ఐ20 యాక్టివ్ vs ఎతియోస్ క్రాస్: వీటిలో ఏది బెస్ట్..?

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం క్రాసోవర్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో, టొయోటా ఎతియోస్ క్రాస్, ఫియట్ అవెంచురా మోడళ్లు ఈ సెగ్మెంట్లో హల్ చల్ చేస్తుండగా ఇందులోకి కొత్త హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ వచ్చి చేరింది.

ఈ సెగ్మెంట్లో నేరుగా టొయోటా ఎతియోస్ క్రాస్‌ను సవాల్ చేసేలా హ్యుందాయ్ తమ ఐ20 యాక్టివ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మరి ఈ రెండు క్రాసోవర్లలో ఏది బెస్టో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ ఐ0 యాక్టివ్ డిజైన్:

హ్యుందాయ్ ఐ0 యాక్టివ్ డిజైన్:

హ్యుందాయ్ ఎలైట్ ఐ20ని ఆధారంగా చేసుకొని ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ని డిజైన్ చేశారు. సన్నటి ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, రగ్గడ్ బంపర్స్, స్కిడ్ ప్లేట్స్ మరియు స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ప్రీమియం క్రాసోవర్‌ను తలపిస్తుంది.

టొయోటా ఎతియోస్ క్రాస్ డిజైన్:

టొయోటా ఎతియోస్ క్రాస్ డిజైన్:

టొయోటా ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఎతియోస్ క్రాస్ క్రాసోవర్‌ను డిజైన్ చేశారు. వెడల్పాటి ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, పెద్ద బ్లాక్ కలర్ బంపర్స్, ప్లాస్టిక్ క్లాడింగ్‌పై సిల్వర్ గార్నిష్, స్కిడ్ ప్లేట్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఆఫ్-రోడింగ్ స్టయిల్ వాహనాన్ని తలపిస్తుంది.

డిజైన్‌లో ఏది బెస్ట్?

డిజైన్‌లో ఏది బెస్ట్?

డిజైన్ పరంగా చూసుకుంటే హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్ల కన్నా కాస్తంత ప్రీమియంగా కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో దీని ధర కూడా ఇతర మోడళ్ల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది.

ఇకపోతే టొయోటా ఎతియోస్ క్రాస్‌లో ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ ఎక్కువగా ఉండి, ఎక్స్టీరియర్ డిజైన్‌ను డామినేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. డిజైన్ విషయంలో మా ఓటు హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌కే చెందుతుంది.

గ్రౌండ్ క్లియరెన్స్:

గ్రౌండ్ క్లియరెన్స్:

క్రాసోవర్ వాహనాల్లో అత్యంత ముఖ్యమైన అంశం గ్రౌండ్ క్లియరెన్స్. ఈ విషయంలో హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ బెస్ట్ అని చెప్పాలి. ఎతియోస్ క్రాస్ కన్నా ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వివరాలు:

* హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ - 190 మి.మీ.

* టొయోటా ఎతియోస్ క్రాస్ - 174 మి.మీ.

హ్యుందాయ్ ఐ0 యాక్టివ్ ఇంటీరియర్స్:

హ్యుందాయ్ ఐ0 యాక్టివ్ ఇంటీరియర్స్:

ఇంటీరియర్స్ విషయంలో హ్యుందాయ్ వాహనాలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నాణ్యతలో రాజీ లేకుండా ఎల్లప్పుడూ ఉత్తమ ఇంటీరియర్లను హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంటుంది. ఐ20 యాక్టివ్ రెండు రకాల ఇంటీరియర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఇంటీరియర్స్:

టొయోటా ఎతియోస్ క్రాస్ ఇంటీరియర్స్:

టొయోటా ఎతియోస్ క్రాస్ ఇంటీరియర్స్ ఆల్-బ్లాక్ కలర్ థీమ్‌తో లభిస్తాయి. అయితే, అక్కడక్కడా సిల్వర్ కలర్ గార్నిష్ ఉంటుంది. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను స్టీరింగ్ వెనుక కాకుండా సెంటర్ కన్సోల్‌లో ఫిక్స్ చేశారు. ఇందులో స్పోర్టీ ఫ్యాబ్రిక్ సీట్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ విషయంలో కూడా మా ఓటు ఐ20 యాక్టివ్‌కే వెళుతుంది.

ఇంజన్స్:

ఇంజన్స్:

ఐ20 యాక్టివ్ ఇంజన్, పవర్, మైలేజ్:

* 1.4లీ. డీజిల్ : 90 PS @ 4000 rpm; 21.19 kpl

* 1.2లీ. పెట్రోల్ - 83 PS @ 6000 rpm; 17.19 kpl

ఎతియోస్ క్రాస్ ఇంజన్, పవర్, మైలేజ్:

* 1.5లీ. పెట్రోల్ - 90 PS @ 5600 rpm; 16.78 kpl

* 1.2లీ. పెట్రోల్ - 80 PS @ 5600 rpm; 17.71 kpl

* 1.4లీ. డీజిల్ - 68 PS @ 3800 rpm; 23.59 kpl

ఐ20 యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్:

ఐ20 యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్:

* కార్నరింగ్ ల్యాంప్స్

* స్మార్ట్ పెడల్

* రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ అసిస్ట్

* స్టీరింగ్ అడాప్టివ్ పార్కింగ్ గైడ్‌లైన్స్

* ఎయిర్‌బ్యాగ్స్ (టాప్-వేరియంట్‌లో)

* ఏబిఎస్ (టాప్-వేరియంట్‌లో)

ఎతియోస్ క్రాస్ సేఫ్టీ ఫీచర్స్:

ఎతియోస్ క్రాస్ సేఫ్టీ ఫీచర్స్:

* ఏబిఎస్

* ఈబిడి

* ఎయిర్ బ్యాగ్స్

* ధృడమైన బాడీ

* తుప్పు పట్టని స్టీల్

సేఫ్టీ విషయంలో ఎతియోస్ క్రాస్ బేస్ వేరియంట్లో సైతం ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. కానీ ఐ 20 యాక్టివ్‌లో ఈ ఫీచర్లు టాప్-ఎండ్ వేరియంట్లో లభిస్తాయి. సేఫ్టీలో మా ఓటు మాత్రం ఎతియోస్ క్రాస్‌కే చెందుతుంది.
ధరలు:

ధరలు:

హ్యుందాయ్ ఐ0 యాక్టివ్:

రూ.6.38 లక్షల నుంచి రూ.8.89 లక్షలు

టొయోటా ఎతియోస్ క్రాస్:

రూ.6.23 లక్షల నుంచి రూ.7.71 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ధర పరంగా చూసుకుంటే మా ఓటు మాత్రం ఎతియోస్ క్రాస్‌కే వెళుతుంది. మరి ఈ రెండింటిలో మీకు నచ్చిన మోడల్ ఏదో చెప్పండి.

Most Read Articles

English summary
Hatchbacks becoming crossovers is a trend that seems to be catching on in India. Over a short period, we have seen four crossovers enter the market—Volkswagen Polo Cross, Fiat Avventura, Toyota Etios Cross and now, the latest entrant, the Hyundai i20 Active.
Story first published: Thursday, March 19, 2015, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X