భారత్ లో రూ.5లక్షల లోపు హ్యాచ్ బ్యాక్ కార్లు ఐదు

By Vinay Kumar

హ్యాచ్ బ్యాక్ లు నగరాలకు సరిగ్గా సరిపోయే కార్లు. అవి సౌకర్యవంతంగా, ఇంధన ఆదాతో పార్క్ చేయడానికి సులువుగా ఉంటాయి.

గుర్తుంచుకోవలసిన ఏంటంటే,
హ్యాచ్ బ్యాక్ కార్ తయారీదారులు కష్టమర్లకు అందించే కార్లు టైలర్ బట్టలు కుట్టిన విధంగా ఉంటాయి. కానీ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటాయి.

మరి అసలైన విషయానికొస్తే...భారత్ లో రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ లు ఏవి?

భారత్ లో రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ లు ఏవో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం....

హ్యూందాయ్ ఐ10 :

హ్యూందాయ్ ఐ10 :

భారత్ లో రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ ల జాబితాలో మొదటిది హ్యూందాయ్ ఐ10. దీని ప్రారంభ ధర రూ.4.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది 19.81 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తుంది. ఇందులో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి.

హ్యూందాయ్ ఐ10 :

హ్యూందాయ్ ఐ10 :

68 బీహెచ్పీ మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగల 4-సిలిండర్, 1.1లీటర్ ఐఆర్.డీఈ2 పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

మారుతీ సుజుకీ సెలారియో :

మారుతీ సుజుకీ సెలారియో :

సుజుకీ అందిస్తున్న మారుతీ సుజుకీ సెలారియో కూడా ఐదు కార్ల జాబితాలో ఉంది. దీని ప్రారంభ ధర రూ.4.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది 23.1 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తుంది .ఇందులో పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఏ.ఎమ్.టీ వెర్షన్ రూ.4.54 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ సెలారియో :

మారుతీ సుజుకీ సెలారియో :

67 బీహెచ్పీ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగల 998 సీసీ, 3-సిలిండర్, కే10బి పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా ఏ.ఎమ్.టీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

హోండా బ్రియో :

హోండా బ్రియో :

భారత్ లో రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ ల జాబితాలో మూడవది హోండా బ్రియో. దీని ప్రారంభ ధర రూ.4.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది అన్నిటికంటే స్టైల్ గా ఉంటూ 18.9 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తుంది. ఇందులో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి.

హోండా బ్రియో :

హోండా బ్రియో :

87 బీహెచ్పీ మరియు 109 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగల 1198 సీసీ. 4-సిలిండర్, VTEC పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

నిస్సాన్ మిక్రా యాక్టివ్ :

నిస్సాన్ మిక్రా యాక్టివ్ :

రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ ల జాబితాలో నిస్సాన్ మిక్రా యాక్టివ్ కూడా ఒకటి. దీని ప్రారంభ ధర రూ.4.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది 19.4 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తుంది. ఇది ఐ10, బ్రియోలో ఉన్న ఫీచర్స్ ను కలిగి ఉంది.

నిస్సాన్ మిక్రా యాక్టివ్ :

నిస్సాన్ మిక్రా యాక్టివ్ :

67 బీహెచ్పీ మరియు 104 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగల 1198 సీసీ, 3-సిలిండర్, డీవోహెచ్సీ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

డాట్సన్ గో :

డాట్సన్ గో :

భారత్ లో రూ.5లక్షల లోపు ఉన్న ఐదు హ్యాచ్ బ్యాక్ ల జాబితాలో ఐదవది డాట్సన్ గో. దీని ప్రారంభ ధర రూ.3.12లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ఇందులోని లైన్ వెర్షన్ ధర అత్యధికంగా రూ.3.69లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది 20.63 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తుంది.

డాట్సన్ గో :

డాట్సన్ గో :

67 బీహెచ్పీ మరియు 104 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగల 1198 సీసీ, 3-సిలిండర్, డీవోహెచ్సీ తో పాటు డ్యూయల్ వీటీవీటీ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

Most Read Articles

English summary
5 Budget hatchbacks or small cars for under 5 lakh rupees in India. These cars return good mileage, have features needed for everyday use and are good value.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X