మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్..

By Ravi

భారతీయులకు కాంపాక్ట్ వస్తువులంటేనే ఎక్కువ మక్కువ. ప్రత్యేకించి కార్ల విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అందుకే సాధారణ కార్ల తయారీ కంపెనీల నుంచి లగ్జరీ కార్ల తయారీ కంపెనీల వరకు ప్రధానంగా కాంపాక్ట్ కార్ల పైనే దృష్టిసారించాయి. అలా భారత మార్కెట్‌కు వచ్చిందే ఈ జర్మన్ కార్ - 'మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్'.

నేను ఇప్పటి వరకు పలు మెర్సిడెస్ బెంజ్ కార్లును డ్రైవ్ చేశాను, కానీ ఏ-క్లాస్‌ను డ్రైవ్ చేస్తున్న పొందిన అనుభూతి మాత్రం కొత్తగా, కాస్తంగా భిన్నంగా అనిపించింది. మేము ఈ కారులో సుమారు 750 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాం. ఇది చూడటానికి చిన్న కారే అని విషయాల్లోనే ఇది పెద్ద కార్లకు ఏ మాత్రం తీసిపోదు.

డ్రైవ్‌స్పార్క్ ఇటీవలే ఈ బుజ్జికారును టెస్ట్ డ్రైవ్ చేసింది. మరి ఈ మెర్సిడెస్ బెంజ్ కాంపాక్ట్ లగ్జరీ కారు హైలైట్స్ ఎంటో, ప్లస్‌లు, మైనస్‌లు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత్‌లో విడుదల

భారత్‌లో విడుదల

ఈ ప్రీమియం ఫ్యామిలీ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ కారును మే 30, 2013వ తేదీన మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి సమీక్ష కోసం తర్వాతి స్లైడ్‌లపై క్లిక్ చేయండి.

డిజైన్

డిజైన్

ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోటివ్ డిజైన్ మార్క్ ఫెథర్స్టన్ ఈ ఏ-క్లాస్ కారును అత్యద్భుతంగా డిజైన్ చేశారు. ఈ కారు డిజైన్‌లో అణవనువునా మెర్సిడెస్ బెంజ్ డిఎన్ఏ ప్రతిభింభిస్తుంది. ఏరోడైనమికల్లీ ఎఫీషియంట్‌గా ఉండేలా ఈ బెంజ్ స్టయిలింగ్ క్యూలను డిజైన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా ఏరోడైనమిక్స్ పరంగా అత్యంత సమర్థవంతమైన కారు.

కాంపిటీషన్

కాంపిటీషన్

ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇది విశిష్టమై డిజైన్‌ను కలిగి ఉండి, ముందు వైపును రాయల్ లుక్‌ను కలిగి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఈ సెగ్మెంట్లోని ఆడి ఏ3, బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్, వోల్వో వి40 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఫ్రంట్ డిజైన్‌

ఫ్రంట్ డిజైన్‌

మెర్సిడెస్ బెంజ్ ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, ఇది కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన బి-క్లాస్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఏ-క్లాస్ ఫ్రంట్ గ్రిల్‌లో డైమండ్ షేపులో మెరుస్తూ ఉండే అల్యూమినియం బిట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భారత్‌లో విడుదలైన తొలి 400 కార్లు మాత్రమే ఈ స్టయిల్‌లో ఆఫర్ చేశారు. హెడ్‌ల్యాంప్స్‌లో కూడా ఎల్ఈడిల సిరీస్ ఉంటుంది.

సైడ్ డిజైన్

సైడ్ డిజైన్

వెనుకవైపు తక్కువ పరిమాణంలో ఉండే రియర్ డోర్ విండోస్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, పొడవాటి వీల్‌బేస్‌లు ఏ-క్లాస్‌ను ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా నిలుపుతాయి. వాస్తవానికి మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్ (2699 మి.మీ.), ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ వీల్‌బేస్ (2633 మి.మీ) కన్నా ఎక్కువగా ఉంటుంది.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

ఇక ఏ-క్లాస్ వెనుక డిజైన్‌ను పరిశీలిస్తే, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ట్విన్ ఎగ్జాస్ట్ పైప్‌లు ప్రధానంగా దృష్టిని ఆకట్టుకుంటాయి. బ్రేక్ నొక్కినప్పుడు ఈ లైట్లు మరింత కాంతివంతంగా ప్రకాశించి, వెనుకగా వచ్చే వారిని దూరం నుంచే అప్రమత్తం చేస్తాయి.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఇంటీరియర్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫీల్‌నిస్తాయి. విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్‌లతో పాటు ఇందులోని కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లు కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు మెర్సిడెస్ కాన్ఫిడెన్స్‌ను కల్పిస్తాయి.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

ఇందులో నావిగేషన్, కమ్యూనికేషన్ ఇన్‌ఫర్మేషన్‌ను చూపించే వ్యవస్థ మరొక ప్రత్యేక ఆకర్షణ.

స్టీరింగ్..

స్టీరింగ్..

ఏ-క్లాస్ స్టీరింగ్ విషయంలో ఎలాంటి కంప్లయింట్స్ లేవు. ఇందులో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. దీని సెంటర్ కన్సోల్‌లో ఎయిర్ కండిషనింగ్‌తో వివిధ కంట్రోల్స్‌ను చక్కగా అమర్చారు.

సీట్స్

సీట్స్

హెడ్ రెస్ట్రైంట్స్‌తో కూడిన ఏ-క్లాస్ సీట్లు చాలా స్పోర్టీగా అనిపిస్తాయి. లాంగ్ డ్రైవ్‌లకు సైతం ఈ సీట్లు ఎంతో సౌకర్యంగా అనిపిస్తాయి.

ఇంజన్

ఇంజన్

ఏ-క్లాస్ కారు 1.5 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. మేము డ్రైవ్ చేసింది 1595సీసీ, 4-సిలిండర్, పెట్రోల్ ఇంజన్ కలిగినది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 112 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆన్ ది రోడ్

ఆన్ ది రోడ్

ఏ-క్లాస్ సస్పెన్షన్‌ను భారత రోడ్లకు అనుగుణంగా ట్యూన్ చేశారు. అయితే, ఎక్కువ ఎత్తు పల్లాలున్న రోడ్లపై ఈ కారులో వెళ్తే, మీ క్లాస్ తిరిగి అదే షేపులో వస్తుందున్న గ్యారంటీ లేదు. కాబట్టి, ఏ-క్లాస్ కారులో వీకెండ్ ట్రిప్స్, లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసేటప్పుడు క్లీన్‌గా ఉండే రోడ్లనే ఎంచుకోండి. వీలైనంత వరకు ఈ కారులో ఆఫ్-రోడింగ్ ప్రయాణాలను మానుకోండి.

మైలేజ్

మైలేజ్

ఏ-క్లాస్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు (6 లీటర్ల రిజర్వ్ సామర్థ్యంతో కలిపి). హార్ష్ డ్రైవింగ్ కండిషన్స్ వల్ల మేము డ్రైవ్ చేసినప్పుడు ఏ-క్లాస్ కారు 100 కిలోమీటర్లకు గాను సగటున 12.4 లీటర్ల పెట్రోల్‌ను స్వాహా చేసింది (అంటే సుమారు లీటరుకు 8.06 కి.మీ. మైలేజీనిచ్చింది). కానీ కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 15.5 కి.మీ. మైలేజీని ఇవ్వాలి (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)

మంచి - చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి - చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి - టిప్‌టాప్ ఇంటీరియర్ ఫీచర్స్, స్మూత్ 7-స్పీడ్ గేర్‌బాక్స్.

చెడు - ఇంజన్ నుంచి లైడ్-బ్యాక్ పవర్ డెలివరీ, పొడవుగా ఉండే వారికి ఐదవ ప్యాసింజర్ సీట్ హెడ్‌రూమ్ తక్కువగా అనిపిస్తుంది.

ఎక్స్-ఫ్యాక్టర్ - స్టయిలింగ్ అండ్ డిజైన్

ధర

ధర

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ధర రూ.20-25 లక్షల రేంజ్‌లో ఉంది. ధర విషయంలో ఇది ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్, ఆడి ఏ3 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా గురించి..

మెర్సిడెస్ బెంజ్ ఇండియా గురించి..

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ డైమ్లర్ ఏజికు చెందిన 100 శాతం భారతీ అనుబంధ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఈ కంపెనీకు మహారాష్ట్రలోని పూనేలో లగ్జరీ మరియు వాణిజ్య వాహనాల తయారీ కేంద్రం ఉంది. మరిన్ని వివరాల కోసం www.mercedes-benz.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Most Read Articles

English summary
Drivespark reviews the all new Mercedes Benz A Class. Small cars are the future and the A Class looks to capture the luxurious premium hatchback segment.
Story first published: Monday, September 2, 2013, 22:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X