నిస్సాన్ పాట్రాల్ రివ్యూ: ఆఫ్-రోడ్ ఎక్స్‌పీరియెన్స్ అదిరింది!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ త్వరలోనే భారత మార్కెట్లో పాట్రాల్ అనే లగ్జరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. కాగా.. మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఈ అద్భుతమైన పవర్‌ఫుల్ ఎస్‌యూవీని అందరి కన్నా ముందుగా టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం దక్కింది.

గడచిన వారాతంలో నిస్సాన్ మొట్టమొదటి సారిగా భారత్‌లో నిర్వహించిన కార్నివాల్‌లో ఈ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంచారు. విలాసం విషయంలో ఎక్కడా తగ్గకుండా, అలాగే ఆఫ్-రోడింగ్ సామర్థ్యంలోను ఎక్కడా రాజీపడకుండా ఉండేలా నిస్సాన్ పాట్రాల్ ఎస్‌యూవీని తీర్చిదిద్దారు.

మిడిల్ ఈస్ట్ మార్కెట్లో నిస్సాన్ పాట్రాల్‌కు మంచి డిమాండ్ ఉండి, అక్కడి నుండే ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. మరి ఈ ఎస్‌యూవీలోని విశిష్టతలేంటో ఈ సమీక్షలో తెలుసుకుందాం రండి..!

సాలిడ్ లుక్స్

సాలిడ్ లుక్స్

నిస్సాన్ పాట్రాల్ ధృడమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇదివరకటి తరం పాట్రాల్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాట్రాల్ ఎస్‌యూవీ డిజైన్ చాలా వరకు మెరుగుపడిందనే చెప్పాలి. ఇందులో డేటైమ్ రన్నింగ్ లైట్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, అక్కడక్కడా క్రోమ్ గార్నిష్‌తో ఇది మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

స్పేసియస్ అండ్ లగ్జరీ ఇంటీరియర్స్

స్పేసియస్ అండ్ లగ్జరీ ఇంటీరియర్స్

నిస్సాన్ పాట్రోల్ ఇంటీరియర్స్ బయటకు కనిపించినంత రఫ్‌గా ఏమీ ఉండవు. ఇదొక 7-సీటర్ ఎస్‍‌‌యూవీ. ఇందులో ప్రీమియం లెథర్‌తో తయారు చేయబడిన లగ్జరీ ఇంటీరియర్స్ ఉంటాయి. ఏడుగురు ప్రయాణీకుల సౌకర్యానికి ఇందులో ఎలాంటి కొరత ఉండదు.

ఇంజన్

ఇంజన్

నిస్సాన్ పాట్రాల్‌లో 5.6 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 400 హెచ్‌పిల శక్తిని, 559 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

 డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్

నిస్సాన్ పాట్రాల్ 2795 కేజీల బరువును కలిగి ఉన్న ఓ రగ్గడ్ లగ్జరీ ఎస్‌యూవీ. ఈ కారు ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను ప్రదర్సించేందుకు గాను నిస్సాన్ ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయించింది. ఈ ఆఫ్-రోడ్ ట్రాక్‌పై ఉండే అవాంతరాలన్నింటినీ నిస్సాన్ పాట్రాల్ చాలా సులువుగా అదిగమించింది. గతుకుల రోడ్డుపై సైతం దీని సస్పెన్షన్ చాలా స్మూత్‌గా అనిపించింది. ఈ ఫొటోలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌‌ను చూడొచ్చు.

నిస్సాన్ పాట్రాల్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎత్తు పళ్లాలపై కూడా దీని హ్యాండ్లిగ్ చాలా కాన్ఫిడెంట్‌గా అనిపిస్తుంది. ఇదిగో ఈ ఫొటోలో 45 డిగ్రీల కోణంపై కూడా ఇది ఎంత స్థిరంగా నిలుచుకొని ఉందో ఈ ఫొటోలో చూస్తే తెలుస్తుంది. ఇందులోని హైడ్రాలిక్ బాడీ మోషన్ కంట్రోల్ సిస్టమ్ కారణంగా, ఇలాంటి ఎగుడు దిగుడు రోడ్లపై ప్రయాణించినా సరే క్యాబిన్‌లో దాదాపుగా స్ట్రైట్‌గా ఉన్న ఫీల్ లభిస్తుంది.

నిస్సాన్ పాట్రాల్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇదిగో ఆఫ్-రోడ్ ట్రాక్‌పై ఉండే ఈ విభాగం, పూర్తిగా ఇసుక దిబ్బలతో కూడుకున్నది. ఇలాంటి ప్రాంతంలో సైతం పాట్రాల్‌లోని పవర్‌ఫుల్ వి8 ఇంజన్ సమర్థవంతంగా పనిచేసింది. ఇందులో విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ సమయంలో మేము సెలక్ట్ చేసుకున్నది శాండ్ మోడ్.

ఫీచర్లు

ఫీచర్లు

నిస్సాన్ పాట్రాల్ ఎస్‌యూవీలో అనేక అధునాతన సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకిగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‍-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్టమ్, క్రాష్ సెన్సిటివ్ ఆటోమేటిక్ అన్‌లాక్ సిస్టమ్, ఆటో హాజర్డ్ లైటింగ్ సిస్టమ్, లేన్-డిపార్చర్ వార్నింగ్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

కాంపిటీషన్

కాంపిటీషన్

నిస్సాన్ పాట్రాల్ వి8 ఈ సెగ్మెంట్లో నేరుగా టొయోటా ల్యాండ్ క్రూజర్ వి8తో పోటీపడే అవకాశం ఉంటుంది.

చివరిమాట

చివరిమాట

నిస్సాన్ పాట్రాల్ కారులో అన్ని అంశాలు బాగానే ఉన్నప్పటికీ, దీని ధర మాత్రం ఆకాశాన్ని అంటేలా ఉంటుంది. పూర్తిగా ఇంపోర్టెడ్ కారు కావటంతో, భారత మార్కెట్లో దీని ధర కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని అంచనా. మరి అంత అధిక ధరను పెట్టి ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేసే కస్టమర్ల ఎంత మంది ఉంటారో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Nissan, the Japanese carmaker is ready to introduce it's best selling SUV in the Middle East, the Nissan Patrol in India in the near future. The vehicle was present during the Nissan CARnival that was held on the 23rd of March in the Buddh International Circuit.
Story first published: Wednesday, March 25, 2015, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X