హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ: అన్నింటినీ బీట్ చేసే కాంపాక్ట్ సెడాన్

By Ravi

ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్లకు (నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న కార్లకు) మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే 'హ్యుందాయ్ ఎక్సెంట్' (Hyundai Xcent) అనే కాంపాక్ట్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ ఇదివరకే విడుదల చేసిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, దానికి అదనపు బూట్ స్పేస్‌ను జోడించి ఈ కారును తయారు చేసింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో లభిస్తున్న స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మోడళ్లకు పోటీగా హ్యుందాయ్ తమ ఎక్సెంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడళ్లతో పోల్చుకుంటే, హ్యుందాయ్ ఎక్సెంట్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది.

ఈ ఎడిటోరియల్ రివ్యూలో హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌లో మంచి, చెడు అంశాలను తెలుసుకుందాం రండి..!

హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

ముందుగా.. హ్యుందాయ్ ఎక్సెంట్ పేరు విషయానికి వస్తే, కంపెనీ నిలిపివేసిన పాత హ్యుందాయ్ యాక్సెంట్ (Hyundai Accent) పేరును తలపించేలా ఈ కారుకు ఎక్సెంట్ అనే పేరును పెట్టారు. విమర్శకులు మరియు వినియోగదారుల ద్వారా చక్కగా అంగీకరించబడి, మంచి సక్సెస్‌ను సాధించిన గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫామ్‌పై దీనిని తయారు చేశారు.

హ్యుందాయ్ ఎక్సెంట్ ధరలు

హ్యుందాయ్ ఎక్సెంట్ ధరలు

హ్యుందాయ్ తమ ఎక్సెంట్ ధరలను అమేజ్, డిజైర్‌ల కన్నా తక్కువగా ఉంచేందుకు ప్రయత్నించింది.

  • ఎక్సెంట్ (పెట్రోల్): రూ.4.66 లక్షలు

    ఎక్సెంట్ (డీజిల్): రూ.4.66 లక్షలు

    • అమేజ్ (పెట్రోల్): రూ.4.99 లక్షలు

      అమేజ్ (డీజిల్): రూ.5.97 లక్షలు

      • స్విఫ్ట్ డిజైర్ (పెట్రోల్): రూ.4.85 లక్షలు

        స్విఫ్ట్ డిజైర్ (డీజిల్): రూ.5.78 లక్షలు

      • హ్యుందాయ్ ఎక్సెంట్ పూర్తి ధరల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

        ఎక్స్టీరియర్

        ఎక్స్టీరియర్

        ఎక్సెంట్‌ను గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు కాబట్టి, దీని వెనుక డిజైన్‌లో ముందు వైపు డిజైన్‍‌‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. ఈ రెండు కార్లను ముందు వైపు నుంచి చూస్తే ఏది సెడాన్, ఏది హ్యాచ్‌బ్యాక్ అని టక్కున గుర్తించడం కష్టం.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఏదేమైనప్పటికీ, ఇందులో కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులను గమనించవచ్చు. ఎక్సెంట్‌లో ముందు వైపు ఉండ్ గ్రిల్ చుట్టూ మరియు వెనుక వైపు బూట్ లిడ్ చుట్టూ క్రోమ్ స్ట్రైప్స్‌ను జోడించారు. ఇది మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇస్తుంది.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        గ్రాండ్ ఐ10తో పోలిస్తే.. హెడ్‌లైట్, ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. హై-ఎండ్ వేరియంట్లలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులు స్వాగతించదగినవి.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఇందులో ఆప్షనల్ 15 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇవి కారుకు మరింత స్టయిలిష్ లుక్‌ని ఇచ్చి, కారు అందాన్ని మరింత పెంచుతాయి.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        వెనుక వైపు బూట్ స్పేస్‌ను పెంచడానికి గాను వెనుక డోరు అద్దం పరిమాణాన్ని కొద్దిగా పెంచారు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        గ్రాండ్ ఐ10 రూఫ్‌పై కనిపించే బ్లాక్ ప్లాస్టిక్ స్ట్రైప్స్ ఈ సెడాన్‌లో కనిపించవు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఎక్సెంట్ రియర్ డిజైన్ బెస్ట్ అని చెప్పొచ్చు లేదంటే ఇతర కాంపాక్ట్ సెడాన్ల కన్నా మెరుగ్గా ఉంది అనొచ్చు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఇందులో కొత్త వ్రాప్అరౌండ్ టెయిల్‌లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఈ కారులో మరో ప్రత్యేక ఏంటంటే, దీని విశాలమైన బూట్ స్పేస్. ఇది 407 లీటర్ల బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో అమేజ్, డిజైర్‌ల కన్నా ఇదే బెస్ట్ బూట్ స్పేస్.

        స్విఫ్ట్ డిజైర్ బూట్ స్పేస్ - 315 లీటర్లు

        హోండా అమేజ్ బూట్ స్పేస్ - 400 లీటర్లు

        ఇంటీరియర్

        ఇంటీరియర్

        ఎక్స్టీరియర్ డిజైన్ మాదిరిగానే ఇంటీరియర్ విషయంలో కూడా అనేక క్యాబిన్ కాంపోనెంట్లను గ్రాండ్ ఐ10 నుంచే గ్రహించారు. ఇందులో హై క్వాలిటీ బీజ్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్‌ను ఉపయోగించారు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        గ్రాండ్ ఐ10లో ఆఫర్ చేసిన 1 జిబి స్టోరేజ్ కలిగిన ఆడియో సిస్టమ్, కూల్డ్ గ్లవ్ బాక్స్, స్మార్ట్ కీ, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లను ఇందులోను యధావిధిగా ఉంచారు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        వేరియంట్‌ను బట్టి ఎక్సెంట్ ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ఇందులో ప్రధానంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, రియర్ ఏసి వెంట్స్, రియర్ సీట్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ వంటి ఫీచర్లను చెప్పుకోవచ్చు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        అమేజ్, స్విఫ్ట్ డిజైర్‌ల కన్నా హ్యుందాయ్ ఎక్సెంట్ సన్నగా ఉన్నప్పటికీ, ఇందులోని ఇంటీరియర్ స్పేస్, లెగ్‌రూమ్ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేరు (అంత విశాలంగా ఉంటుంది కాబట్టి).

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే, ఈ సెడాన్‌లోని వెనుక సీట్లు మరింత లీన్-బ్యాక్ పొజిషన్ (వెనక్కు వాలినట్లు ఉండేలా)ను కలిగి ఉంటాయి.

        సేఫ్టీ

        సేఫ్టీ

        డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కేవలం టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఉంటాయి. అలాగే, ఏబిఎస్ ఫీచర్‌ను కూడా ఆప్షనల్‌గా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వేరియంట్లో కూడా లభిస్తోంది.

        పెర్ఫార్మెన్స్

        పెర్ఫార్మెన్స్

        ఇంజన్స్ విషయానికి వస్తే.. గ్రాండ్ ఐ10లో ఉపయోగించిన 1.1 లీటర్ యూ3 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్లనే ఇందులోను ఉపయోగించారు. కాగా.. ఇందులో పెట్రోల్ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు కానీ డీజిల్ ఇంజన్ పవర్‌ను 1 బిహెచ్‌పి మేర, టార్క్‌ను 22 ఎన్ఎమ్‌ల మేర పెంచారు.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఎక్సెంట్‌లోని డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్విఫ్ట్ డిజైర్, అమేజ్ డీజిల్ వెర్షన్లతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ.

        పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 81 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. అలాగే ఇందులో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

        హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

        పెట్రోల్ వెర్షన్ గరిష్టంగా లీటరుకు 19.1 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ గరిష్టంగా లీటరుకు 24.4 కి.మీ. మైలేజీనిస్తుంది (కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం).

        అమేజ్ మైలేజ్: 18 kmpl (పెట్రోల్), 25.8 kmpl (డీజిల్)

        స్విఫ్ట్ డిజైర్ మైలేజ్: 19.1 kmpl (పెట్రోల్), 23.4 kmpl (డీజిల్)

        చివరిమాట

        చివరిమాట

        మంచి: ధర, ఫీచర్లు, నిర్మాణ నాణ్యత, బూట్ స్పేస్, ఇంటీరియర్ స్పేస్

        చెడు: తక్కువ పవర్‌తో కూడిన డీజిల్ ఇంజన్, ఏబిఎస్ స్టాండర్డ్‌గా లేకపోవటం

        మొత్తమ్మీద చూసుకుంటే, హ్యుందాయ్ ఎక్సెంట్ ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. ఈ ఏడాది బెస్ట్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అనేక అవార్డులను కైవసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
When Hyundai set out to design the Grand i10 it clearly did so with the Xcent in mind. How else would Hyundai have managed to neatly turn the hatchback into a sub-4 meter compact sedan where others have failed.
Story first published: Monday, April 7, 2014, 16:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X