మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ; 15 లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్స్

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ 'వ్యాగన్ఆర్' (Wagon R) మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. గడచిన 2000 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదలైన మారుతి వ్యాగన్ఆర్ కారు, అమ్మకాల పరంగా 15 లక్షల మైలురాయిని చేరుకుంది.

దేశీయ విపణిలో ఇప్పటి వరకూ 15 లక్షల యూనిట్లకు పైగా వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భంగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మనోహర్ భట్ మాట్లాడుతూ.. వినియోగదారుల అభిరుచులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ మోడల్‌లో మార్పులు, చేర్పులు చేయడం మరియు విజయవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా ఈ మైలురాయిని సాధించగలిగామని అన్నారు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడుపోతున్న టాప్ 5 కార్లలో ఒకటిగా ఉంది. వ్యాగన్ఆర్ సక్సెస్ వెనుక అనేక కారణాలున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

తర్వాతి స్లైడ్‌లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సక్సెస్ స్టోరీని తెలుసుకోండి.

సక్సెస్ మ్యాప్

సక్సెస్ మ్యాప్

మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా 2000 సంవత్సరంలో వ్యాగన్ఆర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత 2003-04 మొదటి ఫేస్‌లిఫ్ట్‌ను, 2006-07లో రెండవ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఇదే సంవత్సరంలో (2006-07లో) ఇందులో ఎల్‌పిజి ఫ్యూయెల్ ఆప్షన్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఆ తర్వాత 2010-11లో ఇందులో సరికొత్త వ్యాగన్ఆర్‌ను కంపెనీ విడుదల చేసింది. అదే సంవత్సరంలో (2010-11లో) ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను పరిచయం చేశారు.

అనంతరం 2012-13లో కంపెనీ ఓ మైనర్ ఫేస్‌లిఫ్ట్ వ్యాగన్ఆర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత 2013-14లో కంపెనీ ఓ సరికొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే (ప్రీమియం వెర్షన్) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

అమ్మకాల పరంగా చూసుకుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2003-04 నాటికి 1 లక్ష యూనిట్ల మార్కును, 2007-08 నాటికి 5 లక్షల యూనిట్ల మార్కును, 2011-12 నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును మరియు 2014-15 నాటికి 15 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

మారుతి సుజుకి వ్యాగన్ ఈ సెగ్మెంట్లో అత్యధిక ఎత్తును కలిగి ఉండి, మంచి హెడ్‌రూమ్‌ని ఆఫర్ చేస్తుంది. దీని మొత్తం ఎత్తు 1670 మి.మీ. అంతేకాదు, ఇది ఈ సెగ్మెంట్లో కల్లా బెస్ట్ ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఫ్రంట్ సీట్లలోనే కాకుండా వెనుక సీట్లలో కూర్చుకునే వారికి సైతం మంచి లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్ లభిస్తుంది. ఈ కారులో ఐదుగురు (డ్రైవర్‌తో కలిపి) సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

చిన్న కుటుంబాలు, సిటీలో నిత్యం ప్రయాణం చేసే వారికి ఈ కారు ఓ చక్కటి ఆప్షన్. ఇది పెట్రోల్‌తో పాటుగా ఎల్‌పిజి, సిఎన్‌జి (మెట్రో నగరాల్లో మాత్రమే) ఫ్యూయెల్ ఆప్షన్లతో కూడా లభిస్తుంది. డ్యూయెల్ పవర్ కలిగిన వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ కన్నా ఎక్కువ రేంజ్‌ని ఆఫర్ చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

వ్యాగన్ఆర్ కాంపాక్ట్ డిజైన్‌ని కలిగి ఉండటం వలన మొదటి సారిగా కారు కొనుగోలు చేసే వారికి కూడా, డ్రైవ్ చేయటానికి ఇది సౌకర్యంగా ఉంటుంది. ఈ కారు ఎక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించదు కాబట్టి, ఇరుకు ప్రదేశాల్లో సైతం పార్కింగ్ చేయటానికి సలువుగా ఉంటుంది.

మారుతి వ్యాగన్ఆర్ విజయగాధ

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సరికొత్త వ్యాగన్ఆర్ మోడ్రన్ డిజైన్‌ను, లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్ వ్యాగన్ఆర్ కారులో అనేక కంఫర్ట్ ఫీచర్లు లభ్యమవుతున్నాయి.

ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో 1.0 లీటర్, 3-సిలిండర్, కె10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ పవర్ సిటీ డ్రైవింగ్‌కే కాకుండా హైవే డ్రైవింగ్‌కి సైతం సరిపోయే విధంగా ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన ప్రకారం, పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ లీటరుకు 20.5 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కి.మీ. మైలేజీ మరియు ఎల్‌పిజి వెర్షన్ కేజీకి 14.6 కి.మీ. మైలేజీనిస్తుంది.

అయితే, రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం, పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ సిటీలో 14-15 కిలోమీటర్ల మైలేజీని, హైవేపై 17-18 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అంటే సగటున ఇది లీటరుకు 15-16 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందన్నమాట.

మెయింటినెన్స్

మెయింటినెన్స్

ఇతర పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే వ్యాగన్ఆర్ మెయింటినెన్స్ ఖర్చు తక్కువే అని చెప్పాలి. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి చొప్పున ఇంజన్ ఆయిల్‌ని మార్చుకుంటే సరిపోతుంది. ఇతర ఆయిల్ లెవల్స్‌ను తరచూ చెక్ చేసుకుంటే, కారులో ఎలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉండదు.

ఫీచర్స్ (స్టోరేజ్ ఆప్షన్స్)

ఫీచర్స్ (స్టోరేజ్ ఆప్షన్స్)

ప్రస్తుత వ్యాగన్ఆర్ కారులో అనేక మోడ్రన్, కంఫర్ట్ ఫీచర్లున్నాయి. ఇందులో ప్రధానంగా డ్యాష్‌బోర్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పుష్-టూ-ఓపెన్ కప్ హోల్డర్స్, డ్యాష్‌బోర్డుపై ప్యాసింజర్ వైపు ఏర్పాటు చేసిన గ్లవ్ బాక్స్, అండర్ సీట్ స్టోరేజ్ (ఫ్రంట్ ప్యాసింజర్ సీట్), 60-40 స్ప్లిట్ సీట్స్ (వెనుక వరుసలో), రియర్ పార్సిల్ ట్రే వంటి ఫీచర్లున్నాయి.

ఎలక్ట్రికల్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్

ఎలక్ట్రికల్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్

ఇంకా ఇందులో ఆల్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై డిజిటల్ ఫ్యూయెల్ ఇండికేటర్ విత్ ట్రిప్ మీటర్, సిడి, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన ఈగల్ వింగ్ ఆడియో సిస్టమ్ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్), అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్, లంబార్ సపోర్ట్ ఫ్రంట్ సీట్స్, డే అండ్ నైట్ వ్యూ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

వ్యాగన్ఆర్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్‌సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఫీచర్లు ఆప్షనల్‌గా లభిస్తాయి. ఇంకా ఇందులో సీట్ బెల్ట్ వార్నింగ్ ఇండికేటర్, సెక్యూరిటీ అలారమ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రియర్ వైపర్, వాషర్, డిఫాగ్గర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లున్నాయి.

ధర

ధర

మారుతి వ్యాగన్ఆర్ సక్సెస్‌కు మరో కారణం దీని ధర. ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరకే లభిస్తున్న కారు ఇది. రూ.5 లక్షల కన్నా తక్కువ ధరకే (ఆన్-రోడ్) ఓ మంచి స్మాల్ ఫ్యామిలీ కార్ కోరుకునే వారికి వ్యాగన్ఆర్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

స్టింగ్‌రే

స్టింగ్‌రే

మారుతి సుజుకి 2013-14లో సరికొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే (ప్రీమియం వెర్షన్) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే, ఈ మోడల్ రెగ్యులర్ వ్యాగన్ఆర్ మాదిరిగా మంచి సక్సెస్‌‌ని సాధించలేకపోయింది. కారణం దీని అధిక ధర (రెగ్యులర్ వ్యాగన్ఆర్ కన్నా రూ.1 లక్ష అధికం) మరియు ఆకట్టుకోని డిజైన్.

వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి

ఇదిలా ఉంటే, ఇటీవలే తమ కొత్త ఆల్టో కె10లో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీని పరిచయం చేసిన మారుతి సుజుకి తమ కొత్త వ్యాగన్ఆర్‌లో కూడా ఇదే టెక్నాలజీని ఆఫర్ చేయాలని యోచిస్తోంది. అయితే, ఏఎమ్‌టి వెర్షన్ రెగ్యులర్ వ్యాగన్ఆర్‌లో లభిస్తుందా లేక వ్యాగన్ఆర్ స్టింగ్‌రే మోడల్‌లో లభిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ ఫూర్తి స్పెసిఫికేషన్స్

మారుతి వ్యాగన్ఆర్ ఫూర్తి స్పెసిఫికేషన్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పూర్తి స్పెసిఫికేషన్ల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti Suzuki had launched its Wagon R hatchback in India back in 2000. They are proud to announce that since then they have sold over 15 lakh vehicles of the model. It is an achievement that a vehicle has achieved this milestone within 14 years. Here is success story of the Wagon R.
Story first published: Wednesday, November 26, 2014, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X