హోండా మొబిలియో vs మారుతి ఎర్టిగా: ఏది బెస్ట్

By Ravi

మిడ్-సైజ్ ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) సెగ్మెంట్లో మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన మొబిలియో ఎమ్‌పివి గట్టి పోటీనిస్తోంది. ఎర్టిగా కన్నా బెటర్ లుక్స్, బెటర్ పెర్ఫార్మెన్స్ మరియు బెటర్ మైలేజీతో హోండా మొబిలియో ఈ సెగ్మెంట్లో దూసుకుపోతోంది.

ఈనాటి మన కంపారిజన్ కథనంలో హోండా మొబిలియో మరియు మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏంటో ఈ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మొబిలియో vs ఎర్టిగా: ఏది బెస్ట్

తర్వాతి స్లైడ్‌లలో హోండా మొబిలియో మరియు మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను తెలుసుకోండి.

కొలతలు

కొలతలు

ముందుగా ఈ రెండు మోడళ్ల కొలతను పరిశీలిద్దాం రండి.

హోండా మొబిలియో 4386 మి.మీ. పొడవును, 1683 మి.మీ. వెడల్పును, 1603 మి.మీ. ఎత్తును కలిగి ఉండి 2650 మి.మీ. వీల్‌బేస్ మరియు 189 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

కొలతలు

కొలతలు

మారుతి ఎర్టిగా 4265 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును, 1685 మి.మీ. ఎత్తును కలిగి ఉండి 2740 మి.మీ. వీల్‌బేస్ మరియు 185 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

(కొలతల పరంగా చూసుకుంటే, హోండా మొబిలియోలో ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది, ఎర్టిగాలో ఎక్కువ షోల్డర్/హెడ్‌రూమ్ లభిస్తుంది)

ఇంజన్ డిటేల్స్

ఇంజన్ డిటేల్స్

ఈ రెండు మోడళ్లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.

హోండా మొబిలియో పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-విటెక్, డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌లను ఉపయోగించారు.

మారుతి ఎర్టిగా పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్, డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ ఇంజన్‌లను ఉపయోగించారు.

ఇంజన్ స్పెసిఫికేషన్స్

ఇంజన్ స్పెసిఫికేషన్స్

హోండా మొబిలియో పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-విటెక్ ఇంజన్ 119 పిఎస్‌‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి ఎర్టిగా పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ ఇంజన్ 95 పిఎస్‌‌ల శక్తిని, 132 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 200 టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

(ఇంజన్స్ పరంగా చూసుకుంటే, మారుతి ఎర్టిగా కన్నా హోండా మొబిలియోలోనే ఎక్కువ పవర్‌ను కలిగి ఉంది).

మైలేజ్

మైలేజ్

ఈ రెండు మోడళ్ల పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

హోండా మొబిలియో (పెట్రోల్) : 16.5 కెఎమ్‌పిఎల్

హోండా మొబిలియో (డీజిల్) : 24.0 కెఎమ్‌పిఎల్

మారుతి ఎర్టిగా (పెట్రోల్) : 16.02 కెఎమ్‌పిఎల్

మారుతి ఎర్టిగా (డీజిల్) : 22.77 కెఎమ్‌పిఎల్

(అన్ని మైలేజీలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)

హోండా మొబిలియో ధరలు (ఆగస్ట్ 2014 నాటికి)

హోండా మొబిలియో ధరలు (ఆగస్ట్ 2014 నాటికి)

మొబిలియో ఈ (పెట్రోల్) - రూ.6.49 లక్షలు

మొబిలియో ఎస్ (పెట్రోల్) - రూ.7.51 లక్షలు

మొబిలియో వి (పెట్రోల్) - రూ.8.78 లక్షలు

మొబిలియో ఈ (డీజిల్) - రూ.7.89 లక్షలు

మొబిలియో ఎస్ (డీజిల్) - రూ.8.60 లక్షలు

మొబిలియో వి (డీజిల్) - రూ.9.60 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మారుతి ఎర్టిగా ధరలు (ఆగస్ట్ 2014 నాటికి)

మారుతి ఎర్టిగా ధరలు (ఆగస్ట్ 2014 నాటికి)

ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.6.21 లక్షలు

ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.6.91 లక్షలు

ఎర్టిగా విఎక్స్ఐ ఏబిఎస్ (పెట్రోల్) - రూ.6.98 లక్షలు

ఎర్టిగా జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7.70 లక్షలు

ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.6.73 లక్షలు

ఎర్టిగా విఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.7.50 లక్షలు

ఎర్టిగా ఎల్‌డిఐ (డీజిల్) - రూ.7.62 లక్షలు

ఎర్టిగా విడిఐ (డీజిల్) - రూ.8.26 లక్షలు

ఎర్టిగా జెడ్‌డిఐ (డీజిల్) - రూ.8.91 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చివరిమాట

చివరిమాట

కేవలం ధర పరంగా మాత్రమే చూసుకుంటే హోండా మొబిలియో కన్నా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి బెస్ట్ మోడల్ అనిపించినప్పటికీ, మోడ్రన్ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజన్స్, బెటర్ మైలేజ్ వంటి అంశాల్లో హోండా మొబిలియో బెస్ట్ మోడల్‌గా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Ertiga is facing some stiff competition from Honda's recently launched Mobilio MPV. Here We compared these two MPV's. Take a look and let us know which is your choice.
Story first published: Monday, September 22, 2014, 12:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X