లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ రివ్యూ: టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఎట్టకేలకు మూడు కొత్త ఉత్పత్తులతో విపణిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అందులో తమ లగ్జరీ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్‌కు ఇచ్చింది

By Anil

కొన్ని సంవత్సరాల నిరీక్షణ అనంతరం, అనేక పుకార్లకు పులిస్టాప్ పెడుతూ లెక్సస్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. జపాన్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ మూడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూ అధికారిక కార్యకలాపాలు ప్రారంభించింది.

అందులో ఆర్ఎక్స్ 450హెచ్ లగ్జరీ కారుకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించే కార్యక్రమాన్ని లెక్సస్ ఎర్పాటు చేసింది. అందులో డ్రైవ్‌స్పార్క్ పాల్గొని, స్వయంగా నడిపి టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ రివ్యూ ద్వారా ఇందులోని బెస్ట్ మరియు వరస్ట్ ఏమిటనే వాటి గురించి చూద్దాం రండి....

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ 1996లో ఆర్ఎక్స్ బ్రాండ్ పేరును తమ లైనప్‌ ద్వారా ఆటోమొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. అనతి కాలంలోనే మంచి ఆదరణ పొందడంతో ఆర్ఎక్స్‌కు కొనసాగింపుగా ఆర్ఎక్స్ 450హెచ్ ఎస్‌యూవీని 2010లో విడుదల చేసింది. ఆర్ఎక్స్‌లోని మిగతా మోడళ్లు కనుమరుగు కాగా... ఆర్ఎక్స్ 450హెచ్ పదునైన డిజైన్ లక్షణాలున్న ఎస్‌యూవీగా కొనసాగుతూ వచ్చింది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ధర విషయాన్ని ప్రక్కన పెట్టి ఇండియాలో ఉన్న జర్మనీ మరియు వోల్వో(హైబ్రిడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మరో మోడల్ ఎక్స్‌సి90) కార్లకు ధీటైన పోటీనిస్తుందా? ఈ లెక్సస్ ఎర్ఎక్స్ 450హెచ్ ఇండియన్ మార్కెట్లో మరో కొత్త హైబ్రిడ్ సెగ్మెంట్‌ను సృష్టిస్తుందా? వంటి వాటి గురించి కాలంతో పాటు వేచి చూడక తప్పదు. అయితే ఇది వరకు ఉత్తమమో నేటి రివ్యూలో తెలుసుకుందాం రండి...

డిజైన్

డిజైన్

డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ రూపం పరంగా లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ఎస్‌యూవీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. నిజం చెప్పాలంటే ఎన్ని కార్ల మధ్యలో పార్క్ చేసినా... చూపు దీనివైపుకు మళ్లడం ఖాయం.

ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‍‌లో పెద్ద పరిమాణంలో హనికాంబ్ ఆకారంలో ఉన్న క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, పదునైన ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, మరియు ఆంగ్లపు ఎల్-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సైడ్ డిజైన్‌ పరంగా చూస్తే, ముందు నుండి వెనుక వరకు పదునైన క్యారెక్టర్ గీతలను గమనించవచ్చు. మరియు డోర్ల మీద ఉన్న ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎస్‌యూవీ చివరిలో టాప్ మరియు బాడీని వేరు చేసే నలుపు రంగులో ఉన్న సి-పిల్లర్ కలదు.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

18-అంగుళాల పరిమాణం 7-స్పోక్స్ గల అల్యూమినియం చక్రాల మీద కూర్చున్న ఇది పూర్తిగా ఉలితో చెక్కినట్లు పదునైన డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. రియర్ డిజైన్‌లో రెండు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను కలుపుతూ క్రోమ్ పట్టీ కలదు. వీటన్నింటితో పాటు 453-లీటర్ల స్టోరేజీ సామర్థ్యం కలదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ఇంటీరియర్‌లోకి ప్రవేశించగానే ముందుగా మన దృష్టికి చేరే అంశం ఎటు చూసినా ఎరుపు రంగు లెథర్. దీనికి తోడుగా అల్లూమినియం సొబగులు, కలప మరియు క్రోమ్ పట్టీలతో ఇంటీరియర్‌ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లగ్జరీ ఎస్‌‌యూవీ సెగ్మెంట్‌కు న్యాయం చేస్తూ ఇందులోన అనేక లగ్జరీ ఫీచర్లను అందివ్వడం జరిగింది. ప్రత్యేకించి ముందు వైపు సీట్లను 10 రకాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ప్రయాణికుల అవసరం మేరకు సీట్లను పొడవుగా మార్చేసుకోవచ్చు, నిటారుగా ఉపయోగించుకోవచ్చు అదే విధంగా సీట్లను హీట్ మరియు కూల్ చేసుకునే అవకాశం ఉంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్యాష్ బోర్డు ఎక్కువ ఎత్తులో లేకపోవడంతో డ్రైవింగ్‌లో ఉన్న రోడ్డును చాలా స్పష్టంగా చూడవచ్చు. డ్యాష్ బోర్డు మధ్యలో 12.3-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఉన్న డిస్ల్పే‌ను కంట్రోల్ చేయడానికి లెక్సస్ రిమోట్ టచ్ ఇంటర్‌ఫేస్(RTI)ఉంది. చూడటానికి జాయ్ స్టిక్ తరహాలో ఉంటుంది,కానీ మౌస్ కన్నా ఎక్కువ పనులు చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు 15-స్పీకర్లు గల మార్క్ లెవిన్‌సన్ ఆడియో సిస్టమ్ అనుసంధానం కలదు.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

వెనుక వరుసలో ఉన్న సీటింగ్ చాలా వరకు సౌకర్యవంతంగా ఉంటుంది. కాళ్లు పెట్టుకోవడానికి చక్కటి స్పేసింగ్ కల్పించారు, కానీ వాలుగా ఉన్న రూఫ్ టాప్ కారణంగా పొడవుగా ఉన్న వారు ఒకింత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

గరిష్ట వేగంతో ప్రయాణిస్తున్నపుడు రోడ్డు నుండి మరియు కిటికీల నుండి వచ్చే శబ్దం ఏ మాత్రం గమనించరు. పెద్ద పరిమాణంలో ఉన్న ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు క్యాబిన్‌లో చక్కటి లైటింగ్ సిస్టమ్ కలదు.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ లగ్జరీ హైబ్రిడ్ ఎస్‌యూవీలో అనేక ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అందులో, పది విభిన్నమైన ఎయిర్ బ్యాగులు, మల్టీ టెర్రైన్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ కెమెరాలు, పార్కింగ్ సెన్సార్లతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పనితీరు

పనితీరు

డ్రైవ్‌స్పార్క్ టెస్ట్ డ్రైవ్ చేసిన లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 3.5-లీటర్ల సామర్థ్యం ఉన్న వి6 పెట్రోల్ ఇంజన్ కలదు, దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్ల అనుసంధానం కలదు. ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ సంయుక్తంగా 308బిహెచ్‌పి పవర్ మరియు 335ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‍‌కు అనుసంధానం చేసిన ఇ-సివిటి(ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. ఆర్ఎక్స్ 450హెచ్ లో నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఎకో, నార్మల్, స్పోర్స్ మరియు స్పోర్ట్ ప్లస్.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ డ్రైవింగ్ ప్రారంభించిన తరువాత ప్రారంభంలో ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిచింది. అత్యంత స్మూత్ జర్నీ ఫీల్ అవ్వచ్చు. తరువాత కాసేపటి వేగం పుంజుకున్నాక పెట్రోల్ ఇంజన్ ఆధారంతో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజన్ ద్వార్ ఎలక్ట్రిక్ మోటర్‌కు కావాల్సిన ఛార్జింగ్ అందుతుంది మరియు బ్రేకులు ఉత్పత్తి చేసే పవర్ ద్వారా కూడా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ కేవలం 7.7-సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 200కిలోమీటర్లుగా ఉంది. ప్రారంభంలో స్మూత్ రైడింగ్ కల్పించే ఎలక్ట్రిక్ మోటార్‌కు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అయితే ఎత్తు పల్లమున్న రోడ్లను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సులభంగా అధిగమించింది.

లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

హై వే రోడ్ల మీద లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ప్రయాణం అద్బుతం, మెరుపు వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడంలో ఈ ఎస్‌‌యూవీ విజయం సాధించింది.

ఇందులోని మృదువైన సస్పెన్షన్ సిస్టమ్ హై వే ప్రయాణంలో చక్కటి పనితీరును ప్రదర్శించింది. మరి కఠినమైన రోడ్ల మీద పరిస్థితి ఏమిటి అంటే ? అలాంటి రోడ్ల కోసం స్పోర్ట్ ప్లస్ డ్రైవింగ్ మోడ్ సమాధానం. జారుడు స్వభావం, మలుపులు అధికంగా ఉన్న రోడ్ల మీద ఉత్తమ హ్యాండ్లింగ్ కోసం స్పోర్ట్ ప్లస్ డ్రైవింగ్ మోడ్ ఎంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్టన్నింగ్ డిజైన్, లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ పరంగా అధిక ప్రాధ్యానత, మనం ఊహించ సాధ్యం కాని ఫీచర్లు(ఫుల్ సైజ్ స్పేర్ అల్లాయ్ వీల్) వంటి వాటితో ఆర్ఎక్స్ 450హెచ్ గొప్ప ప్యాకేజీ గల లగ్జరీ ఎస్‌యూవీ అని చెప్పవచ్చు. యూరోపియన్ మరియు జర్మన్ లగ్జరీ కార్లకు ప్రత్యక్షంగా పోటీనివ్వడం తథ్యం.

తీర్పు

తీర్పు

లెక్సస్ ధర రూ. 1.07 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ధర విషయానికి వస్తే బుర్ర కాస్త వేడెక్కడం ఖాయం. ఇదే ధరతో జాగ్వార్ ఎఫ్-పేస్, పోర్షే మకాన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 లను ఎంచుకోవచ్చు. పర్యావరణం దృష్ట్యా చూస్తే, ఇది కాస్త ఎకో ఫ్రెండ్లీ వాహనం అనే అంశం మినహాయిస్తే, యూరోపియన్ మరియు జర్మనీ కార్లకు ఏ మాత్రం సరితూగదు. అయితే నలుగురిలో విభిన్నంగా ఉండాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక!

Most Read Articles

English summary
Read In Telugu Lexus RX 450h First Drive
Story first published: Thursday, June 1, 2017, 18:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X