జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని స్ట్రెంథ్ చూశారా ?

జీప్ గ్రాండ్ చిరోకీ యొక్క ఆఫ్ రోడ్ సామర్థ్యాలను తెలిపే రివ్యూ. మేము స్వయంగా గ్రాండ్ చిరోకీ వాహనాన్ని నడిపాము. దీని ఆఫ్ రోడింగ్ సామర్థ్యాల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం....

By Anil

అమెరికాకు చెందిన దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ గత ఏడాది ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది పుట్టింది అమెరికాలోనే అయినప్పటికీ ఇది తయారీ చేసే వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అదే విధంగా ఇండియాలో కూడా జీప్ వాహనాలను ఇష్టపడే వారికి కొదవేలేదు.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ బ్రాండ్ వాహన ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా విభాగం గ్రాండ్ చిరోకీ మరియు వ్రాంగ్లర్ ఎస్‌యూవీలను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ఆ తరువాత అనతి కాలంలోనే విపణిలో విక్రయాలకు సిద్దం చేసింది. అయితే జీప్ సంస్థ తమ గ్రాండ్ చిరోకీ వాహనాన్ని నడిపి, దాని ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించే అవకాశాన్ని మాకు (డ్రైవ్‌స్పార్క్ తెలుగు) కల్పించింది. గ్రాండ్ చిరోకీ ఆఫ్ రోడ్ డ్రైవ్ అనుభవం వివరాలు మీ కోసం....

ధర వివరాలు...

ధర వివరాలు...

జీప్ సంస్థ యొక్క ప్రారంభ వెహికల్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 56 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 71.60 లక్షలు. అయితే జీప్ ఆహ్వానించిన ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించాల్సిన గ్రాండ్ చిరోకీ వాహనాన్ని రూ. 93 లక్షలతో అందుబాటులో ఉంచింది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

గ్రాండ్ చిరోకీ బేసిక్స్:

గ్రాండ్ చిరోకీ బేసిక్స్:

గ్రాండ్ చిరోకీ లోని రెండవ ట్రిమ్ సమ్మిట్ వేరియంట్, మేము డ్రైవ్ చేసి పరీక్షించిన మోడల్‌ ఇదే, ఇందులో భారీ యాక్ససరీలు కలవు. అందులో ప్రధానమైనది, మూడు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ రావడం. ముందు డ్యాష్ బోర్డ్ మీద ఒకటి మరియు వెనుక వైపు ఇద్దరు ప్రయాణికులకు ఎదురెదురుగా ఒక్కొక్క తెర చొప్పున కలదు.

మేము నడిపిన వాహనం:

మేము నడిపిన వాహనం:

జీప్ గ్రాండ్ చిరోకీ లోని సమ్మిట్ వేరియంట్లో 3.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 286బిహెచ్‌పి పవర్ మరియు 570ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

దీనిని చూడగానే చాలా మంది హై వే మరియు సిటి అవసరాలకు వినియోగించే వాహనంగా నిర్ణయించేస్తుంటారు. మెరుగులు దిద్దిన దీని ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు అత్యాధునిక ఇంటీరియర్ల ఫీచర్ల విషయానికి వస్తే నిజమే అని చెప్పాలి. కాని తారు రోడ్డు ముగిసిన తరువాత వచ్చే ప్రతి మట్టి రోడ్డు మీద ఇది ఎదుర్కొనే సవాళ్లను చూస్తే ఇది ఖచ్చితంగా ఆఫ్ రోడ్ వెహికల్ అంటారు.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రయాణించే ముందు డ్రైవర్ డ్రైవింగ్ మోడ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో గేర్‌బాక్స్‌కు ప్రక్కనే ఉన్న తిప్పేటటువంటి గుండ్రటి ఆకారంలో ఉన్న మోడ్ సెలక్టర్ ద్వారా స్నో, సాండ్, మడ్ మరియు రాక్ అనే డ్రైవింగ్ మోడ్లను ఎంచుకోవచ్చు, సెలక్ట్ చేసుకున్న వాటిని డ్యాష్ బోర్డులో గమనించవచ్చు.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మేము గ్రాండ్ చిరీకీ వాహనానికి విభిన్న భూ భాగాల గుండా పలు పరీక్షలు నిర్వహించాము. అందులో మొదటిది ఏటవాలు తలం మీద గ్రౌండ్ క్లియరెన్స్ టెస్ట్. ఈ సమయంలో గ్రాండ్ చిరోకీలోని ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎంచుకుంటే వెహికల్ మెల్ల మెల్లగా కొండను దిగడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో హిల్ డిసెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇప్పుడు బ్రేకులు ప్రెస్ చేయకుండా వెహికల్ సమతలాన్ని చేరుకునే వరకు దానంతటం అదే మెల్లగా క్రిందకు కదులుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది స్టీరింగ్ ఆపరేట్ చేయడం మాత్రమే. మరి బ్రేకులు ఎవరు వేస్తారంటే... ఎలక్ట్రిక్ ద్వారా బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్రేక్ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇదే వాలుతలం మీద ఉన్నప్పుడు వేగాన్ని పెంచితే హిల్ డిసెంట్ వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది, అదే వేగాన్ని తగ్గిస్తే హిల్ డిసెంట్ మళ్లీ యధావిథంగా పనిచేస్తుంది.పెడల్ షిఫ్టర్స్ ద్వారా వెహికల్ వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మేము డ్రైవ్ చేసిన ఈ వెహికల్ అనేక ఆఫ్ రోడ్ ఛాలెంజింగ్‌లలో నిరూపించుకుంది, బురదమయమైన నీటిలో, నిటారుగా ఉన్న తలం మీద, ఎత్తైన ప్రదేశం నుండి క్రిందకు రావడం, అత్యంత ఇబ్బందికరమైన మలుపుల్లో తన నిశ్శబ్దమైన ఏకాగ్రతతో గ్రాండ్ చిరోకీ సక్సెస్ అయ్యింది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

దుర్బేధ్యమైన నీటిలో కూడా గ్రాండ్ చిరోకీ ఎలాంటి ఆపసోపాలు లేకుండా సునాయాసంగ సాధారణ ఇంజన్ వేగం వద్ద ఎలాంటి ఒత్తిడి లేకుండా దాటుకుంటూ వచ్చేసింది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సాంప్రదాయంగా ఎత్తు మరియు పల్లపు ప్రదేశాల్లో వెహికల్ యొక్క పనితీరును పరీక్షించేందుకు ఎత్తైన ఇనుపమెట్లను నిర్మిస్తారు. ఈ సవాళును కూడా గ్రాండ్ చిరోకీ ఎదుర్కొంది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విశయం ఏమిటంటే... ఇంజన్ మీద ఎలాంటి భారం లేకుండా కేవలం 1,500 ఆర్‌పిఎమ్ వద్ద ఎత్తైన ఇనుపమెట్లను సునాయాసంగా ఎక్కడం జరిగింది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రస్తుతం ఆధునిక ఆఫ్ రోడింగ్ ఎస్‍‌యూవీలలో సెలెక్ టెర్రైన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. దీంతో ముందున్న దారికి అనుగుణంగా వాహనానికి ఉండాల్సిన వేగం, ఆ వేగానికి కావాల్సిన ట్రాక్షన్ మొత్తాన్ని సమన్వయం చేయడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకున్నాయి, ఫోర్ వీల్ డ్రైవ్ వ్యవస్థ విషయానికి వీరు తమ గ్రాండ్ చిరోకీలో అందించిన సిస్టిమ్ అత్యాధునికమైనది. జీప్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పేరు ఉందో తెలిసిందే... దానిని ఇండియన్స్‌కు పరిచయం చేసింది. అయితే ఉత్పత్తుల యొక్క వాస్తవిక ధరకు దగ్గర్లో లేదని భావన అనేక మందిలో కలుగుతుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

గ్రాండ్ చిరోకీ వెహికల్ ధర దాదాపు కోటి రుపాయలకు దగ్గరగా ఉంటుంది, పనితీరు విషయాన్ని ప్రక్కన ఉంచి, ధర గురించి ఆలోచిస్తే, ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఇవే సామర్థ్యాలను కలిగిన కలిగిన ఇతర వాహనాలు దీనిలో సగం ధరకు లభిస్తాయని విశయం బయటపడుతుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ వేరియంట్ల ధరలు

జీప్ గ్రాండ్ చిరోకీ వేరియంట్ల ధరలు

  • గ్రాండ్ చిరోకీ లిమిటెడ్ ధర రూ. 93,64 లక్షలు
  • గ్రాండ్ చిరోకీ సమ్మిట్ ధర రూ. 1.03 కోట్లు
  • గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి ధర రూ. 1.12 కోట్లు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
    మేము డ్రైవ్ చేసిన గ్రాండ్ చిరోకీ సమ్మిట్ వేరియంట్ సాంకేతిక వివరాలు

    మేము డ్రైవ్ చేసిన గ్రాండ్ చిరోకీ సమ్మిట్ వేరియంట్ సాంకేతిక వివరాలు

    • ఇంజన్ సామర్థ్యం - 2987సీసీ (వి6 డీజల్)
    • పవర్ - 286బిహెచ్‌పి
    • టార్క్ - 570ఎన్ఎమ్
    • మైలేజ్ - 12.8 కిమీ/లీ
    • ఇంధన ట్యాంకు సామర్థ్యం - 93.5లీటర్లు
    • గ్రౌండ్ క్లియరన్స్ - 2016ఎమ్ఎమ్
    • వెహికల్ మొత్తం బరువు - 2455కిలోలు
    • బూట్ స్పేస్ (లగేజ్) - 1025 లీటర్లు

Most Read Articles

English summary
Read In Telugu: Jeep Grand Cherokee Off-Road Review
Story first published: Thursday, March 30, 2017, 16:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X