లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: సంక్షిప్త సమీక్ష తెలుగులో...

లెక్సస్ విపణిలోకి విడుదల చేసిన ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీకి డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందం టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. దీనిని కొనవచ్చా... కొనకూడదా అనే విషయాలు వివరంగా...

By Anil

ఇండియన్ మార్కట్లోకి ఈ ఏడాది వచ్చిన కొత్త కార్ల తయారీ సంస్థ లెక్సస్. తొలిసారి రావడంతోనే మూడు కొత్త ఉత్పత్తులతో విపణిలోకి ప్రవేశించింది. ప్రీమియమ్ కార్ల సెగ్మెంట్లోకి ఎల్ఎక్స్ 450డి, ఆర్ఎక్స్ 450హెచ్ మరియు ఇఎస్300హెచ్ కార్లను విడుదల చేసింది.

వీటిలో ఆర్ఎక్స్ 450 హెచ్ మరియు ఎల్ఎక్స్ 450డి మోడళ్లకు మీడియా ప్రతినిధుల చేత టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందం ఆర్ఎక్స్450 హెచ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కథనాన్ని ఇది వరకే ప్రచురించింది. నేటి రివ్యూ సెక్షన్‌లో ఎల్ఎక్స్ 450డి రివ్యూ వివరాలు....

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫ్యాన్సీ డిజైన్ లక్షణాలతోనే కాదు, దీని అద్వితీయమైన ఇంజన్ పనితీరుతో కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. హై వే ల మీదే కాకుండా అన్ని భూ బాగాలలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే ఆఫ్ రోడింగ్ లక్షణాలు దీని సొంతం. ఇలాంటి వాటిని కోరుకునే కస్టమర్లకు అత్యుత్తమ ఎంపిక ఎల్ఎక్స్ 450డి లగ్జరీ ఎస్‌యూవీ.

ఎక్ట్సీరియర్

ఎక్ట్సీరియర్

రివ్యూ సమయంలో రోడ్డు మీద ఎక్కడ పార్క్ చేసినా, దీని భారీ ఆకృతి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. సుమారుగా ఐదు మీటర్లు పొడవు మరియు రెండు మీటర్ల వెడల్పు ఉంది. ట్రాఫిక్ మరియు పార్కింగ్ స్పేస్‌ లను పక్కనపెట్టేసి ఎక్కువ మంది ఇలాంటి భారీ వాహనాలను ఎంచుకుంటున్నారు.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ తమ అన్ని ఉత్పత్తుల్లో ఒకే తరహా ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో లెక్సస్ లోగోను అందించింది. లెక్సస్ ఎల్ఎక్స్ ఫ్రంట్ డిజైన్‌లో అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, పదునైన హెడ్ ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు, బంపర్‌కు ఇరువైపులా పెద్ద పరిమాణంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ గమనించవచ్చు.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రక్క వైపు డిజైన్ విషయానికి వస్తే, 18-అంగుళాల 5-స్పోక్స్ ఉన్న అల్లాయ్ వీల్స్ కలవు, ఈ చక్రాలకు యొకోహామా వారి 285/60 ఆర్ 18 కొలతల్లో ఉన్న టైర్లను అందివ్వడం జరింగింది. అత్యుత్తమ బ్రేకింగ్ పనితీరు కోసం ముందు చక్రానికి 457ఎమ్ఎమ్ మరియు వెనుక చక్రానికి 432ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేక్‌లున్నాయి.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ తమ ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీలోని రియర్ డిజైన్‌కు కూడా తగిన ప్రాధాన్యతనిచ్చింది. క్రోమ్ సొబగులతో నిండిన ఎల్-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కలదు. రియర్ డిజైన్‌లోని బంపర్‌కు పై భాగంలో నెంబర్ ప్లేటు కోసం స్థానం కల్పించారు. ఇందులో 700-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న డిక్కీ కలదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

లెక్సస్ ఈ ఎల్ఎక్స్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌ను లెథర్, డార్క్ మరియు లైట్ వుడ్ అదే విధంగా టెక్నాలజీ సొబగులతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ రోడ్డును చక్కగా వీక్షించే సౌలభ్యంతో ఫ్రంట్ డ్యాష్ బోర్డ్ డిజైన్ చేసారు.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీ ఉన్న పరిమాణం పరంగా చూస్తే, ఇంటీరియర్‌లోని వెనుక వరుస ప్రయాణికులకు తగిన సౌకర్యం లేదు. ప్రత్యేకించి కాళ్లను పెట్టుకోవడానికి కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. అయితే రియర్ ప్యాసింజర్స్ కోసం వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన 11.6-అంగుళాల పరిమాణం ఉన్న డిస్ల్పేలు అసౌకర్యాన్ని మరచిపోయేలా చేస్తాయి.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

జాయ్ స్టిక్ తరహాలో కంట్రోల్ చేయగలిగే వీలున్న పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్పోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు. దీనికి 19-స్పీకర్లు గల మార్క్ లెవిన్‌సన్ ఆడియో సిస్టమ్‌కు అనుసంధానం చేయడం జరిగింది. మ్యూజిక్ ప్రియులు చిన్న సైజ్ బార్ తరహా ఇంటీరియర్‌లో ఎంజాయ్ చేయవచ్చు.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

విన్నూతన శైలిలో ఉన్న డ్యాష్ బోర్డ్ ఆకృతి మరియు ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రత్యేకతలను గుర్తింవచ్చు. సెంటర్ కన్సోల్, స్టీరింగ్ ఆధారిత నియంత్రికల ద్వారా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆపరేట్ చేయవచ్చు.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ ఎల్ఎక్స్ 450డి లో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సన్ రూఫ్ కలదు. సెంటర్ కన్సోల్ మీద అనలాగ్ క్లాక్ మరియు హెడ్స్ అప్ డిస్ల్పే కలదు.

భద్రత పరంగా ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీలో 10 ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటి కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్ అదే విధంగా 4-కెమెరాల ఏర్పాటుతో 360 డిగ్రీలలో మల్టీ టెర్రెయిన్ మానిటర్ మరియు పార్కింగ్ అసిస్ట్ వంటి అత్యుత్తమ భద్రత ఫీచర్లు ఉన్నాయి.

పనితీరు

పనితీరు

లెక్సస్ తమ ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీలో శక్తివంతమైన 4.5-లీటర్ల సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమైన ఉత్పత్తి చేసే 261బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ టార్క్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గుండా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ద్వారా వెహికల్‍‌లోని అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీలో నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఎకో, నార్మల్, స్పోర్ట్ ఎస్ మరియు స్పోర్ట్ ఎస్ ప్లస్. ఈ నాలుగు డ్రైవింగ్ మోడ్‌లలో వెహికల్‌ యొక్క స్టీరింగ్, యాక్సిలరేటర్ మరియు సస్పెన్షన్ పనితీరులో ప్రత్యేకతను గుర్తించడం జరిగింది.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

2.9-టన్నులు బరువు ఉన్న లెక్సస్ ఎల్ఎక్స్ 450డి కేవలం 8.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది అదే విధంగా గరిష్టంగా గంటకు 210కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం జరిగింది. దీని బరువు ప్రయాణ సమయంలో ఇంజన్‌కు ఏ మాత్రం భారం కాకపోవడాన్ని గుర్తిచడం జరిగింది.

లెక్సస్ ఎల్ఎక్స్450డి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

వాలు మరియు మెట్ట తలాల్లో ప్రయాణానంతరం, సమతల హైవే మీదకు తీసుకొచ్చినపుడు అనేక కిలోమీటర్లను సునాయాసంగా అధిగమించింది. ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంతో ఉన్న బాడీ, అడాప్టివ్ వేరిబుల్ సస్పెన్షన్ మరియు అత్యధిక ఐరన్ వినియోగం గల ఈ ఎస్‌యూవీ కఠినమైన రోడ్లను సైతం సులభంగా చేధించింది. స్పోర్ట్స్ ఎస్ మరియు స్పోర్ట్స్ ఎస్ ప్లస్ వేరియంట్లు పల్లము మరియు వాలు తలాల్లోని ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయడానికి ఎంతగానో సహకరించాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్యాంక్ తరహా బాడీ నిర్మాణం, గరిష్ట దూరాలను ఛేదించే సామర్థ్యం, అధునాతన సాంకేతిక ఫీచర్ల జోడింపు మరియు హోదాకు ఏ మాత్రం తగ్గని హుందాతనంతో ఉన్న డిజైన్ ఈ లెక్సస్ ఎల్ఎక్స్ 450డి గొప్పతనం. లగ్జరీ కార్ల ప్రేమికులయితే దీన్ని ఏ మాత్రం దూరం పెట్టలేరు.

తీర్పు

తీర్పు

దీని సామర్థ్యం, గొప్ప తనం మరియు పనితీరు ప్రదర్శన పరంగా మంచి మార్కులే సొంతం చేసుకుంది. దీని ధర రూ. 2.32 కోట్లు, ధర విషయంలో ల్యాండ్ క్రూయిజర్ కన్నా కోటి రుపాయలు ఎక్కువగా ఉంది. భద్రత మరియు బ్రాండ్ పరంగా లెక్సస్ ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu Lexus LX 450d First Drive Review
Story first published: Monday, June 12, 2017, 13:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X