హై టెర్రైన్ గేజెస్ (ఇది కారు వెళ్లే దిశను, కోణాన్ని మొదలైన సమాచారాన్ని తెలియజేస్తుంది), ఆడియో సిస్టమ్ వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చూడొచ్చు.

లెగ్‌రూమ్

లెగ్‌రూమ్

ఫియట్ పుంటో ఇవో సైజును ఏమాత్రం మార్చకుండా ఈ క్రాసోవర్‌ను తయారు చేశారు కాబట్టి, ఇందులో లెగ్‌రూమ్ కూడా పుంటో ఇవో మాదిరిగానే ఉంటుంది. ఆరు అడుగులు పొడవున్న వ్యక్తులు ఇందులో కూర్చున్నప్పుడు కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

ఫియట్ అవెంచురాలో బేసిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. నాలుగు డోర్లలో అమర్చిన స్పీకర్ల నుంచి వచ్చే శబ్ధం అంత గొప్పగా కాకపోయినా, బాగానే ఉంటుంది. ఈ ఆడియో సిస్టమ్ సిడి, ఎఫ్ఎమ్, ఆక్స్-ఇన్, యూఎస్‌బి పోర్టులను సపోర్ట్ చేస్తుంది. పియానో బ్లాక్ ఫినిష్‌లో ఇది తళతళా మెరుస్తూ కనిపిస్తుంది. బూట్ డోర్ రిలీజ్ స్విచ్ కూడా ఇదే ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ కుడివైపు చివర్లో చూసినట్లయితే ఓ బటన్ (రెడ్ సర్కిల్‌లో ఉండే స్విచ్) కనిపిస్తుంది, అదే బూట్ రిలీజ్ స్విచ్.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

ఫియట్ అవెంచురాలో 280 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ బూట్ స్పేస్‌ను యాక్సిస్ చేయాలంటే, ముందుగా ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్‌పై బూట్ రిలీజ్ స్విచ్‌ని నొక్కిన తర్వాత, కారు వెనుక వైపు స్పేర్ వీల్ సెక్షన్‌ను పూర్తిగా ఓపెన్ చేసి ఆ తర్వాత మాత్రమే బూట్ డోరును పైకి లేపాల్సి ఉంటుంది. ఇరుకు ప్రదేశంలో పార్క్ చేసినట్లయితే, దీనిని యాక్సిస్ చేయటం సాధ్యం కాకపోవచ్చు.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా సెంటర్ ఏసి వెంట్స్‌కు ఎగువన హై టెర్రైన్ గేజెస్ అమర్చబడి ఉంటాయి. ఇందులో ఓ కంపాస్, టిల్ట్ మీటర్ మరియు ఓ ఇన్‌క్లైనోమీటర్ ఉంటాయి. ఈ మీటర్లు కారు వెళ్లే దిశను, కోణాన్ని మొదలైన సమాచారాన్ని తెలియజేస్తాయి.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫ్రంట్ బంపర్‌ను ఖచ్చితంగా ఎండ్ చేయకుండా, కాస్తంత క్రింద వైపు ఎక్స్టెండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఫలితంగా ఇది పెద్ద పెద్ద ఎస్‌యూవీలలో ఆఫర్ చేసే స్కిడ్ ప్లేట్ మాదిరిగా కనిపిస్తుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను మరీ పెద్దది కాకుండా, సన్నగా ఉండేలా డిజైన్ చేయటం వలన ఇది కారు లుక్ అండ్ ఫీల్‌ని మరింత పెంచడంలో సహకరిస్తుంది. ఈ క్లాడింగ్ ఫిట్ అండ్ ఫనిషింగ్ చక్కగా ఉంటుంది. డోర్లపై ఉండే క్లాడింగ్‌పై అవెంచురా బ్రాండింగ్ క్రాఫ్ట్ చేయబడి ఉంటుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

డల్ సిల్వర్ కలర్‌లో ఉండే 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ కారు అందాన్ని పెంచడంలో మరింత సహకరిస్తాయి.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

మేము డ్రైవ్ చేసిన వేరియంట్‌లోని ఏసి కంట్రోల్స్ మ్యాన్యువల్ అయినప్పటికీ, సాఫ్ట్ టచ్ ఫీల్ ఉన్న రబ్బరుతో వీటిని తయారు చేశారు. ఫలితంగా వీటిని ఉపయోగిస్తున్నప్పుడు హార్డ్‌నెస్ ఫీల్ ఉండదు.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురాలోని మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే డ్రైవర్‌కు కావల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది రేంజ్, ప్రయాణించిన దూరం, సగటు ఇంధన వినియోగం, సగటు వేగం మొదలైన సమాచారాన్ని తెలియజేస్తుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా గ్లవ్ బాక్స్ స్థలం పెద్దదిగా ఉండి, లోపలివైపు ఓ చిన్న లైట్ కూడా ఉంటుంది. విలువైన పత్రాలు, వస్తువులను దాచుకునేందుకు ఇందులో ఓ సీక్రెట్ కంపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది. పైఫొటోలో మీరు చూస్తున్నది ఫుల్ గ్లవ్ బాక్స్, క్రింది ఫొటోలో ఉన్నది ఓపెన్ చేయబడిన సీక్రెట్ కంపార్ట్‌మెంట్.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా వెనుక భాగంలో ఉండే ఎగ్జాస్ట్ (సైలెన్సర్)ను చాలా చక్కగా డిజైన్ చేశారు. క్రోమ్ టిప్‌తో వెనుక బంపర్ డిజైన్‌లో కలిసిపోయే విధంగా దీనిని డిజైన్ చేశారు.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ బ్రాండ్ లోగోను బానెట్‌పై చాలా అందంగా అమర్చారు. ఈ లోగో బానెట్‌ను తొలుచుకొని పైకి వస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్ డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా హెడ్‌లైట్స్ చాలా పవర్‌ఫుల్‌గా అనిపించాయి. రాత్రివేళల్లో పూర్తి రోడ్‌ను కవర్ చేసేలా లైటింగ్ ఉంటుంది. కాకపోతే, ఇందులో డిఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) మిస్ అయ్యాయి.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

వెడల్పాటి డోర్ల కారణంగా ఫియట్ అవెంచురా కారులోకి ప్రవేశించడం లేదా బయటకు రావటంలో మాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఈ క్రాసోవర్‌కు 16 ఇంచ్ గుడ్ ఇయర్ ఈగల్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు అన్నిరకాల రోడ్లపై మంచి గ్రిప్‌ని ఇచ్చాయి. ఈ పెద్ద టైర్ల కారణంగా అవెంచురా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది.

టైర్ సైజ్: 205/55 R16
మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా టెయిల్ ల్యాంప్ డిజైన్ ఎల్ఈడి తరహాలో ఉంటుంది. ఇది సాధారణ క్లస్టరే అయినప్పటికీ, బ్రైట్‌గా వెలిగినప్పుడు చూస్తే, దూరం నుంచి ఎల్ఈడి క్లస్టర్ మాదిరిగా అనిపిస్తుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

డ్యాష్‌బోర్డుపై ఉండే లైట్ గ్రే సాఫ్ట్ టచ్ క్లాడింగ్ మంచి చేతులకు మంచి సాఫ్ట్ ఫీల్‌ని ఇస్తుంది. అయితే, ఇది త్వరగా మురికి అవుతుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

అవెంచురా రూఫ్ రెయిల్స్ కారుకు మరింత స్పోర్టీ అప్పీల్‌ని తెచ్చిపెడుతాయి.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ పుంటో ఇవో హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌కి అవెంచురా హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌కి ఏ మాత్రం తేడా ఉండదు. అయితే, ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటే, ఇంకా బాగుండనేది మా అభిప్రాయం.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

అవెంచురాలో డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంది. పొట్టిగా ఉండే డ్రైవర్లు తమకు రోడ్ మార్జిన్స్ కనిపించే వరకూ ఈ సీటును సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదొక మంచి సేఫ్టీ ఫీచర్‌లా కూడా సహకరిస్తుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

క్రాసోవర్‌లకు అత్యంత ముఖ్యమైనది గ్రౌండ్ క్లియరెన్స్. ఫియట్ అవెంచురా 205 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, పెద్ద ఎస్‍యూవీల మాదిరిగా ఈ క్రాసోవర్‌తో ఫుల్ ఆఫ్-రోడింగ్ చేయటం సాధ్యం కాదు.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

ఫియట్ అవెంచురా వెనుక వరుసలో స్ప్లిట్ సీట్ లేదు. కానీ, మొత్తం సీటును పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు. ఇందులో సింపుల్ లాకింగ్ మెకానిజం ఉంటుంది, ఈ ఫొటోలో కనిపిస్తున్న నాబ్‌ని ప్రెస్ చేయగానే సీట్ ఫోల్డ్ అవుతుంది.

మాకు నచ్చినవి

మాకు నచ్చినవి

అవెంచురాలోని మీటర్ గేజ్‌లు ఆరెంజ్ కలర్ ప్రకాశిస్తూ, కళ్లకి ఇంపుగా అనిపిస్తాయి. వాస్తవానికి ఇది పుంటో ఇవో లోని మల్టీ-కలర్ డిస్‌ప్లే కన్నా బెటర్‌గా అనిపిస్తాయి.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

ఫియట్ అవెంచురాలోని రియర్ ఫిక్స్డ్ హెడ్‌రెస్ట్, స్పేర్ వీల్, చిన్నపాటి రియర్ విండ్‌షీల్డ్ కారణంగా రియర్ విజిబిలిటీ తక్కువగా అనిపిస్తుంది. కారును రివర్స్ చేసేటప్పుడు విజిబిలిటీ సమస్య తలెత్తవచ్చు. ఇందులో పార్కింగ్ సెన్సార్లు కూడా లేవు.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

అవెంచురాలో యుటిలిటీ స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉంటుంది. డోర్లలో సైతం స్టోరేజ్ స్పేస్‌ని వృధా చేశారనిపించింది. ఈ ఫొటోను చూసినట్లయితే, ఇందులో అర్థ లీటరు వాటర్ బాటిల్ కూడా సరిగ్గా ఇమడలేకపోయింది.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

ఫియట్ అవెంచురా టెయిల్ గేట్ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఆరు అడుగులు ఉన్న వ్యక్తి సైతం డోరును అందుకునేందుకు ముందు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

డోర్ లాకింగ్ మెకానిజం సిస్టమ్ మమ్మల్ని అంతగా ఆకట్టుకోలేదు. డోర్లను లాక్ చేయాలంటే, లోపలి డోర్ హ్యాండిల్‌ను ముందుకు నొక్కాల్సి చేయాల్సి ఉంటుంది, ఓపెన్ చేయాలంటే అదే డోర్ హ్యాండిల్‌ను వెనుక లాగాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ వలన ప్రమాదవశాత్తు డోర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

క్లచ్ ట్రావెల్ లెన్త్ ఎక్కువగా అనిపించింది. క్లచ్ పూర్తిగా నొక్కడానికి కొద్దిగా బల ప్రయోగం చేయాల్సి వచ్చింది.

కు నచ్చనివి

కు నచ్చనివి

అవెంచురాలోని మల్టీ ఫంక్షనల్ స్టాక్ (స్టీరింగ్ క్రింది భాగంలో ఉండే వైపర్, లైట్స్ మొదలైన కంట్రోల్స్) లావుగా ఉండి, నాణ్యత లేకపోవడాన్ని గుర్తించడం జరిగింది.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

ఫ్రంట్ డోర్‌పై డ్రైవర్ సైడ్ ఉండే ఆర్మ్-రెస్ట్ స్లోప్‌గా, మంచి ఎర్గోనమిక్ డిజైన్‌ను కలిగి ఉండదు.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

రివర్సింగ్ లైటును కారు వెనుక వైపు క్రింది భాగంలో అమర్చిన కారణంగా, రాత్రివేళల్లో కారు వెనుక వైపు చూడటం కష్టంగా అనిపిస్తుంది.

మాకు నచ్చనివి

మాకు నచ్చనివి

స్టీరింగ్ వీల్‌ను 3-స్పోక్ డిజైన్‌లో నైస్‌గా షేప్ చేసినప్పటికీ, ఇది అంత సాఫ్ట్ ఫీల్‌ను కలిగి ఉండదు, ఎక్కువ జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది.

చివరిమాట

చివరిమాట

పూర్తిగా హ్యాచ్‌బ్యాక్‌ను కాకుండా అలాగే పూర్తిగా కాంపాక్ట్ ఎస్‌యూవీని కాకుండా ఈ రెండింటికీ మధ్యలో ఉండే ఉత్పత్తిని కోరుకునే వారికి ఫియట్ అవెంచురా ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. పుంటో ఇవో కన్నా రగ్గడ్ అండ్ స్పోర్టీ లుక్ కలిగి ఉన్న అవెంచురా క్రాసోవర్ వీకెండ్ సవారీకి చక్కగా సూట్ అవుతుంది. ఇదొక యూత్‌ఫుల్ కారు. దీని స్పోర్టీ డిజైన్ చక్కగా ఆకర్షిస్తుంది.

చివరిమాట

చివరిమాట

ఫియట్ అవెంచురాలో ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే అనేక సానుకూల అంశాలున్నాయి. లుక్ అండ్ ఫీల్, పెద్ద టైర్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాల్లో ఇది సెగ్మెంట్లో కెల్లా బెస్ట్‌గా ఉంటుంది. అయితే, దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ఈ క్రాసోవర్ సేఫ్టీ విషయంలో ప్రాధాన్యత లేకపోవటమే. మేము డ్రైవ్ చేసిన వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి కనీస సేఫ్టీ ఫీచర్లు కూడా లేవు. కనీసం ఆప్షనల్‌గా కూడా ఈ సేఫ్టీ ఫీచర్స్ లభ్యం కావటం లేదు.

Most Read Articles

English summary
Fiat Avventura review, test drive by DriveSpark. Read our thoughts on the Fiat Avventura crossover against the Toyota Etios Cross and Volkswagen Cross Polo.
Story first published: Thursday, February 19, 2015, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X