హోండా మొబిలియో వర్సెస్ మారుతి ఎర్టిగా: ధరల పోలిక

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కేవలం రూ.6.49 లక్షల ప్రారంభ ధరకే (పెట్రోల్ వెర్షన్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'మొబిలియో'ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఎర్టిగాతో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఎర్టిగా మరియు హోండా మొబిలియో ఎమ్‌పివిల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ముందుగా.. హోండా మొబిలియో విషయానికి వస్తే.. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్, 119 పిఎస్, 145 ఎన్ఎమ్ టార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే, డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ 98 బిహెచ్‌పి, 200 ఎన్ఎమ్ టార్క్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ రెండు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 24.2 కి.మీ., పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.3 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఎర్టిగా వర్సెస్ మొబిలియో ప్రైస్ కంపారిజన్‌ను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

తర్వాతి స్లైడ్‌లలో మారుతి సుజుకి ఎర్టిగా మరియు హోండా మొబిలియో వేరియంట్ల వారీ ధరలను పరిశీలించండి.

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

* మొబిలియో ఈ (పెట్రోల్) - రూ.6.49 లక్షలు

* ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.5.80 లక్షలు

* మొబిలియో ఈ (డీజిల్) - రూ.7.89 లక్షలు

* ఎర్టిగా ఎల్‌డిఐ (పెట్రోల్) - రూ.7.22 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

* మొబిలియో ఎస్ (పెట్రోల్) - రూ.7.50 లక్షలు

* ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.6.56 లక్షలు

* మొబిలియో ఎస్ (డీజిల్) - రూ.8.60 లక్షలు

* ఎర్టిగా విడిఐ (పెట్రోల్) - రూ.7.85 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

* మొబిలియో వి (పెట్రోల్) - రూ.8.76 లక్షలు

* ఎర్టిగా జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7.35 లక్షలు

* మొబిలియో వి (డీజిల్) - రూ.9.76 లక్షలు

* ఎర్టిగా జెడ్‌డిఐ (పెట్రోల్) - రూ.8.49 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

హోండా మొబిలియోలో ఆర్ఎస్ (ధర రూ.10.86 లక్షలు) అనే స్పోర్టీ వేరియంట్ లభ్యం కానుంది. కానీ, మారుతి సుజుకి ఎర్టిగాలో ఇలాంటి స్పోర్టీ వేరియంట్ అందుబాటులో లేదు. కానీ, మొబిలియో పోటీని తట్టుకునేందుకు మారుతి సుజుకి తమ ఎర్టిగాలో ఇటీవలే ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

మొబిలియో vs ఎర్టిగా: ధరలు

మొత్తమ్మీద చూసుకుంటే హోండా మొబిలియో ఎమ్‌పివి ధరల కన్నా మారుతి సుజుకి ఎర్టిగా ధరలే చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ.. డిజైన్, పవర్‌ఫుల్ మోడ్రన్ అండ్ ఎఫీషియెంట్ ఇంజన్, ఇంటీరియర్ స్పేస్, కాంపాక్ట్‌నెస్, టెక్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఎర్టిగా కన్నా మొబిలియోనే బెటర్‌గా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Japanese car maker Honda cars has launched Mobilio MPV car in India at an aggressive price range to take market leader Maruti Ertiga head on in the fastest growing car segment in the country. Take a look at the price comparision between these two models.
Story first published: Thursday, July 24, 2014, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X