మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

By Ravi

మహీంద్రా గ్రూపుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, ఇటీవలే తమ ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు రేవా ఈ2ఓలో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ ప్రీమియం వేరియంట్‌ను మా డ్రైవ్‌స్పార్క్ బృందం బెంగుళూరు రోడ్లపై టెస్ట్ చేసింది. ఈ టెస్ట్ డ్రైవ్‌లో మహీంద్రా ఈ2ఓ ప్రీమియం వేరియంట్ పాస్ అయిందో లేక ఫెయిల్ అయిందో తెలుసుకుందాం రండి.

అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలలో మెరుగైన మౌళిక సదుపాయాల కారణంగా ఆయా మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ క్రమంగా మనదేశానికి విస్తరిస్తోంది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. వీరి అవసరాలను తీర్చేందుకు పలు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల శ్రేణిని క్రమంగా విస్తరించుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే, భారతదేశపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా రేవా కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకుంది. వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో పవర్ స్టీరింగ్ మరియు ఎక్కువ రేంజ్‌నిచ్చే బ్యాటరీని ఏర్పాటు చేసింది. డిజైన్ పరంగా రెగ్యులర్ ఈ2ఓ మరియు ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు.

మరి కొత్త మహీంద్రా ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌లో చేసిన మార్పులు ఏంటి? రియల్ వరల్డ్ ట్రాఫిక్‌లో ఇది సింగిల్ చార్జ్‌పై ఎంత దూరం వెళ్తుంది? దీని బ్యాటరీ సామర్థ్యం/జీవితకాలం ఎంత? దీని వార్షిక మెయింటినెన్స్, రన్నింగ్ కాస్ట్ ఎంత? ఈ ఎలక్ట్రిక్ కారును కొనడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే మా ఈ ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో మహీంద్రా ఈ2ఓ టెస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్‌ను చదవండి.

స్టయిలింగ్

స్టయిలింగ్

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం ఓ ఫోర్-సీటర్, 2-డోర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఈ కారులో నలుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు. చూడటానికి రబ్బరు బాతు ఆకారంలో ఉండే ఈ కారును, ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ (భవిష్యత్ రవాణా) అనే మహీంద్రా సిద్ధాంతం ఆధారంగా తయారు చేశారు.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

పెద్ద హనీకోంబ్ గ్రిల్, ఏబిఎస్ బాడీ ప్యానెల్స్, వింగ్స్, పెద్ద రియర్ బంపర్‌లు దీని ఎక్స్టీరియర్ డిజైన్‌లో ప్రధానమైనవి. రెగ్యులర్‌గా రోడ్లపై కనిపించే పెట్రోల్/డీజిల్/సిఎన్‌జి/ఎల్‌పిజి కార్ల కన్నా మహీంద్రా ఈ2ఓ డిజైన్ చాలా విభిన్నంగా, విశిష్టంగాను ఉంది.

డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్

డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్

దీని కాంపాక్ట్ డిజైన్ సిటీ రోడ్లపై ప్రయాణానికి సులువుగా ఉంటుంది. రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో సైతం ఈ కారులో సులువుగా ముందుకు సాగిపోవచ్చు. ఈ కారులో అమర్చిన సస్పెన్షన్ గతుకులు రోడ్లపై కూడా స్మూత్‌గానే అనిపిస్తుంది. రెగ్యులర్ కార్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ కార్లు ఎల్లప్పుడూ స్టార్టింగ్‌లో క్విక్ యాక్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. సిటీ డ్రైవ్‌కి ఈ ఫీచర్ ఎంతో అవసరం.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం కారులోని ట్రాన్సిమిషన్‌లో ఉండే ‘B' (బూస్ట్ మోడ్) యాక్సిలరేషన్‌ను మరింత వేగవంతం చేసి, ఎదురుగా వెళ్తున్న వాహనాలను సులువుగా ఓవర్‌టేక్ చేసేందుకు సహకరిస్తుంది. ఇది అతి తక్కువ సమయంలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అయితే, ఇక్కడే ఓ డ్రాబ్యాక్ కూడా ఉంది. బూస్ట్ మోడ్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును నడపటం బాగానే ఉన్నప్పటికీ, ఎక్కువ సేపు ఇదే మోడ్‌లో నడిపినట్లయితే, బ్యాటరీ రేంజ్ తగ్గిపోతుంది.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులో మరో డ్రాబ్యాక్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కారును నడుపుతున్నప్పుడు మీరు ఏ మోడ్‌లో ఉన్నారో అనే దానిని ట్రాన్సిమిషన్ వైపు చూసి తెలుసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రత్యేకించి, కొత్తగా ఈ2ఓ కారును నడిపే (అందులోనూ రాత్రివేళల్లో) వారికి తాము ఏ మోడ్‌లో డ్రైవ్ చేస్తున్నామో తెలుసుకోవాలంటే డ్యాష్‌బోర్డుపై ఉన్న గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌ను చూడాల్సిందే. కొత్త ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌లో వేరియబల్ అసిస్ట్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ జోడించినప్పటికీ, బెంగుళూరులోని రద్దీలో మాకు ఈ స్టీరింగ్ కాస్తంత హెవీగానే అనిపించింది. ఈ పవర్ స్టీరింగ్ మరికొంచెం లైట్ (ప్రత్యేకించి మహిళల కోసం)గా చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. చివరగా, ఇందులోని రీనజరేటివ్ బ్రేకింగ్ (బ్రేక్ వేస్తే బ్యాటరీలు చార్జ్ అయ్యే టెక్నాలజీ) రెగ్యులర్ కార్ల మాదిరిగా మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను ఇవ్వలేదు.

క్యాబిన్

క్యాబిన్

మహీంద్రా ఈ2ఓ కారు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, ఇంటీరియర్ స్పేస్‌లో మాత్రం పెద్దగానే ఉంటుంది. ఫ్రంట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను నీట్ అండ్ క్లీన్‌గా ఉంచారు. ఇందులో హెడ్‌రూమ్‌గా కూడా విశాలంగా ఉంటుంది. పొడవుగా ఉన్న వారు డ్రైవర్ సీటులో కూర్చున్నప్పుడు వారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. వెనుక సీటులోని ప్యాసింజర్లకు కూడా విశాలమైన లెగ్‌రూమ్ ఉంటుంది. అయితే, ఫ్రంట్ ఆర్మ్‌‌రెస్ట్స్ మోచేతులకు ఇబ్బందిగా అనిపిస్తాయి, దీని భారీ డోర్లు ట్రక్కు డోర్ల మాదిరిగా మూసుకుంటాయి, సరిగ్గా లేని ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మరియు సీట్ అడ్జస్టర్స్ సరైన డ్రైవింగ్ పొజిషన్‌ను సెట్ చేసుకోవటంలో ఇబ్బంది కలిగిస్తాయి.

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌లో 6.2 టచ్‌స్క్రీన్ (బహుశా దీనిని టచ్‌స్క్రీన్‌కి బదులుగా 'ప్రెస్ స్క్రీన్' అంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఇది మొబైల్ ఫోన్స్ టచ్‌‌స్క్రీన్ మాదిరిగా స్మూత్‌గా కాకుండా చాలా హార్డ్‌గా అనిపిస్తుంది)లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ జిపిఎస్ నావిగేషన్, డివిడి ప్లేయర్, బ్లూటూత్, ఐపాడ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయి. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (లైట్ బ్లూక్ కలర్ బ్యాక్‌లిట్‌తో), కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు మంచి కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్‌ను ఆఫర్ చేస్తాయి.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మహీంద్రా రేవా తమ ఈ2ఓ కారు కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. దీనిని యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఫోన్ ద్వారానే ఈ2ఓ కారులోని కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందులో ప్రధానంగా, రిమోట్ లాకింగ్, ఎయిర్ కండిషన్ యాక్టివేషన్, కార్ బ్యాటరీ రేంజ్ ఇండికేటర్ వంటివి చెప్పుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే, కారులో బ్యాటరీ అయిపోయినప్పుడు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లో ఉండే రివైవ్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా మరో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ రివైవ్ బటన్ స్మార్ట్‌ఫోన్‌లో కన్నా కారులోని టచ్‌స్క్రీన్‌లో ఇచ్చి ఉండే బాగుండనేది మా అభిప్రాయం.

లెక్క

లెక్క

సరే మహీంద్రా ఈ2ఓ కారు గురించి అటుంచితే.. పెట్రోల్/డీజిల్ కారును వదిలి ఈ ఎలక్ట్రిక్ కారును నడపటం వలన మనం ఇంధనంపై ఎంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు, ఈ కారుపై మనం వెచ్చించే పెట్టబడిపై ఎంత రాబడి పొందవచ్చు అనే లెక్కలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇందు కోసం మేము ఈ2ఓ కారును పెట్రోల్, డీజిల్ వెర్షన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారుతో పోల్చడం జరిగింది. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే ఈ కార్లతో పోల్చుకుంటే ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే ఈ2ఓ వాస్తవిక ఓనర్‌షిప్, రన్నింగ్ కాస్ట్‌లను తర్వాతి స్లైడ్‌లో తెలుసుకోండి.

రేంజ్

రేంజ్

మహీంద్రా తమ ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌ను రెగ్యులర్ ఈ2ఓ కన్నా 20 శాతం పెంచినట్లు పేర్కొంది. రెగ్యులర్ ఈ2ఓ సింగిల్ చార్జ్‌పై 10 యూనిట్ల విద్యుత్‌ను గ్రహించి 100 కిలోమీటర్ల రేంజ్‌నిస్తే, ఈ కొత్త ఈ2ఓ ప్రీమియం వేరియంట్ 120 కిలోమీటర్ల రేంజ్‌నిస్తుందని కంపెనీ పేర్కొంది. కానీ రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం, ఇది అంత రేంజ్‌ని ఇవ్వదు. మేము టెస్ట్ చేసిన తరచూ బూస్ట్ మోడ్‌ను, సగం టెస్ట్ వరకూ ఏసిని ఉపయోగించడం వలన సింగిల్ చార్జ్‌పై ఇది కేవలం 92 కిలోమీటర్ల రేంజ్‌ని మాత్రమే ఇచ్చింది. అంటే, జాగ్రత్తగా నడిపితే సింగిల్ చార్జ్‌పై సగటున 100 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఈ కారులో చేరుకోవచ్చన్నమాట.

వార్షిక రన్నింగ్ కాస్ట్ (మెయింటినెస్స్/సర్వీస్ కాస్ట్ లేకుండా)

వార్షిక రన్నింగ్ కాస్ట్ (మెయింటినెస్స్/సర్వీస్ కాస్ట్ లేకుండా)

ఈ మూడు రకాల కార్లను (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్) సగటున రోజుకు 45 కిలోమీటర్ల మేర డ్రైవ్ చేద్దాం అనుకున్నప్పుడు, అందుకయ్యే వార్షిక రన్నింగ్ కాస్ట్ లెక్కను ఈ స్లైడ్‌లోని పట్టికలో చూడండి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర సగటున రూ.80, డీజిల్ ధర రూ.65 మరియు ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.4.85గా ఉంది.

ఈ లెక్క ప్రకారం, ఈ మూడు రకాల కార్ల మొత్తం వార్షిక ఇంధన ఖర్చు (సంవత్సరానికి) క్రింది విధంగా ఉంది.

* మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ - రూ.1,00,800

* మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ - రూ.70,200

* మహీంద్రా ఈ2ఓ - రూ.9,000

5 ఏళ్లకు గాను రన్నింగ్ కాస్ట్ (మెయింటినెస్స్/సర్వీస్ కాస్ట్ కలిపి)

5 ఏళ్లకు గాను రన్నింగ్ కాస్ట్ (మెయింటినెస్స్/సర్వీస్ కాస్ట్ కలిపి)

ఈ మూడు రకాల కార్లను (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్) సగటున రోజుకు 45 కిలోమీటర్ల చొప్పున మొత్తం 5 ఏళ్లకు గాను మొత్తం 81,000 మేర డ్రైవ్ చేద్దాం అనుకున్నప్పుడు, అందుకయ్యే వార్షిక రన్నింగ్ కాస్ట్ లెక్కను ఈ స్లైడ్‌లోని పట్టికలో చూడండి.

మహీంద్రా ఈ2ఓపై కంపెనీ మూడేళ్ల ఉచిత మెయింటిన్స్‌ను ఆఫర్ చేస్తుంది. మిగిలిన రెండేళ్లకు కస్టమర్లు సంవత్సరానికి రూ.2,000 చొప్పున రూ.4,000 చెల్లిస్తే సరిపోతుంది. అదే పెట్రోల్ స్విఫ్ట్‌కి అయితే వార్షిక మెయింటినెన్స్ సుమారు రూ.10,000 (ఐదేళ్లకు రూ.50,000), డీజిల్ స్విఫ్ట్‌కి సుమారు రూ.12,000 (ఐదేళ్లకు రూ.60,000)గా ఉంటుంది.

ఈ లెక్క ప్రకారం, ఈ మూడు రకాల కార్ల మొత్తం మెయింటినెన్స్ కాస్ట్ (5 సంవత్సరాలకు) క్రింది విధంగా ఉంది.

* మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ - రూ.5,54,000

* మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ - రూ.4,10,000

* మహీంద్రా ఈ2ఓ - రూ.49,000

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

గమనిక: మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు విషయంలో ఐదేళ్లు పూర్తయిన తర్వాత కారు బ్యాటరీలను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఇందుకు రూ.1,80,000 ఖర్చవుతుంది. బ్యాటరీలను సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే, కొత్త బ్యాటరీల సాయంతో ఈ కారును మరో 80,000-1,00,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీ ఖర్చును మేము ఈ లెక్కలోకి పరిగణలోకి తీసుకోలేదు, అలా తీసుకుంటే తిరిగి మరో ఐదేళ్ల పాటు స్విఫ్ట్ కార్లకు అయ్యే ఇంధనపు ఖర్చును కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఐదేళ్ల తర్వాత మీరు ఈ2ఓ కారును అమ్మేయాలనుకుంటే, కొత్త బ్యాటరీలు లేకుండా అమ్మడం కష్టం. కానీ స్విఫ్ట్ కార్ల విషయంలో మాత్రం అలా కాదు.

ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చు (అన్ని గణాంకాలను లెక్కలోకి తీసుకొని)

ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చు (అన్ని గణాంకాలను లెక్కలోకి తీసుకొని)

రోజుకు సగటున 45 కిలోమీటర్లకు గాను సంవత్సరానికి 16,200 కిలోమీటర్ల దూరం నడిపామని అనుకున్నట్లయితే, ఐదేళ్లకు గాను నడిపే మొత్తం దూరం 81,000 కిలోమీటర్లు అవుతుంది. ఈ ఐదేళ్ల కాలానికి గాను ఇంధనపు ఖర్చు మరియు మెయింటినెన్స్/సర్వీస్ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే ప్రతి కిలోమీటరుకు అయ్యే రన్నింగ్ కాస్ట్ క్రింది విధంగా ఉంటుంది.

* మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ - రూ.6.84 / కి.మీ.

* మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్ - రూ.5.06 / కి.మీ.

* మహీంద్రా ఈ2ఓ - రూ.0.60 / కి.మీ. (60 పైసలు)

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

రన్నింగ్ కాస్ట్ పరంగా చూసుకుంటే పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కార్ చాలా తక్కువగా ఉంది. అయితే, మనదేశంలో, ఎలక్ట్రిక్ కార్లను చార్జింగ్ చేసుకునేందుకు సరైన చార్జింగ్ మౌళిక సదుపాయం లేదనేది వాస్తవం. కానీ, మహీంద్రా మాత్రం బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాల్లో ఈ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బెంగుళూరులో ఇప్పటి వరకు సుమారు 100 మహీంద్రా రేవా చార్జింగ్ స్టేషన్లను, ఢిల్లీలో 150 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. బెంగుళూరులోని ఫోరం మాల్ వద్ద కంపెనీ ఉచిత చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

అంతా బాగానే ఉంది.. కానీ మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు ధరే ఇప్పుడు అందరినీలో ఆలోచింపజేస్తోంది. ఈ కారు ధరను తగ్గించగలిగినట్లయితే, నగరంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం జోరందుకునే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఈ కారు కోసం కస్టమర్లు సుమారు రూ.8 లక్షలను వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది కస్టమర్లు అంత మొత్తాన్ని వెచ్చించి ఎలక్ట్రిక్ కారును కొనే బదులుగా పెట్రోల్ లేదా డీజిల్ కారును కొనటమే ఉత్తమమని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా కారును కొనుగోలు చేసే వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఈ2ఓను ఎంచుకొంటున్నారు. అంటే, అప్పటికే ఓ పెట్రోల్/డీజిల్ కారును కలిగిన వారు సిటీ ప్రయాణం కోసం రెండవ కారుగానో లేక మూడవ కారుగానో ఈ2ఓను కొనుగోలు చేస్తున్నారన్నమాట.

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఏదేమైనప్పటికీ, మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు ఎర్గోనమిక్స్, ఫిట్ అండ్ ఫినిష్, కొన్ని డ్రైవింగ్ క్యారక్టరిస్టిక్, ప్రత్యేకించి అప్‌మార్కెట్ సెగ్మంటేషన్ కోసం ఇందులో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. మహీంద్రా తమ ఈ2ఓ కారును బ్యాటరీ కోసం లీజింగ్ ఆప్షన్‌తో కలిపి విక్రయిస్తోంది. ఇందులో కారు ధర రూ.6,15,000 (ఆన్-రోడ్, ఢిల్లీ). బ్యాటరీ కోసం కస్టమర్లు ప్రతినెలా రూ.3,000 (సంవత్సరానికి రూ.36,000, ఐదేళ్లకు రూ.1,80,000) చొప్పున చెల్లించాలి. అంటే, మొత్తంగా ఈ కారు కోసం కస్టమర్లు రూ.7,95,000 చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

మహీంద్రా ఈ2ఓ టెస్ట్ డ్రైవ్ రివ్యూపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఫీడ్‌బ్యాక్ రూపంలో మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
The Mahindra Reva e2o Premium has been launched in India. Our expert review of the new e2o focuses on the running costs and practicality of the new car. Will the new Mahindra e2o variant deliver towards its goal of becoming the Future of Mobility? Let's see, shall we?
Story first published: Tuesday, August 26, 2014, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X