మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం

By Anil

హ్యుందాయో మోటార్స్ వాహన సంస్థ యస్‌యువి సెగ్మెంట్లో పోటకి ప్రవేశించింది. అదేనండి తన కొత్త క్రెటాను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది కదా. సౌత్ కొరియాకు చెందిన ఈ హ్యుందాయ్ సంస్థ ఎన్నో నమ్మకాలు పెట్టుకుని క్రెటా మోడల్ యస్‌యువి‌ను విడుదల చేసింది, వారి అంచనాలకు తగినట్లే ఇది సరైన ఫలితాలను నమోదు చేసుకుంటూ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనొ డస్టర్, నిస్సాన్ టెర్రానొ మరియు మహీంద్రా యక్స్‌యువి5oo లకు గట్టి పోటిని ఇస్తోంది.
Also Read: మీ నగరంలో హ్యుందాయ్ కార్ల అన్ని మోడల్లకు చెందిన ధరలను తెలుసుకోలడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే క్రెటాకు ఇలాంటి మోడళ్లు ఏ విధంగా కూడా పోటికి రావు. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన మొట్టమొదటి డీజల్ యస్‌యువి ఇదే కాబట్టి. కాని ఈ మద్యనే మహీంద్రా అండ్ మహీంద్రా తన యక్స్‌యువి5ooలో ఆటోమేటిక్ వర్షెన్‌ను విడుదల చేసిది. ఇప్పుడు అసలైన పోటి మొదలైంది.
Also Read: 20 నెలల్లో.. 1.5 లక్షల ఎలైట్ ఐ20 కార్లను అమ్మిన హ్యూందాయ్

రెండు యస్‌యువి లు భారతీయ మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో ఈ రెండిటి మధ్య గల ధర, ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు భద్రతకు సంభందించిన వివరాల గురించి తెలుసుకుందాం రండి.

డిజైన్

డిజైన్

మహీంద్రా యక్స్‌యువి మొత్తం డిజైన్ పరవాలేదు అనిపిస్తుంది. దాదాపుగా ఎక్కువ గా దీని పాత మోడల్ డిజైన్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. ఇక కొత్తగా అంటే ఇందులో న్యూ ఫ్రంట్ గ్రిల్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ వంటి ఇందులో కొత్తగా వచ్చి చేరాయి.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ లోని అన్ని మోడళ్ల డిజైన్ దాదాపుగా ఫ్లూయిడిక్ డిజైన్‌తో సృష్టించారు. ఈ కొత్త యస్‌యువిని తీక్షణంగా చూశారంటే ఇందులో మీకు హ్యుందాయ్ ఎలైట్ ఐ0 రూపం కనపడుతుంది. అవును దాదాపుగా ఎక్కువ శాతం దీనిని ఎలైట్ ఐ20 డిజైన్ ప్రేరణతో తయారు చేశారు. కాని చూడటానికి బాగానే అనిపిస్తుంది.

ఇంజన్

ఇంజన్

మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్

మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్ వాహనంలో 2.2-లీటర్ల నాలుగు సిలిండర్ల టర్భో ఛార్జ్‌డ్ డీజల్ కలదు ఇది 140బిహెచ్‌పి పవర్, 330యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది లీటరుకు 13.85 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుంది. అయితే ఈ మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్ టువీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్‌లలో లభించును.

హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్

హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్

హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్ లో 1.3-లీటర్ గల నాలుగు సిలిండర్ల టర్భోచార్జ్‌‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 126 బిహెచ్‌పి పవర్, 265యన్‌‌యమ్ అత్యదిక టార్క్‌‌ మరియు లీటర్‌కు 17 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. అయితే ఇది కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌నున మాత్రమే అందిస్తుంది. ఇక ఈ రెండు మోడల్లలో కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్ కలదు.

ఫీచర్స్

ఫీచర్స్

మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్‌లో గల ఫీచర్లు

  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • పగటి పూట వెలిగే లైట్లు
  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
  • ఎలక్ట్రికల్‌గా డ్రైవర్ సీటును అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు.
  • 7-అంగళాల పరిమాణం గల తాకే తెర
  • మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్‌లో గల ఫీచర్లు

    మహీంద్రా యక్స్‌యువి5OO ఆటోమేటిక్‌లో గల ఫీచర్లు

    • జిపియస్ అనుబంధంతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • అటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
    • బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్
    • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
    • మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతనమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
    • హ్యుందా క్రెటా ఆటోమేటిక్‌లో గల ఫీచర్లు

      హ్యుందా క్రెటా ఆటోమేటిక్‌లో గల ఫీచర్లు

      క్రెటా‌‌లో ఆడియో మరియు వీడియో న్యావిగేషన్ సిస్టమ్, ఐదు అంగుళాల తాకే తెర గల ఆడియో సిస్టమ్, ఫుష్ బటన్‌తో స్టార్ట్ చేయగల స్మార్ట్ కీ, అన్నింటిని స్టీరింగ్ వీల్ మీద నుండి కంట్రోల్ చేయడం, 17-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు యల్‌ఇడి పొజిషనింగ్ ల్యాంప్స్ కలవు.

      భద్రత

      భద్రత

      మహీంద్రా యక్స్‌యువిలో గల భద్రత పరమైన ఫీచర్లు

      • యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్)
      • ఎలక్ట్రానిక్ స్టెబిసిటి కంట్రోల్
      • సైడ్ కర్టన్‌తో పాటు ఆరు ఎయిరి బ్యాగులు
      • స్టాటిక్ బెండింగ్ ల్యాంప్స్
      • హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెంట్ అసిస్ట్
      • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
      • హ్యుందాయ్ క్రెటాలో గల భద్రత పరమైన ఫీచర్లు

        హ్యుందాయ్ క్రెటాలో గల భద్రత పరమైన ఫీచర్లు

        ఇందులో కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు స్టెబిలిటి మేనేజ్‌మెంట్ వంటి భద్రతతో కూడిన అంశాలు కలవు.

        ధర

        ధర

        మహీంద్రా యక్స్‌‌‌యువి అటోమేటిక్

        • డబ్యూ8 ఎటి ధర రూ. 18.26 లక్షలు
        • డబ్ల్యూ10 ఎటి ధర రూ. 19.22 లక్షలు
        • డబ్ల్యూ10 ఎడబ్ల్యూడి ఎటి ధర రూ. 20.38 లక్షలు
        • అన్ని ధరలు అంచనా ప్రకారం ఆన్-రోడ్ (డిల్లీ) గా గమనించండి.
        • మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం

          హ్యుందాయ్ క్రెటా

          హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్ లో ప్రస్తుతానికి కేవల ఒక్క వేరియంట్‌ మాత్రమే ఉంది.

          1.6 యస్‌యక్స్ ప్లస్ ధర రూ. 16.12 లక్షలు అంచనాగా ఆన్-రోడ్ (ఢిల్లీ).

          తీర్పు

          తీర్పు

          హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్‌లో ఐదు మంది కలిసి ప్రయాణించవచ్చు, ధర తక్కువ మరియు తక్కువ బరువును మోయగలద ఇక కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను మాత్రమే ఇది ఆఫర్ చేస్తోంది. యక్స్‌యువి కాస్త ధర ఎక్కువ అయినా ఇందులో ఏడు మంది కలిసి ప్రయాణించవచ్చు. అంటే ఇది దీని ధరకు తగ్గ ఫీచర్లను అందిస్తోంది. ఇక ఈ రెండు డీజల్ యస్‌యువిలలో మహీంద్రా యక్స్‌యువిని ఎంచుకోమని డ్రైవ్‌స్పార్క్ నిర్ణయం. మరి మీ నిర్ణయం.

          మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం
          1. మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ
          2. చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్
          3. అక్టోబర్‌లో ఎక్కువగా అమ్మడుపోయిన టాప్ 10 బెస్ట్ కార్లు...

Most Read Articles

English summary
Mahindra XUV 500 vs Hyundai Creta Automatic: The Auto Brutes Battle It Out
Story first published: Friday, November 27, 2015, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X